New Muslims APP

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి జీవితం ఒక చూపులో

నలభై సంవత్సరాల ఆరునెలల పన్నెండు రోజులకు అనగా రమజాన్‌ మాసం 12వ తేది సోమవారం నాడు జిబ్రయీల్‌ దూత తొట్ట తొలిసారిగా దైవవాణిని తీసుకొని 'హిరా' కొండ గుహకు వచ్చారు. అప్పుడే ఆయనకు నబువ్వత్‌ (దైవదౌత్య బాధ్యత) అనుగ్రహించబడింది.

నలభై సంవత్సరాల ఆరునెలల పన్నెండు రోజులకు అనగా రమజాన్‌ మాసం 12వ తేది సోమవారం నాడు జిబ్రయీల్‌ దూత తొట్ట తొలిసారిగా దైవవాణిని తీసుకొని ‘హిరా’ కొండ గుహకు వచ్చారు. అప్పుడే ఆయనకు నబువ్వత్‌ (దైవదౌత్య బాధ్యత) అనుగ్రహించబడింది.

పేరు: ముహమ్మద్‌ మరియు అహ్మద్‌
జననం: క్రీ శ, 571 ఫీల్‌ సంఘటన జరిగిన యాభై లేక యాభై ఐదు రోజుల తర్వాత అనగా రబీవుల్‌ అవ్వల్‌ మాసం తొమ్మిదో తేదీన వసంత ఋతువులో మక్కా నగరంలో సోమవారం నాడు దైవ ప్రవక్త (స) జన్మించారు.
4 లేక 5వ ఏట: నాలుగు లేక ఐదేళ్ళ ప్రాయంలో ఆయన బనూ సాద్‌ తెగవారిలో ఉన్నప్పుడు తొలి గుండె సర్జరీ మరియు హృదయ శుద్ధి సంఘటన జరిగింది.
6వ యేట: ఆరేళ్ళ ప్రాయంలో ప్రవక్త (స) వారి తల్లి ఆమినా పరమ పదించారు.
16వ యేట: పదహారేళ్ల ప్రాయంలో ”హిల్‌ఫుల్‌ ఫుజూల్‌” అనే ఒక సంఘ సంస్కరణా కార్యంలో పాల్గొన్నారు.
25వ యేట: పాతికేళ్ళ వయస్సులో హజ్రత్‌ ఖదీజా (రజి)ను వివాహమాడారు.
35వ యేట: ముఫ్పై ఐదేండ్ల వయస్సులో కాబా గృహ పునర్ని ర్మాణ సందర్భంగా హజ్రె అస్వద్‌ (నల్లరాయి)ని ప్రతిస్థాపించే విషయమై తిరుగులేని తీర్పునిచ్చి మక్కా నగరాన్ని అంతర్యుద్ధం నుండి కాపాడారు.
41వ యేట: నలభై సంవత్సరాల ఆరునెలల పన్నెండు రోజులకు అనగా రమజాన్‌ మాసం 12వ తేది సోమవారం నాడు జిబ్రయీల్‌ దూత తొట్ట తొలిసారిగా దైవవాణిని తీసుకొని ‘హిరా’ కొండ గుహకు వచ్చారు. అప్పుడే ఆయనకు నబువ్వత్‌ (దైవదౌత్య బాధ్యత) అనుగ్రహించబడింది.
నబువ్వత్‌ శకం 6వ సంవత్సరం: అబూ జహల్‌ ఆయన్ని హత్య చేయజూశాడు.
నబువ్వత్‌ శకం 7వ సంవత్సరం: నలభై ఏడేళ్ళ వయసులో సంఘం నుండి బహిష్కరించబడి ”షీబె అబీ తాలిబ్‌” అనే కనుమ లో ఆంక్షలతో కూడిన జీవితం గడిపారు.
నబువ్వత్‌ శకం 10వ సంవత్సరం: ”షీబె అబూతాలిబ్‌ ” నిర్బంధ జీవితం నుండి విముక్తులయ్యారు. ఆ సంవత్సరమే భార్య హజ్రత్‌ ఖదీజా (ర), బాబాయి అబూ తాలిబ్‌లు మరణిం చారు. హజ్రత్‌ సౌదా (ర)ను వివాహం చేసుకున్నారు. ధర్మ ప్రచార నిమిత్తం తాయెఫ్‌ నగరాన్ని పర్యించారు.
నబువ్వత్‌ 11వ సంవత్సరం: తొలిసారిగా మదీనా నగరాని కి చెందిన ఆరుగురు అదృష్టవంతులు ఇస్లాం స్వీకరించారు. హజ్రత్‌ ఆయిషా (ర)తో వివాహం జరిగింది. కాని అప్పుడే పంపకాలు జరగలేదు.
నబువ్వత్‌ శకం 12వ సంవత్సరం: రెండవ హృదయ శుద్ధి సంఘటన, మేరాజ్‌ (గగన యాత్ర) సంఘటన, ఇంకా రెండవ ఉఖ్‌బా ఒప్పందం లాిం ముఖ్యమైన సంఘటనలు జరిగాయి.
నబువ్వత్‌ శకం 13వ సంవత్సరం: అనగా- (హిజ్రత్‌ శకం మొది సంవత్సరం) సఫర్‌ మాసం 26వ తేదీన ఖురైషులు సామూహికంగా దైవప్రవక్త(స)ను హతమార్చాలని నిర్ణయం గైకొన్నారు. సఫర్‌ మాసం 27వ తేదీన ఆయన మక్కా నగరానికి వీడ్కోలు పలికి అక్కడి నుండి పలస పోయారు. రబీవుల్‌ అవ్వల్‌ పన్నెండో తేది శుక్రవారం నాడు మదీనాకు వెళ్ళి అక్కడ అబూ అయ్యూబ్‌ అన్సారీ (ర) ఇంటి ముందు ఆగారు. ఈ సంవత్సరమే హజ్రత్‌ ఆయిషా (ర) గారి పంపకం జరిగింది.
హి.శ. 2వ సంవత్సరం: బవా యుద్ధం, బవాత్‌ యుద్ధం, సఫ్‌ వాన్‌ లేక బద్రె ఊలా యుద్ధం, జుల్‌ అషీరా యుద్ధం, బద్రుల్‌ కుబ్రా యుద్ధం, బనూ ఖైనుఖా యుద్ధం, సవీఖ్‌ యుద్ధం, బనూ సలీం యుద్ధం లాంటి ముఖ్య యుద్ధాలు జరిగాయి, దైవప్రవక్త(స) ను హతమార్చానికి మూడో సారి విఫల ప్రయత్నం జరిగింది.
హి.శ 3వ సంవత్సరం: గిత్‌ఫాన్‌ యుద్ధం, నజ్రాన్‌ యుద్ధం, ఉహద్‌ యుద్ధం, హమ్రావుల్‌ అసద్‌ యుద్ధాలు జరిగాయి. హఫ్సా (ర), జైనబ్‌ బిన్తె ఖుజైమా (ర)లతో వివాహం జరిగింది.
హి.శ. 4వ సంవత్సరం: రజీ, బీరె మవూనా లాిం విషాద సంఘటనలతోపాటు బనూ నజీర్‌ ముట్టడింపు, బద్రుల్‌ ఉఖ్రా యుద్ధాలు జరిగాయి. ఉమ్మె సలమా (ర)తో వివాహం జరిగింది. జైనబ్‌ బిన్తె ఖుజైమా (ర) తనువు చాలించారు.
హి.శ. 5వ సంవత్సరం: దూమా అల్‌ జుందల్‌, బనూ ముస్త లిక్‌, అహ్‌జాబ్‌ లేక కందక యుద్ధం, బనూ ఖురైజా యుద్ధాలు జరిగాయి. హజ్రత్‌ ఆయిషా (ర) మీద అపనిందలు మోపటం జరిగింది. జైనబ్‌ బిన్తె జహష్‌, జువైరియాలతో వివాహం అయింది. ఉరైనీన్‌ యుద్ధం, హుదైబి యా ఒప్పందం లాిం సంఘటనలు జరిగాయి. ఉమ్మె హబీబా (ర)తో వివాహం జరి గింది.
హి.శ. 7వ సంవత్సరం: రాజుల, చక్రవర్తుల పేర ఇస్లాం సందేశ లేఖలు వ్రాయించారు. గాబా, ఖైబర్‌, వాదియుల్‌ ఖురా, జాతుర్రిఖా యుద్ధాలు జరిగాయి. ఆయనకు మేక మాంసంలో విషం కలిపి తినిపించే ప్రయత్నం జరిగింది. సఫియా, మైమూనా (ర)లను వివాహమాడారు. తన అనుచరులతో పాటు ఖజా ఉమ్రా నెరవేర్చారు.
హి.శ. 8వ సంవత్సరం: మౌతా, మక్కా విజయం, హునైన్‌ లేక హవాజిన్‌, తాయిఫ్‌ యుద్ధాలు జరిగాయి. కూతురు జైనబ్‌ (ర) కుమారుడు ఇబ్రాహీమ్‌లు చనిపోయారు.
హి.శ. 9వ సంవత్సరం: తబూక్‌ యుద్ధం జరిగింది. ఎన్నో బృందాలు ఇస్లాం స్వీకరించానికి ఆయన సన్నిధికి వచ్చాయి.
హి.శ. 10వ సంవత్సరం: అంతిమ హజ్‌ చేశారు.
హి.శ. 11వ సంవత్సరం: సఫర్‌ మాసం 29వ తేదీ సోమ వారం నాడు వ్యాధికి గురయ్యారు. రబీవుల్‌ అవ్వల్‌ పన్నెండో తేది సోమవారం నాడు ప్రొద్దెక్కిన తర్వాత ఆయన శుభాత్మ దేహ పంజరాన్ని వీడి పోయింది. అప్పికి ఆయన వయస్సు 63 సంవ త్సరాల నాలుగు రోజులు.
రబీవుల్‌ అవ్వల్‌ మాసం పధ్నాలుగో తేది బుధవారం నాి రాత్రి హజ్రత్‌ ఆయిషా (ర) గారి కుీరంలో ఆయనకు ఖనన సంస్కారాలు జరిపారు.

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.