హజ్ ఆదేశాలు

 షేఖ్  హబీబుర్రహ్మాన్
hujj - telugu
హజ్‌ ఇస్లాం యొక్క కీలక భాగాలలో ఒక భాగం. దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ”ఇస్లాం ధర్మం ఐదు విషయాలపై ఆధారపడి ఉంది.  1) అల్లాహ్  తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్‌(స) అల్లాహ్  ప్రవక్త అని సాక్ష్యం పలకటం. 2)నమాజు స్థాపించటం. 3) జకాత్‌ చెల్లించటం. 4) హజ్‌ చేయటం. 5) రమజాన్‌ నెలలో ఉపవాసం పాటించటం”.  (బుఖారీ,ముస్లిం)
 స్థోమత కలిగి ఉండే ప్రతి స్త్రీపురుషునిపై జీవితంలో కనీసం ఒకసారి హజ్‌ చేయడం విధి. దైవప్రవక్త(స) ఇలా సెలవిచ్చారు: ”ఓ ప్రజలారా! అల్లాహ్  మీపై హజ్‌ని విధిగా చేశాడు కావున మీరు హజ్‌ చేయండి.
హజ్‌ విధి అవటానికి షరతులు:
1) ఇస్లాం: అనగా హజ్‌ ముస్లింపై విధి  అవుతుంది, అవిశ్వాసులపై కాదు.
2) అఖల్‌: మతిస్థిమితి కోల్పోయినవారిపై  హజ్‌ విధి కాదు.
3) బులూగ్‌: యుక్తవయసుకు చేరినవారు.
 చిన్నపిల్లలు కూడా హజ్‌ చేయవచ్చు, వారిని హజ్‌ చేయించే పెద్దలకు దాని పుణ్యం లభి స్తుంది. ఆ విధంగా బాల్యంలో హజ్‌ చేసిన పిల్లలు పెరిగి    పెద్దయిన   తర్వాత   ఆర్థిక  స్థోమత కలిగిన వారయితే వారు తిరిగి హజ్‌ చేయవలసి ఉంటుంది. బాల్యంలో హజ్‌ చేసినంత మాత్రాన ఆ బాధ్యత నెరవేరినట్లు కాదు.
4) స్వతంత్రుడయి ఉండాలి: బానిసపై హజ్‌ విధి కాదు. ఒకవేళ బానిస హజ్‌ చేసినా స్వతంత్రుడైన తర్వాత స్థోమత కలిగినవాడైతే తిరిగి హజ్‌ చేయవలెను.
5) స్థోమత: అంటే ప్రయాణ ఖుర్చులు, వస్తు సామాగ్రిని సమకూర్చుకోగలిగితే అని అర్థం. దీంతో పాటు హజ్‌ యాత్రకై పరిస్థితులు సానుకూలంగా ఉండాలి. వెళ్ళే రూటులో శాంతియుత పరిస్థితులు నెలకొని ఉండాలి. అలాగే యాత్రికుడు అంతదూరం ప్రయాణం చేయగలిగేందుకు ఆరోగ్యవంతంగా ఉండాలి. అల్లాహ్  ఇలా సెలవిచ్చాడు: ”అక్కడికి వెళ్ళే స్థోమత గలవారికి ఆ గృహ (యాత్ర) హజ్‌ చేయటాన్ని  అల్లాహ్ విధిగా చేశాడు.”  (ఆలి ఇమ్రాన్; 97)
 ఒకవేళ ఎవరయినా  ఆర్థికంగా స్థోమత కలిగి ఉండి, శారీరకంగా ప్రయాణం చేయ లేనివాడైతే అతను వేరే (హజ్‌చేసిన) వాడిని అతని తరపునుంచి పంపించవలెను. అబ్దు ల్లాహ్  బిన్‌ అబ్బాస్‌ (ర) కథనం: ఒక స్త్రీ దైవ ప్రవక్త దగ్గరకి వచ్చి దైవప్రవక్తా! అల్లాహ్  తన దాసులపై విధిగా చేసిన హజ్‌ మా నాన్న గారికి అనివార్యమయినప్పటికీ ఆయన ముసలి వారయిపోయారు. వాహనం మీద సరిగా కూర్చోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఆయన తరపున నేను హజ్‌ చేయవచ్చునా? అని అడిగింది. అందుకా యన(స) ”చేయ వచ్చు” అని సమాధానమిచ్చారు.  (బుఖారీ,ముస్లిం)
6) స్త్రీలకు పైన పేర్కొన బడిన షరతులతో పాటు వారి వెంట మహ్రమ్‌ కూడా ఉండాలి. ఒకవేళ మహ్రమ్‌ లేనట్లయితే ఆమెపై హజ్‌ విధి కాదు.
 పై షరతులు కలిగి ఉండేవారు వెంటనే హజ్‌ చేసుకొనవలెను. వచ్చే సంవత్సరం చేద్దామని వాయిదా వేయకూడదు. దైవప్రవక్త(స) ఇలా సెలవిచ్చారు: ”హజ్‌ చేయాలని నిశ్చయించుకున్న వ్యక్తి హజ్‌ చేయడానికి త్వర పడాలి. ఎందుకంటే అతనికి జబ్బు చేయవచ్చు, ఏదో వస్తువు తప్పిపోవచ్చు లేదా ఇతర కారణాల వల్ల హజ్‌ చేయడం సాధ్యపడకపోవచ్చు.  (ఇబ్నెమాజహ్ )
 ఉమర్‌ (ర) ఇలా అనేవారు: ఎవరయితే హజ్‌ చేయడానికి శక్తి సామర్థ్యాలు ఉండి కూడా హజ్‌ చేయరో వారిపై ”జిజ్‌యా” విధించాలని నాకు అనిపిస్తుంది. నిశ్చయంగా వారు విశ్వా సులు కారు.   (అల్‌ మున్తఖా)
హజ్‌ ఔన్నత్యం: 
1.హజ్‌ మబ్రూర్‌ యొక్క ప్రతిఫలం స్వర్గం
అబూహురైరా(ర)కథనం: దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ”మబ్రూర్‌ (ఆమోద ముద్ర పడిన) హజ్‌కు ప్రతిఫలం స్వర్గం తప్ప మరేమీ లేదు”. (బుఖారీ,ముస్లిం)
2. హజ్‌ వలన పాపాలు క్షమించబడతాయి.
 జాబిర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ా (ర) కథనం: దైవప్రవక్త(స) ఇలా అన్నారు: హజ్‌ మరియు ఉమ్రా చేస్తూ ఉండండి. ఎందుకంటే బట్టి ఏ విధంగా చిలుముని తుదముట్టిస్తుందో అదే విధంగా హజ్‌ మరియు ఉమ్రా పేదరికాన్ని మరియు పాపాల్ని తుదముట్టిస్తాయి.  (తబ్రాని)
3. ఈమాన్‌ మరియు జిహాద్‌ తర్వాత అన్నిటి కంటే ఉత్తమమైనది హజ్‌:
 అబూహురైరా(ర)కథనం: దైవప్రవక్త(స)ను ”ఆచరణలన్నిటిలోకెల్లా శ్రేష్ఠమైనది ఏది?” అని ప్రశ్నించడం జరిగింది. ఆందుకాయన (స) సమాధానమిస్తూ ”అల్లాహ్ను ఆయన ప్రవక్తను విశ్వసించటం” అని అన్నారు. ”ఆ తర్వాత ఏది”? అని అడిగితే ”అల్లాహ్  మార్గంలో పోరాడటం” అని చెప్పారు. ”ఆ తర్వాత ఏది”? అని అడిగితే ‘హజ్జె మబ్రూర్‌’ అని చెప్పారు.
4. హజ్‌ అన్నిటికంటే శ్రేష్ఠమైన పోరాటం:
 ఆయిషా(ర)కథనం: నేనొకసారి దైవ ప్రవక్త(స)తో మాట్లాడుతూ ”దైవప్రవక్తా! మేము దైవమార్గంలో పోరాడటాన్ని శ్రేష్ఠ మైన ఆచరణగా భావిస్తాం. అందుకని మాకూ దైవమార్గంలో పోరాడాలని ఉంది” అని అన్నారు. అందుకాయన(స) (మీకొరకు) శ్రేష్ఠ మైన పోరాటం ‘హజ్జె మబ్రూర్‌’ చేయటానికి ప్రయత్నించటం. అని చెప్పారు. (బుఖారీ)
5. ముసలివారు, దుర్బలమైనవారు, స్త్రీలు వారి జిహాద్‌, హజ్‌ మరియు ఉమ్రా:
 అబూహురైరా(ర)కథనం: దైవప్రవక్త(స) ఇలా అన్నారు: ”ముసలివారి కొరకు, దుర్బ లమైనవారి కొరకు మరియు స్త్రీల కొరకు హజ్‌ మరియు ఉమ్రా చేయటమే వారి పోరాటం”. (నసాయి)
6.హజ్‌ ఉమ్రాలు చేసేవారు అల్లాహ్  అతి థులు, వారి దుఆ స్వీకరించబడుతుంది:
 దైవప్రవక్త(స) ఇలా అన్నారు: ”హజ్‌ ఉమ్రాకు వెళ్ళేవారు అల్లాహ్  ముఖ్య అతి థులు, వారు అల్లాహ్ ని వేడుకుంటే అల్లాహ్  ఆ వేడుకోలు స్వీకరిస్తాడు. క్షమాభిక్షను అర్థిస్తే క్షమిస్తాడు.” (తబ్రాని)
7. హజ్‌యాత్రలో మరణిస్తే నేరుగా స్వర్గంలో ప్రవేశిస్తారు:
 అబూ హురైరా(ర)కథనం: దైవప్రవక్త(స) ఇలా అన్నారు: ”ఎవరయితే హజ్‌ కోసం బయలుదేరి మరణించాడో ప్రళయదినం వరకూ అల్లాహ్  అతన్ని హజ్‌ చేసే పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. మరెవరయితే ఉమ్రా కోసం బయలుదేరి మరణించాడో అల్లాహ్‌ా అతన్ని ప్రళయం వరకూ ఉమ్రా చేసే పుణ్యాన్ని ప్రసా దిస్తాడు”.             ( అబూయాలా)
 అబ్దుల్లాహ్‌ా బిన్‌ అబ్బాస్‌(ర) కథనం: ఒక వ్యక్తి అరఫా మైదానంలో దైవప్రవక్త(స)తో పాటు విడిది చేశాడు. అతన్ని ఒంటె క్రింద పడవేసింది, మెడ విరిగి మరణించాడు. అతని గురించి దైవప్రవక్త (స) ఇలా అన్నారు:
 ”అతన్ని రేగాకులతో స్నానం చేయించండి, రెండు (ఇహ్రామ్‌) దుస్తులలోనే కఫన్‌ (వస్త్ర ధారణ) చేయించండి, తలను కప్పకండి, సువాసన పూయకండి, ఎందుకంటే ప్రళయ దినాన అతను లేపబడేటప్పుడు  ‘తల్బియా’ పఠిస్తూ ఉంటాడు.” (బుఖారీ, ముస్లిం)
8. హజ్‌ విశిష్ఠతలో ఒక హదీస్‌:
 అబ్దుల్లాహ్‌ా బిన్‌ ఉమర్‌(ర) కథనం: దైవ ప్రవక్త(స) ఇలా అన్నారు: ”ఎప్పుడైతే మీరు హజ్‌ కోసం బయలుదేరుతారో మీ సవారీ యొక్క ప్రతి అడుగుకీ ఒక పుణ్యం వ్రాయ బడుతుంది. ఒక పాపం క్షమించ బడుతుంది. అరఫాలో విడిది చేసినప్పుడు అల్లాహ్  తొలి ఆకాశంపై దిగి వచ్చి దైవ దూతల ఎదుట గర్వంతో ఇలా అంటాడు: చూడండి వీరు నా దాసులు, దూర ప్రయాణం నుంచి చిందర వందర స్థితిలో దుమ్ము ధూళితో నా దగ్గరకు వచ్చారు. నా కారుణ్యాన్ని ఆశిస్తున్నారు. నా శిక్ష నుంచి భయపడుతున్నారు. (కాని నన్ను వారు చూడలేదు) ఒకవేళ నన్ను వారు చూస్తే వారి పరిస్థితి ఏమిటి! ఒకవేళ వారిపైన ఇసుక కంకర్ల సమానం, లేదా ప్రపంచం యొక్క రోజుల సమానం లేదా వర్షం యొక్క చిను కుల సమానం పాపాలున్నా అల్లాహ్‌ా వాటిని కడిగి వేసేస్తాడు. జమరాత్‌కు కంకరాళ్ళు కొట్టేటప్పుడు దాని ప్రతిఫలం అల్లాహ్  వారి కొరకు సామగ్రి చేస్తాడు. తల వెంట్రుకలు తీసేటప్పుడు ప్రతి వెంట్రుకకు బదులు ఒక పుణ్యం ప్రసాదిస్తాడు. మరియు తవాఫ్‌ చేసే టప్పుడు వారు పాపాల నుంచి ఏ విధంగా పవిత్రం అయిపోతారంటే తల్లి గర్భంలో నుంచి ఎటువంటి పాపం లేకుండా  పుట్టిన వానిలా పవిత్రులైపోతారు”. (తబ్రానీ)
 హజ్‌ ఆదేశాలు:
1. హజ్‌కు వెళ్ళాలని సంకల్పించుకున్న   వారు హజ్‌ ఉమ్రాలు చిత్తశుద్ధితో కేవలం అల్లాహ్  ప్రసన్నత కోసమని సంకల్పించు కోవాలి. ఎందుకంటే ఆచరణలు స్వీకార యోగ్యం అయేందుకు ఇఖ్లాస్‌, చిత్తశుద్ధి షరతు. అల్లాహ్  ఇలా సెలవిచ్చా డు: ”వారు అల్లాహ్ నే ఆరాధించాలని, ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలనీ, ఏకాగ్రచిత్తులై -నమాజును నెలకొల్పాలనీ, జకాత్‌ను ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబ డింది. ఇదే స్థిరమైన, సవ్యమైన ధర్మం.”  (అల్‌బయ్యినహ్ :5)
2. ధర్మసమ్మతమైన సంపాదనతోనే హజ్‌కు వెళ్ళాలి:
 దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ‘ఓ ప్రజ లారా! అల్లాహ్  పరిశుద్ధుడు, పరిశుద్ధతనే స్వీకరిస్తాడు.” తర్వాత ఆయన (స) ఒక వ్యక్తి గురించి వివరించారు: అతను దూర ప్రయాణం చేసి, చిందర వందర, దుమ్ము ధూళితో ఆకాశంవైపు చేతులెత్తి, ఓ నా ప్రభూ! ఓ నా ప్రభూ! అని ప్రార్థిస్తున్నాడు. అతను తినేది, త్రాగేది, ధరించినవి అతని పోషన సంపాదన అన్నీ హరాంతో కూడి నవే. అటువంటప్పుడు  ప్రార్థన ఎలా స్వీక రించబడుతుంది? (ముస్లిం)
3. ఖుర్‌ఆన్‌ సహీహ్  హదీసుల ప్రకారమే హజ్‌ ఆదేశాలు నేర్చుకొనవలెను. వారు వీరు చెప్పారని, చేస్తున్నారని చేయకూడదు. దైవప్రవక్త(స) ఇలా అన్నారు: ”హజ్‌ విష యాలు నాతో నేర్చుకోండి. ఈ హజ్‌ తరు వాత బహుశా నేను హజ్‌ చేయలేనేమో!”  (ముస్లిం)
4. తౌబా (పశ్చాత్తాపం) చేసుకొని, అప్పు లుంటే ఇచ్చేసి, ఇంటివారిని అల్లాహ్‌ పట్ల భయభక్తులతో ఉండాలని, ఎవరి హక్కుల యినా మిగిలిపోయి ఉంటే తీర్చేయాలని హితోపదేశం చేయవలెను.
5. ఇహ్రాం సంకల్పం తర్వాత ముఖ్యంగా తన నాలుకను బేకార్‌ మాటల నుండి కాపాడు కొనవలెను. ఒకరిని హాని కల్గించ కూడదు. మొత్తం సమయాన్ని  అల్లాహ్  విధే యతలో గడపవలెను. అల్లాహ్  ఇలా సెలవి చ్చాడు: ”హజ్‌ మాసాలు నిర్థారితమై ఉన్నాయి. కనుక ఈ నిర్ణీత మాసాలలో హజ్‌ను తన కొరకు విధించుకున్న వ్యక్తి-హజ్‌ దినాలలో-కామక్రీడలకు, పాప కార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి.
            మీరు ఏ సత్కార్యం చేసినా దాని గురించి అల్లాహ్కు తెలుసు. (హజ్‌యాత్రకు బయలు దేరినప్పుడు) ప్రయాణ సామగ్రి (ఖర్చు)ని వెంట తీసుకెళ్ళండి. అయితే అన్నింటికంటే అత్యుత్తమ సామగ్రి దైవభీతి. కనుక ఓ బుద్ధిమంతులారా! నాకు భయపడుతూ ఉండండి”.  (అల్‌బఖర:197)
 దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ”ఎవడైతే ఎలాంటి అపసవ్యమైన చేష్టలకు, వ్యర్థవిషయాల కు పాల్పడకుండా, దైవ అవిధేయతకు ఒడిగట్ట కుండా జాగ్రత్త పడుతూ హజ్‌ చేస్తాడో అతను ఆరోజే తల్లి గర్భం నుంచి పుట్టినవానిలా (పరమ పవిత్రుడై) తిరిగి వస్తాడు.  (బుఖారి, ముస్లిం)
6.తవాఫ్‌, సయీ చేసేటప్పుడు, రాళ్ళు రువ్వ్టే టప్పుడు తమ తరపు నుంచి వేరే వారికి హాని, నష్టం బాధ కలగించకూడదు. దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు:”తన నాలుక మరియు చేత్తో వేరే ముస్లిములను హాని కల్పించని వాడు నిజ మైన ముస్లిం”. (బుఖారి,ముస్లిం)
7. జమాఅత్‌తో నమాజ్‌ చేయడంలో ఎటు వంటి నిర్లక్ష్యం చూపించకూడదు.
8. స్త్రీలు, గైర్‌ మహ్రమ్‌లు ఎదురైతే పరదా పాటించవలెను. అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు:   ”ఓ ప్రవక్తా! తమపై నుంచి తమ దుప్పట్లను (క్రిందికి) వ్రేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా (మర్యాదస్తులు గా) గుర్తించబడి, వేధింపుకు గురికాకుండా ఉంటారు. అల్లాహ్  క్షమించేవాడు, కనికరించే వాడు.” (అహ్జాబ్: 59)

Related Post