New Muslims APP

పరిమళించాలి అనుబంధ సుగంధాలు

మనిషికి మనిషికి మధ్య ఉండేది బంధం. మనిషికి అద్దానికి మధ్య ఉండేది బింబం. ఈ బంధాల కడలిలో, అనుబంధాల తీరంలో పత్రి అలా ఒక జ్ఞాపకం. అటువంటి ఎన్నో అలల పత్రిబింబమే పత్రి సత్సంబంధం. మనల్ని మనం అద్దంలో చూసుకునే బదులు ”ఒక విశ్వాసి మరొక విశ్వాసికి అద్దంలాంటి వాడు” (బజ్జార్‌) అన్న పవ్రక్త ముహమ్మద్‌ (స) వారి మాటననుసరించి మన బింబాల్ని బంధాలలో చూసుకుంటే, సత్సంబంధాలు పెరిగి, అనుబంధాలు, అనురాగాలు పటిష్టమవుతాయి. ”నన్ను బల పర్చిన వారిని నువ్వు బల పర్చు.” (బుఖారీ) అని బంధం అల్లాహ్‌తో చేసుకున్న విన్నపానికి ఆయనిచ్చి మాట ”నిన్ను కలిపిన వారిని నేనూ కులుపుతాను”. (బుఖారీ)

నేడు మన సమాజ స్థితిని గమనించినట్లయితే, ఏడాదికి ఒక జిల్లాలో జరిగే హత్యలలో సగ భాగం రక్త సంబంధీకులవే అవ్వడం అత్యంత విచారకరం!

మన విషయంలో నిజమవుతుంది. అప్పుడు పత్రి బంధం ఓ అంద మయిన బింబమవుతుంది. అప్పుడు పవ్రక్త (స) వారి శుభవార్త చల్లని దీవెన వలె మనపై కురుస్తుంది: ”ఎవరయితే తన ఆయుష్షులో పెరుగుదలను, సంపాదనలో సమృద్ధిని కోరుకుాంరో వారు బంధుత్వ సంబంధాలను బల పర్చాలి”. (ముస్లిం). కాదు కూడదు అంటే, మన ఆయష్షు తరుగుతుంది, సంపదలో శుభం నశిస్తుంది. అల్లాహ్‌ మన పత్రి కార్యాన్ని భంగం చేస్తాడు. అప్పుడు మన బతుకు చింపిన విస్తరి అవుతుంది. ఇది నిజం! కఠోర సత్యం!!

నేడు మన సమాజ స్థితిని గమనించినట్లయితే, ఏడాదికి ఒక జిల్లాలో జరిగే హత్యలలో సగ భాగం రక్త సంబంధీకులవే అవ్వడం అత్యంత విచారకరం! పేగు పంచుకొని పుట్టిన తల్లిని ఒకడు, వేలు పట్టుకొని నడిపించిన నాన్నను ఒకడు, రక్తం పంచుకు పుట్టిన అన్నను ఒకడు, జీవితాన్ని పంచుకోవడానికొచ్చిన భార్యను ఒకడు కాళ నాగులయి కాటేస్తున్నారు. ఇలా ఎన్నో బంధాలు సంబంధం లేకుండా రక్తసిక్తమవుతున్నాయి. ఆస్తి కోసం రక్త సంబంధీకుల చావును కోరుకుంటున్నారు. కన్న తండ్రి ఆప్యాయతను, కన్నతల్లి మమకారాన్ని హక్కుగా, వారి బాగోగులు గమనించడాన్ని బారంగా భావించే భావి పౌరుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. బంధాన్ని కూడా మనిషి అమ్మ గలిగే, కొనగలిగే వస్తులానే చూస్తున్నాడు. పత్రి ఒక్కరూ వారి కోరికలను తీర్చుకోవడంలో లీనమయి ఉన్నారు. మన దగ్గర కావాల్సిన ధనం ఉంది. కానీ బంధం బీటలు వారుతోంది. అమ్మ, నాన్న, అక్కా, చెల్లి, అన్న, తమ్ముడు, అత్త, మామ, భార్య, పిల్లలు – ఇలా అందరికి దూరమవుతున్నారు. అందరితో ముక్తసరి సంభాషణే, ప్లాస్టక్‌ నవ్వులే. పరిస్థితి ఎలా తయారయిందంటే, మన సంపద్రాయాలు, మన విలువలు, మన పరివారం, మన అనుబంధాల నుండి వేరయి, వేరే లోకంలో వీటి కోసం వెతుకులాడుతున్నాము. కృతిమ్ర యంతాల్రతో, అస్సలు సంబంధం లేని లక్షల మందితో పంచుకోవడం, ఇంి వారికి కనీసం మాట మాతం తెలియక పోవడం, బంధు మితుల్రతోనయితే అస్సలు మాటలు లేకుండా పోవడం సర్వ సాధారణం అయి పోయింది. లాప్‌ ాప్‌, మొబైల్‌, కంప్యూటర్‌, ఐపోడ్‌, ాబ్‌, వైఫై – మొదలయినవి మొత్తం పప్రంచాన్ని దగ్గర చేస్తున్నాయి కానీ, ఒకే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. నేడు మనకు అన్నీ సౌకర్యాలు ఉన్నా నిజమయిన సంతృప్తి, నిజమైన ఆనందం లేదు. కారణం అది బంధాల్లో, సంస్కృతీ సంపద్రాయంలోనే ఉంటుంది గనక.

‘పాలను ఫిజ్ర్‌ ఇస్తుంది, ఆవు కాదు! విలువలు, నీతులు, బందాలు పుస్తకాల్లో కనబడతాయి. నిజ జీవితంలో కాదు! డబ్బు నాన్న పర్సులో కనబడుతుంది, ఆయన శ్రమలో కాదు!’ ఇదీ నేటి తరానికి తెలిసిన పప్రంచం. ‘ఇలా కాదురా’ అని అమ్మ అంటే, అన్నం ప్లేటు ఎత్తేస్తాడు. నాన్న కాసింత కసురుకుంటే పిజ్జా తెప్పించికొని తినేస్తానాండు. ‘మితిమీరిన స్వేచ్ఛ ఎప్పుడూ మిస్‌ యూజ్‌ అవుతూనే ఉంటుంది’ అన్నట్టు నేడు జెట్ స్పీడుతో దూసుకుపోవాలనుకునే యువత అనేక వ్యసనాల వల్ల నిర్వీర్యం అయి పోతున్నది. ‘విశృఖలత్వం విజృంభించినప్పుడు శిధిలాలే మిగులుతాయి మదిలోనయినా, మహిలోనయినా’ అన్నట్టే జరుగుతున్నది. హైచ్‌.ఐ.వీ కేసుల్లో 50 శాతం మంది 18-30 ఏళ్ల లోపు వయసు గలవారే. నెలకు తెలుగు రాష్టాల్రలో 1200 కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీనికి తోడు మాదక దవ్య్రాల సేవనం కూడా జడలు విప్పుతు న్నది. ఒక్క హైదరాబాదులోనే 1000కి పైగా మైనర్లు ఈ మహామ్మారి బారిన పడిన వారున్నారు. ఇలా ఎటు చూసిన పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఇలాంటి తరుణంలో ‘పేమ్ర, శాంతి, పరస్పర సహకారం, గౌరవం వంటి ధనాత్మక విలువలను పెంచి, స్వార్థం, ధ్వేషం, అసూయ, పగ, పత్రీకారం వంటి రుణాత్మక గుణాలను నిర్మూలించి గుడ్‌ పేరెంట్స్ అని మనం అన్పించుకోవాలి. అప్పుడే గుడ్‌ జనరేషన్‌ అన్న పేరు మన పిల్లలకు వస్తుంది.

 

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 1.00 out of 5)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.