New Muslims APP

ఓ మిత్రమా! నీ జీవిత పయనమెటు..?

సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్  పేరుతో

“అన్వేషణ” మానవుని సహజ లక్షణం- తన అన్వేషణలో ఆహార సంపాదన, ఆరోగ్య పరిరక్షక చర్యలలో, ప్రయాణ సౌకర్యాలలో, ఇంకా సుఖమయ జీవితానికి దోహదం చేసే ఎన్నో అంశాలను ఆవిష్కరిస్తూ సాగిపోతున్నాడు మనిషి. తత్ఫలితాలు వాస్తవమైన, నిర్భయమైన సుఖాన్ని అందివ్వకపోగా, ఆందోళనలకు దారి తీయగా, ఆవిష్కరణ పరంపరలో తన ఉనికికి సంబంధించిన గతం-వర్తమానం-భవిష్యత్తు గురించి సమాలోచనలు ఆంతర్యాన్ని చుట్టుముట్టగా, సత్యాన్ని ఆవిష్కరించ పూనుకున్నాడు మనిషి. “సత్యం” అతని ముంగిటకొచ్చి పలుకరించినా, నీ అన్వేషణ వాస్తవ ఫలితాన్ని నేనేనని ఘోషించినా ఏదో విషయం అతన్ని మోసంలో పడవేసింది.

సరే ఇక చాలు! శాస్త్రీయంగా, హేతుబద్దంగా, అనుభవజ్ఞుల అనుభవాలతో, మహనీయుల బోధనలతో వివిధ ధార్మిక గ్రంథాల ఆధారాలతో నీవు విస్మరించిన ఈ సత్యాన్ని తిరిగి నీ ఎదుటకు తీసుకురాబడుతుంది.

ఓ మిత్రమా!

నీకు  స్వాగతం!    సుస్వాగతం!!

ఓ మిత్రమా! నీ జీవిత పయనమెటు..?

 

సృష్టి ఆవిర్భావం-బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం

ఈ సృష్టి ఆవిర్భావం గురించి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డార్విన్ సిద్ధాంతమేమిటో కాస్త గమనించండి: “విశ్వంలో ఫుట్బాల్ బంతిలా ఒక జడపదార్థం, అందులో ఎన్నో పదార్థాలు, మరెన్నో కణాల సముదాయం ఉండేది. నేటికి దాదాపు ఇరవై బిలియన్ సంవత్సరాల పూర్వం విశ్వంలో ఒక విస్ఫోటనం జరిగి జడపదార్థం చెల్లాచెదరయి విభిన్న స్థానాలలో పొందికగా అమరింది. వీటిని నేటి మానవుడు పాలపుంతలు, గ్రహాలు, నక్షత్రాలుగా పిలుస్తున్నాడు.”

ఈ సిద్ధాంత సారాంశము ఏమనగా విశ్వంలో ఒక జడపదార్థం ఉండేదని, అది విస్ఫోటనం చెందడం వలన ప్రస్తుత సృష్టి ఉనికిలోకి వచ్చిందని- దీనిని కొంత విషయం అవగతమవుతుంది.విస్ఫోటనం పదార్థాల విచ్ఛిన్నానికి కారణమవుతుందనేది సాధారణ విషయమే. కాని ఆలోచనకు దారితీసే విషయమేమనగా పదార్థ చిన్నాభిన్నానికి కారణమయ్యే విస్ఫోటనం ద్వారా వివిధ ద్రవ్యరాశులుగల, వివిధ గుణాలు గలిగిన పదార్థాలుగా, పాలపుంతలు, సూర్యచంద్ర నక్షత్రాలు, గ్రహాలు, భూమిగా విడిపోయి ఒక క్రమమైన నిర్మాణంగా, నిర్దిష్టమైన దూరాలలో కక్ష్యలేర్పరు చుకుని పరిభ్రమించడం ఎంతో అందంగా, శాస్త్రీయంగా ఈ ఏర్పాటు జరగడం వెనక ఎవ్వరూ లేరని అనగలమా?

ఉదాహరణకు భూమికి సూర్యునికి మధ్య దూరం రమారమి పదిహేను వందల కోట కిలోమీటరు ఈ దూరం మరీ తక్కువైతే భూమిపై జీవరాశి కిలో మాడిమసి అయ్యేది. అలాకాక ఈదూరం మరీ ఎక్కువైతే వాతావరణం పూర్తిగా చల్లబడి భూమి మంచుతో కప్పబడి జీవరహితంగా వుండేది. ఈ రెండింటిలో ఏది జరిగినా జీవరాశుల మనుగడ అసాధ్యమయ్యేది. సౌరకుటుంబాన్ని నిర్ధిష్ట దూరంలో ఏర్పాటు చేసి భూభ్రమణ పరిభ్రమణాన్ని, తద్వారా రాత్రిపగలు, రుతువులు ఏర్పరిచిన ఆ అంతరిక్ష శాస్త్రవేత్త ఎవరు?

మరో ఉదాహరణ గమనించండి:

భూమి చుట్టు కొలత దాదాపు నలభైవేల కిలోమీటర్లు అని అంచనా. ఈ పరిమాణం రెండింతలు అయితే సహజ సిద్ధమైన భూమ్యాకర్షణ శక్తి ఎక్కువై మనిషి పెరుగుదల శక్తి అంగుళానికి మించేది కాదు. అలాకాక ఈ చుట్టు కొలత పరిమాణం మరీ తక్కువయితే, భూమ్యాకర్షణ శక్తి తగ్గి మనిషి తాటి చెట్టును మించిన పొడువుగా వుండేవాడు. భూమ్యాకర్షణ శక్తికి, మనిషి పెరుగుదల మధ్యగల అవినాభావ సంబంధంలో ఏమాత్రం తేడాలు వచ్చినా ఊహించని అనర్థాలు సంభవించి ఉండేవి. మానవమనుగడ అసాధ్యమయ్యేది. మనిషి మనుగడకై భూగోళాన్ని ఉత్తమంగా మలచిన ఆ భౌగోళిక శాస్త్రవేత్త ఎవరు?

పై విషయాల వల్ల ఇంతటి అద్భుతంగా, శాస్త్రీయంగా ఈ విశ్వాన్ని మలచిన కర్త ఒకడు ఉన్నాడని, ఆశక్తి అద్వితీయమని నిరూపణ అవుతుంది. అద్వితీయమైన శక్తిని గురించి ధార్మిక గ్రంథాలు ఏమంటున్నాయి?

వేదాలు:

 1. ఆయన ఒక్కడే, ఆయన్నే ప్రార్ధించండి. – ( ఋగ్వేదం 4-5-6:26)
 2. శక్తిమంతుని యొక్క ఎటువంటి విగ్రహచిత్రరూపాలు లేవు. (ఇక అతని నామమే సర్వస్త్రోత్రము. ఉపనిషత్తులు: (యజుర్వేదం- 9:40)
 3. ఎవరయితే ఈ లోకాలను తన ప్రభావంతో రక్షించి పాలిస్తాడో ఆ దేవుడు ఒక్కడే, ఓ జ్ఞానులారా! ఆయనను రెండవవానిగా చేయడానికి 8. ఆయన ప్రక్కన మరొకరు లేరు. (శ్వేతాశ్వతరోపనిషత్తు-3:2)
 4. దేవుని రూపము ఇంద్రియాల పరిధిలో నిలవదు కన్నులతో ఆయన శ్రీనెనవ్వరూ చూడలేరు. (శ్వేతశ్వతరోపనిషత్తు)
 5. కామము, క్రోధము, భయము, మోహము, లాభము, మదము, రోగుణము అననము మరణము కారుణ్యము శోకము. సోమరితనము, ఆకలి, దప్పిక, ఆశ, లజ్జ, దుఃఖము, విషాదము, సంతోషము అను ఈ దోషములు లేనివాడు శుభప్రదుడైన దేవుడు. (యోగశిఖోపనిషత్తు)

భగవద్గీత:

 1. నాశరహితమైనట్టియు, సర్వోత్తమైనట్టియు, ప్రకృతికి పరమై విలసిల్లినట్టియు నా స్వరూపమును తెలియని అవివేకులు అవ్యక్త రూపుడనగు (ప్రపంచాతీతుడగు ) నన్ను పాంచ భౌతిక దేహమును పొందిన వానినిగా తలంచుచున్నారు. (గీత-7:24)

బైబిల్:

 1. అందుకు యేసు నేను సత్పురుషుడనని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరెవరునూ సత్పురుషుడుకాడు. (లూకా 18:19, మార్కు 10, 18)
 2. ఒక్కడే దేవుడు తప్ప మరొక దేవుడు లేడనియు ఎరుగుదుము – (1వ కొరింధి 8:5)
 3. దేవతలనబడిన వారునూ, ప్రభువులనబడిన వారునూ అనేకులున్నారు. ఆకాశమందైననూ, భూమి మీదనైననూ మనకు ఒక్కడే దేవుడున్నాడు. (1వ కొరింధి 8:6)

దివ్యఖుర్ఆన్:

మానవులందరికి మార్గదర్శకత్వం చూపటానికి వచ్చిన చిట్టచివరి దైవగ్రంథం దివ్యఖుర్ఆన్లో ఒకే దైవభావన:

 1. ఆయనే అల్లాహ్ ఆయన తప్ప మరొక దేవుడు లేడు. (తాహ:8)
 2. అల్లాహ్ ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవ్వడూ లేడు. (అల్ హషర్:22)
 3. మీ నిజమైన ఆరాధ్య దైవం కేవలం ఒక్కడే, ఆయన భూమికి ఆకాశాలనూ, భూమ్యాకాశాలలో ఉన్న సమస్తానికి ప్రభువు. (అస్సఫ్పాత్: 3-5)
 4. ప్రవక్తా! ఆయన ఒక్కడే దేవుడని ప్రకటించు. (అల్అన్అమ్:19)
 5. అల్లాహ్ ఆయన తప్ప ఆరాధ్యదైవం ఎవ్వడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. (బకరః:225)
 6. అల్లాహ్ ఇలా అజ్ఞాపించాడు. “ఇద్దరిని దేవుళ్ళుగా చేసుకోకండి. దేవుడు మటుకు ఒక్కడే. కనుక మీరు నాకే భయపడండి.” ఆకాశాలలో ఉన్నదంతా భూమిలో ఉన్నదంతా ఆయనదే. కేవలం ఆయన ధర్మం మాత్రమే (సృష్టిలో అంతటా అనుసరింపబడుతోంది. అలాంటప్పుడు మీరు అల్లాహ్ను కాదని మరొకరికి భయపడతారా? (అన్నహ్ల్ -51,52)
 7. నేను తప్ప మీకు మరొక దేవుడు ఎవ్వడూ లేడు. కనుక మీరు నాకే భయపడండి. (అన్నహ్ల్-2)

మహనీయుల నోట- ఒకే దైవం మాట

 1. ఒక మానవాతీత శక్తి ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఆ శక్తిని వర్ణించడం ఎవరి తరం కాదు. -భాస్కరాచార్యుడు (శాస్త్రవేత్త) –
 2. ఏ శక్తి అయితే ప్రకృతిని నడుపుతుందో దానిని నిర్వచించలేము. ఈ విశ్వాన్ని ఏదో ఒక అద్భుత శక్తి (There is some power) నడుపుచున్నది.
 3. మానవుని ప్రతి కణంలోనూ 6 అడుగుల పొడవు D.N.A. కలదు. ప్రతి D.N.A. లో 10 ట్రిలియన్ల (102 కణాలు తమతమ స్థానంలో నిక్షిప్తమై ఉన్నాయి. వీటన్నింటిని ఒక గొప్ప ప్రాకృతిక గ్రంథంగా వర్ణించవచ్చు. ఈ గ్రంథం దైవం ద్వారా నిర్మించబడింది. గెలిలీయో

4.ఓ అర్జునా! సర్వ విధముల ఆ (హృదయస్థడగు) ఈశ్వరున్నే శరణు పొందుము. -శ్రీకృష్ణుడు (గీత 18:62)

 1. భూమి విూద ఎవనికైనను తండ్రి (దేవుడు) అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోక మందు ఉన్నాడు. -ఏసుక్రీస్తు (యోహోను 4:23,24)

అంతిమ దైవసందేశహరుడు, మానవ మహోపకారి మహాప్రవక్త ముహమ్మద్ (సఅసం) సందేశం కూడా ఇదే.

 1. దేవుడు ఒక్కడే అని గుర్తించడం, ఆయన్నే ఆరాధించడం మానవునిపై దేవునికి ఉన్న హక్కులు. మహాప్రవక్త ముహమ్మద్ (సఅసం

అదే విధంగా ఈ సృష్టి ఆవిర్భావం నుండి నేటి వరకు మొదటి దైవప్రవక్త అయిన ఆదం అలైహిస్సలాం నుండి నూహ్ (నోవాహ), ఇబ్రాహీమ్ (అబ్రహము), ఇస్మాయిల్ (ఇష్మాయేలు), ఇసఖ్ (ఇసాకు), యాఖూబ్ (యాకోబు), మూసా (మోషే), దావూద్ (దావీదు), యహ్యా (యోహోను), ఈసా (ఏసు) (వీరందరిని దైవం కరుణించుగాక) విరేగాక పుడమిపై పాదం మోపిన ప్రతి దైవ ప్రవక్త ఒకే దైవాన్ని ఆరాధించాలని ఆయన్ని ఆరాధించడం వల్లనే ఇహపరలోక సాఫల్యం ఉందని భోధించారు. ఉందని భాధించారు.

ఇంకా… భారతదేశంలో మధ్యయుగంలో ఏర్పడిన భక్తి ఉద్యమంలో, దయానంద సరస్వతి, శంకరాచార్యులు, రాజరామమోహనరాయ్, కబీర్, ఖాజామొయినుద్దీన్ చిష్తి (రహ్మా), వంటి మహనీయులు, ప్రపంచంలోని ధార్మిక గ్రంథాలైన, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, జుబూర్, టొరా, బైబిల్, చిట్టచివరి దైవగ్రంథమైన దివ్యఖుర్ఆన్ మరియు ఎందరో దైవప్రవక్తలు, మహాపురుషులు వీరందరూ బోధించింది ఒక్కటే……

“మానవులందరూ ఒకే దైవాన్ని ఆరాధించాలి….. బహుదైవారాధన చేయరాదు.”

యదార్థం ఇది అయినప్పుడు, ప్రపంచంలోని ధార్మిక గ్రంథాలు, దైవప్రవక్తలు, మహనీయులు, సత్సమాజ నిర్మాణానికి కృషి చేసిన వారందరూ ఒకే దేవుని వైపునకు ఆహ్వానించినప్పుడు, ఓ సోదరులారా! మనం చేస్తున్నది ఏమిటి? ఏ విషయం మనందరిని మోసంలో పడవేసింది. ఒక రోజు మరణం రాక తప్పదు. దేవుని ముందు హజరుకాక తప్పదు. అప్పుడు పశ్చాత్తాపపడి ప్రయోజనం ఉండదని దైవగ్రంథాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? పదండి నడుద్దాం ఒకే దేవుని వైపునకు, సత్యధర్మం వైపునకు.

దైవ ధర్మం ఎల్లప్పుడూ ఒకటే

ప్రపంచంలో ఎన్నో ధర్మాలున్నప్పటికీ ఇస్లాం ధర్మం వైపే ఎందుకు మరలాలి? అని మీరు ఆలోచిస్తున్నారా? అసలు చెప్పదలచిన విషయమేమంటే ప్రస్తుతం ప్రపంచంలో చాలా మతాలవంటి మతం కాదు ఇస్లాం. అది అత్యంత ప్రాచీనమైన ధర్మం, సత్యసంధులు, సచ్ఛీరులయిన దైవభక్తులు ఆచరిస్తూ వచ్చిన ధర్మం ఇది. ఇతర మతాలన్నీ ఈ ఏకైక మతం యొక్క వక్రీకృత రూపాలు. కనుక అన్ని ధర్మాలు ఒక్కటే అని అనుకోవడం కూడ తప్పు. అసలు “ధర్మం” అన్నది నాటికి నేటికీ ఒక్కటే! నిజమైన, వాస్తవమైన ధర్మం కేవలం ఒక్కటే కాణాలదు. ఒక్కటే కూడా. అదే ఇస్లాం. అదే దైవ ధర్మం. అదే దైవ సమ్మతమైన జీవిత విధానం. ప్రతి యుగంలో ఈ ధర్మమే నిజమైనదిగా సత్యమైనదిగా అలరారుతూ వచ్చింది. ఇప్పుడున్న కొన్ని మతాలలో, ధర్మాలలో వాటి గ్రంథాలలో ఒకే దైవభావన మనకు కనబడుతుంది. కాని వాటిని ఆచరించే వారిలో విభిన్న దైవారాధకులుగా మారడానికి కారణం, వాటిని అవలంబించి ఆచరించిన వారు వాటిలో మార్పులు చేర్పులు, హెచ్చుతగ్గులు చేశారు. తాము కోరిన విధంగా తమకునచ్చిన విధంగా, తమ ప్రయోజనాలకు భంగం కలుగని విధంగా వాటిని పూర్తిగా మార్చి అస్తవ్యస్తం చేశారు. కాని ఇస్లాం ఏ రూపంలో అవిర్భవించిందో, అది అవతరించినప్పుడు అది ఎలా ఉండేదో, ఇప్పుడు కూడా అదే రూపంలో విలసిల్లుతుంది. దైవప్రోక్తమైన పవిత్ర ఖుర్ఆన్ ఇప్పుడు కూడ నిజస్వరూపంలో వర్ధిల్లుతుంది. చివరి దైవప్రవక్త ముహమ్మద్ (సఅసం) జీవిత చరిత్ర, ఆయన ఆచరించిన విధానాలు (సున్నత్ కూడ కాలదోషం పట్టకుండా, కించిత్ మార్పుచెందకుండా సురక్షితంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరయినా ఇస్లాం అంటేమిటో తెలుసుకోదలిస్తే, చివరి దైవప్రవక్త (సఅసం) నిజజీవిత చరిత్రను చదివి అర్థం చేసుకోదలచుకుంటే వారు నిరాశ నిస్పృహలకు లోనుకానవసరం లేదు. ఇస్లాం పరిపూర్ణమైన ధర్మం. ఇది ప్రళయ కాలం వచ్చేవరకు చెక్కుచెదరకుండా పదిలంగా ఉంటుంది. అల్లాహ్ తనే దీని సంరక్షణకు వాగ్ధానం చేశాడు.

ఇస్లాం చెప్పేదేమంటే

ఇస్లాం ధర్మం కొత్త విషయలేవీ చెప్పకుండ, ఆది కాలం నుండి దైవప్రవక్తలు, దైవగ్రంథాలు, మహాపురుషులు బోధిస్తున్న విషయాలనే, మనిషి మరచిపోయిన పాఠాలనే అతని స్మృతిలోకి తీసుకొని వచ్చింది. యావత్ విశ్వానికి సర్వసృష్టికర్త అయిన దైవం (అల్లాహ్) ఒక్కడే. ఆయనే మనందరి పాలకుడు, పోషకుడు, స్వామి, విశ్వవిధాత. కాబట్టి ఆరాధనకు, ఉపాసనలకు, విధేయతలకు ఏకైక అర్హుడు ఆయన మాత్రమే. మానవులందరూ ఆయన్నే ఆరాధించాలి. (అసలు ఇస్లాం అనే అరబ్బీ పదానికి అర్థం దైవ విధేయత).

దైవానికి తన భక్తులంటే అపరిమితమైన ప్రేమ, అనురాగమును, కనుకనే మానవులకు తాము మరచిపోయిన ధర్మ పాఠాలను మళ్ళీ జ్ఞాపకం చేసే ఏర్పాటు చేశాడు మానవుణ్ణి తన ప్రవక్తగా, సందేశహరునిగా పంపాడు. వారందరూ బోధించింది ఇస్లాం ధర్మమే. ఈ ప్రవక్తలందరూ ప్రచారం చేసిన ధర్మాన్ని దైవధర్మంగా, వీరిని విశ్వసించి, వీరు చూపిన మార్గాన్ని అవలంభించే వారందర్నీ ముస్లిములుగా గుర్తిస్తారు. (ముస్లిం అంటే దైవ విధేయత చూపువాడు).

ప్రవక్తల పరంపరలో మహప్రవక్త ముహమ్మద్ (సఅసం) చివరి వారు, దైవగ్రంథాలలో దివ్యఖుర్ఆన్ అంతిమ దైవగ్రంథము దివ్యఖుర్ఆన్ బోధనలు, ప్రవక్త సాంప్రదాయము సర్వమానవాళి కోసము ఇది ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒకజాతికి పరిమితం కావు. వీటిపైన ఆచరిస్తేనే మానవాళికి ఇహపర లోక సాఫల్యాలు లభిస్తాయి. దైవ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఇహలోకంలో పరాభావం పాలవడమే కాకుండా పరలోకంలో శాశ్వత నరకం అనుభవించవలసి ఉంటుంది.

సత్యధర్మం పట్ల ద్వేషం ఎందుకు?

సైన్సు కనిపెట్టిన విభిన్నరీతుల ద్వారా విద్యుత్తు, టెలివిజన్, టెలిఫోన్, కంప్యూటర్, ఇంటర్నెట్, ఈ-మెయిల్, ఇంకా అనేక రకాల యంత్రాలు, విమానాలు, రైల్వేలు, బస్సులు, కార్లు, వీటన్నింటిని విదేశీయులు కనిపెట్టారని వాటి పట్ల విముఖత చూపము. అదే విధంగా కమ్యూనిజం, సోషలిజం, సెక్యూలరిజం, నేషనలిజం, ప్రజాస్వామ్యం మొదలైన వాటి వ్యవస్థాపకులు స్వదేశీయులు కారు, విదేశీయులని మన జాతి వారు కారు పరజాతి వారని మనం అసహ్యించుకోము. సైన్సుకు సంబంధించిన విభిన్న బోధనల వల్ల మనందరం లాభం పొందుతున్నాము. సామాజిక శాస్త్రం, జీవశాస్త్రం, గణితం, కంప్యూటర్ పరిజ్ఞానం, సంస్కృతి నాగరికతలు ఇతరుల కృషికి ఫలితాలని చెప్పి మనం అసహ్యించుకోము. అయితే సత్యధర్మమైన ఇస్లాంను విదేశీ ధర్మమని మనం ఎందుకు ద్వేషించాలి? ఇస్లాం మనందరిది. దైవప్రవక్తలందరు మరియు మహనీయులు బోధించింది ఇస్లాం ధర్మమే. ఇస్లాం ప్రపంచంలోని ప్రతిజాతిలోనూ వచ్చింది. ప్రపంచాన్ని సృష్టించిన ఏకేశ్వరుడు ప్రతి దేశంలో, ప్రతి జాతిలో తన సందేశాన్ని పంపించాడు. ఆ సందేశాన్ని మహాప్రవక్త ముహమ్మద్ (సఅసం) సర్వలోకానికి బోధించారు. అదే ఈనాటికీ దివ్యఖుర్ఆన్ రూపంలో మరియు దైవసందేశహరులైన ముహమ్మద్ (సఅసం) ఆచరణ (సున్నత్) రూపంలో సురక్షితంగా ఉంది. ఇవి యధావిధంగా ఉన్నదనడానికి చరిత్రే సాక్ష్యం. మనం వీటిని ఎందుకు అధ్యాయనం చేయకూడదు? వీటి ఆసరాగ మన జీవితాలను, పాలనా యంత్రాంగాన్ని ఎందుకు సరిదిద్దుకో కూడదు? మన ప్రభువు యొక్క గొప్ప వరం ద్వారా ప్రయోజనం పొందాలని దివ్యఖుర్ఆన్ మనందరిని ఆహ్వానిస్తుంది.

మానవత్వపు ఔన్నత్యం

ఇస్లామ్ మానవుడ్ని అత్యున్నత స్థాయికి చేర్చింది. భూమి, ఆకాశాల సృష్టితాలన్నింటిలో మానవుడే ఉన్నతుడని ఇస్లాం బోధిస్తుంది. పరమాణువు నుండి పర్వతం వరకు, నీటి బొట్టు నుండి మహాసముద్రం వరకు, భూమిలోని చిన్నకణం నుండి నింగిలోని సూర్యచంద్రుల వరకు, చీమ నుండి ఏనుగు వరకు ఎన్నెన్నో ఉన్నాయో అవి వృక్షాలయినా, జంతువులయినా, జిన్నాతులయినా, దైవదూత లయినా, ఇంకేతర సృష్టితాలయినా అన్నింటికంటే మానవుడే ఉన్నతుడు. ఇస్లాం దృష్టిలో మానవుడు భూమిపై దైవప్రతినిధి అల్లాహ్ తన దివ్యతేజ సృష్టితాలయిన దైవదూతలను సయితం మానవుని ముందు మోకరింపజేశాడు. అందువల్ల మానవుడు అల్లాహ్ ను కాదని మరెవరిముందో మోకరిల్లడం, మరెవరినో ఆరాధిం చడం, ఇంకెవరినో అవసరాలు తీర్చమని, ఆపదలను దూరం చేయమని అర్థించడం, మరెవరినో లాభనష్టాలు చేకూర్చేవారని భావించి ప్రాధేయపడడం, ఇంకెవరినో మేలుకీడులు కలిగించేవారని అనుకోవడం స్వయంగా మానవునికే తలవంపు, కాదంటారా? మనిషి అన్నింటికీ యజమాని, అతడు కేవలం తనను పుట్టించినవానికే దాసుడు.

సమానత్వం-సహజీవనం

ఇస్లామ్ సమానత్వానికి పునాది వేసింది. అది సహజీవనానికి అంకురార్పణ చేసింది. మానవులు ఏ కాలానికి చెందిన వారయినా, ఏ దేశానికి చెందిన వారయినా, ఏ జాతి, ఏ వంశంలో వారికి సంబంధాలున్నప్పటికీ, వారు ఏ వృత్తి చేపట్టినప్పటికీ, ఏ భాష మాట్లాడినప్పటికీ, ఏ రంగు వారయినా పరస్పరం అందరూ సోదరులే, అందరూ ఒకే తల్లిదండ్రుల బిడ్డలు, వారిలో ఏ ఒక్కరూ ఉన్నతుడుగాని, నీచుడుగాని కాదు. జన్మపరంగా గాని, వృత్తిపరంగా గాని, రంగుబేధం వల్లగాని అతడు మంచివాడనో లేక చెడ్డవాడనో తేల్చి చెప్ప లేము. మనుషుల మధ్య ఉచ్చనీచాలు, కుల మత బేధాలు, అంటరాని తనాలన్నీ హాని కరమయినవి. అవమాన కరమయినవి, ఇస్లాం ఈ వ్యత్యాసాలను రూపుమాపాలంటుంది. ఇస్లాం ఈ దౌర్జన్యాలను సహించదు.

దివ్యఖుర్ఆన్ ఇలా పేర్కొంది. “మేము మిమ్మల్ని వర్గాలుగా, తెగలుగా రూపొందించాము. ఎందుకంటే మీరు ఒకరినొకరు గుర్తించగలగాలని, ఈ జాతులు ఈ తెగలు, ఉచ్ఛనీచాలు- మంచితనాలన్నీ, మూర్ఖత్వాల కొరకు కాదు, అవి కేవలం ఒఒకరినొకరు పరిచయం చేసుకోవడానికే ”

ఎవరయితే తనను పుట్టించిన యజమాని పట్ల ఎంతగా కృతజ్ఞుల్పై విధేయులై ఉంటారో వారే గొప్పవారు. మరెవ్వరయితే ఎంతగా అవిధేయు లవుతారో దైవం దృష్టిలో అంతే అల్పులుగా, నీచులుగా పరిగణించబడతారు.

ఇలాంటి సమానత్వం, ఇలాంటి గొప్పతనం, సౌభ్రాతృత్వం, సౌశీల్యంగల అత్యున్నతమయిన స్థానం ఇస్లామ్ ద్వారానే లభిస్తుంది. రండి! దైవప్రవక్త ముహమ్మద్ (సఅసం) జీవిత చరిత్రను అధ్యాయనం చేయండి. సన్మార్గ అన్వేషణకై ఇస్లాము పరిశీలించండి. ఇక ఆపై మీ మేధాసంపత్తి ఎంత తేజోవంత మయ్యింది. మీ హృదయం ఎంతగా ప్రక్షాళనం పొందింది. మీ అంతరాత్మకు ఎంత ప్రశాంతత చేకూరిందో మీకే తెలుస్తుంది. మీరు ఇస్లాం మాత్రమే నిజమైన ధర్మం అని ఒప్పుకుని తీరుతారు.

ఇస్లాం విశ్వజనీన సౌభ్రాతృత్వాన్ని ఇస్తుంది – మానవులందరికి సృష్టికర్త ఒక్కడే అయినప్పుడు ఆయన విభిన్న వర్గాల ప్రజలకు వేరువేరు ఆరాధన పద్ధతులు సూచిస్తాడా? ఎంత మాత్రం కాదు. మానవులందరికి ఏకేశ్వరుడే దైవమైనప్పుడు మానవులందరు సమానులే, సోదరులే. యావత్ ప్రపంచం ఒకే జీవన స్రవంతిగా మారాలంటే అది ఇస్లామీయ సిద్ధాంతాల ద్వారా, దేవుడు ఒక్కడే అని నమ్మడమే కాకుండా వాటిని నిజ జీవితంలో ఆచరించడం ద్వారా, మానవులంతా ఒక్కటే అనే సత్యాన్ని చాటే ఒక వ్యవస్థ ద్వారా మాత్రమే సాధ్యం.

వివిధ జాతులు, వర్గాలు, తెగలు ఒకరిపై మరొకరు కత్తులు నూరడానికి మానవుడు తన తోటి మానవుల పట్ల ద్వేషం పెంచుకోవడానికి కారణమేమిటి? మానవునిలో నైతికత ఎందుకు దిగజారిపోతుంది. మానవ సమాజం కుక్కలు, తోడేళ్ళ మందల్లా ఎందుకు మారిపోయింది. ఇదంతా మనుషులు సృష్టించుకున్న ప్రాశ్చాత్య సంస్కృతి ఫలితమే. కాదంటారా?

దురదృష్టావశాత్తు మన యువత ప్రాశ్చాత్య సంస్కృతి వెంట పరుగెడు ఈ సంస్కృతుల్లో గాని, వారి సిద్ధాంతాలలోగాని, మన సమస్యలకు పరిష్కారం లేదు. ప్రాశ్చాత్య సంస్కృతులు, సిద్ధాంతాలు ఆపదలను సృష్టించే విష వృక్షాలు మాత్రమే. వాటి ఫలితాల వల్ల ప్రపంచ మేధావి వర్గం నిరాశ చెందుతుంది. మనందరి సమస్యలకు అసలు పరిష్కారమయితే కేవలం ధర్మం లోనే ఉంది. నిజధర్మమైన ఇస్లాంలోనే ఉంది. స్వయం కల్పిత, ప్రాంతీయ, భాషాపరమైన, జాతి, వర్గ, వృత్తిపరమయిన వలలలో నుండి బయట పడదలచు కుంటే, విశాలమైన మానవతను స్వీకరించదలచుకుంటే మీరు ఇస్లామ్ను అర్థం చేసుకోవలసి ఉంటుంది.

రండి మనం ప్రాంతీయ, భాషా పరమయిన కులం, మతం, జాతి వర్గం, వృత్తి పరమయిన వలలలో నుండి బయటకు వద్దాం. విశాల హృదయంతో మానవతను స్వీకరిద్దాం. సత్యధర్మమైన ఇస్లామ్ను అధ్యయనం చేసి అర్ధం చేసుకుందాం.

ఇస్లాం మానవులందరిది

– గాలి, నీరు, అగ్ని, వెలుతురు, వేడిమి ఎవరి సొత్తుకాదు. వీటన్నింటినీ పుట్టించినవాడు దైవం. ఆయనే వాటికి యజమాని. ఇవి యావత్ మానవాళి కొరకు సృష్టించబడ్డాయి. అందరూ వాటితో లబ్ది పొందుతారు.

సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, నదీనదాలు, పర్వతాలు, జంతువులు, వృక్షాలు, ఖనిజ సంపదలు ఎవరికీ స్వంతం కాదు. ప్రతి మానవునికీ వాటిపై హక్కు ఉంది.

భూగర్భంలో ఉన్న మేలిమి సంపదలపై ఖనిజ పదార్థాలపై ఏ ఒక్కరి గుత్తాధిపత్యం లేదు. ప్రతి వ్యక్తికీ, ప్రతి జాతికి, వీటిని వినియోగించుకునే హక్కు ఉంది. అదే విధంగా అల్లాహ్ పంపించిన ధర్మం, ఆయన ఇచ్చిన సందేశం, ఆయన నిర్దేశించిన జీవన వ్యవస్థ, పరిపూర్ణ జీవిత విధానం మనందరి కొరకూను. వీటి ద్వారా లాభం పొందే హక్కు ప్రతి మానవునికి ఉంది.

గాలి, నీరు, అగ్ని- వెలుతురు, వేడిమి మా స్వంతం అని ఎవరూ అన లేరు. ఒకవేళ సూర్యుడు, చెంగుడు, నదీనదాలు, పర్వతాలు, జంతువులు, వృక్షాలు, ఖనిజ సంపదలు తమ స్వంతమని ఎవరయినా అన్నట్లయితే అతని ఆధిపత్యాన్ని, అతని వాదనను మీరు అంగీకరిస్తారా? అల్లాహ్ అందరి కోసం వస్తువులన్నింటినీ సృష్టిస్తే మీరు నిస్సహాయులై ఈ దౌర్జన్యాన్ని ఎలా సహించ గలుగుతారు?

సోదరులారా! మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని సహించలేరు. అయితే అల్లాహ్ పంపిన సత్యధర్మాన్ని ఆయన అవతరింపజేసిన మార్గదర్శక గ్రంథం మనందరిది అని మీరు ఎందుకు భావించరు? దానిపై ముస్లిముల ఆధిపత్యాన్ని మీరెందుకు సమ్మతిస్తూన్నారు? ఇస్లాం కేవలం ముస్లిముల ధర్మమని మీరెందుకు భావిస్తున్నారు? అది స్వయంగా మీదే. ఈ ఆస్తిలో మీరు భాగస్తులే. అది ఇతరులదని దాన్ని మీరు వదులుకుంటారా? అలా అయితే మీరేనష్టపోతారు. అల్లాహ్ కేవలం ముస్లిములకే ప్రభువునని దివ్యఖుర్ఆన్ బోధించలేదు. పైగా అది, అందరి పాలకుడు, యజమాని, ప్రభువు, సార్వభౌముడు అల్లాహ్ యేనని పేర్కొంటుంది.

దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం ముస్లిములకే కాక యావత్ మానవాళికి కారుణ్యమూర్తి అనీ, దైవగ్రంథం మరియు దైవప్రవక్త ముహమ్మద్ (సఅసం) సూచించిన మార్గం ప్రపంచ మానవాళి అందరి కోసమని ఖుర్ఆన్ బోధిస్తుంది. అల్లాహ్ అందరికీ ప్రభువనీ, మహాప్రవక్త ముహమ్మద్ (సఅసం) అందరికీ ప్రవక్త అని, దైవబోధ అందరి కొరకని మనం ఎందుకు అనుకోకూడదు? అది పరాయిదని ఎందుకు భావించాలి? ఇస్లామ్ నా సొత్తు అని ఘంటాపధంగా చెప్పే వానితో ఎందుకు అంగీకారానికి రావాలి?

ఇస్లాం సంపూర్ణ జీవన వ్యవస్థ

ఇస్లాం సంపూర్ణ జీవన విధానం కాబట్టి మీరు దీన్ని సంకల్ప శుద్ధితో అధ్యయనం చేయాలి.

అస్థిత్వానికి సంబంధించిన కొన్ని నమ్మకాలు, ఆచారాలు, ఊహా జనితమయిన కథలు, ఆరాధనకు సంబంధించిన రీతులు, సామాజిక నియమా లకు సంబంధించిన విషయాలు అన్ని ధర్మాలలో కానవస్తుంటాయి. ఒక ధర్మంలో ఒక విషయం ఎన్నదగ్గదైతే మరో ధర్మంలో ఇంకో విషయం మెచ్చదగ్గదిగా ఉంటుంది.

అలాకాక ఇస్లాం, విశ్వాసం, ఆరాధనలు, నైతికత, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలకు వ్యక్తిగత సామూహిక జీవితాలకు సంబంధించిన అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి వివరమయిన ఆదేశాలనిస్తుంది.

ఇస్లాం బోధనలు శాస్త్రీయంగానూ, సక్రమంగానూ, సులభంగానూ ఉన్నాయి. ఈ బోధనల్లో పరస్పర వైరుధ్యం కానరాదు. స్త్రీ-పురుషుల హక్కులు, విధులు, వ్యక్తిగత సామూహిక హక్కులు, విధులన్నీంటికి సంబంధించిన ఆదేశాలలో చక్కటి సమతులనం ఉంది. కలిమిలేమిల్లో సుఖదుఃఖాలలో ఒక వ్యక్తి అనుసరించవలసిన విధానాలను చక్కగా వివరించడం జరిగింది.

ప్రతి కోరిక తీరేందుకు పద్దతులు, హద్దులు నిర్ణయింపబడ్డాయి. మనిషిలోని సహజ సిద్ధమయిన సామార్థ్యాలకు పదును పెట్టి వాటిని సమర్ధ వంతంగా సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఇస్లాంలో ఉన్నాయి. అన్ని వర్గాలకు వెలుతురు, మార్గ దర్శకాలు ఇందులో ఉన్నాయి.

సృష్టికర్త అయిన అల్లాహ్ గురించి, సత్య ధర్మమైన ఇస్లాం గురించి తెలుసుకోవడానికి ఈ సృష్టిలో ఎన్నో ఆధారాలున్నాయి. మనకు ఈ విషయంలో సహయపడడానికి దైవ గ్రంధాలు, ప్రవక్తల బోధనలు ఉన్నాయి. పవిత్ర గ్రంథాలను చదవి, మనం- ఏకేశ్వరునికి సంబంధించిన వివరమైన జ్ఞానాన్ని పొందగలం. సత్యధర్మమైన ఇస్లాం అధ్యయనం చేసి మనం, ఆ ఏకైక దైవం వైపునకు మరలగలం. మన ఇహపరలోకాలను సుఖమయం చేసుకోగలం.

ఓ సోదరులారా! రండి! విశాల హృదయంతో ఇస్లామ్ను అధ్యాయనం చేయండి. ఇతర ధర్మాలను, వాటి గ్రంథాలను మహనీయుల బోధనలను ముందుంచుకుని సాపేక్షతా దృష్టితో చూడండి. తమను పుట్టించిన వానితో సన్మార్గం చూపించమని వేడుకుంటూ సత్యాన్వేషణ దృష్టితో అధ్యయనం చేయండి. జ్ఞానం వివేచనల సాక్ష్యం మీరు సత్యాన్ని పొందగలుగుతారు.

 

 • శుభారంభం

 

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.