మహా గొప్ప మానసిక శాస్త్రవేత్త ముహమ్మద్‌ (స)

''అలాగైతే నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వెళ్లిపో. వారిద్దరినీ బాగా చూసుకో'' అని చెప్పి పంపించారు. మరో హదీసులో ''నువ్వు నీ తల్లిదండ్రుల సేవలోనే పరిశ్రమిస్తూ ఉండు. అదే నీపాలిట జిహాద్‌'' అని ఉంటే, ఇంకో ఉల్లేఖనంలో ''నువ్వెలాగైతే వారిని ఏడి పించి వచ్చావో, వెళ్ళి అలానే వారిని నవ్వించు'' అని ఉంది. (బుఖారీ, ముస్లిం)

”అలాగైతే నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వెళ్లిపో. వారిద్దరినీ బాగా చూసుకో” అని చెప్పి పంపించారు. మరో హదీసులో ”నువ్వు నీ తల్లిదండ్రుల సేవలోనే పరిశ్రమిస్తూ ఉండు. అదే నీపాలిట జిహాద్‌” అని ఉంటే, ఇంకో ఉల్లేఖనంలో ”నువ్వెలాగైతే వారిని ఏడి పించి వచ్చావో, వెళ్ళి అలానే వారిని నవ్వించు” అని ఉంది. (బుఖారీ, ముస్లిం)

వ్యక్తుల పరువుప్రతిష్టలు, సమాజంలో వారికున్న గౌరవోన్నతలను బట్టి వారితో వ్యవహరించాలి. ప్రతి వ్యక్తికీ సముచితమైన స్థానం ఇవ్వాలి. ఒక గౌరవనీయుణ్ణి అతని స్థాయికంటే దిగజార్చడం, ఒక నీచుణ్ణి పదవి పీఠాలపై ఎక్కించడం అనేది అనేక రకమైన అపసవ్య తలకు, అపశృతులకు, అనర్థాలకు దారి తీస్తుంది. ఈ కారణంగానే దైవ ప్రవక్త (స) వ్యక్తులతో సంభాషించడంలోగానీ, వ్యాపార లావా దేవీలు చేసేటప్పుడుగాని ఎదుటి వ్యక్తి స్థాయి, స్థోమతను, మనో భావాన్ని, ఆత్మాభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ప్రవర్తించేవారు. తన చుట్టూ ఉన్న అనుచర గణంలో ప్రతి ఒక్కరిలోని బలగాలు, బల హీనతల మీద ఆయన దృష్టి ఉండేది. ప్రతి వ్యవహారంలోనూ ఎదుటి వ్యక్తి మనోభావాన్ని పరిగణలోకి తీసుకుని మరి మసలుకునేవారు. ఓ సందర్భంలో స్వయంగా ఆయన (స) ఇలా సెలవిచ్చారు: ”ప్రజలతో వారి స్థాయిని బట్టి వ్యవహరించండి”. (అబూ దావూద్‌)

ఆయన (స) తాను తీర్పు ఇవ్వగోరే వ్యక్తుల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించేవారు మహనీయ ముహమ్మద్‌ (స). వారికి ఏదైనా బోధిం చాలనుకున్నప్పుడు వారి ఆర్థిక, బాహ్య, ఆధ్యాత్మిక, నైతిక, విద్యాపర మైన ప్రకర్షను దృష్టిలో పెట్టుకుని మరీ హితోపదేశం చేసేవారు. ఓ వ్యక్తి వచ్చి ‘సత్క్రియల్లో మహోత్కృష్టమైనదేది?’ అని ప్రశ్నించగా – ”ధర్మ పోరాటం (జిహాద్‌)” అని బదులిచ్చారు. అదే ప్రశ్న మరో వ్యక్తి వచ్చి అడిగినప్పుడు-”నమాజు” అని సెలవిచ్చారు. ఇంకో వ్యక్తి వచ్చి అడిగినప్పుడు-”ఉత్తమ నడవడిక” అన్నారు. పైకి పరస్పరం విరుద్ధంగా కనబడుతున్న ఈ సమాధానాలు నిశిత దృష్టితో గనక ఆలోచిస్తే అలాంటి వైరుధ్యం వీటిలో లేదని తెలుస్తుంది. ఒక వ్యక్తి అయిదు పూటల ప్రార్థనలు, రమజాను ఉపవాసాలు, జకాత్‌, హజ్‌ మొదలగు విధులను చక్కగా నిర్వర్తిస్తున్నాడు. కానీ ‘ధర్మపోరాటం-జిహాద్‌’ అంటే అతనికి ఒక విధమైనటువంటి ఇబ్బంది. కనుక అతన్ని ‘జిహాద్‌’ మహా కార్యం అన్నారు. మరో వ్యక్తి సత్కర్మలన్నీ బాగానే చేస్తున్నాడు. కాని నమాజు పట్ల అలసత్వం, నిర్లక్ష్య ధోరణి కలిగి ఉన్నాడు గనక ‘నమాజ్‌’ ఉత్కృష్ట కార్యం అన్నారు. ఇంకో వ్యక్తి దైవానికి సంబంధించిన విష యాల్లో బాగున్నాడు; కాని దాసుల విషయంలో, వారి హక్కుల విష యంలో మహా దారుణంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ‘ఉత్తమ నడవడిక’ అని హితవు పలికారు. అవును-, వివేకికి, అవివేకికి మధ్య గల తేడా ఒక్కటే. వివేకి ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని మరి చెబు తాడు. అవివేకి తనకు కావలసింది మాత్రమే ప్రజలకు చెబుతాడు.
ఒక వ్యక్తి దైవ ప్రవక్త (స) వారి పవిత్ర సన్నిధికి వచ్చి-”నేను (ధర్మం కోసం) ప్రస్థానం (హిజ్రత్‌) చేెస్తాననీ, జిహాద్‌ (ధర్మయుద్ధం)లో పాల్గొం టానని మీతో ప్రమాణం చేసి చెబుతున్నాను. ప్రతిగా అల్లాహ్‌ా తరఫు నుండి ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాను” అన్నాడు. అది విని మహనీయ ముహమ్మద్‌ (స) ఆ వ్యక్తితో-”నీ తల్లిదండ్రులలో ఏ ఒక్కరైనా బ్రతికి ఉన్నారా?” అనడిగారు. ‘అవును, ఇద్దరూ బ్రతికే ఉన్నారు’ అని సమా ధానమిచ్చాడా వ్యక్తి. ”మరైతే నిజంగా నువ్వు, అల్లాహ్‌ా నీకు మంచి ప్రతిఫలాన్ని ఇవ్వాలని అభిలషిస్తున్నావా?” అని మళ్ళీ ప్రశ్నించారు ప్రవక్త మహనీయులు (స). ‘అవును’ అన్నాడతను.
అప్పుడాయన ”అలాగైతే నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వెళ్లిపో. వారిద్దరినీ బాగా చూసుకో” అని చెప్పి పంపించారు. మరో హదీసులో ”నువ్వు నీ తల్లిదండ్రుల సేవలోనే పరిశ్రమిస్తూ ఉండు. అదే నీపాలిట జిహాద్‌” అని ఉంటే, ఇంకో ఉల్లేఖనంలో ”నువ్వెలాగైతే వారిని ఏడి పించి వచ్చావో, వెళ్ళి అలానే వారిని నవ్వించు” అని ఉంది. (బుఖారీ, ముస్లిం)
అంటే, వచ్చిన ఆ వ్యక్తికి ఇతర ధర్మ కార్యాల పట్ల శ్రద్ధ ఉండేది కాని, తల్లిదండ్రుల ఎడల శ్రద్ధ ఉండేది కాదు. ఈ కారణంగానే ”నీ జిహాద్‌ నీ తల్లిదండ్రుల సేవ” అని సెలవిచ్చి పంపారు ప్రవక్త మహనీ యులు (స). సుబ్హానల్లాహ్‌!

మరో అద్భుత సంఘటన గురించి తెలుసుకుందాం రండి! ఓ వ్యక్తి దైవ ప్రవక్త (స) వారి పవిత్ర సన్నిధికి వచ్చి-‘యా రాసూలల్లాహ్‌ా! నాలో లేని అవలక్షణమంటూ ఏది లేదు. జూదం, చోరీ, వ్యభిచారం, అబద్ధ మాడటం-అన్నీ ఉన్నాయి. (సకల అవలక్షణాల పుట్టననుకోండి). అయితే వీటన్నింటిని ఒకేసారి ఉన్నపళంగా మానుకోవాలంటే నా వల్ల కాని పని. తమరు మన్నిస్తారంటే ఏదో ఒక అవలక్షణాన్ని వదులుకోవ డానికి సిద్ధంగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు. అతను చెప్నిదంతా శ్రద్ధగా విన్న ప్రవక్త మహనీయ (స) ”సరే-నీవు ఎప్పటికీ అబద్ధమాడ నని ప్రమాణం చేస్తావా?” అనడిగారు. అందుకావ్యక్తి- ‘(ఓస్‌ ఇంతేనా, అదెంత పని) యా రసూలల్లాహ్‌ా! ఈ క్షణం నుంచి జీవితంలో ఎన్నడూ అసత్యం పలుకనని మనస్ఫూర్తిగా ఒట్టేసి చెబుతున్నాన’న్నాడు. తర్వాత ఆ వ్యక్తి తనలో తాను ఉబ్బితబ్బిబ్బవుతూ -ఆహా! ఎంత భాగ్యం!! దైవ ప్రవక్త (స) ఎంత తేలికైన విషయాన్ని వదలమన్నారు’ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

రాత్రయింది-దొంగతనం చేయాలన్న ఆలోచన ఒకసారి వస్తే, మద్యం సేవించాలన్న ఆలోచన మరోసారి, మగువ ఒడిలో సేద తీరా లన్న ఆలోచన ఇంకోసారి, జూదం, మట్కా ఆడాలన్న ఆలోచన ఒకసారి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే చెడు ఆలోచన వచ్చిన ప్రతిసారి ప్రవక్త మహనీయులు (స) వారితో చేసుకున్న ఒడంబడిక అతనికి గుర్తొచ్చేదీ. అదే క్షణంలో ఆ నేరం తాలూకు శిక్ష కూడా అతని మనో తెరపై కదలాడేది. ఒకవేళ అబద్ధం చెబుదాములే అనుకున్నా ప్రవక్త మహనీయుల (స) వారి సన్నిధిలో అది సాధ్యపడదు. అలా ఆ వ్యక్తి ఒక్కో వ్యసనాన్ని, పాపాన్ని పరిత్యజిస్తూ ఉదయం అయ్యేకల్లా పరమ పునీతుడై పోయాడు. (ఒక్క రాత్రి వీటన్నిం టకి దూరంగా ఉండగలిగిన నేను ఇకమీదట అన్ని రాత్రులు కూడా వీటన్నింటికీ దూరంగా జీవించగలనన్న ఆత్మ విస్వాసం అతనికి ఏర్ప డింది.) కొన్ని రోజుల తర్వాత దైవ ప్రవక్త (స) వారి సన్నిధికి వచ్చిన అతని యోగక్షే మాల్ని అడిగారు ప్రవక్త మహనీయులు (స). సమాధానంగా అతను-‘యా రసూలల్లాహ్‌ా! ‘అబద్ధం ఆడను’ అన్న చిన్న మాట నాలోని అవలక్షణాలన్నింటిని తొలగించేసింది’ అని సంబర పడిపొతూ చెప్పాడు.

చుట్టూ ఉన్న ఒనరుల పట్ల నాయకుడైన ప్రతి ఒక్కడికి అవగాహన ఉండాలి. ఒన రులు అంటే-,గనుల్లో దొరికే బొగ్గో, వజ్ర మో, అడవిలో దొరికే కలపో, శ్రీచందనమో లేదా ధనం మాత్రమే కాదు. మన స్థాయి, మన పరివారం సామర్థ్యాలు, మన చుట్టూ ఉండే వ్యక్తుల టాలెంట్‌ ఇవన్నీ మానవ గనికి సంబంధించిన ఒనరులే. ఒకవేళ నాయకుడు తన సహచర బృందం యొక్క స్థాయి, సామర్థ్యాలను సరిగ్గా అంచనా వేయకపోతే, వారిలోని ప్రతిభాపాటవాలను, పాండిత ప్రకర్షను గుర్తించకపోతే వారి శక్తీ స్థోమతల్ని పసిగట్టిన ఇతరులు వారిని ఎగ రేసుకుపోతారు.

అలాగే వారిలో గల బలహీనతలను సయి తం గుర్తెరిగి వాటిని బలగాలుగా తీర్చి దిద్దాలి. ఒక్కో వ్యక్తి ఒక్కో పని ఇష్టంతో చేస్తాడు, మరో పని పట్ల అశ్రద్ధ కనబర్చ వచ్చు. అలాంటప్పుడు అతనిలో ఆ పని పట్ల శ్రద్ధను పెంచాలి. ఆ పనిని ఎంతో చాక చక్యంగా తను చేయగలడని ధైర్యమివ్వాలి. ఒక పనికి ఒక వ్యక్తిని నియమించినప్పుడు అతన్ను నమ్మాలి. అనుమానం ఉన్న వ్యక్తిని నియమించకూడదు. నియమిస్తే అనుమా నించకూడదు. తన సహచర బృందాన్ని తన అక్కున చేర్చుకోవడం సమర్థ నాయకుడి లక్ష ణం. వారిలోని ప్రతిభాపాటవాలను పిండేసి, వారి శ్రమ శక్తిని గుంజేసి, ఎంతగా వాడుకో వాలో అంతగానూ వాడేసి తరువాత వదిలే యడం అసమర్థ నాయకుడి లక్షణం. సహ చరులొచ్చి సలహా అడిగినప్పుడు సమర్థుడి అభిప్రాయం వినడానికి సర్వసాధారణంగానే అన్పిస్తుంది. కానీ అది ఎలాంటి చిక్కు లేకుం డా సమస్యను సలువులగా పరిష్కరించి ఫలి తాన్ని అనుభవించేలా చేస్తుంది. ఇదే విష యాన్ని మనం పై ఉదాహరణలలో చూడ గలం.

 

Related Post