ఉపవాసాలు మనిషిని క్రమబద్ధీకరిస్తాయి

''పవిత్ర రమజాను మాసం రాగానే స్వర్గ ద్వారాలు తెరువబడతాయి. నరక ద్వారాలు మూయబడతాయి. సైతానులు బంధించబడతారు. కరుణ ద్వారాలు కూడా తెరువబడతాయి''.

”పవిత్ర రమజాను మాసం రాగానే స్వర్గ ద్వారాలు తెరువబడతాయి. నరక ద్వారాలు మూయబడతాయి. సైతానులు బంధించబడతారు. కరుణ ద్వారాలు కూడా తెరువబడతాయి”.

అబ్దుల్ హక్క్
”విశ్వసించిన ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది. అదే విధంగా ఇది మీకు పూర్వం ప్రవక్తల్ని అనుసరించేవారికి కూడా విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.” (2:183)

రోజా ప్రాముఖ్యం

(1) మహాప్రవక్త(స) ఇలా అన్నారు: ”పవిత్ర రమజాను మాసం రాగానే స్వర్గ ద్వారాలు తెరువబడతాయి. నరక ద్వారాలు మూయబడతాయి. సైతానులు బంధించబడతారు. కరుణ ద్వారాలు కూడా తెరువబడతాయి”. దీనిని బట్టి రమజాను ప్రాముఖ్యం ఎంతటిదో తెలుసుకోవచ్చు.
(2) పూర్తి విశ్వాసంతో మనస్ఫూర్తిగా చేయు ఉపవాసి యొక్క ఉపవాసం వల్ల పూర్వపు పాపాలన్నీ క్షమింపబడతాయి. భక్తి విశ్వాసాలతో తరావీహ్‌ా నమాజులు చేసేవారి, లైలతుల్‌ ఖద్ర్‌ రాత్రి నమాజులు సల్పే వారి పాపాలు క్షమింపబడతాయి.
(3) ఉపవాసి నోటి నుండి వచ్చే వాసన ప్రళయదినాన దైవసమక్షంలో ”ముష్క్‌” వాసన కంటే కూడా ఎక్కువగా సువాసన కలిగి ఉంటుందని మహాప్రవక్త(స) అన్నారు.
(4) స్వర్గంలోని ఎనిమిది ద్వారాలలో ఉపవాసికి ”రయ్యాన్‌” అనే ద్వారం ప్రత్యేకించబడింది.
(5) ఈ నెలలో ఉపవాసికి ”ఇఫ్తార్‌” (రోజా పూర్తి అయిన తర్వాత చేసే భోజనం) చేయించిన వారి పాపాలు క్షమించబడతాయి.
అతనికి ఉపవాసికి లభించినంత పుణ్యం లభిస్తుంది. ఎలాంటి తగ్గింపూ ఉండదు. రోజాను నిష్టతో, క్రమశిక్షణతో, సంపూర్ణ దైవభక్తితో ఆచరించడం ఉపవాసి ప్రథమ కర్తవ్యం. ఆ సమయంలో ఏవైనా తప్పులు చేసిన యెడల పుణ్యఫలాలు తగ్గుతాయి.
తప్పులు చేస్తూ వుండీ భక్తి కనబరస్తూ ఉండేదాని కంటే తప్పుల జోలికి పోకుండా ఉండటం మేలైన కార్యం. మహాప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ”ఉపవాసంలో ఉండీ కూడా ఎవరైనా అబద్ధం చెప్పడం, అబద్ధాలను అనుసరించడం విడనాడకపోతే – అటువంటి ఉపవాసం పట్ల అల్లాహ్‌ాకు ఎటువంటి ఆసక్తి లేదు.”
”ఉపవాసం చెడుల నుండి రక్షించే రక్షణా కవచం(డాలు) వంటిది” అని కూడా అన్నారు. అబద్ధాలు పలుకుతూ, చాడీలు చెప్తూ, చెడు పనులు చేస్తూ, రోజాను కూడా ఆచరిస్తూ ఉంటే ఏ మాత్రం ఫలితం దక్కదు. కేవలం ఆకలి దప్పులతో ఉండుటయే కానీ ఏ మాత్రం ఉపయోగం ఉండదు.
ఒక వ్యక్తి నమాజులు చేస్తున్నాడు. రోజాలు ఉంటున్నాడు. అయితే అతడు చాడీలు చెప్పడం, అబద్ధాల సాక్ష్యం ఇవ్వడం వల్ల వాటి పుణ్యఫలం తగ్గినట్లే. ఒక రోగికి ఎంతటి బలమైన ఆహారమిచ్చినా ఆ రోగానికి తగిన చికిత్స జరుగనంతవరకూ అంతా నిష్ఫలమే కదా!
(5) ఉపవాస సమయంలో ఎలాగైతే ఆహారాది విషయాల్లో పరిధులను దాటకుండా ఉండాలో అలాగే నిషిద్ధ కార్యాల్లో కూడా హద్దుల్లో ఉండడం తప్పనిసరి. కొందరు ఉపవాసమైతే చేస్తారు కాని మిగతా విషయాలను అంతగా పట్టించుకోరు. పరోక్షనింద, చాడీలు చెప్పడం, దుర్భాషలాడటం, తిట్టడం, దురుద్దేశ్యంతో చూడడం ఇలాంటి వాటి వలన రోజాభంగం కాదు. కానీ పుణ్యఫలం తగ్గుతుంది.
(6) ఉపవాస స్థితిలో చెడు పనులకు దూరంగా ఉండటం తప్పనిసరి పరిస్థితి. ప్రతి విశ్వాసి కనీసం ఈ నెలలోనైనా చెడు కార్యాలకు దూరంగా ఉండాలనుకుంటాడు. అంటే దీనర్ధం- ఈ నెల గతించిన తర్వాత ఆ పనులు చేయమని కాదు. ఆత్మతో ప్రమాణం చేసుకొని క్రమేణా దురభ్యాసాల నుండి విముక్తిని పొందేందుకు ప్రయత్నం చేయడం మంచిది. దేవుని దయవలన తప్పక వాటికి విముక్తి లభించును.
(7) ఈ ఉపవాసం అంగాంగాలకు వర్తిస్తుంది. చెడు దృశ్యాల నుండి రక్షణకు కంటి రోజా, దుర్భాషలు, అసత్యాలు, చాడీలకు దూరంగా నోటి రోజా, చెడు స్థలాలకు వెళ్ళకుండా కాళ్ళ రోజా, చెడు మాటలకు దూరంగా శ్రవణ రోజా మొదలైనవాటి వల్ల రోజా పాటించునే కాని ఉపవాస దీక్ష యొక్క ముఖ్యోద్దేశ్యం
నెరవేరదు.

 

Related Post