నరక కూపం 2

నరక కూపం 2 – తల్లిదండ్రి, సోదరి, సోదరులు, భార్యాపిల్లలు, బంధువులు,  స్నేహితులు ….ఇలా మనిషి జీవితంలో బాంధవ్య బంధాలు అనేకం. అందులో కొన్ని తియ్యగా ప్రారంభమయి మధురాతిమధురంగా మారితే,ఇంకొన్ని మధురంగా మొదలయి పరమ చేదుగా పరిణమిస్తాయి. మనలో కొంద రు తమవారిని ఉన్నత స్థితికి తీసుకువచ్చేందుకు, తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించేందుకు, తమ ఆడ సంతానాన్ని గొప్పంటి సంబం ధాలు చూసి పెళ్ళి చేసేందుకు కష్టాలన్నీ తాము అనుభవించి సుఖాలు మాత్రం కుటుంబ సభ్యులు అందేలా అహిర్నిశలు పరిశ్రమిస్తుంటారు. అటువంటి త్యాగధనుల్ని మరచి బ్రతికే కాలం నేటిది. తనయుడి ప్రేమ కై తపించే తల్లిదండ్రులు,అయిన వారు ఉండి కూడా ఆదర కరువైన అనాథలు, భర్త అనురాగం పొందలేని భార్యలు, భార్య ప్రేమ లభించని భర్తలు…ఇలా చెప్పుకుంటూపోతే మానవ సంబంధాలన్నీ సమస్యాత్మకం గానే ఉంటున్నాయి. ఇహంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే, ఎటువంటి సంపద, సంతానం లాభించని రోజున వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”(గూబగుయ్యిమనిపించే) గావుకేక (అంటే ప్రళయం) వచ్చినప్పుడు.. ఆ రోజు మనిషి తన (స్వంత) సోదరుని నుండి పారిపోతాడు.తన తల్లి నుండి, తండ్రి నుండి, తన భార్య నుండి, తన పిల్లల నుండి (పారి పోతాడు). ఆ రోజు ప్రతి ఒక్కరికీ తన సంగతి చూసుకోవటంతోనే సరిపోతుంది”. (అబస: 33-37)

”నరకాగ్ని ఇహలోకాగ్నికంటే 70 రెట్లు అధిక వేడి కలిగి ఉంటుంది”. అంటే ఒకవేళ ప్రపంచ ఉష్ణోగ్రత 2000 డిగ్రీల సెంటి గ్రేట్‌ అయితే నరకాగ్ని వేడి 138 వేల డిగ్రీల సెంటిగ్రేడ్‌గా ఉంటుంది.

 

ఇక కళ్ళ ఎదుట కనబడే కన్నవారినే పట్టించుకొని మనుషులు ఎక్కడో, ఎప్పుడో ఎదురుకాబోయే నరక పరిణామాల గురించి పట్టించుకుంటా రనుకోవడటం అత్యాశే అవుతుంది. ఈ అహంతోనే ఉన్నావా? అసలు ఉన్నావా? అని దైవాన్ని, ఆయన ఉనికినీ గద్దించి అడిగేవాళ్లు కొందర యితే, అసలు దైవం లేడు పొమ్మనేవాళ్ళు మరికొందరు మనకు తారస పడతారు. ఇటువంటి ఏమరుపాటుకు గురై జీవించే వారి మార్గదర్శ కత్వం, మేల్కొల్పడం కోసమే ప్రవక్తలు వచ్చారు. వారు నిజ దైవం ఎవరో విస్పష్ట పర్చడమే కాక, దాసుల హక్కులేమిటో, దేవుని హక్కు లేమిటో విడ మరచి చెప్పడంతోపాటు స్వర్గనరకాలు సత్యమన్న విష యాన్ని నొక్కి వక్కాణించారు. ‘ప్రజలరా! నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఖర్జూరపు ఒక ముక్కను దానం చేసైనా సరే’ అని ఎంతో ప్రేమగా పిలుపు ఇచ్చారు. అయితే చేసిన, చూసిన ఉపకారాల్నే విస్మరించిన మనిషి ఈ యదార్థాన్ని త్రొసి పుచ్చాడు. దైవాన్నీ నమ్మ లేదు, నరకాన్ని స్వర్గాన్నీ విశ్వసించలేదు. అసలు మరణానంతరం జీవితం ఉంటుందన్న విషయాన్నే తిరస్కరించాడు. తను సాధించి ప్రగతి ఫలాలను చూసుకొని మురిపోతూ మిడిసిపాటుకి గురై విర్ర    వీగాడు.  తాను వీధి గుండా నడివెళితే భూమి చీలిపోతుందని, ఆకా శం బ్రద్దలవుతుందని, తాను పర్వతాలంతటి ఎత్తుకు చేరుకుంటాని తన సత్తాను తానే మత్తెక్కి కళ్ళు పైకెక్కి కన్ను మిన్ను కానక ప్రవర్తించాడు.   ఇట్టి స్వభావం గలవారు ఎవరయినా సరే వారు ఆలోచించాల్సింది ఒక్కటే; దైవప్రవక్తలు, ధర్మకర్తలు చెప్పింది వారు అనుకున్నట్టు అసత్య మయితే  ఆపాపం వారికే తగులుతుంది. వారికెలాంటి నష్టంవాటిల్లదు. కానీ…ఒకవేళ వారు చెప్పింది అక్షర సత్యమయితే? ‘చూడండి! మీరు ఇంత కలాం తిరస్కరిస్తూ వచ్చిన నరకాగ్ని ఇదే’ అని నరక దూత వారి తో అన్నప్పుడు, అప్పుడు వారి సమాధానమేమిటి? అప్పుడు వారు ఎక్క డికి పారిపోగలరు? ఎక్కడ తల దాచుకోగలరు? ఏ ఆపద్బాంధవుడిని ఆశ్రయించగలరు?

నరకాగ్ని ఎంత వేడిగా ఉంటుందనే విషయాన్ని దైవప్రవక్త (స) ఇలా వివరించారు: ”నరకాగ్ని ఇహలోకాగ్నికంటే 70 రెట్లు అధిక వేడి కలిగి ఉంటుంది”. అంటే ఒకవేళ ప్రపంచ ఉష్ణోగ్రత 2000 డిగ్రీల సెంటి గ్రేట్‌ అయితే నరకాగ్ని వేడి 138 వేల డిగ్రీల సెంటిగ్రేడ్‌గా ఉంటుంది. ఈ భయంకరమయిన వేడితోనే నరకవాసుల దుస్తులు తయారు చేెయ బడతాయి. ఈ అగ్నితోనే వారి పడకలు కూడా తయారు చేయబడ తాయి. ఈ అగ్నితోనే వారి గొడుగులు, స్తంభాలు కూడా తయారు చేయబడతాయి. ఈ అగ్నితోనే వారి కొరకు గచ్చు పరచబడు తుంది. ఇటువంటి మహా కఠినమయిన శిక్షాస్థలంలో మానవ జీవితం ఎలా కొనసాగుతుంది? తన చేతిలో ఒక చిన్న నిప్పు రవ్వను భరించలేని మానవుడు అంతటి భయంకర నరకాగ్నిని ఎలా భరిస్తాడు? తీర్పు దినాన ఈ నరకాగ్ని జ్వాలల్ని చూసి మానవాగ్రేసరులయిన ప్రవక్తలే భయంతో వణుకుతూ అల్లాహ్‌ాను ‘రబ్బి సల్లిమ్‌ సల్లిమ్‌’ అని ప్రార్థిస్తుంటే సాధారణ వ్యక్తుల పరిస్థితి, అందులోనూ పాపాత్ముల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి.

స్వర్గపు శుభవార్తను పొందిన 10 మంది భాగ్యవంతుల్లో ఒకరయిన హజ్రత్‌ ఉమర్‌ (ర) ఖుర్‌ఆన్‌ పారాయణ సమయంలో నరక ప్రస్తావన ఉన్న వాక్యం పఠించి స్పృహ కోల్పోయారు.”తండ్రిగారూ! రాత్రి పూట ప్రపంచమంతా ప్రశాంతంగా నిద్రపోతున్నది. మరి మీరెందుకు మేల్కొనే ఉన్నారు?” అని హజ్రత్‌ రబీ (ర) గారిని ఆయన కుమార్తె ప్రశ్నించగా – ”అమ్మాయీ! నరకాగ్ని నీ తండ్రిని పడుకోనివ్వటం లేదమ్మా” అని సమాధానమిచ్చారాయన. ”నిజానికి నీ ప్రభువు శిక్ష  ఎంతో భయపడ వలసినటువంటిది”. (దివ్యఖుర్‌ఆన్‌ -17: 57)

అనాథాశ్రమాల పేరుతో ఆస్తుల్ని పెంచుకునేవారలారా! భూకబ్జాల పేరుతో శ్రామికుల నిలువు దోపిడికి పాల్పడేవారలారా! జాతి సంపదను కొల్లగొట్టేవారలారా! వడ్డీ, చక్ర వడ్డీ, బారు వడ్డీలంటూ పేదల నడ్డీ విరగొట్టేవారలారా! మద్య పానానికి, మగువ లోలత్వానికి బానసయి బ్రతికేవారలారా! ఒక్కసారి కాదు, వందసార్లు ఆలోచించండి!

పోతే వారు ఏం భుజిస్తారు? ”వారు తమ ఉదరాలను నరకాగ్నితో నింపుకుంటారు”. ఈ వచనాన్ని వ్యాఖ్యానిస్తూ పండితులు ఏమన్నారంటే నరకవాసుల ఆకలి తీవ్రత ఎలా ఉంటుందంటే – దాని ముందు నరక శిక్షలు కూడా స్వల్పమనిపిస్తాయి. నరకావాసులకు ఆకలేస్తుంది. తమ ఆకలి తీర్చవలసిందిగా వారు అల్లాహ్‌ాను వేడుకుంటారు.  అల్లాహ్‌ా వారికి ఆహారాన్ని అందజేస్తాడు. కానీ ఆ ఆహారం ఎలా ఉంటుందను కుంటున్నారు? ”నిశ్చయంగా జఖ్ఖూమ్‌ (జెముడు) వృక్షం. పాపాత్ములకు ఆహారం అవుతుంది”.  (దుఖాన్‌: 43,44)

ఓ పాషాణ హృదయుడా! కాళనాగులా స్వల్ప లాభం కోసం స్త్రీల తన, మాన, ధనాలను కాజేసిన కుయుక్తుడా! జిత్తులమారి నక్కలా ఎన్నో కాపురాల్లో కలతలు రేపి, ఎన్నో కొంపల్ని కూల్చిన ఓ క్రూరుడా! శాంతి స్థాపన చాటున ఆరాచకాన్ని సృష్టించిన ఓ దానవుడా! ఈ జఖ్ఖూమ్‌ వృక్షం అంటే ఏమిటో నీకు తెలుసా? ఈ వృక్షపు ఒకే ఒక్క బొట్టు గనక ప్రపంచంలో పడితే వారి జీవితంలో రుచి అన్న మాటనే వారు మరచి పోతారు. పరమ చేదుగా ఉంటుంది దాని ఒక్క బొట్టు. చూడు ఆ సర్వేశ్వరుడు ఏమంటున్నాడో! ”అది నూనే గసిలాగా ఉంటుంది. అది కడుపులోకి పోయి  సలసల కాగే నీరు మాదిరిగా ఉడుకుతూ ఉంటుంది”. (దుఖాన్‌: 45, 46)

మనిషి ఈ బాధను భరించలేక కాళ్ళూచేతులు గిలగిల కొట్టుకుంటూ నరకానికి ఓ ప్రక్క చేరుతాడు. తక్షణమే అల్లాహ్‌ా ఆజ్ఞ అవుతుంది: ”వాడ్ని పట్టుకోండి. ఈడ్చుకుమటూ పోయి నరకాగ్ని నడిబొడ్డున పడ వేయండి”. (దుఖాన్‌: 47) తర్వాత ఏమవుతుందు? ”పిదప అతని నెత్తి మీద సలసలకాగే అగ్ని ద్రవపు శిక్షను కుమ్మరిం చండి”. అని ఆదేశింబడుతుంది. (దుఖాన్‌: 48) అప్పుడు అతని పరి స్థితి ఎలా ఉంటుందంటే,  ”మరుగుతున్న నిటిని అవిశ్వాసులపై కుమ్మరించడం జరిగినప్పుడు, ఆ నీరు వారి తలలను రంధ్రం చేసుకుంటూ శరీరంలోపలి భాగాలన్నింటి నీ మాడ్చి మసి చేస్తుంది. ఆ భాగాలన్నీ మల ద్వారం ద్వారా బయల్పడి అతడి కాల్ళపై పడతాయి”. (ముస్నద్‌ అహ్మద్‌)

ఓ మానవుడా! నీకు లభించిన పరిమిత అధికారాన్ని చూసుకొని గొప్పలు పోయేవాడివి కదా! సభల్లో సమావేశాల్లో సన్మానాలు పొందే వాడివి కదా! నీ ఉక్కు పాదాల క్రింద నలిగిపోయిన నిరాధార జీవులు ఎన్నో..ఎన్నెన్నో..! అహింస…అహింస…అంటూనే నువ్వు చేసిన హింస లను… సత్యప్రియులను, శాంతికాముకులను నీవు పెట్టిన చిత్రహిం సలు చూడలేక, చూసి తాళలేక ఆకాశం విలపించింది, భూమి ప్రకం పించింది. విశ్వాసులు మంటల్లో పడి కాలిపోయతుంటే నీవు నీ మంది మార్బలమంతా చుట్టూ చేరి వికటాట్టహాసం చేస్తూ వేడుక చూసిన సందర్భం నీకు గుర్తుందా? మరి నీ ప్రభువు ఏమంటున్నాడో: ”(నరక యాతన) రుచి చూడు! నీవు గొప్ప శక్తింతునిలా, మర్యాదస్తునిలా ఉండే వాడివి కదా!” (దుఖాన్‌: 49) నరక తేళ్ళ గురించి ప్రస్తావిస్తూ దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: ”అవి గాడిదల్లా ఉంటాయి. ఒకసారి కాటు వేస్తే అవిశ్వాసి నలభై సంవత్సరాల వరకు దాని మంటను భరిస్తూ ఉంటాడు”. (ముస్నద్‌ అహ్మద్‌)   ”వారి (అవిశ్వాసుల)ని చితకబాదడానికి ఇనుప సుత్తులు కూడా ఉంంటాయి”., (అల్‌హజ్జ్‌: 21)   ప్రస్తుతం మనం చూస్తున్న మానవ దేహ దారుఢ్యంలో నర శిక్ష భరించే శక్తి లేదు. కాబట్టి నరకవాసుల శరీరాలను విపరీతంగా పెంచడం జరుగుతుంది. దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”నరకంలో అవిశ్వాసి యొక్క ఒక పన్ను ఉహుద్‌ పర్వతమంతటి ఉంటుంది”. (ముస్లిం).

”కొందరు అవిశ్వాసుల చర్మం మూడు రోజుల ప్రయాణం అంత వెడల్పు ఉంటుంది”. (ముస్లిం). ”కొందరి చర్మం 63 అడుగుల వెడ ల్పుగా ఉంటుంది”. (తిర్మిజీ). కొందరు అవిశ్వాసుల భుజాలు, తొడలు మహా పర్వతాల్ని తలపిస్తుంటాయి”. (అహ్మద్‌). ”(కర్మల్ని) బట్టి నరక వాసులు కొందరు ఎంత స్థూలకాయులయి పోతారంటే, వారి చెవుల నుండి – మెడ వెనుక భాగానికి మధ్య గల అంతరం ఏడు వందల సంవత్సరాలంత సుదీర్ఘమయి ఉంటుంది. వారి చర్మపు మందం 70  జానెళ్ళు ఉంటుంది. వారి దవడ ఉహుద్‌ పర్వతంమంత ఉంటుంది”.(అహ్మద్‌)

‘వారి కోసం ఎండిన ముండ్ల గడ్డి తప్ప మరొక ఆహారం ఉండదు. అది బలమూనీయదు, ఆకలినీ తీర్చదు”. (గాషియా: 6,7) అది ‘గొంతులో ఇరుక్కుపోతుంది’. అప్పుడు నరకవాసి దాన్ని మింగలేక కక్కలేక చస్తాడు.  ఆఖరికి అలసిసొలసి అల్లాహ్‌ాను నీళ్ళు ఇవ్వమని ప్రాధేయ పడతాడు. నీళ్ళు ఇవ్వబడతాయి. కానీ, ”వారు గనక మంచి నీళ్ళు అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారిని సత్కరించడం జరుగు తుంది. అది వారి ముఖాలను మాడ్చి వేస్తుంది. సలసలకాగే ఆ నీరు పేగులని సయితం కోసి వేస్తుంది. ఎంత జుగుప్సారకమయిన శిక్ష  అది!” ఈ విషయమయి మహా ప్రవక్త (స) ఇలా అన్నారు: ”అల్లాహ్‌ా సాక్షి! నాకు తెలిసిన విషయాలు మీరు తెలుసుకుంటే తక్కువగా నవ్వు తారు, ఎక్కువగా ఏడుస్తారు. పడకలపై మీ భార్యలతో సుఖాలు అను భవించడం మానేస్తారు. ఇంకా అల్లాహ్‌ా శరణు కోరుతూ అడవుల్లోకి, ఎడారుల్లోకి పారిపోతారు”. (ఇబ్ను మాజా)

వివరణగా ముస్నద్‌ అహ్మద్‌లో ఇలా ఉంది: ”ప్రవక్తా! మీరు ఏం చూశారు?” అని సహాబాలు ప్రశ్నించారు. అందుకు దైవప్రవక్త (స) ”నేను స్వర్గనరకాలను చూశాను” అన్నారు. వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”నరకం నుండి కాపాడబడాలను కున్న వ్యక్తి ప్రశాంతంగా నిద్ర పోడంగానీ. స్వర్గంలో ప్రవేశించాలనుకునే వ్యక్తి సుఖంగా నిద్రపోవ డంగానీ నేను చూడలేదు” అన్నారు ప్రవక్త మహనీయులు (స).

నరకవాసులు మరణాన్ని కోరుకుంటారు. కానీ, ప్రళయ దినాన మరణాన్ని సయితం అంతమొందించడం జరుగుతుంది. ”వారి దేహ చర్మం కాలి కరిగిపోయినప్పుడల్లా దాని స్థానంలో మేము మరొక చర్మాన్ని సృష్టిస్తాము. వారు శిక్షను బాగా రుచి చూడాలని”.     (అన్నిసా: 56)

ఇక రక్షణ లభించే మార్గం ఏది లేదని గ్రహించిన నరకవాసులు – చివరి ప్రయత్నంగా అల్లాహ్‌ాతో ఇలా విన్నవించుకుంటారు:”ఓ మా ప్రభూ! మా దౌర్బాగ్యం మమ్మల్ని కప్పేసింది. నిజంగానే మేము మార్గం తప్పినవారము. ఓ స్వామీ! ఇక మమ్మల్ని ఇక్కడ్నుంచి బయట కు తీయి. తరువాత మేము అటువంటి పాపాలు చేస్తే దుర్మార్గులవు తాము”. అల్లాహ్‌ా ఇలా సమాధానమిస్తాడు: ”నా ముందు  నుండి వెళ్ళి పోండి. ఇందులోనే పడి ఉండండి. నాతో మాట్లాడకండి”. (మోమినూన్‌: 106-108)

సోదరా! మేలుకో, నిన్ను నువ్వు తెలుసుకో. నీ గమ్యసస్థానంపై దృష్టి నిలుపు. సత్కర్మలు చేస్తానని, దుష్కర్మలకు దూరంగా ఉంటానని ప్రతిజ్ఞ  చెయ్యి. నీ లెక్కల్ని నువ్వు సరి చూసుకో. ఉన్న వెలితిని పూర్తి చేసుకో. అల్లాహ్‌ా ఎంతో ప్రేమగా ఇస్తున్న ఈ పిలుపుని సదా గుర్తుంచుకో!

”విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్‌ాకు భయపడండి. ప్రతి వ్యక్తీ తాను రేపటి కొరకు ఏమి సమకూర్చాడో చూసుకోవాలి. అల్లాహ్‌ాకు భయ పడుతూ ఉండండి. మీరు చేెసే పనులన్నీ అల్లాహ్‌ాకు తెలుసు. అల్లాహ్‌ా ను మరచిపోయిన వారిలా మీరు అయిపోకండి. అల్లాహ్‌ా మరచి పోవడంవల్ల అల్లాహ్‌ా వారిని తమని తాము మరచిపోయేలా చేశాడు”. (హష్ర్‌: 18,19)

‘విశ్వసించిన ప్రజలారా! మీరు మిమ్మల్ని, మీ కుటుంబీకుల్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి”. (తహ్రీమ్‌:6)

Related Post