బీదల పాట్లను గుర్తించే మాసం

ఈ మాసంలో రాత్రి వేళ తరావీహ్‌, తహజ్జుద్‌ నమాజుల్లో సుదీర్ఘమైన, చక్కటి స్వరంతో ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తూ ఉంటే రోజంతా పని చేసి అలసిపోయినా ఉల్లాసంగానే ఉంటుంది. ఈ విధంగా కువైట్‌లో రమజాను మాసం ముగుస్తుంది.

ఈ మాసంలో రాత్రి వేళ తరావీహ్‌, తహజ్జుద్‌ నమాజుల్లో సుదీర్ఘమైన, చక్కటి స్వరంతో ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తూ ఉంటే రోజంతా పని చేసి అలసిపోయినా ఉల్లాసంగానే ఉంటుంది. ఈ విధంగా కువైట్‌లో రమజాను మాసం ముగుస్తుంది.

ముహమ్మద్

కువైట్‌లో రమజాను నెల సన్నాహాలు షాబాన్‌ నెల నుంచే ఆరంభమవుతాయి. శుభాలను ఆర్జించడం కోసం ప్రవక్త (స) సూచించిన అన్ని సున్నత్‌ రోజాలు పాటిస్తారు. ఎంతో ఆసక్తిగా రోజురోజూ గుర్తు చేసుకుంటూ రమజాన్‌ తొలి దినం కోసం ఎదురు చూస్తారు. ఈ విధంగా నింగిలో రమజాన్‌ మాసపు నెలవంకను చూడగానే అల్లాహ్‌ాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ భక్తీవిశ్వాసాలతో అందరూ రోజాను మొదలెడతారు. ఈ నెలలో ఎక్కువగా ఖుర్‌ఆన్‌ పారాయణం చేయడం, వినడం, దానధర్మాలు చేయడం చేస్తారు. ఉద్యోగస్తులకు పని వేళలను తగ్గిస్తారు.

చిన్న పిల్లలు ఉపవాసం ఉండలేరని వదిలి వేయకుండా రోజా ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఇఫ్తార్‌కు, సహ్‌ారీకి వారి కోసం చల్లని పానీయాలు, పదార్థాలు, తీపి వంట కాలు, సూప్‌లు వండి రోజా కోసం పురి కొల్పుతారు. పుణ్యం కోసం బంధు మిత్రులు, స్నేహితులు, ఇరుగు పొరుగువారు రమజాన్‌ శుభాకాంక్షలు తెలుపుతతూ ఒకరినొకరు కలవటం, కానుకలు ఇవ్వటం చేస్తారు. భోజనాలు వండి మస్జిద్‌లకు ఇఫ్తార్‌ నిమిత్తం పంపిస్తారు. రోజు అంతా ఉపవాసం ఉన్నా మితంగా ఇఫ్తార్‌ చేసి ఇషా, తరావీహ్‌ా సల్లికి బయలుదేరుతారు.

ఈ నెలలో పనివాళ్ళకు ఎక్కువ పని ఉన్నా రోజాను బరువుగా భావించక సహనంతో, సంతోషంతో రోజాను ముగించుకుంటారు. చివరి పది రోజులూ నరకాగ్ని నుండి విముక్తి కోసం అడుగడుగునా అల్లాహ్‌ాను క్షమాపణ వేడుకుంటూ వెయ్యి నెలలకంటే శ్రేష్ఠమైన రాత్రిని పొందుటకు సుఖ నిద్రను మానుకొని రాత్రి పూట జాగారం చేస్తారు. తహజ్జుద్‌ నమాజుకు బయలుదేరుతారు. ఒక హదీసులో సల్మాన్‌ ఫారసీ (రజి) ఇలా ఉల్లేఖించారు: షాబాన్‌ చివరి తేదీన మహా ప్రవక్త (స) ప్రసంగం చేశారు. అందులో – ”జనులారా! ఒక మహోన్నతమైన ఎనలేని శుభాల నెల త్వరలో రానున్నది. అల్లాహ్‌ా ఈ నెలలో రోజాను పాటించడం విధిగా నిర్ణయించాడు. అందులోని ఒక రేయి వెయ్యి నెలలకన్నా శుభప్రదమైనది. ఈ నెల రాత్రుల్లో తరావీహ్‌ా నమాజు చేయడం నఫిల్‌గా నియమించాడు. ఈ నెలలో ఎవరైనా ఒక సత్కార్యాన్ని అంతర్‌ ప్రేరణతో, సంతోషంగా చేస్తే అది ఇతర మాసాల్లో విధిని నిర్వర్తించిన దానికి సమానం. ఎవరైనా ఈ మాసంలో ఫర్జ్‌ నిర్వర్తిస్తే అది ఇతర మాసాల్లో డెబ్బయి విధుల్ని నిర్వర్తించిన దానికి సమానం” అని చెప్పారు.

ఈ మాసంలో రాత్రి వేళ తరావీహ్‌, తహజ్జుద్‌ నమాజుల్లో సుదీర్ఘమైన, చక్కటి స్వరంతో ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తూ ఉంటే రోజంతా పని చేసి అలసిపోయినా ఉల్లాసంగానే ఉంటుంది. ఈ విధంగా కువైట్‌లో రమజాను మాసం ముగుస్తుంది.

అయితే రమజాను మాసం మనకిచ్చే ఉపదేశం ఏమిటి? అంటే ఈ విధంగా నెల రోజులు ఉపవాసాలు ఉండి కొంత సమయం వరకు అన్నపానీయాలకు, కోర్కెలకు దూరంగా ఉండటం వలన మనోనిగ్రహం, ఓపిక, సహనం జనిస్తాయి. శరీర అవయవాల పనితీరు చక్కబడుతుంది. సమయానికి అన్నపానీయాలు లభించని పేదవారి స్థితిని అర్థం చేసుకోగలరు. ఎక్కువ సమయం నమాజుల్లో నిలబడటం వలన గర్వం నశించి సేవాభావం అలవడు తుంది.

ఈ విధంగా నిరంతరం ఒక నెల రోజుల పాటు ఉపవాసం పాటించిన వారిలో దేవుని పట్ల భయభక్తులు జనించడంతోపాటు, సాటి మనుషుల పట్ల దయాదాక్షిణ్యాలు పెంపొందుతాయి. కలవారు లేనివారి అవసరాలు తీర్చడానికి సమాయత్తం అవుతారు. కువైటీలలో ఈ దాతృస్వభావం ఎక్కువగా ఉంది. రమజాను నెల చివరి పది రోజుల్లోనైతే ఇక్కడి వాతావరణం అనిర్వచనీయం. వివిధ మంతఖాల్లోని జకాత్‌, ఛారిటీ సంఘాలు పేదవారిని వెతికి వెతికి మరీ ఫిత్రా దానాలు ఇస్తాయి. రమజాన్‌ పండుగ జరుపుకోవటానికి అవసరమైన వస్తుసామగ్రిని పెద్ద ఎత్తున పంపిణీ చేస్తారు. ఇక పండుగ దినాన ఇచ్చిపుచ్చుకునే కానుకల, ఈదియాల సందడి గురించి వేరుగా చెప్పనవసరం లేదు.

Related Post