అద్వితీయుడైన అల్లాహ్ విషయంలో జరిగిన అన్యాయం

ALLAH - telugu
లోకాలకు ప్రభువు, పరిపోషకుడు, పరిపాలకుడైన అల్లాహ్ను కొందరు కుల దైవంగా, వంశ సంరక్షకునిగా చేసుకున్న దాఖలాలు మనకు చరిత్రలో చాలానే కన్పిస్తాయి. దేవుడంటే, ఇస్రాయేలీయుల, హెబ్రీయుల సంరక్షకుడేనన్న వాదన పాత నిబంధనలో అనేక చోట్ల కనబడుతుంది. ఈ వాదనను ఖండించే అనేక వచనాలు పాత నిబంధనలో ఉన్నప్పటికీ ఈ వాదన మాత్రం నేటికీ బలంగానే వినబడుతుంది. యూదులు తమల్ని దైవ జనులుగా, దైవ ప్రియులుగా అభివర్ణించుకుంటారు. దాదాపు ఇదే విధమైన వాదన క్రైస్తవుల్లోనూ, మన భారత దేశంలోనూ కన్పిస్తుంది. ఇలా దైవాన్ని ఒక కులానికి, వంశానికి, ప్రాంతానికి పరిమితం చేసుకునేవారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే-, ”దేశ కాలాలకు పరిమితమైన వాడు దేవుడు కాడు” అన్నది. చూడండి:
  ”నాశరహితమైనట్టియు, సర్వోత్తమ మైనట్టియు, ప్రకృతికి పరమై విలసిల్లు నట్టియు, (అండ, పిండ, బ్రహ్మాండాలకు అతీతం అయిన) నా స్వరూపమును తెలియని అవివేకులు అవ్యక్త రూపుడగు నన్ను పాంచ భౌతిక దేహమును పొందిన వానిగా తలంచుచున్నారు”. (గీత -7: 24)
  ”మీరు ఏ కాలమందైనను ఆయన స్వరమును వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు”.
                                                                                                            (యోహాను-5:37)
సత్యం ఇదని ప్రస్ఫుటమైన తర్వాత కూడా మంకు పట్టు మానుకోనివారిని స్వయంగా ఆ పరమ ప్రభువే ప్రశ్నిస్తున్నాడు:
  మేము అల్లాహ్  పుత్రులం (దేవుని బిడ్డలం, కుమారులం), ఆయనకు ప్రియులం’ అని యూదులు క్రైస్తవులు అంటారు. (ఓ ప్రవక్తా!) వారిని ఇలా  అడుగు:  ‘మరయితే  మీ పాపాలకుగాను ఆయన మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? ఎంత మాత్రం కాదు, మీరు కూడా ఆయన సృష్టించిన మానవ వర్గానికి చెందినవారే. ఆయన తాను కోరినవారిని  క్షమిస్తాడు. కోరిన వారిని శిక్షిస్తాడు”. (మాయిదా: 18)
అంటే ఈ వాదనను ప్రతిపాదించేవారు – వారు యూదులైనా, క్రైస్తవులైనా, అస్తికులనా, నాస్తికులైనా, వారి వాదనలో ఏమాత్రం పసలేదన్నదానికి ఇది నిదర్శనం. ఒకవేళ వారంటున్నదే వాస్తవమైతే, వారు నిజంగా అల్లాహ్‌ా ప్రీతిపాత్రులై ఉంటే వారి పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఇక దైవ ప్రియులు ఎవరంటారా? ఎవరైనా కాగలరు. ఆ స్థాయికి ఎదిగే స్వేచ్ఛ, అవకాశం అల్లాహ్‌ా జనులందరికీ అనుగహ్రించాడు. ఇలా అన్నాడు:
”ఓ ప్రజలారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యదార్థానికి మీలో అందరికన్నా ఎక్కువ భయభక్త్తులు గలవాడే అల్లాహ్‌ా సమక్షంలో ఎక్కువ ఆదరణీయుడు”.  (హుజురాత్:13)
  మన అందరి మూలం ఒక్కటే కాబట్టి కుల గోత్రాల, వంశ పరంపరల పేరిట గర్వాన్ని ప్రదర్శించవలసిన అవసరం లేదు. మన మధ్య నిమ్నోన్నతా భేదభావాలకు కూడా తావు లేదు. ఎందుకంటే మనందరి వంశ వృక్షం చివరకు ఆది మానవుడైన ఆదం (అ) తోనే కలుస్తుంది. మరి ఆదంను అల్లాహ్  పుట్టించింది మట్టితోనే.
  మానవ సమాజాన్ని చతుర్వర్ణ వ్యవస్థగా ప్రారంభించి 3వేల 6వందల కులాలుగా దిగజార్చిన వారితో  చిన్న విన్నపం ఏమిటంటే –  మనుషుల్ని  అయితే   మీరు  విభజించారు సరే, దైవాన్ని సైతం కులానికొక్కడి చొప్పున విడదీయడం, గొడవలు, హత్యలు, మారణ హోమాలకు కారకులవడం ఎంత వరకు సమంజసం? రేపు ఆ పరమోన్నత ప్రభువు మిమ్మల్ని నిలదీస్తే ఏమని సమర్ధించుకుంటారు? ఏమిటి దైవానికి భయపడే సమయం రాలేదా?

దేవునికి సంతానం ఉందా?

మానవ చరిత్రలో జరిగిన అతి పెద్ద నేరం – ‘దేవునికి సంతానం ఉంది’ అనడం. ఈ వాదన పూర్వాపరాల్ని గమనిద్దాం!
  తామే దైవ జనులు, దైవానికి ప్రియులు, తమ కోసమే స్వర్గం అని ఎలాగైతే అన్య ప్రాంతాలలోని ప్రజలు భావించేవారో, అలాగే తమ వద్దకు దైవ సందేశాన్ని తీసుకువచ్చిన ప్రవక్తలను, సంఘం కోసం పాటుపడిన సంస్కర్తలను, రాజులను, రాణులను దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అని చెప్పి,  వారిని దైవంగా తలచి కొలచిన దాఖలాలు మానవ చరిత్రలో కోకొల్లలు. యూదులు ‘ఉజైర్‌’ అనే దైవ దాసుడ్ని దైవ కుమారుడిగా నామకరణం చేస్తే, క్రైస్తవులు ఈసా (ఏసు) దైవ ప్రవక్తను దేవుని కుమారునిగా ఎంచారు. ఇక నాగరికత విషయంలో వీరిరువురికన్నా ఎంతో ప్రాచీనమైన రోమన్‌ నాగరికత లోనూ, ఈజిప్టు నాగరికతలోనూ, సింధు నాగరికతలోనూ త్రిమూర్తులు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తెల భావన బలంగా ఉన్నట్టు చరిత్ర చదివిన ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. ప్రపంచంలోని పలు జాతులు, పలు చోట్ల ప్రవేశ పెట్టిన ఈ విధమైనటువంటి వాదన గురించి ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది:
   ”అల్లాహ్కు సంతానం కలదని వీళ్ళు అంటున్న మాట.    (ఇలాంటి  మాటలకు)  ఆయన అతీతుడు, పవిత్రుడు. నిజం ఏమిటంటే – భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనదే (ఆయన పుట్టించిన సృష్టే). అవన్నీ ఆయన (ఆజ్ఞల)కు తల ఒగ్గి ఉన్నాయి”. (బఖరా:116)
మరో చోట ఇలా ఉంది: ”వారు అల్లాహ్‌ాను వదలి స్త్రీలను మొరపెట్టుకుంటున్నారు. వాస్తవానికి వారసలు పొగరుబోతు షైతానులను మొరపెట్టుకుంటున్నారు”.  (అన్‌ నిసా: 117)
  అంటే, స్త్రీలను దైవంగా కొలవడం. ఉదాహరణకు: లాత్‌, ఉజ్జా, మనాత్‌, నాయిలా మొదలగు స్త్రీ ఆకారం గల ప్రతిమల్ని అరబ్బులు ఆరాధించేవారు. అలాగే మన భారత దేశంలో సైతం దుర్గ, లక్ష్మి, గంగమ్మ, కాళికా మొదలైన స్త్రీలను దైవంగా కొలవడం నేటికీ జరుగుతుంది. వీటికి తోడుగా గ్రామ దేవీలనీ, అమ్మోరు, ఆటలమ్మ అని ఎన్నో స్త్రీ ప్రతిమలు దైవాలుగా కొలవబడుతున్నాయి. ఇదే విధంగా ఈజిప్టు, రోమ్‌ దేశాల్లోనూ దైవదూతలను దైవ కుమార్తెలుగా ఎంచి పూజించిన దాఖలాలు కూడా మనకు చరిత్రలో కనబడతాయి. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
”కరుణామయుని (అల్లాహ్‌) దాసులైన దైవ దూతలను వీళ్ళు ఆడవారుగా ఖరారు చేస్తున్నారు. ఏమిటి, వారి పుట్టుక సందర్భంగా వీళ్ళు గాని అక్కడ ఉన్నారా? వీళ్ళ ఈ సాక్ష్యం వ్రాసుకోబడింది. (దీని గురించి) వీళ్ళు తప్పకుండా నిలదీసి అడగబడతారు”. (జుఖ్రుఫ్: 19)
  మరి ఈ పూజింపబడుతున్నవారు ఎవరు? అంటారా. ఖుర్‌ఆన్‌ ఇలా సమాధాన మిస్తుంది: ”కరుణామయునికి సంతానం ఉందని వారు చెబుతున్నారు. (ఇది నిజం కాదు) ఆయన పరమ పవిత్రుడు. నిజంగా వారంతా గౌరవించబడిన ఆయన దాసులు”. (అల్‌ అన్‌బియా: 26)
  అంటే-, అల్లాహ్కు సంతానం ఉంది అన్న మాట పెద్ద అభాండం. అతి పెద్ద అబద్ధం. క్షమించరాని నేరం. అట్టి వారిని హెచ్చరించేందుకే ఖుర్‌ఆన్‌ అవతరించింది:
”అల్లాహ్‌ా సంతానం కలిగి ఉన్నాడని అవాకులు, చెవాకులు పేలే వారిని హెచ్చరించడానికి ఈ గ్రంథం అవతరింప జేయబడింది. యదార్థానికి వారికిగానీ, వారి తాతముత్తాతలకుగానీ, దీని గురించి ఏ మాత్రం విషయ జ్ఞానం లేదు. వారి నోటి నుండి వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు చెప్పేదంతా పచ్చి అబద్ధం”. (అల్‌ కహఫ్‌:4,5)
అయితే – ఏకేశ్వరోపాసన పునాదుల మీద నిర్మితమైన ముస్లిం సముదాయంలో సైతం ఇటువంటి అపసవ్యత చోటుచేసుకోవడం అత్యంత శోచనీయం! బాధాకరం!! వీరిలోని కొందరు – లాల్‌ పరీ, ఉజ్లీ పరీ, కాలీ పరీ, నన్‌గే బాబా, తుర్‌తుర్‌ బీబీ, అమ్మాజాన్‌, బావాజాన్‌, దీవానె షాహ్  అంటూ ఎగేసుకెళ్ళి ఆరాధించడం మనం గమనించవచ్చు. ఖుర్‌ఆన్‌ వీరిని సైతం హెచ్చరించడానికి వచ్చిందని, వారు తమ ఈ వైఖరిని, మూర్ఖత్వాన్ని మానుకోకపోతే దైవ శిక్ష  వారిని సైతం నాశనం చేస్తుంది అని వారు ఎంత తొందరగా గ్రహిస్తే అంతే మంచిది. దైవం దృష్టిలో మనిషి చేసే కర్మలే ప్రమాణాలు. వంశపు విశిష్ఠతలు, కుల పెద్దరికాలు ఆయన వద్ద చెల్లవు. సారాయిని సారాయి బాటిల్ల్లో త్రాగితే వారు త్రాగుబోతులా? సారాయిని పెప్సి బాటిల్లో మార్చుకుని త్రాగితే మీరు సాధుస్వభావులా? అలా చేసేవారు నరకానికా? ఇలా చేసే మీరేమో స్వర్గానికా?! ఎంత విడ్డూరం!! జిన్నులు ఇచ్చిన సాక్ష్యం వీరందరికీ కనువిప్పు కావాలి.
  ”మా ప్రభువు మహిమ అత్యున్నతమైనది. ఆయన తన కోసం (ఎవరినీ) భార్యగా గానీ, కొడుకుగా గానీ చేసుకోలేదు. మనలోని మూర్ఖుడు అల్లాహ్‌ా గురించి సత్య విరుద్ధమైన మాటలు పలికేవాడు. మనుషులైనా, జిన్నులైనా అల్లాహ్‌ాకు అబద్ధాలు అంటగట్టడం అనేది అసంభవం అని మేము అనుకున్నాము”. (ఆల్ఫ్ జిన్:3-5)
  అంటే – దాదాపు ప్రజలు మోసగాళ్ళ, దగాకోరుల మాటలు సత్యం అన్న భ్రాంతితోనే వింటారు. కాబట్టి దేవుడి గురించి వారు ఏం చెప్పినా నిజమని నమ్ముతారు. అలాగే జిన్నులు సైతం అట్టి దగుల్బాజి పండితుల మాటలను నిజం అని నమ్మి మోసపోయారు. కాని ఖుర్‌ఆన్‌ వాణిని విన్న మీదట నిజానిజాలు నిగ్గు తేలాయి. వారు తమ పూర్వ వైఖరిని మానుకొని స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసకులుగా పరివర్తనం చెందారు.

Related Post