నేటి బాలలే రేపటి పౌరులునేటి బాలలే రేపటి పౌరులు

మరుసి రోజు పిల్లలందరూ హుషారుగా నవ్వుకుంటూ వచ్చారు. హసన్ క్లాసులోకి ప్రవేశించగానే ఒకర్నొకరు త్రోసుకుంటూ గబగబా వచ్చి అతని చుట్టూ గుమిగూడారు. ‘హజ్రత్‌! చలియే, ఖిస్సా బోలియే’ అంటున్నారు.
‘ముందు హాజరు తీసుకోవాలి. తరువాత కొంత సేపు సంభాషణ. ఆ తర్వాతే కథ’ అన్నాడు హసన్. వారందరినీ చక్కగా వరసతీరి కూర్చోమని చెప్పాడు. అందరూ అలాగే కూర్చున్నారు. హసన్ కూడా కూర్చున్నాడు. హాజరు తీసుకుని కథ మొదలు పెట్టాడు.

హజ్రత్‌ ఇద్రీస్‌ (అ) అతి ఎక్కువగా పరిశోధన చేసేవారు గనక ఆయనకు ‘ఇద్రీస్‌’ అని పేరు పడింది. ప్రపంచమంతటిలో కలంతో వ్రాసిన మొదటి వ్యక్తి ఆయనే. హజ్రత్‌ ఇద్రీస్‌ (అ) గారు లెక్కల విధానాన్ని కనిపెట్టారు. సూర్యచంద్ర నక్షత్రాల గురించి పరిశోధన చేసిన తొలి వ్యక్తీ ఆయనే. ఆ విధంగా ఆయన ధరిత్రిపై తొలి శాస్త్రవేత్త కూడా. హజ్రత్‌ ఇద్రీస్‌ (అ)గారు మొదటి సారి గుడ్డలు కుట్టి ధరించినవారు.

మానవాళికి మార్గదర్శకత్వం వహించ డానికి అల్లాహ్‌ ఒక లక్ష 24 వేల మంది ప్రవక్తల్ని ప్రభవింపజేశాడన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. ఈ ప్రవక్తల పరంపరలోని ఓ ప్రవక్త హజ్రత్‌ ఇద్రీస్‌ (అ). ఈయన ‘నూహ్‌’ అనే ప్రవక్తకి చాలా కాలం ముందు వచ్చారు. హజ్రత్‌ ఇద్రీస్‌ (అ) గారితో నూహ్‌ ప్రవక్తకి రక్త సంబంధం కూడా ఉంది. ఆయన నూహ్‌ ప్రవక్తకి ముత్తాత అవుతారు.

అందరూ చెవులు రిక్కించి వింటున్నారు. కథ సాగి పోతూ ఉంది. హజ్రత్‌ ఇద్రీస్‌ (అ) అతి ఎక్కువగా పరిశోధన చేసేవారు గనక ఆయనకు ‘ఇద్రీస్‌’ అని పేరు పడింది. ప్రపంచమంతటిలో కలంతో వ్రాసిన మొదటి వ్యక్తి ఆయనే. హజ్రత్‌ ఇద్రీస్‌ (అ) గారు లెక్కల విధానాన్ని కనిపెట్టారు. సూర్యచంద్ర నక్షత్రాల గురించి పరిశోధన చేసిన తొలి వ్యక్తీ ఆయనే. ఆ విధంగా ఆయన ధరిత్రిపై తొలి శాస్త్రవేత్త కూడా. హజ్రత్‌ ఇద్రీస్‌ (అ)గారు మొదటి సారి గుడ్డలు కుట్టి ధరించినవారు. అందరూ మంత్రించిన బొమ్మల్లాగా కదలకుండా కూర్చున్నారు.

హజ్రత్‌ ఇద్రీస్‌ (అ) గారు మంచి పనులు చాలా ఎక్కువ చేసేవారు. ఆ కాలం నాటి ప్రజలందరూ కలిసి చేసే సత్కార్యాలకు ఆయనగారి ఒక్కరోజు సత్కార్యాలు సరితూగేవి. అందుకే దైవదూతలు సయితం ఆయన కార్య శైలిని చూసి ఆశ్చర్యపోయారు.
అందరూ మంత్ర ముగ్ధులై వింటున్నారు. మధ్యలో కథ ఆపేసి ‘కథ ఎలా ఉందో చెప్పండి’ అని ప్రశ్నించాడు హసన్.
‘కథ చాలా బాగుంది. మాకు బాగా నచ్చింది’ అన్నారు. ‘కథ వినాటానికి ఆసక్తి కనబరుస్తున్నారు సరే. మరి కథ చదవటం కూడా మీకు ఇష్టమేనా?….’
‘అవును కథలు చదవటం కూడా మాకు ఇష్టమే. కానీ ఇటువంటి మంచి కథలుండే పుస్తకాలు ఎక్కడున్నాయి?’
‘ఇటువంటి కథలుండే పుస్తకాలు తేనెలొలికించే తేట తెలుగులో నేను తెచ్చిస్తే మీరు చదువుతారా?’
‘ఓ. చదువుతాం, చదువుతాం, తప్ప కుండా చదువుతాం’. వారిలో ఒక తెలివైన కుర్రాడు-‘మాకు మేము చదువు కోవడమే కాకుండా మీరు కూడా కథలు చెబుతూ ఉండవలసిందే!’ అన్నాడు. అలాగేనంటూ మళ్ళీ కథ ప్రారంభించాడు హసన్.
హజ్రత్‌ ఇద్రీస్‌ (అ) గారు ‘నబీ మరియు రసూల్‌ కూడాను. అల్లాహ్‌ ఖాబీల్‌ (ఆదం గారి జేష్ఠ పుత్రుడు) సంతానం వైపు ఆయన్ను పంపించాడు. అల్లాహ్‌ను ఆరాధించమని, పుణ్య కార్యాలు చేస్తూ ఉండమని ఆయన వారికి ఉపదేశించారు. వజ్ర సంకల్పం గల ప్రవక్తల్లోని ఓ ప్రవక్త హజ్రత్‌ ఇద్రీస్‌ (అ) గారు. ఈ కారణంగానే అల్లాహ్‌ ఆయన అంతస్తును పెంచాడు. ఉత్తమోత్తమ ప్రవక్తగా ఆయన్ను పేర్కొన్నాడు. మన ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (స) మేరాజ్‌ (గగన యాత్ర) సమయాన నాల్గవ ఆకాశంలో ఆయన్ను కలుసుకున్నారు.
సమయం అయ్యింది… అందరూ హసన్ చుట్టూ నిల బడ్డారు. కొందరు అతని వైపు ప్రేమతో చూస్తున్నారు. కొందరు అతని చేతిని తాకుతూ ఆనందంతో పొంగి పోతున్నారు. ‘సరే. ఇక ఇళ్ళకు వెళ్ళండి’ అన్నాడు హసన్. పిల్లలందరూ ఇళ్ళకు వెళ్ళిపోయారు.

Related Post