హజ్రత్ ఫాతిమా (ర. అ)

హజ్రత్‌ ఆయిషా(ర), హజ్రత్‌ ఫాతిమా (ర.అన్‌హా)తో ఉన్న చనువుతో ఇంతకీ ఆ రహస్యమేమిటోనని అడిగారు. కాని హజ్రత్‌ ఫాతిమా (ర.అన్‌హా) నిరాకరించారు. ఆయిషా(ర) ప్రవక్త(స) మరణానంతరం మరలా ఆ రహస్యాన్ని చెప్పమని బలవంతపర్చారు.

హజ్రత్‌ ఆయిషా(ర), హజ్రత్‌ ఫాతిమా (ర.అన్‌హా)తో ఉన్న చనువుతో ఇంతకీ ఆ రహస్యమేమిటోనని అడిగారు. కాని హజ్రత్‌ ఫాతిమా (ర.అన్‌హా) నిరాకరించారు. ఆయిషా(ర) ప్రవక్త(స) మరణానంతరం మరలా ఆ రహస్యాన్ని చెప్పమని బలవంతపర్చారు.

– తాహిరా తన్వీర్

సంతాన శిక్షణ

హజ్రత్‌ ఫాతిమా (ర.అన్‌హా) తమ పిల్లల శిక్షణ కూడా తన పితామహుని (స) శైలిలోనే చేయసాగారు. అల్లాహ్‌ాను ప్రసన్నుణ్ణి చేయటమే లక్ష్యంగా పెట్టు కున్నారు. పిల్లల ముందు ”అల్లాహ్‌ాయే మన ప్రభువు, ఆయన అనంత కరుణామయుడు, ఆయన కోపాగ్ని చాలా భయంకరమైంది, ఆయనీపనికిష్టపడడు, ఆ పని అయిష్టం” అని అల్లాహ్‌ా గుణగణాలను, ఇష్టాయిష్టాలను తెలియపరచేవారు. పిల్లలయందు అల్లాహ్‌ా పట్ల ప్రేమ భయాలు జనింపజేసేవారు. వారి ఆలోచనలు, చర్యలు అదే దిశలో నడిచేలా చేసేవారు.

ఒకసారి నాల్గయిదు సంవత్సరాల చిన్నారి హసన్‌ హుసైన్‌లిరువురూ ఏదో విషయంపై పోట్లాడుకుని హసన్‌ నాకు కొట్టాడంటే హుసైన్‌ నాక్కొట్టాడంటూ తల్లి వద్ద ఫిర్యాదు తీసుకొచ్చారు. తల్లి వారిద్దరి వాదన విన్న తరువాత ఇలా తీర్మానించారు: ”హసన్‌ హుసైన్‌కు కొట్టాడో, హుసైన్‌ హసన్‌కు కొట్టాడో నేనెరుగును. కానీ నాకు తెలిసిందల్లా అల్లాహ్‌ా తగువులాడేవారిని ఇష్టపడడన్నదే, మీరిద్దరు జగడమాడి అల్లాహ్‌ాను అసంతోషపరచారు. కాబట్టి మీరిద్దరూ నా నుంచి దూరం జరగండి. ఎవరైతే అల్లాహ్‌ాను అసంతోష పరచారో వారితో నేను కూడా అసంతృప్తి చెందాను” అని తల్లి వారిని తమనుంచి దూరం చేసారు. ఈ మాటలు విన్న పిల్లలు వారి పోట్లాట మాని తమ ప్రియ తల్లి కోపాన్ని, ఎడబాటును (అది కాసేపటికైనా) సరే భరించలేక ఆమెను ప్రాధేయపడసాగారు. తల్లి ఓరచూపుల్తో వారిని చూడసాగారు. కాని పైకి మాత్రం తమ కోపాన్ని, అలాగే ప్రదర్శించారు. వారిద్దరు గారాబంగా తల్లి
దగ్గరకు వచ్చి ‘అమ్మా! మా తప్పును అల్లాహ్‌ాచే మన్నింపచేయండి’ అని ప్రాధేయపడ్డారు. తాము మరెప్పుడూ పోట్లాడుకోమని లెంపలేసుకున్నారు. ఇది చూసిన తల్లి వారి మన్నింపుకై ఉన్న దుఆలను (ప్రార్థనలను) నేర్పించసాగారు. ఒక వైపు వారిద్దరూ ఉత్తమమైన విధేయులు, మరొకవైపు మంచి సోదరులు. సత్యం పలకడం, ఎదుటి వారి గౌరవ మర్యాదలను కాపాడటం వారి స్వభావం. ఆ తరువాత వారిరువురు ప్రపంచానికి ఉదాహరణ ప్రాయంగా నిలిచారు. అయితే ఆ సోదరులిద్దరిలో సుగుణాలను నూరి పోసిన ఘనత హజ్రత్‌ ఫాతిమా (ర.అన్‌హా)దే.

తండ్రి మరణం:
ప్రపంచంలోని ప్రతి వస్తువు అశాశ్వత మైనది. ఈ ప్రపంచంలో వచ్చిన ప్రతి ప్రాణికి మరణమనేది తప్పదు. ఎన్ని  సంవత్సరాలు, ఎన్ని కాలాలపాటు జీవించినా మరణమనేది అవశక్యం. ప్రవక్త ముహమ్మద్‌(స) తమ 63 సంవత్సరాల వ్యవధిని పూర్తి చేసుకుని పరలోకానికి పయనించారు. వారు అంతిమ ప్రవక్త, సమస్త మానవ జాతికి ఉత్తమ శిక్షకులు, అనురాగాలొలకించే తండ్రి శాశ్వతంగా దూరమయ్యారు. హజ్రత్‌ ఫాతిమా (ర.అన్‌హా) గారికి అది మామూలు విషాదం కాదు.

ప్రవక్త (స) అంతిమ క్షణాల్లో తీవ్ర జ్వరంతో బాధ పడుతూ స్పృహ కోల్పోతున్న, కోల్కుంటున్న ఆ దృశ్యం హజ్రత్‌ ఫాతిమా (ర.అన్‌హా) హృదయాన్ని దుఃఖ సాగరంలో ముంచేసింది. భరించలేక ‘ఓ నాన్నా’ అని కేక వేశారు, ఆ కేక విన్న ప్రవక్త ముహమ్మద్‌ (స) ఆమెను దగ్గరగా పిలిచి, చెవిలో ఏదో చెప్పారు. అది విన్న హజ్రత్‌ ఫాతిమా (ర.అన్‌హా) ఏడ్వ సాగారు. ప్రవక్త(స) ఆమెను మరలా పిలిచి చెవిలో ఏదో చెప్పగా ఆమె నవ్వారు. ఇది చూసిన వారిలో కుతూహలం రేగింది. కానీ ఎవ్వరూ వారినడగ సాహసించలేదు- ఆయిషా(ర) తప్ప.

హజ్రత్‌ ఆయిషా(ర), హజ్రత్‌ ఫాతిమా (ర.అన్‌హా)తో ఉన్న చనువుతో ఇంతకీ ఆ రహస్యమేమిటోనని అడిగారు. కాని హజ్రత్‌ ఫాతిమా (ర.అన్‌హా) నిరాకరించారు. ఆయిషా(ర) ప్రవక్త(స) మరణానంతరం మరలా ఆ రహస్యాన్ని చెప్పమని బలవంతపర్చారు. అప్పుడు హజ్రత్‌ ఫాతిమా (ర.అన్‌హా) ఇలా తెలియజేసారు: నేనీ అనారోగ్యంలో మరణిస్తానని నాన్న గారు చెప్పగా నేనేడ్వసాగాను. రెండోసారి ‘నా కుటుంబీకులందరిలో మొట్టమొదట నన్ను కలుసుకునే దానిని నీవే’ నన్న శుభవార్తకు నేను నవ్వాను.”

తండ్రి మరణాన్ని ఆమె తట్టుకోలేక పోయారు. దుఃఖ స్థితిలో ఛాతి బాదు కోవడం, దుస్తులు చించుకోవడం, జుట్టు లాక్కోవడంలాంటి పనులను ముహమ్మద్‌(స) తీవ్రంగా ఖండించారు. కాబట్టి ఆమె తమ బాధనెప్పడూ ఎవ్వరి ఎదుటా వ్యక్త పరచలేదు. తమ దుఃఖాన్ని దిగమ్రింగు కున్నారు. కాని ఆ తరువాత ఎవ్వరూ ఎప్పుడూ ఆమె పెదాలపై చిరునవ్వు కూడా చూడలేదు.

ప్రవక్త(స) గారి అంత్యక్రియల తరువాత అనస్‌(ర)ను చూసి హజ్రత్‌ ఫాతిమా (ర.అన్‌హా) ”ప్రవక్త(స) (సమాధి) పై మీరు మట్టెలా వేయగలిగారు?” అనే హృదయ విదారకర వాక్యం వారి పెదాల ద్వారా వెలువడిందని బుఖారీ తెలియపరచారు. దుఃఖంలో గుండెలు తరుక్కుపోతున్నా హద్దులు మీరి ప్రవర్తించలేదు. తమ బాధను బయటకు రానివ్వలేదు.

Related Post