ధార్మిక గ్రంథాల వెలుగులో దేవుడు

అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరం భావమజానంతో మమావ్య యమనుత్తమమ్‌ నాశరహితమైనట్టియు, సర్వోత్తమైనట్టియు ప్రకృతికి పరమైవిలసిల్లునట్టియు నా స్వరూప మును తెలియని అవివేకులు అవ్యక్తరూపుడగు నన్ను పాంచ భౌతిక దేహమును పొందిన వానినిగా తలంచుచున్నారు. (గీత 7:24

అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరం భావమజానంతో మమావ్య యమనుత్తమమ్‌
నాశరహితమైనట్టియు, సర్వోత్తమైనట్టియు ప్రకృతికి పరమైవిలసిల్లునట్టియు నా స్వరూప మును తెలియని అవివేకులు అవ్యక్తరూపుడగు నన్ను పాంచ భౌతిక దేహమును పొందిన వానినిగా తలంచుచున్నారు. (గీత 7:24

ప్రియమైన ధార్మిక సోదరు లారా!

మీరెప్పుడైనా ఈ విషయమై ఆలోచించారా? మన చుట్టూ వ్యాపించి ఉన్న ఈ అనంతమైన విశ్వవ్యవస్థ దానంతట అదే ఉనికిలోకి వచ్చిందా? లేక మరెవరి ద్వారానైనా ఉనికిలోకి తీసుకు రాబడిందా? ఈ విశ్వములో ఉన్న విభిన్న శక్తులు ఒకే దేవుని ఆధీనంలో ఉన్నాయా? లేక అనేక దైవాల ఆధీనంలో ఉన్నాయా?

ఇదే విధంగా మానవుని జయాపజయాలు, లాభనష్టాలు, వ్యాధి స్వస్థత, సమస్తము స్వయంగా మానవుని అధీనంలో ఉన్నాయా? విభిన్న శక్తుల ఆధీనంలో ఉన్నాయా? లేక దైవాధీనంలో ఉన్నాయా?

ఈ ప్రశ్నలకు సరియైన స్పష్టమైన సంపూర్ణమైన సమాధానాలు లభించినంత కాలం మానవులు అజ్ఞానాంధకారపు కారుచీ కట్లలో కొట్టు మిట్టాడుతూ, మూఢ నమ్మకాలు, మిథ్యామార్గాలలో తచ్చాడుతూ తమ శక్తి సామర్థ్యాలను ధారపోస్తూ ఉంటారు. సమాజంలో కొందరు తెలి వైన వాళ్ళు (మోసగాళ్ళు, వంచ కులు) తాముకూడా అతీంద్రియ శక్తులు కలిగియున్నామని ఏదైనా చేయగల మని భ్రమపరుస్తున్న కారణం గా, ప్రజలు మోసాలకు గురై తమ సంపదల ను నష్టపరు చుకోవడమే గాక ఒక్కోక్క సారి పరువును కూడా పోగొట్టుకోవలసి వస్తుంది.
ఇటువంటి సమయంలో మన ధార్మికగ్రంథాలు మనకిచ్చే సమాధానమేమిటి? పరిశీలించవల సిన అవసరం లేదా? అసలు దేవుని గూర్చి మన ధార్మిక గ్రంథాలు ఇచ్చే సందేశం ఏమిటో మొదటగా పరిశీలించి తెలుసుకుందాము.

విభిన్న దైవాలా? ఏకైక దైవమా?
య ఏక ఇత్తము ష్తుతి (ఋగ్వేదం 6:45:16)

ఒక్కడు, సాటిసమానము లేని ఆయన్నే స్తుతించండి.ఏకోహి రుద్రోన ద్వితీ
యాయ తస్థు ఒక్కడే దేవుడు రెండవవాడు లేడు (శ్వేతాశ్వేతరో పనిషత్తు 3:2) ామామేకం శరణం వ్రజ
నన్నొక్కనిమాత్రమే శరణు బొందుము (గీత 18:66)
నేను యొహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. (బైబిల్‌ యెసయా 45:5)
మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. (బైబిల్‌ మార్కు 12:29)
మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి.(బైబిల్‌ 1 కొరింధీ 8:6)
ఒకవేళ ఆకాశంలో భూమిలో ఒక్క అల్లాహ్‌ా తప్ప ఇతర దేవుళ్ళు కూడా ఉంటే, అప్పుడు (భూమ్యాకాశాల) రెండింటి వ్యవస్థ ఛిన్నాభిన్నమై ఉండేది. (ఖుర్‌ఆన్‌ 21:22)
– మరొక దేవుడెవ్వడూ ఆయనతో పాటు లేడు. ఒకవేళ అలా అయితే, ప్రతి దేవుడు తన సృష్టిని తీసుకొని వేరుపడిపోయేవాడు. (ఖుర్‌ఆన్‌ 23:91)
ాఆయన అల్లాహ్‌ా,అద్వితీయుడు, అల్లాహ్‌ా నిరపేక్షాపరుడు. (ఖుర్‌ఆన్‌ 112:1-2)

గమనిక: పై వాక్యములు పరిశీలించినచో వేదాలు, ఉపనిషత్తులు, గీత, బైబిలు, ఖుర్‌ఆన్‌ ప్రకారం మనల్ని, యావత్తు సృష్టిని సృజించి పోషించి-పాలించే స్వామి- యజమాని అయిన దేవుడు ఒక్కడేనని విభిన్న దైవాలు లేనే లేరని స్పష్టమవుతోంది.

దేవుడు పుడతాడా?
యో మామజమనాదిం చవేత్తి లోకమహేశ్వరమ్‌ అసమ్మూఢస్స మర్య్తేషు సర్వపాపై ప్రముచ్యతే.
ఎవడు నన్ను యదార్థముగా జన్మరహితునిగను, అనాదియైన వానిని గాను సకల లోక మహేశ్వరునిగాను తెలిసుకొనుచున్నాడో వాడు మానవులలో జ్ఞాని, అట్టి వాడు సర్వ పాపముల నుండి విముక్తుడగును. (గీత 10:3)
దేవుడు అబద్దమాడుటకు ఆయన మాన వుడు కాడు. పశ్ఛాత్తాపపడుటకు ఆయన నర పుత్రుడు కాదు.(బైబిల్‌ సంఖ్యా కాండము 23:19)
ఆయనకు సంతానం ఎవరూ లేరు ఆయన కూడా ఎవరి సంతానమూ కాదు. (ఖుర్‌ఆన్‌ 112:3)
గమనిక: పై వాక్యముల ప్రకారం దేవునికి పుట్టుక అనేదే లేదని పుట్టినది, సృష్టించబడి నది ఏది దేవుడు కాదని గుర్తించిన మాన వుడు మాత్రమే జ్ఞాని అని తెలుస్తుంది.

దేవుడు చనిపోతాడా?
పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్స నాత న:య: స సర్వేషు భూతేషు నశ్యత్సు వినశ్యతి
ఆ అవ్యక్తము కంటేను పరమైన విలక్షణమైన సనాతనమైన అవ్యక్త భావమే ఆ పరమ పదము. ప్రాణులన్నీయు నశించినను ఆ పరమ పురుషుడు మాత్రము నశింపడు. (గీత 8:20)

చిరంజీవియు, సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రం చేసి ఘనపరచి స్తుతించితిని.(బైబిల్‌ దానియేలు 4:34)
భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు.(బైబిల్‌ యెషయా 40:28)
ఒక్క ఆయన ఉనికితప్ప ప్రతీది నశిం చేదే. (ఖుర్‌ఆన్‌ 28:88)
ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. (ఖుర్‌ఆన్‌ 2:255)
గమనిక: ఈ సృష్టి సకల జగత్తు నశించిపో యినను ఆ ఒక్క దేవుడు నశింపక నిరంతరం సజీవంగా ఉంటాడనేది సుస్పష్టం.

దేవుడు కనిపిస్తాడా?

ససందృశే తిష్ఠతి రూపమస్య నచక్షుషా పశ్యతి కశ్చనైనమ్‌
ఆయన రూపం దృష్టి పరిధిలో నిలువదు. కన్నులతో ఆయనను చూడలేము. (శ్వేతా శ్వేతరోపనిషత్తు 40:20)
ఆయన మనకు అగోచరుడు. (బైబిల్‌ యోబు 37:23)
చూపులు ఆయనను అందుకోలేవు ఆయన చూపులను అందుకుంటాడు. (ఖుర్‌ఆన్‌ 6:103)
గమనిక: పై వాక్యముల ద్వారా దేవుడు అవ్యక్తస్వరూపుడు కాబట్టి మన కన్నులకు అగోచరుడు అని తెలపడమే గాక ఎవరైతే కనిపించే ప్రతిదాన్ని దైవమని భ్రమిస్తారో వారు అవివేకులని కూడా చెప్పడం జరిగింది.

దేవుడు అవతరిస్తాడా?
అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరం భావమజానంతో మమావ్య యమనుత్తమమ్‌
నాశరహితమైనట్టియు, సర్వోత్తమైనట్టియు ప్రకృతికి పరమైవిలసిల్లునట్టియు నా స్వరూప మును తెలియని అవివేకులు అవ్యక్తరూపుడగు నన్ను పాంచ భౌతిక దేహమును పొందిన వానినిగా తలంచుచున్నారు. (గీత 7:24)

మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి (దేవుడు) అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి (దేవుడు) ఆయన పరలోక మందు న్నాడు. (బైబిల్‌ మత్తయి 23:9)
ాదైవదూతలు తమ ప్రభువు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకొని అవతరిస్తారు. (ఖుర్‌ఆన్‌ 97:4)
గమనిక: దేవుని తరుపున దూతలు అవతరి స్తారే గాని, దేవుడు అవతరించడు. ఎవరైతే దేవుడే అవతరిస్తాడని తలంచుచున్నారో, వారు ఆయా వాక్యాభాగాలు అర్థం చేసుకోవడంలో పొరబడుతున్నారని అర్థమౌతుంది. ఎందుకంటే గీతా శాస్త్రము సయితం సర్వశక్తి వంతుడైన దేవుడు పాంచబౌతిక దేహం దాల్చ డని స్పష్టంగా తెలియజేస్తుంది.

దైవేతరులను ఆరాధిస్తే కలిగే పర్యవసానం?
అంధం తమ ప్రవిశంతియే అసంభూతి ముపాసతే తతో భూయ ఇవతే తమోయ ఉ సంభూత్యాగ్‌ రతా
ఎవరైతే ప్రకృతిని ఉపాశిస్తారో వారు అంధ కారం (నరకం)లో ప్రవేశిస్తారు. ఎవరు సం భూతిని (మానవునిచే తయారుచేయబడిని వాటిని) ఆరాధిస్తారో వారు మరింత అంధ కారం (నరకం)లో ప్రవేశిస్తారు. (యజుర్వేదం 40:9)

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకాధార ముగా చేసికొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. (బైబిల్‌ యిర్మియా 17:5)
ఇతరులకు అల్లాహ్‌కు భాగస్వాములుగా చేసేవారికి అల్లాహ్‌ా స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు. వారి నివాసం నరకం. అటువంటి దుర్మార్గుల కు సహాయం అందించే వాడెవడూ లేడు. (ఖుర్‌ఆన్‌ 5:71)

గమనిక: మొత్తం పరిశీలన ద్వారా అర్థమైన విషయమేమిటంటే వేదోపనిషత్తులు, గీత, బైబిలు మరియు అంతిమ దైవగ్రంథమైన దివ్య ఖుర్‌ఆన్‌ ద్వారా ఒక్కడైయున్న ఆ దేవుడు హిబ్రూలో యెహోవాగా, సంస్కృ తంలో సర్వేశ్వరునిగా మరియు అరబీ భాష లో అల్లాహ్‌ాగా పిలువబడిన ఆయన చావు పుట్టుకలు లేని వాడని అదృశ్యుడైన ఆయన అవతరించడు అని అర్థమవుతుంది. ఇంకా సర్వేశ్వరుడు యెహోవా అయిన ఆ అల్లాహ్‌ా ని తప్ప ఇతరులకు ఆరాధిస్తే దాని పర్యవ సానంగా ఇహలోకంలో శాపాలకు గురి అవడమే గాక, మరణానంతరం నరకంలో బాధాకరమైన ఘోర శిక్షలు చవిచూడవలసి వస్తుందని మన ధార్మిక గ్రంథాలు మనలను హెచ్చరిస్తున్నాయి. కాబట్టి నిజ దైవమయిన అల్లాహ్‌ాను ఆరాధించి, ఆయన ఆదేశాలను గైగొని స్వర్గానికి వెళతామో, బహుదైవాలను మొక్కి అవిధేయత చూపి నరకం పాలవు తామో మనమే నిర్ణయించుకోవాలి.

 

Related Post