నేటి బాలలే రేపటి పౌరులు 2వ భాగం

”మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి” అన్న అల్లాహ్‌ ఆదేశంతో ఓ నిర్ణీత కాలం వరకు భూలోకంలో జీవించడానికి హజ్రత్‌ ఆదం మరియు హవ్వా దివి నుండి భువికి దిగి వచ్చారు, వారితో పాటు మనిషికి పరమ శత్రువైన షైతాన్‌ కూడా వచ్చాడు. ఎందుకంటే? అల్లాహ్‌ అతనికి ప్రళయం వరకు గడువు ఇచ్చాడు గనక.

తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి; వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టదా? గిట్టదా?

తర్వాత హజ్రత్‌ ఆదం (ఆ) తన ప్రభువు నుండి కొన్ని మాటలు గ్రహించి ”ప్రభూ! మేము ఆత్మ వంచనకు పాల్పడి మాకు మేమే అన్యాయం చేసుకున్నాము. ఇక నీవే మాకు దిక్కు. నీవు మమ్మల్ని కనికరించి క్షమించక పోతే మేము సర్వ నాశనమై పోతాము” అని పశ్చాత్తాపంతో క్షమాపణ వేడుకున్నారు. దాన్ని అల్లాహ్‌ స్వీకరించాడు. ఎందుకంటే, అల్లాహ్‌కు పశ్చాత్తాపం చెంది మరలేవారంటే ఎంతో ఇష్టం గనక.

పిల్లలూ! మధ్యలో కొంచెం పిచ్చాపాటి మ్లాడుకుందాం. ఆ తర్వాత క్లాసు ముగిసేంతవరకు కథ చెబుతాను అన్నాడు హసన్. అందుకు ఓ కుర్రాడు అన్నాడు… ”మధ్యలో మాటలెందుకండీ…త్వరగా కథ చెప్పండి…కథ సాంతం అయిపోవాలి”. అయితే వినండి! ఇబ్లీసు మనిషికి పరమ శత్రువనీ, అతన్ని ఎన్నిటికీ అను సరించవద్దనీ, అతని మాయ మాటలకు లొంగి జీవించ వద్దనీ, తేనె పూసిన కత్తిలాంటి అతని సానుభూతికి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని అల్లాహ్‌ హజ్రత్‌ ఆదం (స)కు హితోపదేశం చేశాడు. అలాగే జన బాహుళ్యం దారి తప్పిన ప్రతిసారీ తాను ప్రవక్తలను, సంఘసంస్కర్తలను ప్రభవింపజేస్తాను అని వారికి విధేయత చూపి నడుచుకునేవాడి జీవితం ఆనందమయం, శాంతిమయం అవుతుందని కూడా అల్లాహ్‌ తెలియజేశాడు. మరి ఎవరైతే ప్రవక్తల్ని వ్యతిరేకిస్తారో వారి జీవితాలు ఆటుపోట్లకు గురవుతూ ఉంటాయని, వారికి భద్రత కరువౌతుందని, ప్రళయ దినాన వారు నరకంలో నెట్టి వేయబడతారని కూడా హెచ్చరించాడు.

అల్లాహ్‌ హజ్రత్‌ ఆదం (స)ను ధరిత్రిపై తన తొలి ప్రతినిధిగా చేయటమే కాక, ప్రవక్త పదవిని ప్రసాదించి ఆయనకు ఎంతో మేలు చేశాడు. హజ్రత్‌ హవ్వా (స) గారికి అనేక మంది పిల్లలు పుట్టారు. హజ్రత్‌ ఆదం (స) తన సంతానానికి జీవితాంతం అల్ల్లాహ్‌కు విధేయత చూపుతూ ఉండమని, షైతాన్‌ బాటను అనుసరించవద్దని హితబోధ చేశారు. అయితే వారిలో కొందరు తండ్రి చెప్పినట్లు ప్రవర్తించి తండ్రికి తగ్గ తనయులనిపించుకుంటే… మరికొందరు తండ్రి మాట పెడచెవిన పెట్టి అపమార్గానికి ఒడిగట్టి, ఆదం కడుపున చెడ పుట్టామని అన్పించుకున్నారు.. మీకు వేమన చెప్పిన ఈ పద్యం గుర్తు ఉంటుందనుకుంటాను:

తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి; వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టదా? గిట్టదా?

ఒకడు – ‘కథ అయిపోయిందా…!’ అన్నాడు. కథ అపుడే ఎక్కడ అయి పోతుంది? ఇంకా అనేక మంది గొప్ప ప్రవక్తల గాథలు కూడా ఉన్నాయిగా… విన్పిస్తూనే ఉంటానని… అన్నాడు అలీ. అందరూ- ఓహో ప్రవక్తల కథలా? అయితే భలే మజాగా ఉంటాయి అని కథల పట్ల వారికున్న ఆసక్తిని కనబర్చారు.
హసన్ రిజిష్టరు తీసి పిల్లల పేర్లు వ్రాసుకోవడం ప్రారంభించాడు. అందరూ చకచకా, వచ్చి టకటకా పేర్లు వ్రాయించు కుంటున్నారు. హసన్ హాజరు తీసుకున్నాడు.

‘చూడండీ! ఇక నుంచి నేను రోజూ కథ ప్రారంభించే ముందు హాజరు తీసుకుంటాను. అ తర్వాతనే కథ చెబుతాను సరేనా!?’ అని చెప్పి కథలో ఉన్న గుణ పాఠాన్ని రెండు మూడు మాటల్లో వారికి అర్థమయ్యేటట్లు బోధించాడు.

సమయం అయిపోయింది. అయినా పిల్లలు కదలడం లేదు. కాసేపు కూర్చోండి! ఇంకో కథ చెప్పండి అంటున్నారు. ఈ రోజు ఇంత వరకు చాలు. మళ్ళీ రేపు అని నచ్చజెప్పి వాళ్ళందరికీ రేపు సెలవు కావాలా? కథ కావాలా?…అడిగాడు. ‘మాకు కథ కావాలి. కథే కావాలి!’ అంటూ అందరూ ఇళ్ళకి వెళ్ళి పోయారు.
నిన్నటి అల్లరి శబ్దాలకు బదులు నేటి వాతావరణంలో ‘కథ, కథ’ అనే శబ్దాలు ప్రతిధ్వనించాయి.. హసన్ ఆలోచించాడు …నిన్నటి నష్టం ఈ రోజు పూడ్చుకోగలి గాను. ‘కథ ఒక అద్భుతమైన ఇంద్రజాలం’ అన్న మాట అక్షరాల నిజం.

Related Post