తఖ్వా – దైవభీతి

 సర్వకాల సర్వావ స్థలందు  కనిపెట్టుకుని  ఉండేవాడు. మానవుణ్ని తన పూజకై పుట్టించాడు. జీవితాన్నిచ్చి,  ఈ  జగత్తును మానవుడి అన్ని అవసరాలను తీర్చేవిధంగా సృష్టిం చాడు. అతన్ని  మాత్రమే ముస్లిం ప్రేమిం చాలి.  మనసా,  వాచా, కర్మణా అతన్ని ఆరాధించేబాటలోనే నడవాలి. మన ప్రేమకు అల్లాహ్  ఒక్కడే అర్హుడు.

సర్వకాల సర్వావ స్థలందు కనిపెట్టుకుని ఉండేవాడు. మానవుణ్ని తన పూజకై పుట్టించాడు. జీవితాన్నిచ్చి, ఈ జగత్తును మానవుడి అన్ని అవసరాలను తీర్చేవిధంగా సృష్టిం చాడు. అతన్ని మాత్రమే ముస్లిం ప్రేమిం చాలి. మనసా, వాచా, కర్మణా అతన్ని ఆరాధించేబాటలోనే నడవాలి. మన ప్రేమకు అల్లాహ్ ఒక్కడే అర్హుడు.

అనుపమ మాస పత్రిక సౌజన్యంతో

తఖ్వా అర్థం :

ఇది అరబీ పదం. దీని అర్థం తనను తాను రక్షించుకోవడానికి దీన్ని అడ్డుగా పెట్టుకుంటాము. ‘‘డాలు’’ అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అల్లాప్‌ా గురించి మనం చాలా శ్రద్ధ, భయభక్తులు ప్రదర్శించి జీవితాన్ని చెడు నుండి రక్షించు కోవటం.

మన జీవితంలో దీన్ని ఎలా అన్వ యించుకోవాలి? మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాము, ఇష్టపడుతున్నాము అంటే మనం వారికి నచ్చిన పనులను మాత్రమే చేసి వారి మెప్పు పొందే ప్రయత్నం చేస్తాము. వారికి అయిష్టమైనవి చేయము. వాటి గురించి ఆలోచించము. ముస్లిం అనే వారు తప్పక అల్లాప్‌ా గురించి ఇలా ప్రవర్తించటం కనీస ధర్మం. ఎందుకంటే, అల్లాప్‌ా ఒక్కడే ప్రార్థనలకు, పూజలకు అర్హుడు. ఈ చరాచర జగ త్తుకు, సృష్టికి మూల కారకుడు, రక్షకుడు, పెంచిపోషించేవాడు, సర్వకాల సర్వావ స్థలందు కనిపెట్టుకుని ఉండేవాడు. మానవుణ్ని తన పూజకై పుట్టించాడు. జీవితాన్నిచ్చి, ఈ జగత్తును మానవుడి అన్ని అవసరాలను తీర్చేవిధంగా సృష్టిం చాడు. అతన్ని మాత్రమే ముస్లిం ప్రేమిం చాలి. మనసా, వాచా, కర్మణా అతన్ని ఆరాధించేబాటలోనే నడవాలి. మన ప్రేమకు అల్లాప్‌ా ఒక్కడే అర్హుడు.
అతన్ని స్తుతించటంలో కానీ, పూజిం చటంలోగాని, ఆరాధించటంలో కానీ మన జీవన కాలంలో ఎక్కువభాగం, దీనికే కేటాయించాలి తప్ప మన మనసు చెప్పే దారిన కాదు. అల్లాప్‌ా ఆదేశించిన దారినే నడవాలి. దేవుడిచ్చిన ఈ శరీరం ఒక వరం. కళ్ళు ఒక వరం, కాళ్ళు ఒక వరం, చేతులు ఒక వరం, గుండె అద్భుత మైన వరం. ఒకసారి జ్ఞానం ఉపయోగించి ఆలోచించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, అతని గొప్పతనం మన శరీరాన్ని పులకింపజేస్తుంది. మంచి, మంచి ఇంకా మంచి చేయాలని, ఆ సర్వ సృష్టికారకుణ్ని స్తుతించి కీర్తించి తరించా లని మనసు ఉవ్విళ్ళూరుతుంది. మన జీవితంలోని ప్రతి రంగంలో అతను కోరిన రీతిగా మనం వ్యవహరించాలి. ఏదైనా కొనేటప్పుడు, అమ్మేటప్పుడు, ఎవరి తోనైనా మాట్లాడేటప్పుడు, ఎక్కడికి వెళ్ళినా మనం అల్లాప్‌ా భయ, భీతుల్లోనే మన వ్యవహారం ఉండితీరాలి. పరీక్షలు రాస్తున్నప్పుడు కానీ, పాఠాలు బోధిస్తు న్నప్పుడుగానీ, రచనలు చేస్తున్నప్పుడు గానీ, ఏ రంగమైనా మనలో తఖ్వా ఉండి తీరాలి.

ప్రవక్త (స) ఒక హదీసు (సహీ ముస్లిం)లో ఇలా అన్నారని వ్రాయబడి ఉంది : ‘‘తఖ్వా అన్నది ఇక్కడ ఉండాలి’’ అని హృదయం వైపు చూపారు. ఉమర్‌ (రజి) ‘‘కాబ్‌ (రజి) గారిని తఖ్వా అంటే ఏమిటి?’’ అని ప్రశ్నించారు. కాబ్‌ (రజి) గారు పవిత్ర ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని బాగా ఔపాసన పట్టినవారు. వారు ఉమర్‌ (రజి) గారినిలా ప్రశ్నించారు, ఒక బాట, దానికి ఇరువైపులా ముళ్ళపొదలుంటే నీవు ఎలా ఆ దారిన నడుస్తావు అని అడిగితే, ఉమర్‌ (రజి) గారు ఇలా జవాబిచ్చారు: ‘‘నేను జాగ్రత్తగా నా వస్త్రాలను దగ్గరికి పట్టుకొని, ఇంకా జాగ్రత్తగా నడుస్తాను, నా అంగవస్త్రాన్ని రక్షించుకుంటూ ముందుకు వెళతాను’’ అని అన్నారు. అప్పుడు కాబ్‌ (రజి) ‘‘అదే తఖ్వా’’ అన్నారు. జీవిత బాటలో రెండువైపుల షైతాను వలవేసి ఉంటాడు. మనలను మనం రక్షించుకుంటూ ఈ ప్రపంచంలో ముందుకెళ్ళాలి.

తఖ్వాను పొందేదెలా?

ఖుర్‌ఆన్‌ను పఠించండి. పఠించ వలసిన రీతిలోనూ, మీరు ఏం చదువు తున్నారో తెలుసుకుంటూ ముందుకు సాగండి. ఒక తర్జుమాను ఎన్నుకొని, మీకు బాగా వచ్చిన భాషలో అర్థం చేసుకుంటూ చదువుతూ ముందుకు సాగండి. ఇది మీ హృదయ మాలిన్యాలను కడిగివేస్తుంది. ఖుర్‌ఆన్‌ తీర్పుదినం నాడు మనకై క్షమా భిక్షకై అల్లాప్‌ాను వేడుకుంటుంది.

రాత్రింబవళ్లు అల్లాప్‌ాను స్మరిం చండి. ‘‘ఓ విశ్వాసులారా! అల్లాప్‌ాను స్మరించండి. కీర్తించవలసిన రీతిలో ఉదయం సాయంత్రం కీర్తించండి’’ (దివ్య ఖుర్‌ఆన్‌ 32:42,43). చిన్న దుఆ పుస్తకాలు దొరుకుతాయి, అవి కొని ఉదయం, సాయంత్రం అల్లాప్‌ాను స్మరించండి. ఉదయం సాయంత్రాలు వీలు లేకపోతే, సుబ్‌హానల్లాప్‌ా, వల్‌హం దులిల్లాప్‌ా, అల్లాహు అక్బర్‌ అని చదు వుతూ ఇంటిపని, వంటపని, బట్టలు తకటం చేయవచ్చు. దీనివలన మన పనీ జరుగుతుంది, ఇబాదత్‌ చేసిన పుణ్యం దక్కుతుంది.
ఎప్పుడూ మంచివాళ్ళలో కూర్చుంటూ, లేస్తూ, మంచిపనులు చేస్తూ, చెడుకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒకవేళ మీ మనసు చెడువైపు ప్రేరేపిస్తే, చావును గుర్తుకు తెచ్చుకోండి. మీ మనసు అదుపులో ఉంటుంది. తఖ్వాకై కృషి సల్పండి. అల్లాప్‌ా మిమ్మల్ని పుణ్య పురుషుల్లో చేర్చుతాడు. స్వర్గద్వారాలు మీకై తెరువబడవచ్చు.
మనిషిలో ఏర్పడిన ఈ భయభక్తుల వల్ల, దైవాగ్రహం నుండి మనల్ని మనం కాపాడుకోగలం. రమజాన్‌ ఉపవాసాలు కూడా భయభక్తులు జనించేందుకే అల్లాప్‌ా విధిగా చేశాడు. ఉపవాసం విరమించే సమయంలో ప్రతి ఒక్కరు తమకు తాము ప్రశ్నించుకోవాలి. ‘‘నా ఈ ఉపవాసం నాలో దైవభీతి కల్గించిందా?’’ నరకాగ్ని నుండి కాపాడే విధంగా ఉందా? అల్లాప్‌ా మెచ్చే విధంగా సూచించిన విధంగా నేను ఈ వ్రతాన్ని పాటించానా’’ అని ఆత్మ విమర్శ చేసుకోవాలి.

‘‘అల్లాహుమ్మ ఆతి నఫ్‌సీ తఖ్వాహా, వజక్కియా అంతఖైరు మన్‌జక్కాహా అంత వలియ్యుహా వ మౌలాహా’’.
(ఓ అల్లాప్‌ా! నా ఆత్మకు తఖ్వాను ప్రసాదించి దాన్ని పరిశుభ్రపరచు. ఆత్మను నీవే అత్యుత్తమంగా ప్రక్షాళనం చేసే వాడివి. ఇంకా నీవే దాని రక్షకుడవు, యజమానివి)

Related Post