నేను నా రమజాన్ – 2

 ''ఎవరయితే నలభయి రోజుల పాటు విరామం లేకుండా అయిదు పూటల నమాజు జమాత్‌తోపాటు, మొదటి తక్బీర్‌తో చదువుతాడో అతని కోసం రెండు జమానతులు వ్రాసి ఉంచ బడతాయి. 1) నరక ముక్తి జమానతు. 2) కాపట్య ముక్తి జమానతు''. (తిర్మిజీ)

”ఎవరయితే నలభయి రోజుల పాటు విరామం లేకుండా అయిదు పూటల నమాజు జమాత్‌తోపాటు, మొదటి తక్బీర్‌తో చదువుతాడో అతని కోసం రెండు జమానతులు వ్రాసి ఉంచ బడతాయి. 1) నరక ముక్తి జమానతు. 2) కాపట్య ముక్తి జమానతు”. (తిర్మిజీ)

6) విశ్వాస సోదరులారా! మనకు ప్రవక్త ముహమ్మద్‌ (స) అంటే మన తన, మాన, ధనాలకన్నా అధిక ప్రేమ, అభి మానం. మనం ఆయన్ను అభిమానించినంతగా ఇంకెవ్వరిని అభిమానించము. అల్లాహ్‌ా తర్వాత పూర్తి విశ్వంలో ఘనపాటి అయిన విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్‌ (స) వారి సహవాసం లభించడమే మహాభాగ్యం. అలాంటిది – ఎంచక్కా ఆయతోపాటు హజ్జ్‌ చేసే అవకాశం రావడం అంటే ఇంకెంత అదృష్టంతో కూడుకున్న విషయమో ఆలోచించండి! అలాంటి ఓ బంపర్‌ ఆఫర్‌ని రమజాన్‌ మన కోసం తీసుకు వచ్చింది. మహనీయ ముహమ్మద్‌ (స) ఇలా ఉపదేశించాడు: ”రమజాను మాసంలో ఉమ్రా చేయడం అంటే నాతోపాటు హజ్జ్‌ చేసేంతటి పుణ్యాన్ని మూట గట్టుకోవడమే”. (బుఖారీ). మంచి కాలం మించిపోక ముందే త్వర పడండి. రమజాను మాసంలో ఉమ్రా చేసి ప్రవక్త (స) వారి సరసన హజ్జ్‌ చేసేంతటి పుణ్యాన్ని మీ సొంతం చేసుకోండి.

7) విశ్వాస సోదరులారా! ”నరకాగ్ని నుండి కాపాడ బడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడినవారే సఫలీకృతులు” అన్నాడు అల్లాహ్‌ా. మనందరి ప్రయత్నం కూడా అదే. ఎలాగయినా అల్లాహ్‌ాను రాజీ పరచు కొని నరకాగ్ని నుండి రకణ పొంది స్వర్గంలో ప్రవేశించాలి. అదే మనందరి అవిరళ కృషి, అవిశ్రాంత పరిశ్రమ. మనం పడే శ్రమ, చేసే కృషిని ఫలవంతం చేసే ఓ సువర్ణ సూత్రాన్ని ప్రవక్త (స) మనకు తెలియజేశారు. ”ఎవరయితే నలభయి రోజుల పాటు విరామం లేకుండా అయిదు పూటల నమాజు జమాత్‌తోపాటు, మొదటి తక్బీర్‌తో చదువుతాడో అతని కోసం రెండు జమానతులు వ్రాసి ఉంచ బడతాయి. 1) నరక ముక్తి జమానతు. 2) కాపట్య ముక్తి జమానతు”. (తిర్మిజీ)

8) విశ్వాస సోదరులారా! ప్రపంచ శాస్త్రవేత్తల జాబితాలో తమ పేరు చేరాలని మనలో కొందరికుండొచ్చు. ప్రపంచ కుబేరుల జాబితాలో తమ పేరు ఉండాలని కొందరుకుండవచ్చు. విశ్వ విజేతలయి క్రీడా కారుల జాబితాలో తమ పేరు ఉండాలని కొందరికుండవచ్చు. గిన్నిస్‌ బుక్‌ ఆప్‌ వరల్డ్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని ఇంకొందరు ఆరాట పడుతుండొచ్చు. ఆయా రంగాల్లో కష్ట పడితే వారు కోరుకునేది దక్కచ్చు, దక్కకపోవచ్చు. కానీ, రమజాన మీ కోసం తీసకొచ్చి బంగారు పథకాన్ని గనక మీరు అనుసరించనట్లయితే ఏకంగా దైవదూతల సరసన నిలబడే సువర్ణ అవకాశాన్ని అది మనకిస్తుంది. ప్రవక్త (స) ఇలా అన్నారు: ”ఖుర్‌ఆన్‌ పారాయణం చేసే వ్యక్తి ఉపమానం – అతను ఖుర్‌ఆన్‌ను ఖంఠస్థం చేసుకొని ఉంటే – అతను అత్యుత్తమ దైవదూతల సరసన ఉంటాడు. దాన్ని ఎంతో ప్రయాసకోర్చి పారాయణం చేసే వ్యక్తి రెట్టింపు పుణ్యం లభిస్తుంది”. (బుఖారీ, ముస్లిం)

9) విశ్వాస సోదరులారా! మన ఇంటి సిరి తోట పండాలని, మన బతుకు పూబాట అవ్వా, మన ఆయష్షు పెరగాలని, పుష్కలమయిన ఆరోగ్యం మన సొంతమవ్వాలని మనలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మన ఈ కోరి తీరాలంటే ఎవరి పరిష్కారాలు వారికుండొచ్చు. అయితే వీటన్నింటికి ఇస్లాం చూపే పరిష్కారం మాత్రం ఒక్కటే. అదే మన బంధుత్వ సంబంధాలను బల పర్చుకో వడం. ఎవరి కుటుంబం ఎంత పెద్దదిగా ఉంటే వారికి విజయ అవకాశాలు అంతే ఎక్కువగా ఉంటాయన్నట్టు, మన బంధుత్వ సంబంధాలు ఎంత ్టపటిష్టంగా ఉంటే, ఇహపర సాఫల్య మార్గాలూ అంతే సులువుగా మనకు అందుబాటులో ఉంటాయి. ప్రవక్త (స్ల) అన్నారు: ”బంధు త్వ సంబంధం అల్లాహ్‌ా అర్ష్‌కి వేలాడుతూ ఉంటుంది.అది ఇలా అంటూ ఉంటుంది: ”ఓ అల్లాహ్‌ా నన్ను కలిపేవారిని నువ్వూ కలుపి ఉంచు (బలపర్చు). నన్ను త్రేంచే వారిని నువ్వూ త్రెంచు”. (ముస్లిం).

10) విశ్వాస సోదరులారా! ”మంచి విషయాలలో, దైవభీతి సంబంధిత విషయంలో అందరితో సహకరించండి” అని అల్లాహ్‌ సెలవిచ్చాడు. కాబట్టి ఒకవేళ మనం ఉపవాసాలుంటున్నామంటే ఉండని వారిని ఉండమని ప్రోత్సహించాలి. అయిదు పూటల నమాజు చదువుతున్నామంటే చదవని వారిని మస్జిద్‌ తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి. తరావీహ్‌ా నమాజు నిష్టగా పాటిస్తుంటే పాటించని వారిని ఎలాగయినా తరావీహ్‌ా నమాజు చేసుకునేలా ప్రేరేపించాలి. దానధర్మాలు చేస్తుంటే, చేయని వారిని దానధర్మాలు చేసి ప్రభువు ప్రసన్నతను పొందమని ప్రోత్సహించాలి. రోగుల్ని పరామర్శిండానికి వెళుతుంటే తోటి సోదరుల్ని కొందరిని తోడు తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి. ముస్లిమేతర సోదరులతో కలవడానికి వెళుతుంటే పరిచయస్తులను కొమదరిని తోడు తీసుకెళ్ళాలి. ‘యా బాగియల్‌ ఖైరి అఖ్బిల్‌-ఓ మేలు కోరుకునేవాడా! ముందుకెళ్ళు. దైవదూత అన్నట్టు ప్రతి మంచి కార్యంలో మనం ముందుండాలి.

Related Post