New Muslims APP

వుజూ

 '' ప్రళయ దినాన నా అనుచర సమాజం ప్రజలు వుజూ కారణంగా తమ కాళ్ళు చేతులు మెరిసి పోతున్న స్థితిలో హాజరవుతారు, కనుక మీలో ఎవరు ఎంత ఎక్కువగా ఈ మెరుపును పెంచగలుగుతారో అంత ఎక్కువగా పెంచుకోవాలి.    ( బుఖారి-136, ముస్లిం 246)

” ప్రళయ దినాన నా అనుచర సమాజం ప్రజలు వుజూ కారణంగా తమ కాళ్ళు చేతులు మెరిసి పోతున్న స్థితిలో హాజరవుతారు, కనుక మీలో ఎవరు ఎంత ఎక్కువగా ఈ మెరుపును పెంచగలుగుతారో అంత ఎక్కువగా పెంచుకోవాలి. ( బుఖారి-136, ముస్లిం 246)

షరీఅత్‌ పరిభాషలో వుజూ అంటే, వుజూ సంకల్పంతో శరీరపు కొన్ని నిర్ణీత అవయవాలను నీటితో శుభ్రపరచటం.

వుజూ విధులు (అవి ఆరు)

1. సంకల్పం.
2. ముఖాన్ని కడగటం.
3. రెండు చేతులను మోచేతులతో సహా కడగటం.
4. తలపై మసహ్‌ా చేయటం.
5. రెండు కాళ్ళను చీలమండలంతో సహా కడగటం.
6. వరుస క్రమాన్ని పాటించడం.
 అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు:  ” ఓ విశ్వసించినవారలారా! మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ మొహాలను, మోచేతుల సమేతంగా మీ చేతులను కడుక్కోండి. మీ తలలను మసహ్‌ చేయండి, చీలమండల వరకు మీ కాళ్ళను కడుక్కోండి… (అల్‌ మాయిదహ్‌:6)
 

1. సంకల్పం:

వుజూ ఒక ఆరాధన, కావున సంకల్పాన్ని బట్టి ఆరాధన ఔన్నత్యం నిర్ణయించబడుతుంది. సంకల్పం అన్నది హృదయంలో ఉంటుంది.

దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ”ఆచరణలు సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్కరికీ అతని సంకల్పానికి అనుగుణంగా ప్రతిఫలం దొరుకుతుంది.” (బుఖారి1,ముస్లిం 1907)
 
 సంకల్పించే విధానము :
 వుజూ చేయటం ప్రారంభించేటప్పుడు మనసులో అనుకోవటం/సంకల్పించుకోవటం నేను నమాజ్‌ కోసం, అశుద్ధతను దూరం చేసుకునేందుకు వుజూ చేసుకుంటున్నాను.
 
2. మొత్తం ముఖాన్ని కడగటం:
 అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు :  ” మీ మొహాలను కడగండి…” ( అల్‌ మాయిదహ్:6)
మొహం హద్దు తల వెంట్రుకలు మొలచిన చోటు నుండి గడ్డం క్రింద వరకు పొడుగునా, కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు వెడల్పుగా ఈ మధ్యగల భాగాన్ని మొహం అంటారు. మొహంపై ఉన్న మీసాలను గడ్డాన్ని తప్పకుండా కడగాలి. ఎందుకంటే అవి కూడా మొహంలోని భాగాలే కాబట్టి వాటిని పైనుంచి గానూ,లోనుంచి గానూ కడగాలి. ఒకవేళ గడ్డం దట్టమైనదిగా ఉండి లోభాగము కనిపించుట కష్టమైనప్పుడు గడ్డాన్ని పైనుంచి కడిగినా సరిపోతుంది.
3.మోచేతులతో సహా రెండు చేతుల్ని కడగటం:
అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు : ” మోచేతుల సమేతమంగా మీ చేతులను కడుక్కోండి” (అల్‌ మాయిదహ్‌:6)
అబూ హురైరా(ర) వుజూ చేస్తూ మొహాన్ని సవ్యంగా కడిగారు, తరువాత కుడి చేయిని కడుగుతూ భుజం వరకు తీసుకెళ్ళారు, తరువాత ఎడమ చేయిని కడుగుతూ భుజం వరకు తీసుకెళ్ళారు, తరువాత తలపై మసహ్‌ా చేసారు, తరువాత కుడికాలును పిక్క వరకు కడిగారు, తరువాత ఎడమ కాలును పిక్క వరకు కడిగారు. ఆ తరువాత నేను ఇదే విధంగా దైవప్రవక్త(స) వారిని వుజూ చేస్తుండగా చూశానన్నారు. (ముస్లిం246)
3.మోచేతులతో సహా రెండు చేతుల్ని కడగటం:
అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు : ” మోచేతుల సమేతమంగా మీ చేతులను కడుక్కోండి” (అల్‌ మాయిదహ్:6)
అబూ హురైరా(ర) వుజూ చేస్తూ మొహాన్ని సవ్యంగా కడిగారు, తరువాత కుడి చేయిని కడుగుతూ భుజం వరకు తీసుకెళ్ళారు, తరువాత ఎడమ చేయిని కడుగుతూ భుజం వరకు తీసుకెళ్ళారు, తరువాత తలపై మసహ్‌ా చేసారు, తరువాత కుడికాలును పిక్క వరకు కడిగారు, తరువాత ఎడమ కాలును పిక్క వరకు కడిగారు. ఆ తరువాత నేను ఇదే విధంగా దైవప్రవక్త(స) వారిని వుజూ చేస్తుండగా చూశానన్నారు. (ముస్లిం246)
 చర్మం మొత్తం వెంట్రుకలతో సహా బాగా కడగటం తప్పనిసరి. ఒకవేళ గోళ్ళ క్రింద మురికి ఉన్న కారణంగా నీరు ఆ భాగంలో చేరకపోయినచో, మరియు ఉంగరము క్రింద భాగంలో కూడ నీరు చేరకపోయినచో అతని వుజూ సంపూర్ణమవదు.
అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్ర్‌(ర) ఈ విధంగా తెలియజేశారు: ఒకసారి మేము ప్రవక్త(స)తో కలిసి మక్కా నుండి మదీనాకు తిరిగి వచ్చాము దారిలో నీరున్నచోట అసర్‌ నమాజు సమయాన సహచరులు తొందర పడ్డారు. తొందరపాటులోనే వుజూ చేసుకున్నారు,కాని వారి మడిమలు తడవని కారణంగా పొడిగా కనిపించసాగాయి.(అది చూచి) ప్రవక్త(స) ఇలా అన్నారు: ”ఈ మడిమలు నరకాగ్నికి ఆహుతి అవుతాయి. కావున వుజూ సవ్యంగా చేయండి”. (బుఖారి161, ముస్లిం 241)
ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌(ర) కథనం ప్రకారం ఒక వ్యక్తి వుజూ చేసాడు, అతని పాదములో గోరంత భాగం తడవలేదు. ఆ భాగాన్ని ప్రవక్త(స)కి చూపించేసరికి ప్రవక్త(స) ”వెళ్ళు,సవ్యంగా వుజూ చెయ్యి” అని అన్నారు, అతను మళ్ళీ వుజూ చేసుకొని తరువాత నమాజు చేశారు. ( ముస్లిం 243)
 
4. తలపై కొద్ది భాగాన్ని మసహ్‌ చేయటంతలపై ఒక్క వెంట్రుకైనా ఉన్నా సరే.
అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు:”మీ తలను మసహ్‌ చేయండి…” (మాయిదహ్‌:6)
 ముగైరా బిన్‌ షొబా(ర) ఉల్లేఖనం ప్రకారం: దైవప్రవక్త(స) వుజూ చేశారు, మరియు నుదుటి జుత్తుపై మరియు అమామహ్‌ాపై మసహ్‌ చేశారు. (ముస్లిం 279)
 మసహ్‌ాకి బదులు తల పూర్తి భాగాన్ని లేక కొద్ది భాగాన్ని కడిగినా ధర్మసమ్మతమే. తలపై కొద్ది భాగాన్ని మసహ్‌ చేయటం విధి. కావున తలపై ఎటువైపు మసహ్‌ చేసినా సరిపోతుంది.
 
5. చీలమండలతో సహా రెండు కాళ్ళను కడగటం:
అల్లాహ్‌ ఇలా తెలియజేశాడు : ”చీలమండల వరకు మీ కాళ్ళను కడుక్కోండి”  అల్‌మాయిదహ్:6)
 రెండు కాళ్ళను గోళ్ళ క్రింద స్థానంతో సహా కడగటం తప్పనిసరి. ఎక్కడ కూడా పొడిగా ఉండరాదు. చర్మం మొత్తం వెంట్రుకలతో సహా చేతులు కడిగేటట్టుగా కడగవలెను.
 
6. పైన తెలుపబడిన నియమాలు వరుస క్రమంగా పాటించవలెను:
 ఈ వరుస క్రమాన్ని పాటించడం తప్పనిసరి అని పైన వుజూ గురించి తెలుపబడిన ఆయత్‌ ద్వారా రుజు అవుతుంది.
 మరియు దైవప్రవక్త(స) కూడా ఇదే క్రమాన్ని పాటించారు. దైవ వాక్యము మరియు ప్రామాణిక హదీసుల ద్వారా ఈ విషయం రూఢీ అవుతుంది.
వుజూలోని సున్నతులు.
వుజూలో చాలా సున్నతులు ఉన్నాయి. వాటిలోని ముఖ్యమైనవి ఇక్కడ తెలుపుతున్నాము:
 
1. ప్రారంభంలో బిస్మిల్లాహ్‌ పఠించటం:
అనస్‌ (ర) కథనం ప్రకారం ఒకసారి దైవప్రవక్త (స) తమ అనుచరులతో వుజూ చేయుటకు నీళ్ళు కోరారు, కాని అనుచరుల వద్ద (త్రాగటానికి తప్ప వుజూ కొరకు) నీరు లభించలేదు. ఆ సందర్భంలో ప్రవక్త(స) మీలో ఎవరి దగ్గరైనా త్రాగు నీరు ఉంటే నా దగ్గరకు తీసుకు రండని ఆజ్ఞాపించారు. ఒక పాత్రలో (అనుచరులు) నీరు తీసుకొచ్చారు. ఆ పాత్రలో దైవప్రవక్త(స) తన హస్తాన్ని ఉంచి ఇక ‘బిస్మిల్లాహ్‌’ అని వుజూ చేయడం ప్రారంభించండి అని చెప్పారు….”(నసాయి1/61)
 
2. రెండు చేతుల్ని పాత్రలో ముంచక ముందే కడగటం:
అబ్దుల్లాహ్‌ బిన్‌ జైద్‌ బిన్‌ ఆసిమ్‌ అల్‌ అన్సారీ కథనం ప్రకారం ఒక సందర్భంలో ఆయనను దైవప్రవక్త(స)వారి వుజూ విధానాన్ని చేసి చూపించమని అడగబడింది. అప్పుడాయన ఒక పాత్రలో నీరు తెప్పించారు (ముందుగా) ఆ పాత్రను వంచి తన రెండు చేతులపై నీళ్ళు పోసి 3 సార్లు కడిగారు. ఆ తరువాత తన చేతులను ఆ పాత్రలో పెట్టారు….. (బుఖారి2183,ముస్లిం 235)
 
3.మిస్వాక్‌ చేయటం
దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ”నా అనుచర సమాజం గనక కష్టాల్లో పడిపోతుందన్న సంశయం నాకు లేకుండి నట్లయితే ప్రతి వుజూ సమయంలో మిస్వాక్‌ చేయాలని ఆజ్ఞాపించి ఉండేవాణ్ణి.” (బుఖారి 847, ముస్లిం 252)
 
4. పుక్కలించటం – 3 సార్లు.
5.పిడికెడు నీళ్ళు కుడి చేత్తో తీసుకొని ముక్కులో ఎక్కించటంమరియు ఎడమ చేత్తో ముక్కు చీది శుభ్ర పరచటం. ఈ విధంగా 3 సార్లు చేయాలి.
6. దట్టమైన గడ్డాన్ని ఖిలాల్‌ చేయటం:
 అనస్‌ (ర) కథనం ప్రకారం దైవప్రవక్త (స) వుజూ చేసేటప్పుడు అరచేతిలో నీళ్ళు తీసుకొని గడ్డం లోపలికి చేతి వ్రేళ్ళను జొప్పించి ఖిలాల్‌ చేసేవారు. ఆ తరువాత ఇదే విధంగా చేయమని నా ప్రభువు నాకు ఆజ్ఞాపించాడని చెప్పారు.    (అబూదావూద్-145)
7. తల మొత్తాన్ని మసహ్‌ చేయడం.
 
8. నీటితో చేతి వ్రేళ్ళ మరియు కాళ్ళ వ్రేళ్ళ మధ్య ఖిలాల్‌ చేయటం:
అంటే ఒక చేతి వ్రేళ్ళను రెండవ చేతి వ్రేళ్ళ మధ్య కలపటం మరియు ఎడమ చేతి చివరి చిన్న వ్రేలుతో కాళ్ళ వ్రేళ్ళ మధ్య ఖిలాల్‌ చేయటం.
లఖీత్‌ బిన్‌ సబ్ర (ర) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రబోధించారు ”వుజూ సవ్యంగా పూర్తి చేయండి, వ్రేళ్ళ మధ్య భాగాలను తడపండి, ముక్కులోనికి సరిగా నీరు ఎక్కించండి, అయితే ఉపవాస స్థితిలో మాత్రం ఇలా చేయకండి.  (అబూదావూద్‌ 142, తిర్మిజీ దీన్ని       ధృవీకరించారు 788)
 
9. రెండు చెవుల పై భాగము మరియు లో భాగములపై మసహ్‌ చేయటం– తల మసహ్‌ కోసం తీసుకున్న నీరు కాకుండా మరొక సారి నీరు తీసుకోవటం.
 ఇబ్నె అబ్బాస్‌(ర) కథనం ప్రకారం దైవప్రవక్త(స) తలపై మసహ్‌ చేసి, చెవుల పైనా మరియు లోనా మసహ్‌ా చేసారు.
10.వుజూలోని ఫర్జులు, సున్నతులు మూడేసి సార్లు చేయవలెను.
11. రెండు చేతులు మరియు రెండు కాళ్ళు కడిగేటప్పుడు కుడి చేయి మరియు కుడి కాలుతో ప్రారంభించవలెను:
అబూ హురైరా (ర) కథనం ప్రకారం దైవప్రవక్త(స) ఈ విధంగా ఉపదేశించారు ”మీరు వుజూ చేయడానికి ఉపక్రమించినపుడు కుడి వైపు నుంచి మొదలెట్టండి”. (ఇబ్నెమాజ-402)
12.అద్దల్క్‌ – అనగా అవయవాల్ని నీళ్ళతో కడిగేటప్పుడు నెమ్మదిగా రుద్దటం:
 అబ్దుల్లాహ్‌ బిన్‌ జైద్‌(ర) దైవప్రవక్త(స) వుజూ చేసేటప్పుడు ఇదే విధంగా నెమ్మదిగా రుద్దేవారని చేసి చూపించారు.  (అహమ్మద్‌ 39/4)
13.మవాలాత్‌: అనగా ఒక అవయవం కడిగిన వెంటనే రెండో అవయవం కడగాలి. ఉదాహరణకు ఒక అవయవాన్ని కడిగిన తరువాత అది ఎండిపోయినంత వరకు మధ్యలో ఆగిపోకుండా వెంటనే మరో అవయవాన్ని కడగవలెను. ఇలా చేయటం  వలన ప్రవక్త(స)వారి విధానాన్ని ఆచరించినట్లవుతుంది.
14.తలపై మసహ్‌ చేసేటప్పుడు, మోచేతుల పైభాగాన్ని కడిగేటప్పుడు, అలాగే రెండు కాళ్ళ చీలమండల పైభాగాన్ని కడిగేటప్పుడు సాధ్యమైనంతవరకు ఎక్కువ భాగాన్ని కడిగే ప్రయత్నం చేయవలెను. ఎందుకంటే దైవప్రవక్త(స) ఈ విధంగా శుభవార్తను వినిపించారు.
 ” ప్రళయ దినాన నా అనుచర సమాజం ప్రజలు వుజూ కారణంగా తమ కాళ్ళు చేతులు మెరిసి పోతున్న స్థితిలో హాజరవుతారు, కనుక మీలో ఎవరు ఎంత ఎక్కువగా ఈ మెరుపును పెంచగలుగుతారో అంత ఎక్కువగా పెంచుకోవాలి.    (బుఖారి-136, ముస్లిం 246)
15.నీళ్ళను వృధా చేయకుండా జాగ్రత్త వహించవలెను.
అనస్‌ (ర) కథనం: దైవప్రవక్త(స) ఒక ముద్‌ నీటితో వుజూ చేసేవారు.” (బుఖారి 198)
16. వుజూ చేసేటప్పుడు ఖిబ్లా వైపు ముఖం చేయటం.
17. వుజూ చేసేటప్పుడు మాట్లాడకుండా ఉండటం.
18. వుజూ తరువాత కలిమా షహాదహ్‌ మరియు దుఆ పఠించటం.
”అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌దహు లా షరీక లహు, వ అష్‌హదు అన్న ముహమ్మదన్‌ అబ్దుహు  వ రసూలుహ్‌
 (అల్లాహ్‌ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడనీ, ఆయన ఒక్కడేననీ, ఆయనకు సాటి రాగలవారెవరూ లేరనీ నేను సాక్ష్యమిస్తున్నాను. ఇంకా ముహమ్మద్‌(స) అల్లాహ్‌ా దాసులు మరియు అల్లాహ్‌ ప్రవక్త అని కూడా సాక్ష్యం పలుకుతున్నాను.) ”అల్లాహుమ్మజ్‌ అల్‌నీ మినత్తవ్వాబీన వజ్‌ అల్‌నీ మినల్‌ ముతతహ్హిరీన్‌
 ( ఓ అల్లాహ్‌! నన్ను పశ్చాత్తాపం చెందేవానిగా, పరిశుభ్రతను పాటించేవానిగా చెయ్యి. )
 ” సుబ్‌హానకల్లాహుమ్మ వ బిహమ్దిక, అష్‌హదు అల్లాఇలాహ ఇల్లా అన్‌త అస్తగ్‌ఫిరుక వ అతూబు ఇలైక్‌”.
 (ఓ అల్లాహ్‌! నీవు నీ స్తోత్రములతో పాటు పవిత్రుడవు, నీవు తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరని సాక్ష్యమిస్తున్నాను. నిన్ను  క్షమాపణ కోరుతున్నాను. నీ వైపునకే మరలుతున్నాను.)

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.