ఉపవాసం పరమార్థం

''ఏ వ్కక్తి ధర్మనిష్ఠతో, పుణ్యఫలాపేక్షతో రమజాను రోజాలు పాటిస్తాడో అతను పూర్వం చేసిన పాపాలు మన్నించబడ తాయి. ఎవరయితే భక్తి ప్రపత్తులతో, ఆత్మపరిశీలనతో (స్వర్గ) ఫలాపేక్షతో తరావీహ్‌ నమాజు చేస్తాడో అతడు పూర్వం చేసిన అపరాధాలు క్షమించ బడతాయి'' అని మహనీయ ముహ మ్మద్‌ (స) అన్నారు. (ముత్తఫఖున్‌ ఆలైహి)

”ఏ వ్కక్తి ధర్మనిష్ఠతో, పుణ్యఫలాపేక్షతో రమజాను రోజాలు పాటిస్తాడో అతను పూర్వం చేసిన పాపాలు మన్నించబడ తాయి. ఎవరయితే భక్తి ప్రపత్తులతో, ఆత్మపరిశీలనతో (స్వర్గ) ఫలాపేక్షతో తరావీహ్‌ నమాజు చేస్తాడో అతడు పూర్వం చేసిన అపరాధాలు క్షమించ బడతాయి” అని మహనీయ ముహ మ్మద్‌ (స) అన్నారు. (ముత్తఫఖున్‌ ఆలైహి)

”రమజాను మాసం ఖుర్‌ఆన్‌ అవతరించిన మాసం. అది మానవు లందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతోపాటు సత్యాసత్యాలను వేరుపర్చే స్పష్టమైన నిదర్శనాలున్నాయి. కనుక మీలో ఎవరు ఈ మాసాన్ని పొందుతారో వారు విధిగా ఉపవాసాలు ఉండాలి. ”. (దివ్యఖుర్‌ఆన్‌- 2: 185)

షరీయతుని అనుసరిస్తూ ప్రతి ముస్లిం నిర్ణీత కాలం వరకు ఉపవాసం ఉండాలి. ఒక రోజు ముందుగాని, ఒక రోజు వెనుక గానీ చేయకూడదు. ”మీరు (రమజాను) నెలవంకను చూసి ఉపవాసాలుండండి. మళ్ళీ మీరు (షవ్వాల్‌) నెలవంకను చూసి ఉపవాసాల్ని విరమించండి” అని మహ నీయ ముహమ్మద్‌ (స) వారు సెలవి చ్చారు. (ముత్తఫఖున్‌ అలైహి)

‘నా సముదాయపు వేగిరంగా (తొందరగా) ఇఫ్తార్‌ చేస్తున్నంత కాలం వారు శుభాన్ని పొందుతూనే ఉంటారు” అన్నారు మహ నీయ ముహమ్మద్‌ (స). (ముస్నద్‌ అహ్మద్‌) అయితే మరీ ఆలస్యం, మరీ తొందర చేయ కూడదు. ఉపవాసం అంటే కేవలం ఆహారపానీ యాలకు నిర్ణీత కాలం వరకు దూరం గా ఉండటం మాత్రమే కాదు. దైవ నిషేధాలన్నింటికి దూరంగా మసలుకో వాలి. ”ఎవరయితే రోజా పాటిస్తూ కూడా ఆసత్యం పలకడం, ఆసత్యాన్ని ఆచరించటం మానడో అటువంటివాడు ఆకలిదప్పులతో ఉండటం పట్ల అల్లాహ్‌ా కు ఏ మాత్రం ఆసక్తి లేదు” అని ఉపదేశించారు మహనీయ ముహమ్మద్‌ (స). (బుఖారీ)

”ఏ వ్కక్తి ధర్మనిష్ఠతో, పుణ్యఫలాపేక్షతో రమజాను రోజాలు పాటిస్తాడో అతను పూర్వం చేసిన పాపాలు మన్నించబడ తాయి. ఎవరయితే భక్తి ప్రపత్తులతో, ఆత్మపరిశీలనతో (స్వర్గ) ఫలాపేక్షతో తరావీహ్‌ నమాజు చేస్తాడో అతడు పూర్వం చేసిన అపరాధాలు క్షమించ బడతాయి” అని మహనీయ ముహ మ్మద్‌ (స) అన్నారు. (ముత్తఫఖున్‌ ఆలైహి)
”రోజా డాలు వంటిది. మీలో ఎవర యినా రోజా పాటిస్తున్నట్లయితే,అతను అశ్లీల పలుకులు పలుకరాదు. అల్లరి చేష్టలు చేయరాదు. ఇతరులెవరయినా తిట్టినా, జగడానికి దిగినా, ‘నేను ఉప వాసంతో ఉన్నాను’ అని చెప్పెయ్యాలి” అని ప్రబోధించారు మహనీయ ముహ మ్మద్‌ (స). (బుఖారీ, ముస్లిం)

”రోజా మరియు ఖుర్‌ఆన్‌ విశ్వాసి కొరకు సిఫారసు చేస్తాయి. రోజా అంటుంది: ‘ప్రభూ! నేను ఇతన్ని పగలల్లా భోజ నానికి, ఇతరత్రా వాంఛలకు దూరం చేశాను, ఇతని విషయంలో నా సిఫా రసును స్వీకరించు’. అలాగే ఖుర్‌ఆన్‌ అంటుంది: ‘నేను ఇతన్ని రాత్రిళ్ళలో సుఖనిద్రకు దూరం చేశాను కనుక స్వామీ! ఇతని ఎడల నా సిఫారసును స్వీకరించు’. అప్పుడు అల్లాహ్‌ా ఈ రెంటి సిఫారసు ను స్వీకరిస్తాడు”. అన్నారు ప్రవక్త (స). (బైహఖీ, మిష్కాత్‌)

Related Post