New Muslims APP

అపరిచిత సత్యాన్వేషి

 

అపరిచిత సత్యాన్వేషి –  ఇమామ్‌ ఖుదామా అల్‌ మఖ్దసీ (రహ్మ) తన పుస్తకం ‘కితాబుత్తవ్వాబూన్‌’లో అబ్దుల్‌ వాహిద్‌ బిన్‌ జైద్‌ నుండి ఉల్లేఖిస్తున్నారు. ఆయన ఇలా అన్నారు:
మేము ఓ పడవలో ప్రయాణిస్తుండగా భయంకరమయిన తుఫాను చోటు చేసుకుంది. సముద్ర పవనాలు మమ్మల్ని ఓ అపరిచత ద్వీపానికి తీసుకెళ్ళాయి.అక్కడ దిగిన మాకు ఓ వ్యక్తి తారస పడ్డాడు. అతనో విగ్రహాన్ని పూజిస్తున్నాడు. మేము అతని దగ్గరకు వెళ్ళి – ”అయ్యా! మీరు ఆరాధిస్తున్నదెవరిని?” అని అడిగాము. అందుకా వ్యక్తి విగ్రహం వైపు సైగ చేశాడు.

ఆయన నువ్వు భావిస్తున్నట్లు కంటికి కానవచ్చే వస్తువు, సృష్టి కాదు; సృష్టి కర్త.

మేము: మాతోపాటు పడవలో ఇలాంటి బొమ్మల్ని చెక్కే ఆచారులు కొందరున్నారు. ఇది నీ ఆరాధ్య దైవం ఎలా కాగలదు? నీ భక్తిశ్రద్ధలకు ఇది ఏ మాత్రం అర్హత గలది కాదు.

అపరిచిత వ్యక్తి: మీరు ఎవర్ని ఆరాధిస్తారు?
మేము: మేము నిజ ఆరాధ్యుడయిన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధిస్తాము.

అపరిచిత వ్యక్తి: ఆయనది బంగారు విగ్రహమా, వెండి విగ్రహమా, రాగి విగ్రహమా?
మేము: ఆయన నువ్వు భావిస్తున్నట్లు కంటికి కానవచ్చే వస్తువు, సృష్టి కాదు; సృష్టి కర్త.
అపరిచిత వ్యక్తి: అల్లాహ్‌ ఎక్కడుంటాడు?
మేము: అల్లాహ్‌ అర్ష్‌ మీద అసీనుడయి ఉంటాడు. అది పై ఆకాశాల లో ఉంది. ఆయన రాజ్యాధికారం భూమండలం మొత్తం మీద ఉంది. సజీవుల్లో, నిర్జీవుల్లో ఆయన ఆదేశాలే అమలవుతాయి.
అపరిచిత వ్యక్తి: మీకు ఆయన గురించి ఎలా తెలిసింది?
మేము: మహోన్నత సృష్టికర్త, విశ్వ సామ్రాజ్యాధికారి అయిన అల్లాహ్‌ మా కోసం దైవ ప్రవక్తలను (అన్బియా, రుసుల్‌) ప్రభవింపజేశాడు. వారు మాకు ఆయన గురించి తెలియజేశారు.

అపరిచిత వ్యక్తి: ప్రవక్త వచ్చి ఏం చేశాడు?
మేము: ప్రవక్త అల్లాహ్‌ సందేశాన్ని అందజేసే పని చేశాడు. ఆయన
అందించాల్సిన సందేశం సంపూర్ణమయి పోయిన తర్వాత
అల్లాహ్‌ ఆయనకు మరణమిచ్చాడు.
అపరిచిత వ్యక్తి: ఆయన మీ వద్ద తనకు సంబంధిచిన ఏదయినా ఒక జ్ఞాపిక వదిలి వెళ్ళారా?
మేము: అవును, వదిలి వెళ్లారు.
అపరిచిత వ్యక్తి: ఏమిటా  జ్ఞాపిక?
మేము: ఆయన తన ప్రభువు తరఫు నుండి ఆయనకు అందిన ఒక
గ్రంథాన్ని వదలి వెళ్ళారు.
అపరిచిత వ్యక్తి: ఆ నిజ ప్రభువు తరఫు నుండి అందజేయ బడిన ఆ గ్రంథాన్ని మాకు చూపించండి.
మేము మా దద్గర ఉన్న ఖుర్‌ఆన్‌ ఓ ప్రతిని తెప్పించి అతనికి అంద జేశాము.
అపరిచిత వ్యక్తి: నేనీ గ్రంథాన్ని చదవ లేను.
మేము అతని ముందర ఖుర్‌ఆన్‌ గ్రంథంలోని కొన్ని సూరాలను చదివి విన్పించాము. ఒక వైపు మేము ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తూ ఉంటే మరో వైపు అతను ఏడుస్తూనే ఉన్నాడు. చివరికి సూరాలు పూర్తయ్యాయి.
ఖుర్‌ఆన్‌ పారాయణం ఫుర్తయ్యాక అతను ఇలా అన్నాడు: ”ఇలాంటి గ్రంథం కలిగి ఉన్న ప్రజలు ఎలాంటి పాపానికి పాల్పడకూడదు”. ఆ తర్వాత అతను ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాడు.మేము అతనికి ఇస్లాం శిక్షణ ఇచ్చాము. తెలుసుకోవాల్సిన మౌలిక విషయాలను తెలియ జేశాము. ఖుర్‌ఆన్‌లోని కొన్ని సూరాలను కంఠస్థం కూడా చేయిపించాము. తర్వాత అతన్ని మాతోపాటు పడవలో కూర్చోబెట్ట్టుకున్నాము. పడవ ఆ అపరిచిత ప్రాంతాన్ని వీడి బయలుదేరింది. రాత్రయింది. భోజనాలు ముగించుకొని అందరూ నిద్రకు ఉపక్రిమిస్తున్నారు. అప్పుడా వ్యక్తి అన్నాడు: ”ఏ నిజ ఆరాధ్యుడయిన అల్లాహ్‌ వైపునకు మీరు నన్ను ఆహ్వానించారో రాత్రయ్యాక ఆయన ఏమయినా నిద్ర పోతాడా?”.
మేము: ”లేదు, ఓ అల్లాహ్‌ దాసుడా! ఆయన సజీవుడు, సజీవంగా ఉంాడు. ఆయనకు కునుకుగానీ, నిద్దురగానీ రాదు. అలసట ఆయన దరికి చేరదు. విశ్వ వ్యవస్థను నడుపుతున్న వాడు ఆయన, రాత్రింబవళ్ళను తీసుకువచ్చేవాడు, తిరిగి తీసుకెళ్ళేవాడు ఆయన” అన్నాము. అందుకు అతను ఇలా అన్నాడు: ‘నిద్రించని ప్రభువు మీకుండగా మీరెలా ప్రశాంతంగా నిద్రుస్తున్నారు?’ అంటూ ఓ మూలకెళ్ళి ఆరాధనలో నిమగ్నమయి పోయాడు.
మేము పట్టణం చేెరకున్న తర్వాత-”మా ఈ సోదరుడు నవ ముస్లిం. ఈ ప్రాంతానికి కొత్త. ఏదయినా అర్థిక సహాయం అతని తప్పక చేయాలి” అని పరస్పరం మ్లాడుకున్నాము. కొంత మొత్తం జమా చేసి అతనిచ్చాము. అందుకతను:’ఏమిటి ది?’ మేమన్నాము: నీ అవసరార్థం ఇవి పనికొస్తాయి అన్నాము. అతను ఇలా అన్నాడు: ”అల్లాహ్‌ తప్ప నిజ ఆరాధ్యుడెవడూ లేడు. నేను అల్లాహ్‌ను వదలి సమద్ర మధ్యన ఓ ద్వీపంలో విగ్రహ ప్రతిమల్ని ఆరాధించినప్పుడే ఆయన నన్ను వృధా చెయ్య లేదు. అలాింది ఇప్పుడు నేను నా నిజ ఆరాధ్యు డయిన అల్లాహ్‌ ఆరాధిస్తుండగా ఆయన నన్ను వృధా పరుస్తాడా? చెప్పండి!” అన్నాడు.
ఆ తర్వాత అతను ధర్మసమ్మతమయిన జీవనోఫాధి అన్వేషణలో బయలుదేరి వెళ్ళి పోయాడు. ఆనక అనతి కాలంలోనే అతను అల నాటి ధర్మపరాయణుల్లో గొప్ప వ్యక్తిగా వినుతికెక్కాడు.

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.