త్యాగోత్సవ సందేశం

   ఇది నిజంగా సంతోష సమయమే, ఆనంద ఘడియే. దాోంపాటు ఆలో చించాల్సిన వేళ కూడా.  పండుగ దినం మనకిస్తున్న సంకేతం - ''ఓ ఆదమ్‌ పుత్రుడా! నేను నీ పాలిట నూతన సృష్టిని. నీ ప్రతి చర్య, క్రియపై ప్రత్యక్ష సాక్షిని! నా నుండి నువ్వు పొందాల్సిన మేలును, సామగ్రిని నేనెళ్ళక ముందే ప్రోది చేసుకో. నేనోసారి వెళ్ళిపోయానంటే ఇక ప్రళయ దినం వరకు మళ్ళీ తిరిగి రానని గుర్తుంచుకో!!''

ఇది నిజంగా సంతోష సమయమే, ఆనంద ఘడియే. దాోంపాటు ఆలో చించాల్సిన వేళ కూడా. పండుగ దినం మనకిస్తున్న సంకేతం – ”ఓ ఆదమ్‌ పుత్రుడా! నేను నీ పాలిట నూతన సృష్టిని. నీ ప్రతి చర్య, క్రియపై ప్రత్యక్ష సాక్షిని! నా నుండి నువ్వు పొందాల్సిన మేలును, సామగ్రిని నేనెళ్ళక ముందే ప్రోది చేసుకో. నేనోసారి వెళ్ళిపోయానంటే ఇక ప్రళయ దినం వరకు మళ్ళీ తిరిగి రానని గుర్తుంచుకో!!”

”తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయ గొప్పతనాన్ని కీర్తించి, తగు రీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది అల్లాహ్‌ అభిలాష!”. (అల్‌ భఖరహ్‌: 285)
అవును, అల్లాహ్‌ రమజాను పూర్తి మాసం తర్వాత జుల్‌ హిజ్జహ్‌ మాసపు పది రోజులను అనుగ్రహించి మహా గొప్ప మేలు చేయడమే కాకుండా ఈ థ దినాలు సాంతం ఇబ్బడిముబ్బడిగా సత్కార్యాలు చేసుకునే సత్బుద్ధిని ప్రసాదించాడు. దీనికి ప్రతీగానే నేడు విశ్వ వ్యాప్తంగా విశ్వాసులు ఆయన గొప్పతాన్ని కీర్తిచడానికి, తగు రీతిలో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవడాని కి ఈద్‌గాహ్‌ాకు చేరుకుని ఆయన ఘనకీర్తి అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ వ లిల్లాహిల్‌ హమ్ద్‌ అని వేనోళ్ళ కీర్తిస్తున్నారు. ఎంత పవిత్రత, ఘనత మక్కా నగరానికి ఏమి విశిష్ఠత, ఔన్నత్యం మదీనా పురానికిఎన్ని శుభాల వెల్లువలు థ రాత్రుల ఆగమనానికి ఎన్నెన్ని వింతలో అరఫా దినానికిఇంకెన్ని విశేషాలో తర్వియా దినానికి.

అల్లాహ్‌ దాసులు పుణ్యాలు చేసి అత్యంత శ్రేష్ఠ సామగ్రి అయిన ‘తఖ్వా’ను మూట కట్టుకోవాలనీ, వారి బ్రతుకులు చరితార్థం అవ్వాలనే ఆ పరమ దయాళువు కొన్ని వసంత రుతువుల్ని కేయించాడు. నిన్ని రమాజాను అటువిం రుతువుల్లో ఒక రుతువయితే, మొదటి జుల్‌ హిజ్జహ్‌ మాసపు పది రోజులు ఒకటి. ఈ దినాల విశిష్ఠతను తెలియజేస్తూ ”జుల్‌ హిజ్జహ్‌ నెలలోని ప్రథమ థకంలో చేసిన పుణ్య కార్యాలు అల్లాహ్‌కు అన్నికన్నా ఎక్కువ ప్రియమైనవి, ఆఖరికి దైవమార్గంలో జరిపిన పోరాటం కూడా దీనంతగా ప్రియమైనది కాదు. అయితే మనిషి తన ధన, ప్రాణాలు పణంగాపెట్టి అమరగతి నొందే పోరాటం సంగతి వేరు” అని మహా ప్రవక్త (స) సెలవి చ్చారు. (సహీహ్‌ బుఖారీ)
ఈ దశ దినాల ప్రాశస్త్యాన్ని విశద పరుస్తూ – ”ఈ పది రోజుల పుణ్యాలకు ఇంతి ఘనత లభించడానికి గల కారణం ఏమిటంటే, ఈ దినాల్లో మౌలిక ఆరాధనలన్నీ ఏకమయ్యాయి. నమాజ్‌, రోజా, సద్ఖా, హజ్జ్‌ వంటి మౌలిక ఆరాధనలన్నీ ఈ థ రాత్రుల్లో తప్ప మరే ఇతర రోజుల్లో ఐక్యం కావు”. అన్నారు ఇబ్బుల్‌ ఖయ్యిమ్‌ (ర). పై విశిష్ఠతల కారణంగానే సజ్జనులయిన మన పూర్వీకులు ఈ థ రాత్రులు కరుణామయుని దయను పొందే నిమి త్తం కఠోరంగా పరిశ్రమించేవారు. మనలోని చాలా మంది సజ్జన పూర్వీ కుల్ని అనుసరిస్తూ, గత దశ రోజుల్లో వీలయినన్ని ఆరాధనలు చేసి, స్వచ్ఛంద ఉపవాసాలుపాటించి, దానధర్మాలు చేసి, ఖుర్‌ఆన్‌ పారాయణం చేసి అల్లాహ్‌ ప్రీతిని, ప్రసన్నతను పొందే ప్రయత్నం చేశారు. తమలోని అనేక వ్యసనాలను, చెడు అలవాట్లను, చెడు సావాసాలను పరిత్యజించారు. రమాజను మాసం విం సత్కారాల సమాహారం అనంతరం జుల్‌ హిజ్జహ్‌ మాసపు దశ దినాలు కూడా మనకు ప్రాప్తించడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం! ఈనాడు పండుగ నాడు. త్యాగోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విశ్వాసుల పర్వదినం. సంబరల ఘడియ, సంతోష సమయం. కొత్త బట్టల్లో చిన్నారి బాలబాలికలు నన్నె ఫరిష్తాల్లా కన్పిస్తున్నారు. వృద్ధులు, యువకులు, స్త్రీలు, పురుషుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పరస్పర పలుకరింపు లతో, పరస్పర ఆలింగనాలతో రంగు రంగుల తూనిగల్లా ప్రేమాభిమానాల ను ప్రదర్శించుకుంటున్నారు. ఇదేదో షరా మామూలుగా జరిగే తంతు ఎంత మాత్రం కాదు. ఇదో మహత్త సందేశం కలిగి ఘనాఘన ఘడియ. క్రియా రూపంలో ఇస్లాం ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అద్భుత ప్రక్రియ.

సొంత గొప్పలు పోయే దినం కాదు ఇది. అల్లాహ్‌ ఘనకీర్తిని కొనయాడే ఘడియ ఇది. మనందరి ప్రభువు అల్లాహ్‌ా ఒక్కడే, మనందరి ప్రవక్త ముహమ్మద్‌ (స) ఒక్కరే, మనందరి గ్రంథం ఖుర్‌ఆన్‌ ఒక్కటే. మనందరి ధర్మం ఇస్లాం ఒక్కటే. మనంమందరం ఒక్కటే. మానవ దౌర్బల్యాల వల్ల చిన్నా చితకా పాక్షిక విభేదాలు ఉన్నప్పికీ మనందరి అఖీదా (విశ్వాసం) ఒక్కటే అనడానికి ప్రబల తార్కాణం నేి మన ఈద్‌ వేడుక. ప్రధానమయిన అఖీదాలో ఒక్కిగా ఉన్న మనం పాక్షికాలను, పొరపొచ్చాలను విస్మరించి తోటి సోదరుల్ని గుండెలకు హత్తుకోవాల్సిన దినం పండుగ. పర్వదినం మన కిచ్చే మరో సంకేతం – సమాజాన్ని కలుపుకోకుండా, సాటి ప్రజల యెడల ప్రేమ గుణాన్ని పెంచుకోకుండా, త్యాగ గుణాన్ని అలవర్చుకోకుండా ఏ సంతోషమయినా సంపూర్ణం కాజాలదు. వివాహం అయినా,అఖీఖా అయినా మనం మన సంతోషాన్ని సమాజంతో పంచుకోవాలని, మనం కేవలం మన గురించి మాత్రమే ఆలోచించకుండా సంఘం, సమాజం గురించి సయితం ఆలోచించాలని ఉపదేశిస్తుంది పండుగ. ”తఖబ్బలల్లాహు మిన్నా వ మిన్‌ కుమ్‌” అల్లాహ్‌ మనందరి సత్కర్మల్ని స్వీకరించి ఆమోదముద్రను వేయుగాక!

ఈద్‌ అంటే నిఘంటువు ప్రకారం మళ్ళి మళ్ళీ వచ్ఛేది, మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకునేది. మళ్ళీ మళ్ళీ జన స్రవంతిలో సంతోషాన్ని, ఆనందాన్ని నింపేది. స్వవాసులు, ప్రవాసులు తమ తమ ఇళ్ళ వైపు మళ్ళేది.
ఇబ్ను అన్బారీ (ర) గారి ప్రకారం ఈద్‌ను ఈద్‌ అని ఎందుకనండం జరి గిందంటే, ఆ నాడు ప్రతి వ్యక్తి తన స్థాయి, స్తోమత వైపునకు మరలుతాడు గనక. కాబ్టి ఆతిథ్యం ఇచ్చేవారు తమ స్థాయి తగ్గట్టు ఆతిథ్యం ఇస్తారు. శ్రీమంతులు వారి స్థాయికి తగ్గట్టు హుందాగా వ్యవహరింస్తూ సమాజం లోని బడుగు బలహీన జనాల బతుకుల్లో సయితం సంబర సంతోషాల పూలు పూయించే సదుద్దేశ్యంతో విరివిరిగా ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. (నైలుల్‌ ఔతార్‌)

అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌లో ఇలా సెవిస్తున్నాడు: ”ప్రతి అనుచర సమాజానికి మేము ఒక ఆరాధనా పద్ధతిని నిర్ధారించి ఉన్నాము. దాన్ని వారు పాటిస్తున్నారు. కాబట్టి వారు ఈ విషయంలో నీతో గొడవ పడకూడదు. నువ్వు మాత్రం ప్రజలను వారి ప్రభువు వైపునకు పిలువు. నిశ్చయంగా నువ్వు సన్మార్గాన ఉన్నావు”. (అల్‌ హజ్జ్‌: 67) ప్రస్తుతం సన్మార్గం మీద ఉన్నవారు ఇస్లాం ధర్మాన్ని అనుసరించే వారు మాత్రమే. ఇస్లాం ధర్మాన్ని, శాస్త్రాన్ని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిపై సంపూర్ణ చేసిన మీదట గత శాస్త్రాలన్నింనీ రద్దు చేయడం జరిగింది. మనం జరుపుకునే ఈదుల్‌ ఫిత్ర్‌, ఈదుల్‌ అజ్హా పండుగలతో గత ప్రవక్తల అనుయాయులు జరుపుకునే పండుగలన్నింటినీ తొలగించడం జరి గింది. కాబట్టి ముస్లింలమయిన మనం అల్లాహ్‌నే ఘనాఘడుగా భావించాలి. ఆయన ధర్మాన్నే ఘనాఘనదిగా భావించాలి, ఆయన ప్రవక్త (స) సంప్రదాయాన్నే ఘనాఘన సంస్కృతిగా ఎంచాలి. ఆయన గ్రంథాన్నే ఘనా ఘన గ్రంథరాజంగా భావించాలి. ఆయన మన కోసం కేయించిన ఈ రెండు పండుగలనే ఘనాఘనమయినవిగా లెక్కించాలి. షరీయతు పరిధుల్లో ఉంటూ శృతి మించకుండా పండుగ జరుపుకునే మనం అన్యుల పండుగల్లో, సంబరాల్లో (ముఖ్యంగా షిర్క్‌తో కూడిన సంబరాలు, జాతరలు, పుష్కరాలు వగైరా) పాల్గొని సంతోషించడం ఒక ముస్లింగా సహించదగిన విషయం కాదు అన్న ఎరుకతో జీవించాలి. ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా పండుగ సంబ రాల్లో పాల్గొని అల్లాహ్‌ యెడల విధేయతను కనబర్చాలి. ఎన్ని సౌకర్యాలు, ప్రాపంచిక లాభాలున్నా షిర్క్‌ కూడిన అన్యుల ఉత్సవాల్కో పాల్గొనరాదు.
ప్రియ పాఠకుల్లారా! పది రోజుల క్రితం జుల్‌హిజ్జా నెలవంక చూసింది మొదలు మనందరి నాలుకల మీద నానుతున్న తక్బీరాత్‌లు-అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ లా ఇలాహ ఇల్లల్లాహ్‌ అల్లాహు అక్బర్‌ అల్లాహు అక్బర్‌ వ లిల్లాహిల్‌ హమ్ద్‌! మనం ఈ పలుకుల పరమార్థాన్ని అర్థం చేసుకునే చెబుతున్నామా? లేక షరా మామూలుగా ప్రతి యేా చెప్పినట్టే చిలుక పలుకుల్లా వల్లిస్తున్నామా? అన్నది ఈ సందర్భంగా ఎవరికి వారు వేసుకోవాల్సి ప్రశ్న, చేసుకోవాల్సిన ఆత్మ సమీక్ష!!

అన్ని వేళలా అల్లాహ్‌ యెడల అవిధేయతకు ఒడిగడుతూ, అల్లాహ్‌యేతరుల విషయంలో నమ్మిన బంటులా వ్యవహరిస్తూనే ‘అల్లాహు అక్బర్‌’ అనడం ఎంత మాత్రం సహేతుకం కాదు. అల్లాహ్‌ ప్రసన్నతను ప్రక్కనబెట్టి, అల్లాహ్‌ యేతరుల ప్రసన్నత కోసం ప్రాకులాడుతూనే అల్లాహు అక్బర్‌ అనడంలో అర్థం లేదు. నోి మాటగా వందసార్లు లక్ష కోట్లు అని జపించి నంత మాత్రాన జేబులో చిల్లిగవ్వ కూడా లేకపోతే ప్రయోజనం ఏమి? వందసార్లు లక్ష కోట్లు అనడం వేరు, అక్షరాలా వంద కోట్లకు యజమాని అవ్వడం వేరు. అలాగే నోిటి మాటగా అల్లాహు అక్బర్‌ అనడం వేరు, దాన్ని భావార్థాన్ని గుండెల్లో నింపుకుని భక్తిప్రపత్తులతో జీవించడం వేరు.

అభిమాన సోదరుల్లారా! ఓ మామూలు డాక్టర్‌. అతనితో మనకు ఎలాంటి  రక్త సంబంధము లేదు. పూర్వ పరిచయమూ లేదు. అలాంటి వైెద్యుడు చెప్పి పత్యానల్లా నోరు మెదపకుండా, కాలు కదపకుండా పాటించే మనం, మనం దరి సృష్టికర్త అల్లాహ్‌ గీసిన సరిహద్దు రేఖల్ని యదేచ్ఛగా చెరిపేయడం, ఆయన సూచించిన పత్యాలను పాించకపోవడం మనకు ప్టిన పైత్యం కాకపోతే మరేమిటో ఆలోచించండి! ఏమి, విశ్వ మొత్తంలో అల్లాహ్‌కు మించిన వైద్యుడుగాని, శ్రేయోభిలాషిగానీ, మిత్రుడుగానీ మరొకడు ఉన్నాడా? అ,ఆలు దిద్దడం మొదలు ఆర్థిక, వైజ్ఞానికి, సామాజిక రంగాల్లో ఆయా నిపుణులను అనుసరించే మనం, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్‌ా మాట విషయంలో ఎందుకు మాట తప్పుతున్నాము. ముందేమో మాటిస్తున్నాము. ఆ తర్వాత మొండి చెయ్యి చూపిస్తున్నాము. మన ఈ ప్రవర్తని దేనికి తార్కాణం?
అల్లాహ్‌ాను అక్బర్‌ (ఘనాఘనుడి)గా భావించే మనం మన ప్రవర్తన సయితం అంతే ఘనాఘనమయినదిగా ఉండేటట్లు చూసుకుంటున్నామా? మన తల్లిదండ్రుల్ని అంతే గొప్పగా చూసుకోవాలన్న ఆలోచన మనకుందా? మన బంధుత్వ సంబందాలు సయితం అంతే బలంగా ఉండాలని మనం కోరుకుం టున్నామా? ఉంటే సరి. లేదంటే మాత్రం సరి చేసుకొని అందరి చేత శభాష్‌ అనిపించుకోవాలి. అలా మనం పండుగ జరుపుకోవాలి.

ఇది నిజంగా సంతోష సమయమే, ఆనంద ఘడియే. దాంతోపాటు ఆలో చించాల్సిన వేళ కూడా. పండుగ దినం మనకిస్తున్న సంకేతం – ”ఓ ఆదమ్‌ పుత్రుడా! నేను నీ పాలిట నూతన సృష్టిని. నీ ప్రతి చర్య, క్రియపై ప్రత్యక్ష సాక్షిని! నా నుండి నువ్వు పొందాల్సిన మేలును, సామగ్రిని నేనెళ్ళక ముందే ప్రోది చేసుకో. నేనోసారి వెళ్ళిపోయానంటే ఇక ప్రళయ దినం వరకు మళ్ళీ తిరిగి రానని గుర్తుంచుకో!!”

నిమిషాలు, ఘడియలు, వారాలు, నెలలు, సంవత్సరాలు, థాబ్దులు, శతాబ్దులు గడిచిపోతున్నా నైతికంగా, ఆధ్యాత్మికంగా అట్టడుగు స్థాయిలోనే ఉండి పోయిన వారిని మనం వివేకవంతులం అని అనగలమా? కాబ్టి మనలోని ప్రతి ఒక్కరు మంచి కాలం మించి పోక ముందే జరిగిన పొర పాట్లు, పాపాల మీద పశ్చాత్తాపం చెంది పరమోన్నత ప్రభువు వైపునకు మర లాల్సి ఉంది. ఎందుకంటే, ‘నేనే మహోన్నత ప్రభువును’ అని బీరాలు పోయిన ఫిర్‌ఔన్‌ కూడా తౌబా చేసుకున్నాడు కానీ, ఎప్పుడు? మంచి సమయం మించిపోయాక. ఫలితం పరాభవమే అతనికి ఎదురయ్యింది. నఖశిఖ పర్యంత మనల్ని ఎంతో అందంగా తీర్చిదిద్దిన మన ప్రభువు – మనల్ని పుట్టిస్తే మనమేమో ఆయన్ను వదలి అన్యులను ఆరాధిస్తున్నాము. ఆయన మనకు జీవనోపాధిని కల్పిస్తుంటే మనమేమో తన చోటు నుంచి కదల లేని, అర్హత లేని అశక్తులకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఆయన వరాలను మనపై కుండపోతగా కురిపిస్తూ ఉంటే మనమేమో చెడుల చ్టిను ఆయన వద్దకు పంపుతున్నాము. నిరపేక్షాపరుడయిన ఆయన అనన్య అనుగ్రహాలతో, అగణ్య వరప్రసాదాలతో మన పట్ల ఆయనకున్న ప్రేమను తెలియజేస్తుంటే మనమేమో, నిత్య అగత్యపరులమయి ఉండి కూడా లెక్కలేనన్ని పాపాలు చేసి మన ఆత్మలపై అన్యాయం చేసుకుంటున్నాము. మనం ఆయన వైపునకు కదలి వెళితే ఆయన దూరం నుండే స్వాగతిస్తాడు. మనం ఆయనకు దూరంగా జరిగితే అత్యంత సమీపంగా తన కారుణ్యం వైపునకు పిలుస్తాడు. ఆయన్ను స్మరించే వారిని, ఆయన ఆదేశాలను గైగొనే వారిని అమితంగా అనుగ్రహిస్తాడు. పాప ఊబిలో కూరుకుపోయేవారు సయితం మనస్సు మార్చుకుని తౌబా చేసుకుంటే వారి పాపాలు సముద్ర నురుగు వలే ఉన్నా, నింగిని తాకుతున్నా వారిని మన్నిస్తాడు. మనం ఆయన యెడల ధిక్కార వైఖరికి పాల్పడితే ఆయన మన యెడల ఒక వైద్యునిలా వ్యవహరిస్తాడు. ఆయన మనల్ని పరీక్షకు గురి చేసేది మన పాపాల్ని ప్రక్షాళించడానికే! ”ఓ మానవుడా! అలాిం పరమ దయాళువు అయిన ప్రభువు విషయంలో ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది?” (ఇనిఫతార్‌:6)

అంతిమంగా ఓ మాట – మనకు బాగా తెలుసు, మనం ఎన్నుకున్న మార్గం పూల పాన్పు కాదు. అది నిరంతర కృషి, పరిశ్రమ, రక్తం, కన్నీటి కాలువ గుండా సాగుతుంది. ఇక్కడ త్యాగాలే తప్ప బహుమానాల్లేవు. వాస్తవమే మంటే, విధ్వేషం, పరాభవం, దారిద్య్రం, బలహీనత, విచ్ఛిన్నత, విభిన్నతల కారణంగా మనం నేి వరకు ఎన్ని కష్ట నష్టాలు భరించామో వాి ముందు ఇస్లాం మార్గాన చేసే త్యాగాలు ఏ మూలకు? దేశం ఏదయినా కావచ్చు, ప్రదేశం ఏదయిన అవ్వచ్చు. ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న, ఉన్న స్డితిగతుల్ని ఓ సారి నెమరువేసుకుంటే అందరిది ఒకే నీతి, ఒకే రీతి – ముస్లింలను ధర్మం నుండి తప్పించాలి. ఈ పూర్వ రంగంలో మనం సరిగ్గా, తొలి నాి ముస్లింలు ఉన్న చోటే ఉన్నాము. వారి కుడి ఎడమల నాటి రెండు గొప్ప సామ్రాజ్యాల మధ్య చిక్కుకొని ఉండగా నేడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. తొలినాి ముస్లిముల్లా మనం కూడా పరీక్షలు, కష్టాలు, త్యాగాల కఠినమయిన, ప్రాణవిదారకమయిన దశలను దాట వలసి ఉంది.ఈ మార్గంలో చేసే ఏ కృషి అయినా, ఏ త్యాగమయినా వృధా పోదు. భూమ్యాకాశాలే దీనికి ప్రత్యక్ష సాక్షి! ”విశ్వసించిన ప్రజలారా! మీరు గనక అల్లాహ్‌ాకు సహయ పడితే, అల్లాహ్‌ా కూడా మీకు తప్పక సహాయ పడతాడు. మీ పాదాలకు నిలకడను ప్రసాదిస్తాడు”. (దివ్యఖుర్‌ఆన్‌-47:7)

ఆ మహోన్నత ప్రభువు వాగ్దానం సత్యమయిందనడంలో సందేహమేముంది!

Related Post