ప్రధమ ఖలీఫా అబూ బకర్‌ (ర)

అల్లాహ్‌ హిజ్రత్‌ సందర్భంగా హజ్రత్‌ అబూ బకర్‌ (ర)ను తోడు తీసు కోవలసిందిగా మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిని ఆదేశించాడు. గుహలో ఆయన కలత చెందినప్పుడు అభయమిస్తూ సూరాతౌబాలోని 40వ ఆయతును అవతరింపజేశాడు. మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారితో అన్ని యుద్ధాల్లోనూ ఆయన పాల్గొన్నారు. దైవ ప్రవక్త ముహ మ్మద్‌ (స) వారి మరణం వరకూ ఆయనకు తోడుగా, కుడి భుజంగా ఉన్నారు. ఇహలోకంలోనే స్వర్గపు శుభవార్తను అందుకున్న పది మంది సౌభాగ్యవంతుల్లో ఆయన ఒకరు. దైవప్రవక్త ముహమ్మద్‌ (స) చివరి ఘడియల్లో ఇమామత్‌ చేయవలసింగా ఆయన్ను ఆదేశించారు

అల్లాహ్‌ హిజ్రత్‌ సందర్భంగా హజ్రత్‌ అబూ బకర్‌ (ర)ను తోడు తీసు కోవలసిందిగా మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిని ఆదేశించాడు. గుహలో ఆయన కలత చెందినప్పుడు అభయమిస్తూ సూరాతౌబాలోని 40వ ఆయతును అవతరింపజేశాడు. మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారితో అన్ని యుద్ధాల్లోనూ ఆయన పాల్గొన్నారు. దైవ ప్రవక్త ముహ మ్మద్‌ (స) వారి మరణం వరకూ ఆయనకు తోడుగా, కుడి భుజంగా ఉన్నారు. ఇహలోకంలోనే స్వర్గపు శుభవార్తను అందుకున్న పది మంది సౌభాగ్యవంతుల్లో ఆయన ఒకరు. దైవప్రవక్త ముహమ్మద్‌ (స) చివరి ఘడియల్లో ఇమామత్‌ చేయవలసింగా ఆయన్ను ఆదేశించారు

హజ్రత్‌ అబూ బకర్‌, హజ్రత్‌ ఉమర్‌, హజత్‌ ఉస్మాన్‌, హజ్రత్‌ అలి (రజియల్లాహు అన్హుమ్‌) – వీరినే ఖులఫాయె రాషిదీన్‌ – సద్వర్త నులైన పరిపాలకులు అనంటారు. దైవ అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి మరణాననంతరం వీరు అల్లాహ్‌ా ఆదేశాలను, ఆయన ప్రవక్త సంప్రదాయాలను అమలు పర్చారు. వాటి ప్రాతిపదికన పరిపాలిం చారు. ధర్మ సంస్థాపనలో, న్యాయ వ్యవస్థ స్థాపనలో, ఇస్లాం ధర్మ ప్రచారంలో వీరు పోషించిన పాత్ర, పడిన శ్రమ అమోఘమైనది. ఈ నలుగురు ఖలీపాల పరిపాలనా కాలం దాదాపు 30 సంవత్సరాలు. అది హిజ్రీ శకం 11 నుండి ప్రారంభమయి హిజ్రీ శకం 40 వరకూ. దైవ అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా ప్రవచించారు: ”నా సము దాయంలో ఖిలాఫ¦త్‌ (పరిపాలన) 30 సంవత్సరాలు ఉంటుంది”. (తిర్మిజీ)

మొదటి ఖలీఫా హజ్రత్‌ అబూ బకర్‌ (ర)వేరు – వంశావళి: అబ్దుల్లాహ్‌ా బిన్‌ ఉస్మాన్‌ బిన్‌ ఆమిర్‌ అత్తయిమీ అల్‌ ఖర్షీ-అబూ బకర్‌ నామాంతరం తోనే ఆయన ప్రసిద్ధి చెందగా. ఆయన తండ్రి ఉస్మాన్‌, అబూ ఖహాఫా వేరుతో ప్రసిద్ది చెందారు.

బయోడెటా

ఏనుగుల సంవత్సరం తర్వాత రెండేళ్ళకు జన్మించారు. దైవ దౌత్యానికి పూర్వం తర్వాత ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి ప్రాణ మిత్రులుగా ఉన్నారు. పురుషుల్లో అందరికన్నా ముందు ఇస్లాం స్వీకరించారు. ఆయన గొప్ప శ్రీమంతులవ్వడంతోపాటు మంచి వ్యాపారవేత్త కూడా.

హజ్రత్‌ అబూ బకర్‌ (ర) గారి విశిష్ఠత

అల్లాహ్‌ హిజ్రత్‌ సందర్భంగా హజ్రత్‌ అబూ బకర్‌ (ర)ను తోడు తీసు కోవలసిందిగా మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిని ఆదేశించాడు. గుహలో ఆయన కలత చెందినప్పుడు అభయమిస్తూ సూరాతౌబాలోని 40వ ఆయతును అవతరింపజేశాడు. మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారితో అన్ని యుద్ధాల్లోనూ ఆయన పాల్గొన్నారు. దైవ ప్రవక్త ముహ మ్మద్‌ (స) వారి మరణం వరకూ ఆయనకు తోడుగా, కుడి భుజంగా ఉన్నారు. ఇహలోకంలోనే స్వర్గపు శుభవార్తను అందుకున్న పది మంది సౌభాగ్యవంతుల్లో ఆయన ఒకరు. దైవప్రవక్త ముహమ్మద్‌ (స) చివరి ఘడియల్లో ఇమామత్‌ చేయవలసింగా ఆయన్ను ఆదేశించారు.

ఖలీఫా బహువచనం ఖులఫా – ప్రతినిధి
రాషిద్‌ బహువచనం రాషిదూన్‌ – సద్వర్తనుడు

ప్రశ్నోపనిషత్తు

1) ఖులాఫాయె రాషిదీన్‌ అని ఎవరెవరిని అంటారు? వారి పరి పాలనా కాలం ఎంత?
2) అబూబకర్‌ (ర) గారి వంశావళిని వేర్కొనండి?
3) హజ్రత్‌ అబూ బకర్‌ (ర) నామాంతరం ఏమిటి?
4) ఆయన్ను సిద్దీఖ్‌ అన్న బిరుదు ఎందుకు వరించింది?
5) దైవ ప్రవక్త (స) మరియు అబూబకర్‌ ఇద్దరిలో ఎవరు వెద్ద? వారిరువురి వయసు వ్యత్యాసం ఎంత?
6) అబూ బకర్‌ (ర) ఇస్లాం స్వీకరించిన నాటికి ఆయన వయసు ఎంత?
7) ఆయనకు సంబంధించిన ఐదు మంచి గుణాలను వేర్కొనండి?
8) వ్యాసంలో మీకు చెప్పబడిన విషయాలను మినహాయించి మీకు ఆయన గురించి ఏమి తెలుసు?
9) సర్గపు శుభవార్త పొందిన ఆ పది మంది సౌభాగ్యవంతులు ఎవరు?

ఖిలాఫత్‌ శపథం

దైవప్రవక్త ముహమ్మద్‌ (స) తన తర్వాత ప్రతినిధిగా ఎవ్వరినీ ఖరారు చేయలేదు. ఈ కారణంగా ఆయన (స) మరణానంతరం అన్సార్లంతా బనూసాద్‌ మహల్లాలోని ఓ మండపంలో ప్రోగయ్యారు. అదే సమ యంలో అక్కడికి ముహాజిర్లు కూడా వచ్చారు. వారిలో హజ్రత్‌ అబూ బకర్‌, ఉమర్‌, అబూ ఉబైదా (ర) కూడా ఉన్నారు. ప్రవక్త (స) వారి తర్వాత ఎవరిని ఖలీఫాగా ఎన్నుకోవాలన్న మీమాంస వచ్చినప్పుడు హజ్రత్‌ అబూబకర్‌ (ర) గారు హజ్రత్‌ ఉమర్‌ మరియు అబూ ఉబైదా ను ఉద్దేశించి వీరిద్దరిలో ఎవరినయినా ఖలీఫాగా ఎన్నుకోండి అని సలహా ఇచ్చారు. కానీ ఉమర్‌ (ర) గారు ముందుకొచ్చి హజ్రత్‌ అబూ బకర్‌ (ర) గారి చేతి మీద బైఅత్‌ – శపథం చేశారు. తర్వాత హజ్రత్‌ అబూబకర్‌ (ర) గారి అంగీకారంతో అక్కడున్నవారందరూ బైఅత్‌ చేశారు. రెండవ రోజు మస్జిదె నబవీలో ప్రోగయి అందరూ మళ్ళీ బైఅత్‌ చేశారు. తర్వాత ఆయన్ను ఖలీఫతుర్రసూల్‌, ఖలీఫతుల్‌ ముస్లి మీన్‌ అన్న బిరుదిచ్చారు. ఎందుకంటే ఆయనే ఇకమీదట ముస్లింలం దరికి అధినాయకుడు గనక. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దే శించి ఇలా అన్నారు:

”ప్రజలారా! నన్ను మీవై అధినాయకుడిగా చేయడం జరిగింది. నిజమే మిటంటే నేను మీకన్నాగొప్పవాణ్ణి మాత్రం కాను. ఒకవేళ నేను మంచి చేెస్తే మీరు నాకు వెన్నుదన్నుగా నిలవండి. ఒకవేళ నేను చెడు మార్గాన నడిస్తే మీరంతా కలిసి నన్ను సంస్కరించాలి.సత్యం ఒక అప్పగింత. అసత్యం ఒక మోసం. మీ దృష్టిలో బలహీనుడయిన వ్యక్తి నా దృష్టిలో బలవంతుడు; అతని హక్కును అతనికివ్పించనంత వరకు. మీ దృష్టిలో బలవంతుడయినవాడు నా దృష్టిలో బలహీనుడు; ఎప్పటి వరకయితే అతను కాజేసిన హక్కును హస్తగతం చేసుకోనో – ఇన్షా అల్లాహ్‌ా. ఒకవేళ ప్రజలు జిహాద్‌ చేయడం మానుకుంటే అల్లాహ్‌ా వారిని అవమానం పాల్జేస్తాడు. ఏ జాతిలోనైతే నీతిబాహ్యత, విచ్చల విడితనం ప్రబలుతుందో ఆ జాతి మీద దైవ శిక్ష, విభిన్న రకాల ఉప ద్రవాలు విరుచుకుపడ్తాయి. ఓ ప్రజలారా! నేను అల్లాహ్‌ా మరియు ఆయన ప్రవక్త బాటన నడుస్తున్నంత కాలం మీరు నన్ను అనుసరిం చండి. నేను అల్లాహ్‌ా మరియు ఆయన ప్రవక్త (స) మార్గాన నడవడం లేదని మీరు గ్రహిస్తే మీరు నన్ను అనుసరించాల్సిన అవసరం లేదు”.

హజ్రత్‌ అబూబకర్‌ (ర) గారి గుణవిశేషాలు:

ఆయన గొప్ప దూరదృష్టి గలవారు, న్యాయవంతులు, వినమృరులు, నిరాడంబరులు, నీతిమంతులు. ప్రతి విషయంలోనూ ఆయన ప్రజల కోసం ఆదర్శంగా అలరారారు. అజ్ఞాన కాలంలో సయితం ఆయన మద్యానికి, మగువ లోలత్వానికి, ఇతరత్రా వ్యాపకాలు, వ్యసనాలకు దూరంగా మసలుకునేవారు, వాటిని అసహ్యించుకునేవారు. పరిపాల విషయంలో ఆయన మహా గొప్ప అనుభవజ్ఞులు. ఎట్టి క్లిష్టతర పరిస్థి తుల్లోనయినా అదరని బెదని వ్యక్తిత్వం ఆయనది.

ప్రశ్నోపనిషత్తు

1) హజ్రత్‌ అబూబకర్‌ (ర) గారికి ఖిలాఫ¦త్‌ ఎలా అప్పగించబడింది?
2) హజ్రత్‌ అబూబకర్‌ (ర) గారి కొన్ని గుణవిశేషాలను వేర్కొనండి?
3) ‘నేను మీకన్నా గ్పొవాణ్ని మాత్రం కాను’ అన్న ఆయన మాటల్లో ఆయన ఏ గుణంగా కనబడుతుంది?
4) ప్రసంగంలో ఆయన ప్రజలకు ఉపదేశించిన నైతిక విలువలేమిటి?
5) బలవంతుడు, బలహీనుడి గురించి హజ్రత్‌ అబూబకర్‌ (ర) గారి దృక్పథం ఏమిటి?

Related Post