తీర్చి దిద్దిన తీరు చూడు!

 నమాజ్‌ విశ్వాస (ఈమాన్‌) మాధుర్యం. అది ఆత్మకు ఆహారం. హృదయానికి శాంతిని, నెమ్మదిని ఇచ్చే అరుదైన టానిక్కు. దాంతో పాటు అది ముస్లింల సామూహిక, నైతిక, సంస్కృతీ నాగరికతల సంస్కరణకు దోహదపడే అత్యుత్తమ పరికరం కూడా. అంతిమ దైవప్రవక్త (స ) ద్వారా ప్రజా బాహుళ్యంలో వచ్చిన సామాజిక, నైతిక పరివర్తనలో కీలక పాత్ర పోషించింది నమాజే అంటే అతిశయోక్తి కాదు. వస్త్రధారణపై బొత్తిగా అవగాహన లేని అరబ్బు అనాగరికులను ఇస్లాం కొన్నేండ్లలోనే సభ్యతాసంస్కారాల ఉన్నతికి చేర్చిందంటే అందులో నమాజ్‌ నిర్వహించిన భూమిక అంతా ఇంతా కాదు

నమాజ్‌ విశ్వాస (ఈమాన్‌) మాధుర్యం. అది ఆత్మకు ఆహారం. హృదయానికి శాంతిని, నెమ్మదిని ఇచ్చే అరుదైన టానిక్కు. దాంతో పాటు అది ముస్లింల సామూహిక, నైతిక, సంస్కృతీ నాగరికతల సంస్కరణకు దోహదపడే అత్యుత్తమ పరికరం కూడా. అంతిమ దైవప్రవక్త (స ) ద్వారా ప్రజా బాహుళ్యంలో వచ్చిన సామాజిక, నైతిక పరివర్తనలో కీలక పాత్ర పోషించింది నమాజే అంటే అతిశయోక్తి కాదు. వస్త్రధారణపై బొత్తిగా అవగాహన లేని అరబ్బు అనాగరికులను ఇస్లాం కొన్నేండ్లలోనే సభ్యతాసంస్కారాల ఉన్నతికి చేర్చిందంటే అందులో నమాజ్‌ నిర్వహించిన భూమిక అంతా ఇంతా కాదు

ముహమ్మద్ అజీజుర్రహ్మాన్

మహా ప్రవక్త ముహమ్మద్‌ (స ) ప్రజల జీవితాలను తీర్చి దిద్దటానికి, ఆంతర్యాలను పరిశుద్ధ పరచటానికి పూనుకున్నప్పుడు రకరకాల జనులు ఆయన (స ) ముందున్నారు. ధనికులతోపాటు పేదవారు కూడా ఉన్నారు. పండితులతో పాటు పామరులు కూడా ఉన్నారు. నాగరికులతో పాటు అనాగరికులు కూడా ఉన్నారు. మానవ మహోపకారి అయిన ప్రవక్త (స ) అందరినీ శ్రద్ధగా గమనిస్తూ ఉండేవారు. వారి పరిస్థితిని బట్టి విషయం అర్థమయ్యేలా చెప్పేవారు.

ఒక న్యూ ముస్లిం

ముఆవియా బిన్‌ హకమ్‌ సులమీ ప్రవక్త సహచరులలో ఒకరు. ఈయన అప్పుడప్పుడే ఇస్లాంలో చేరిన న్యూ ముస్లిం సహాబీ. అంతకు ముందు ఆయన ఇస్లాం మర్యాదలను గురించి విని ఉన్నారు. ఎవరయినా తుమ్మి ‘అల్‌హమ్దులిల్లాహ్‌ా’ అని పలికినపుడు, దానికి జవాబుగా ‘యర్‌హముకల్లాహ్‌ా’ అని చెప్పటం ధర్మం అన్న విషయం ఆ న్యూ ముస్లిం సహాబికి తెలుసు. సామూహిక నమాజు వేళ కాగానే అందరూ నమాజుకు ఉపక్రమించారు. ఆ న్యూ ముస్లిం సహాబి కూడా అందరితో కలిసి నమాజుకు నిలబడ్డారు. నమాజు మధ్యలో ఎవరికో తుమ్ము వచ్చింది. అంతే! దానికి సమాధానంగా ముఆవియ (ర ) ‘యర్‌హముకల్లాహ్‌ా!’ అని బిగ్గరగా అనేశారు. కొంతమంది సహాబా ఆయన్ని తీక్షణంగా చూశారు. ‘అదేంటీ, మీరంతా నన్ను అలా చూస్తారేమిటి?’ అని ముఆవియ (ర ) నమాజులోనే అడిగేశారు. అప్పుడు సహాబీలలో కొందరు కాళ్ళపై చేతులు చరిచి ‘సుబ్‌హానల్లాహ్‌ా’ అన్నారు. ‘ఓహో! నమాజులో ఇలా మాట్లాడకూడదు కాబోలు’ అనుకుని మౌనం వహించారు ముఆవియా.సలాం చెప్పి నమాజు ముగించిన తర్వాత దైవప్రవక్త (స ) వెనుతిరిగి, ”నమాజు మధ్యలో మాట్లాడిందెవరు?” అని అడిగారు. జనులంతా ముఆవియా వైపు సైగ చేశారు.
ఆ సన్నివేశాన్ని ముఆవియ (ర ) మాటల్లోనే దర్శించండి – ఆయన ఇలా అన్నారు: ”నా తల్లిదండ్రులను దైవప్రవక్త (స ) కు అర్పింతు! నేను ప్రవక్త (స ) వారిని మించిన సంస్కర్తను అంతకుముందుగానీ, ఆ తర్వాత గానీ ఎక్కడా చూడలేదు. ఆయన (స ) నన్ను కోప్పడలేదు సరి కదా, ఆప్యాయంగా నన్ను దగ్గరకు పిలిచి, ”ఇది నమాజు నాయనా! నమాజులో మాట్లాడకూడదు కదా! నమాజులో ఖుర్‌ఆన్‌ పఠించ బడుతుంది. దైవనామం స్మరించబడుతుంది. దైవ కీర్తన జరుగుతుంది” అని మాత్రం సుతిమెత్తగా చెప్పారు.

సభ్యతా సంస్కారాల సరోవరం నమాజు

నమాజ్‌ విశ్వాస (ఈమాన్‌) మాధుర్యం. అది ఆత్మకు ఆహారం. హృదయానికి శాంతిని, నెమ్మదిని ఇచ్చే అరుదైన టానిక్కు. దాంతో పాటు అది ముస్లింల సామూహిక, నైతిక, సంస్కృతీ నాగరికతల సంస్కరణకు దోహదపడే అత్యుత్తమ పరికరం కూడా. అంతిమ దైవప్రవక్త (స ) ద్వారా ప్రజా బాహుళ్యంలో వచ్చిన సామాజిక, నైతిక పరివర్తనలో కీలక పాత్ర పోషించింది నమాజే అంటే అతిశయోక్తి కాదు. వస్త్రధారణపై బొత్తిగా అవగాహన లేని అరబ్బు అనాగరికులను ఇస్లాం కొన్నేండ్లలోనే సభ్యతాసంస్కారాల ఉన్నతికి చేర్చిందంటే అందులో నమాజ్‌ నిర్వహించిన భూమిక అంతా ఇంతా కాదు.

ఎందుకంటే నమాజు చేసే వ్యక్తి నగ్నంగా గానీ, అర్థ నగ్నంగా గానీ, ఉండలేడు. ముఖ్యంగా అతను తన మర్మస్థానాలను పరిశుభ్రమైన దుస్తులతో మరుగు పరచాలి. శరీరంలోని నిర్ణీత భాగంపై సతర్‌ (ఆచ్ఛాదన) ఉండాలి. అరేబియాలోని పల్లెటూరి బైతులకు ఈ సంస్కారం లేకుండింది. ఆఖరికి పట్టణాలలో నివసించేవారు కూడా వస్త్రధారణ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉండేవారు. కురైషు మహిళలు హజ్‌ చేసినప్పుడు-నగ్నంగా-కాబా ప్రదక్షిణ చేసేవారు.

అయితే ఇస్లాం రాగానే శరీరంపై ఆచ్ఛాదనను అనివార్యంగా ఖరారు చేసింది. శరీరాచ్ఛాదన లేకుండా చేసే నమాజ్‌ నెరవేరదని ప్రకటించింది-
”ఓ ఆదం సంతతి వారలారా! మీరు (నమాజు నిమిత్తం) మస్జిదులకు వచ్చిన ప్రతి సారీ మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి”. (అల్‌ ఆరాఫ్‌ – 31)

నమాజులో పురుషులైతే కనీసం నాభి నుంచి మోకాళ్ళ క్రింది వరకు శరీరాన్ని వస్త్రంతో కప్పి ఉంచటం తప్పనిసరి. స్త్రీలకయితే నఖశిఖపర్యంతం ఆచ్ఛాదన ఉండి తీరాలి. ఈ విషయాన్ని ఇస్లాం రోజుకు ఐదు సార్లు మరీ మరీ జ్ఞాపకం చేసి తన అనుయాయుల్లో నిద్రాణమై ఉన్న లజ్జాబిడియాలను తట్టి లేపుతుంది. నాగరికతకు ఆమడ దూరాన ఉండే ఆఫ్రికా ఖండంలోని ఆటవికులు, ఆది వాసులు సయితం నమాజు వల్ల సభ్యతాసంస్కారాలకు అలవాటు పడ్డారు.

 

నమాజు వల్ల సభ్యతాసంస్కారాలకు అలవాటు పడ్డారు.

 

Related Post