ముహర్రమ్‌లో చేెస్తున్నదేమి? చేయాల్సిందేమి? 2

''రమజాన్‌ తరువాత అన్నికన్నా శ్రేష్ఠమైన ఉపవాసాలు ముహర్రమ్‌ ఉపవాసాలు. ఇది అల్లాహ్‌ మాసం. ఇక ఫర్జ్‌ (విధిగా చేయవలసిన) నమాజుల తర్వాత అన్నికన్నా శ్రేష్ఠతరమైన నమాజు రాత్రి నమాజ్‌''. (ముస్లిం)

”రమజాన్‌ తరువాత అన్నికన్నా శ్రేష్ఠమైన ఉపవాసాలు ముహర్రమ్‌ ఉపవాసాలు. ఇది అల్లాహ్‌ మాసం. ఇక ఫర్జ్‌ (విధిగా చేయవలసిన) నమాజుల తర్వాత అన్నికన్నా శ్రేష్ఠతరమైన నమాజు రాత్రి నమాజ్‌”. (ముస్లిం)

ముహర్రమ్‌ మాసం – మహా ప్రవక్త ప్రియ సహచరులు

ముహర్రమ్‌ మాసంలో అతిశయిల్లి రాగాన పడే మరో అంశం ప్రవక్త ప్రియ సహచరులలో కొందరి గురించి మనవాళ్ళు శోభించని రీతిలో మ్లాడటం, విపరీత వ్యాఖ్యలు చేయటం. నిజానికి ప్రవక్త ప్రియసహచరుల (రజి)ను విమర్శించటం, దూషించటం అధర్మం. తన సహచరులను దూషించరాదని ప్రవక్త (స) స్వయంగా తాకీదు చేశారు. ఆయన (స) ఇలా అన్నారు:
”నా సహవాసులను దూషించకండి. నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తిస్వరూపుని సాక్షిగా చెబుతున్నా! మీలోని ఎవరైనా ఉహద్‌ పర్వతానికి సమానంగా బంగారం ఖర్చు ప్టిెనా వీళ్ళు ఖర్చుపెట్టినా ఒక ‘ముద్‌’కు గానీ, ముద్‌లోని సగ భాగానికి గానీ సమానం కాజాలదు”. (బుఖారీ, ముస్లిం)
ఇమామ్‌ తహావీ (రహ్మ.లై) గారు ప్రవక్త ప్రియ సహచరుల గురించి ‘అహ్లె సున్నత్‌ వల్‌ జమాఅత్‌’ అభిమతాన్ని వివరిస్తూ ఇలా అన్నారు: ”మేము ప్రవక్త సహాబీలను అభిమానిస్తాము. వారిలో ఏ ఒక్కరి పట్ల కూడా ప్రేమలో అతిశయిల్లటం గానీ, ఏ ఒక్కరినీ దిగజార్చేలా మ్లాడటంగానీ చేయము. సహాబీలను ద్వేషించే ప్రతి ఒక్కరినీ మేము ద్వేషిస్తాము. సహాబా గురించి ఉత్తమ రీతిలో ప్రస్తావించేవారిని మేము కూడా ఉత్తమ రీతిలో గుర్తు చేసుకుాంము. వారిని అభిమానించటం ధర్మానికి, విశ్వాసానికి, ఉపకారానికి ప్రతీక. వారిని ద్వేషించటం అవిశ్వాసానికి, కాప్యానికి దురహంకారానికి నిదర్శనం”.
(షరహుల్‌ అఖీద- అత్తహావీయ).

ఆషూరా ఉపవాసం:

ముహర్రమ్‌ నెలలో వీలైనంత ఎక్కువగా పుణ్యకార్యాలు చేయాలి. నఫిల్‌ ఉపవాసాలుండాలి. ఎందుకంటే మహనీయ ముహమ్మద్‌ (స)ఇలా ఉద్బోధించారు: ”రమజాన్‌ తరువాత అన్నికన్నా శ్రేష్ఠమైన ఉపవాసాలు ముహర్రమ్‌ ఉపవాసాలు. ఇది అల్లాహ్‌ మాసం. ఇక ఫర్జ్‌ (విధిగా చేయవలసిన) నమాజుల తర్వాత అన్నికన్నా శ్రేష్ఠతరమైన నమాజు రాత్రి నమాజ్‌”. (ముస్లిం)
ముఖ్యంగా ముహర్రమ్‌ 10వ తేదీ నాడు ఉపవాసం తప్పకుండా పాటించాలి. మహా ప్రవక్త (స) మక్కాలో ఉన్నన్నాళ్ళు ముహర్రమ్‌లోని పదవ తేదీన ఉపవాసం పాించేవారు. ఆయన (స) మదీనాకు హిజ్రత్‌ చేసిన మీదట కూడా ఈ ఉపవాసం పాటించారు. తన ప్రియ సహచరులకు కూడా ఈ మేరకు ఆజ్ఞాపించారు. ఆ తర్వాత రమజాను నెల ఉపవాసాలు విధిగా నిర్థారించబడ్డాయి. అప్పుడు ‘ఇక మీదట కోరినవారు ఈ (నఫిల్‌) ఉపవాసం ఉండవచ్చు. కోరినవారు మానుకోవచ్చు’ అన్నారు.
ఆషూరా ఉపవాసానికి సంబంధించి కొన్ని హదీసులు –
1) హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (ర)కథనం: ”దైవ ప్రవక్త (స)ఒక దినానికి – మరో దినంపై ప్రాధాన్యతను కల్పిస్తూ ఉపవాసం ఉండగా నేను ఎన్నడూ చూడలేదు. అయితే ఆషూరా దినానికి, రమజాన్‌ మాసానికి మాత్రమే అలాిం ప్రాధాన్యతను కల్పించేవారు”.
(బుఖారీ, ముస్లిం)
2) హజ్రత్‌ ఆయిషా (ర)కథనం: ”అజ్ఞాన కాలంలో కురైషులు ఆషూరా ఉపవాసం ఉండేవారు. దైవప్రవక్త (స) కూడా ఆనాడు ఉపవాసం పాించేవారు. ఆఖరికి మదీనాకు ప్రస్థానం చేసిన మీదట కూడా ఆయన (స) ఆషూరా దినపు ఉపవాసం ఉండటమేగాక, తన సహచరులను కూడా పాటించమని ఆదేశించారు. ఆ తర్వాత రమజాన్‌ నెల ఉపవాసాలు విధి (ఫర్జ్‌)గా ప్రకించబడిన మీదట ఆయన (స) వెసులుబాటును ప్రకిస్తూ ఇలా అన్నారు: ”మీలో ఇకనుండి కోరినవారు ఈ (ఆషూరా) ఉపవాసం ఉండవచ్చు. కోరినవారు వదలవచ్చు”. (బుఖారీ, ముస్లిం)
3) హజ్రత్‌ రబీ బిన్తె మవూజ్‌ (ర) కథనం: ”దైవప్రవక్త (స) మదీనా పరిసర ప్రాంతాలలో ప్రజలకు ఆషూర దినపు ఉపవాసం పాించమని వర్తమానం పంపారు. దాంతో మేము స్వయంగా ఆషూరా ఉపవాసం పాించటమే కాకుండా. మా పిల్లలకు కూడా ఉపవాసం ఉంచే వాళ్ళం. తిండి కోసం వాళ్ళు ఏడ్చినప్పుడు ఆట వస్తువులిచ్చి ఇఫ్తార్‌ వేళ వరకు కాలక్షేపం చేయించే వాళ్ళం”. (ముస్లిం)
4) హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ అబ్బాస్‌ (ర) కథనం: ”దైవప్రవక్త (స) మదీనాకు ఏతెంచిన తర్వాత అక్కడి యూదులు ఆషూరా దినాన ఉపవాసం ఉండటం గమనించి, ‘ఇంతకీ మీరీ రోజు ఉపవాసం ఎందు కుంటున్నారు?’ అని అడిగారు. దానికి వారు’ఇదొక గొప్ప రోజు. ఈ రోజే దేవుడు తన ప్రవక్త మూసా (అ)ను, ఆయన జాతి వారిని ఫిరౌనీయుల చెర నుండి విముక్తి ప్రసాదించి, ఫిరౌనీయులను సముద్రంలో ముంచి వేశాడు. అందుకు కృతజ్ఞతగా మూసా (అ) ఈ రోజు ఉపవాసం పాటించారు. అందుకే మేము కూడా ఈనాడు ఉపవాసం పాటింస్తున్నాము’ అని బదులిచ్చారు. అప్పుడు ఆయన (సఅసం) ఇలా అన్నారు: ”అలా అనుకుంటే మాకే ఎక్కువ హక్కుంది. మేము మీకన్నా ఎక్కువగా మూసా (అ)కు దగ్గరగా ఉన్నాము”. కాబ్టి ఆయన (స) ఖుద్దుగా ఆ రోజు ఉపవాసం ఉండటంతోపాటు, తన ప్రియ సహచరులను కూడా దాని గురించి ఆజ్ఞాపించారు. (బుఖారీ, ముస్లిం)
హజ్రత్‌ అబూ మూసా (ర) గారి కథనం ప్రకారం యూదులు ఆషూరా దినాన్ని పర్వ దినంగా భావించేవారు. కైబర్‌ వాసులు (యూదులు) ఆ రోజున తమ స్త్త్రీలకు ప్రత్యేకంగా ఆభరణాలు తొడిగించి సంతో షాతిశయంతో కేరింతలు కొట్టేవారు. కాగా; దైవప్రవక్త (స) తన అనుయాయుల నుద్దేశించి, ”మీరీ రోజు ఉపవాసం ఉండండి” అన్నారు. (బుఖారీ, ముస్లిం)

అనాదిగా ఆషూరా దినానికి గల చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని చాటే మరి కొన్ని హదీసులు (బలహీనమైన హదీసులు) కూడా ఉన్నాయి. మస్నదె అహ్మద్‌లోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”ఆషూరా దినానే దైవప్రవక్త నూహ్‌ (అ) ఓడ జోది పర్వతాన్ని తాకింది. అందుచేత ప్రవక్త నూహ్‌ (అ)కృతజ్ఞతాపూర్వకంగా ఆనాడు ఉపవాసం ఉన్నారు”.
తిబ్రానీలోని ఒక ఉల్లేఖనంలో ఇలా అనబడింది: ఆ రోజునే హజ్రత్‌ ఆదం (అ) పశ్చాత్తాపం ఆమోదించబడింది. ఆ రోజునే దేవుడు తన ప్రత్యేక అనుగ్రహంతో దైవప్రవక్త హజ్రత్‌ యూనుస్‌ (అ) వైపు మరలాడు. దైవప్రవక్త హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ (అ) జన్మించింది కూడా ఆనాడే.

ఆషూరా ఉపవాస మహత్యం

హజ్రత్‌ అబూ ఖతాదా (ర) కథనం: ఆషూరా ప్రాముఖ్యం గురించి దైవప్రవక్త (స)ను ప్రశ్నించగా ”ఇది గతించిన ఒక సంవత్సర కాలపు పాపాలను హరిస్తుంది” అని సమాధానమిచ్చారు. (ముస్లిం)

ఈ హదీసు దృష్ట్యా ముస్లింలైన మనం ఆషూరా దినాన శాయశక్తులా ఉపవాసం ఉండేందుకు యత్నించాలి. ఒక ఏడాది కాలపు పాపాలను రూపుమాపే మహదావకాశం లభించినపుడు దాన్ని వృధా చేసుకోకూడదు. కాని అత్యంత శోచనీయమైన విషయమేమిటంటే నేడు మన జీవన ప్రమాణాలు మారిపోయాయి. ఈ దినాన్ని పురస్కరించుకొని మనవాళ్ళు కొత్త పుంతలు తొక్కి సున్నతుల స్థానంలో బిద్‌అత్‌లను ఆవిష్కరిస్తున్నారు. బిద్‌అతులనే సున్నత్‌లుగా భ్రమ చెందుతున్నారు. ఆ రోజున ఉపవాసం పాటించి పాపాల మన్నింపు చేయించు కోవాల్సిందిపోయి రుచికరమైన భోజనాలు ఆరగించేందుకు ప్రత్యేకించుకుంటున్నారు. పరమాణ్ణాలు, పానకాలు సిద్ధం చేసి దారిన పోయే వారందరికీ పంచిపెడుతున్నారు. ఇది దైవప్రవక్త (స) వారి సంప్రదాయం పట్ల పరిహాసం కాదా!? ప్రవక్త ముద్దుల మనవడు అమరగతినొందిన దినాన సంతాపం పాటించే తీరు ఇదేనా?

ఆషూరా ఉపవాసంలో యూదుల పద్ధతికి భిన్నంగా…

ఏదేని విషయంలో దేవుని తరఫున స్పష్టంగా సంకేతం రానంత వరకూ సాధారణంగా మహా ప్రవక్త (స) గ్రంథప్రజల విధానానికి భిన్నంగా వ్యవహరించేవారు కాదు. ముహర్రమ్‌ 10వ తేదీన యూదులు, క్రైస్తవులు భక్తీ శ్రద్ధలతో ఉపవాసం ఉంారని తెలిసినపుడు ఆయన (స) ఈ ఉపవాస విషయంలో వైవిధ్యానికి సంకల్పించుకున్నారు. ఆయన (స) ఇలా అన్నారు:
”వచ్చే ఏడాది దైవ చిత్తమయితే మేము ముహరమ్ర్‌ 9వ తేదీన కూడా ఉపవాసం పాటిస్తాము”.
”కాని వచ్చే ఏడాది రాక మునుపే మహా ప్రవక్త (స) పరమపదించారు” అని హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (ర) తెలిపారు.
(ముస్లిం)
మరి ఇక ఆషూరా ఉపవాసం విషయంలో యూదుల – క్రైస్తవుల పద్ధతికి భిన్నంగా వ్యవహరించాలంటే ఏం చేయాలి? పైహదీసు ప్రకారం ఆషూరా ఉపవాసంతోపాటు మనం ముహర్రమ్‌ 9వ తేెదీన కూడా ఉపవాసం ఉండాలి. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (ర) ప్రభృతులు కూడా ఈ అభిమతాన్నే అనుసరించారు. ఈ హదీసు ఆధారంగా మరి కొంత మంది ఇస్లామీయ విద్వాంసులు ఇలా అభిప్రాయపడ్డారు: ”ఏ కారణంగానయినా ముహర్రమ్‌ 9వ తేదీన ఉపవాసం ఉండలేకపోయినవారు ఆషూరా ఉపవాసంతో పాటు ముహర్రమ్‌ 11వ తేదీ ఉపవాసం పాటిస్తే యూదుల, క్రైస్తవుల విధానానికి భిన్నంగా వ్యవహరించినట్లవుతుంది.

ఆచార్య ఇబ్నె ఖయ్యిమ్‌ (ర), మహా సంస్మర్త ఇబ్నె హజర్‌ (శి)లు ఈ విషయంలో చేసిన వ్యాఖ్యానం అమోఘం. వారిలా అన్నారు: ”ఆషూరా ఉపవాసం విషయంలో మూడు అంతస్త్తులున్నాయి. అన్నింకన్నా అధమ స్థాయి కేవలం 10వ తేదీన ఉపవాసం ఉండటం. దానికన్నా ఉన్నత స్థాయి 9వ తేదీన కూడా ఉపవాసం ఉండటం. అత్యున్నత స్థాయి ఏదంటే ముహర్రమ్‌ 9,10,11 తేదీలలో (మొత్తం మూడు రోజులు) ఉపవాసాలుండటం. ఎందుకంటే ఈ మాసంలో ఎన్ని ఎక్కువ ఉపవాసాలుంటే అంతే ఎక్కువ పుణ్యఫలం ప్రాప్తిస్తుంది”. (జాదుల్‌ మఆద్‌, ఫత్‌హుల్‌ బారీ).

Related Post