New Muslims APP

పవిత్ర మాసం ప్రశ్నోత్తరాలు – 2

ప్రశ్న: ఒకరింటికి ఇఫ్తార్‌ చెయ్యడానికి వెలితే ఏం అనాలి? పవిత్ర మాసం ప్రశ్నోత్తరాలు – 2
జవాబు: ”అఫ్తర ఇన్‌దకుముస్సాయిమూన్‌, వ అకల తఆమకుముల్‌ అబ్రార్‌, వ సల్లత్‌ అలైకుముల్‌ మలాయికహ్‌” అనాలి. (దారమీ)
ప్రశ్న: తరావీహ్‌ నమాజు ఏ ధర్మ ఖలీఫా కాలంలో సామూహికంగా చెయ్యడం ప్రారంభమయింది?
జవాబు: ద్వితీయ ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ (ర) గారి కాలంలో. స్వయంగా ప్రవక్త (స) వెనకాల మూడు రాత్రులు సహాబహ్‌ా సామూహికంగా (తరావీహ్‌) నమాజు చేశారు.

నూతన వస్త్రాలు ధరించి, రుచికరమయిన (సరీద్‌) వంటకాలు ఆరగించిన వారిది కాదు పండుగ. వాస్తవంగా ఈద్‌ ఎవరిదంటే, ఎవరి నిన్ని ఉపవాసాలు స్వీకరించ బడ్డాయో, ఎవరి ఖియామ్‌ స్వీకరింబడిందో, ఎవరి పాపాలు మన్నించ బడ్డాయో, ఎవరి కృషి అయితే అంగీకరిమచ బడిందో వారిదే ఈద్‌.

ప్రశ్న: తరావీహ్‌ నమాజు 11 రకాతులకన్నా ఎక్కువగా చదవచ్చా?
జవాబు: హజ్రత్‌ ఆయిషా (ర) గారి కథనం ప్రకారం 11 రకాతులు చదవడం మంచిది. అయితే ఎక్కువ చదవడంలో ఎలాిం అభ్యంతరం లేదు. ”రాత్ర నమాజు రెండేసి రకాతులు” అని స్వయంగా ప్రవక్త (స) సెలవిచ్చి ఉన్నారు గనక, ఇన్నేసి అని కాకుండా ఎన్ని రకాతులయిన చదువుకోవచ్చు.
ప్రశ్న: రమజాను మాసంలో ఖుర్‌ఆన్‌ పారాయణం చేయాలా?
జవాబు: రమజాను మాసం ఎక్కడయితే రోజాల మాసమో అక్కడే అది ఖుర్‌ఆన్‌ అవతరించిన మాసం కూడా. ఈ మాసం సాంతం దైవ దూతల నయాకులయిన హజ్రత్‌ జిబ్రీల్‌ (అ) దివ్య లోకాల నుండి భూమికి దిగి వచ్చి ప్రవక్త ముహమ్మద్‌ (స) వారితో కలిసి ఖుర్‌ఆన్‌ పారాయణం చేసేవారు. కాబట్టి తరావీహ్‌లో వినడంతో పాటు సొంతంగా కనీసం అంటే ఒక్క సారయినా ఖుర్‌ఆన్‌ను పూర్తి చెయ్యాలి.
ప్రశ్న: రమజాను చివరి దశకం ఎప్పుడు మొదలవుతుంది?
జవాబు: చివరి దశకం 20వ రోజు సూర్యాస్తమయంతో మొదలవు తుంది.
ప్రశ్న: చివరి థలో మరింత అధికంగా ఆరాధనలు చెయ్యాలా?
జవాబు: అవును. విశ్వాసుల మాత హజ్రత్‌ ఆయిషా (ర.అ) గారి కథణం ప్రకారం-”చివరి థకం ప్రారంభమవగానే ప్రవక్త (స) నడుం బింగించేవారు. రాత్ర మేల్కొనేవారు, ఇంటిల్లిపాదిని మేల్కొలిపే వారు”. (బుఖారీ)
ప్రశ్న: కొన్ని ఆధారాల ద్వారా లైలతుల్‌ ఖద్ర్‌ రమజాను 27న ఉంటుం దని తెలుస్తుంది. దీనికి మీరేమాంరు?
జవాబు: ఎక్కువ అవకాశం 27వ తారీఖున ఉంటుంది అనడంలో సందేహం లేదు. కానీ, అదే రాత్రి ఉంటుందని నిశ్చయం కాదు. చివరి థకంలోని బేసి సంక్య గల రాత్రుల్లో అన్వేషించాలి.
ప్రశ్న: ఏతికాఫ్‌ అర్థం ఏమి?
జవాబు: ప్రాపంచిక విషయాలకు దూరంగా అల్లాహ్‌ ఆరాధన నిమిత్తం మస్జిద్‌కి పరిమితం అవ్వడాన్ని ఏతికాఫ్‌ అంటారు. ఇది ఒక రోజు కోసం, ఒక ఘడియ కోసం కూడా ఉండవచ్చు. ప్రవక్త (స) లైలతుల్‌ ఖద్ర్‌ చివరి ధసకంలో ఉందని తెలిసింది మొదలు జీవితాంతం ఏతికాప్‌ పాటించారు. ఆయన తర్వాత ఆ సంప్రదాయాన్ని ఆయన సతీమణులు కొనసాగించారు.
ప్రశ్న: జకాత్‌ అంటే అర్థ ఏమి?
జవాబు భాషా పరంగా జకాత్‌ అంటే, వృద్ధి, పెరుగుదల, సమృద్ధి, శుభం అన్న అర్థాలు వస్తాయి. శాస్త్ర పరం – ఒక ప్రత్యేకమయిన సమయం తర్వాత ఒక ప్రత్యేకమయిన ధనంలోంచి ఒక ప్రత్యేకమయిన భాగాన్ని తీసి ప్రత్యేకమయిన ప్రజలకు అందజేయడం.
ప్రశ్న: జకాత్‌ వల్ల ప్రయీజనం ఏమి?
జవాబు: ఇస్లామీయ ఆరిఓతక విధాన్ని సూచించే విధానం జకాత్‌. దీన్ని పూర్తి చిత్తశుద్ధితో గనక పాటించినట్లయితే ధనం ఒకే వర్గం వద్ద కేంద్రీకృతం అవ్వడం అనేది జరగదు. సమాజంలోని అన్ని వర్గాలకు అది చేరుతుంది. జకాత్‌ సక్రమంగా చెల్లించడం వల్ల ధనికులకు మరియు నిరుపేదలకు మధ్య గల అంతరం, దూరం తగ్గి పోతుంది. అసూయ, ద్వేషం, కుళ్ళు లాంటి వాతావరణం ఉండదు. ఇచ్చే వారిలో గర్వాహంకారాలు దూరమయితే, తీసుకునేవారిలో ఉపకార భావం చోటు చేసుకొని ఒక ఆరోగ్య సమాజానికి దోహదం అవుతుంది.
ప్రశ్న: జకాత్‌ విధి అని తెలిసి కూడా ఇవ్వకపోతే ఏమవుతుంది?
జవాబు: భయంకరమయిన నరక శిక్ష ఉంటుంది.
ప్రశ్న: జకాతు షరతులు ఏమి?
జవాబు: జకాత్‌ ఫర్జ్‌ అవ్వడానికి – 1) అది నిసాబ్‌కు చేరుకోవాలి. 2) (వెండి బంగారాలు, కరెన్సీ అయితే) దానిపై పూర్తి సంవత్సరం గడవాలి. 3) అప్పు ఉంటే అది చెల్లించిన మీదట మిగిలినది నిసాబ్‌కు చేరుతుంటే జకాత్‌ చెల్లించాలి.
ప్రశ్న: జకాత్‌ ఏ ఏ సంపదలో విధి అవుతుంది?
జవాబు: వెండి, బంగారం, పశువులు, పంట వస్తులు, వ్యాపార సామగ్రి మొదలయినవి.
ప్రశ్న: బంగారానికి నిసాబ్‌ ఎంత? వెండికి నిసాబ్‌ ఎంత?
జవాబు: 85 గ్రాముల బంగారం మీద జకాత్‌ ఉంటుంది. 595 గ్రాముల వెండి మీద జకాత్‌ ఉంటుంది. కరెన్సీ ఈ రెంటిని అనుసరించి ఉంటుంది.
ప్రశ్న: వాడుకలో ఉన్న వెండి బంగారాల మీద జకాత్‌ ఉంటుందా?
జవాబు: ఈ విషయంలో భేదాభిప్రాయాలున్నప్పికీ మంచి మాట ఏమిటంటే, జకాత్‌ తీయాలి అన్నదే.
ప్రశ్న: పంట వస్తువుల జకాత్‌ నిసాబ్‌ ఎంత?
జవాబు: పంట 675 నుండి 612 వరకు ఉంటే దానిపై జకాత్‌ ఉంటుంది. ఇది అయిదు ఔసఖ్‌లకు సమానం.
ప్రశ్న: పంట వస్తువులపై కూడా యేడాది పూర్తవ్వాలన్న నిబంధన ఉందా?
జవాబు: లేదు, పంట చేతికి అందనప్పుడు విధి అవుతుంది.
ప్రశ్న: జకాత్‌ సొమ్ముకు అర్హుఉలు ఎవరు?
జవాబు: 1) ఫుఖరా – కడు నిరుపేదలు. 2) మసాకీన్‌ – అవసరం తీని పేదలు. 3) జకాత్‌ వసూలు చేసే వారు. 4) కొత్తగా ఇస్లాం స్వీకరిమచిన వారు. 5) బానిస బంధ ముక్తి కోసం. 6) అప్పు భారం ఉన్న వారు. 7) అన్ని ధార్మిక అవసరాల కోసం. 8) అవసరమయిన బాటసారులు.
ప్రశ్న: అనాథలకు జకాత్‌ సొమ్ము ఇవ్వచ్చా?
జవాబు: అనాథలు, వితంతువు గురించి విచారించాలి. బహుశా వారు సంపన్నులయి ఉండొచ్చు. కానీ పక్షంలో ఇవ్వచ్చు.
ప్రశ్న: జకాతుల్‌ ఫిత్ర్‌ ఆదేశం ఏమి?
ఇది ప్రతి ముస్లింపై తప్పని సరి విధి. బానిస, స్వేచ్ఛాపరుడు, ఆడ, మగ, చిన్న, పెద్ద అందరిపై విధి. 2 1/2 కిలోల ధాన్యం.
ప్రశ్న: జకాతుల్‌ ఫిత్ర్‌ పరమార్థం ఏమి?
జవాబు: ”ఇది ఉపవాసి వల్ల జరిగిన పొరపాట్లను, తప్పులను ప్రకాళిం చేదిగా, మరియు నిరుపేదలకు ఆహారంగా ఉంటుంది” అన్నారు ప్రవక్త (స). ( అబూ దావూద్‌)
ప్రశ్న: జకాతుల్‌ ఫిత్ర్‌ ఈద్‌ నమాజు వరకు కూడా చెల్లించ లేదు. అతనేం చెయ్యాలి?
జవాబు: తర్వాతయినా సరే తప్పకుండా చెల్లించాలి. అయితే అది సాధారణ దానంగా ఉంటుంది.
ప్రశ్న: ఈద్‌ నమాజ్‌ ఆదేశం ఏమి?
జవాబు: ఈ విషయంలో భిన్నభిప్రాయాలున్నాయి. సన్నుత్‌ అని కొందరు, ఫర్జ్‌ కిఫాయా అని కోమదరు, ఫర్జ్‌ ఐన్‌ అని కొందరు అంటారు. ఏది ఏమయినప్పికీ ఈద్‌ నమాజు చాలా ప్రాధాన్యమయినది. ఎందుకంటే పురిటి రకస్రావం, బహిష్టు వచ్చే మహిళలు కుడా ఈద్‌గాహ్‌ాకు వచ్చి (నమాజు చదవకూడదు) అక్కడి ప్రార్థన – దుఆలో పాల్గొనాల్సిందిగా ప్రవక్త (స) ఆదేశించారు.
ప్రశ్న: పండుగ సంబరాలు ఎలా జరుపుకోవాలి?
జవాబు: ముమదు ఈద్‌ నమాజు చదువుకోవాలి. తర్వాత ఈద్‌ శుభాకాంక్షల్ని తెలియజేసుకోవాలి. ఆనక ఇంటిల్లిపాది సంతోషంగా గడపాలి. బంధుమిత్రులు, స్నేహితుల్ని వెళ్ళి కలవాలి. అల్లాహ్‌ ఇష్టం ఉన్నవి చేయాలి, ఇష్టం లేని వాిని విడనాడాలి.
ప్రశ్న: ఈద్‌ నమాజు తప్పి పోతే ఏం చెయ్యలి?
జవాబు: తర్వాత అయినా సరే రెండు రకాతుల నమాజు చదువు కోవాలి.
ప్రశ్న: ఈద్‌ స్పెషల్‌ అని సినిమాలు వేస్తారు. సేమియాలు తిని సాయంత్రం సినిమాకి బయలు దేరతారు. దీని గురించి మీ అభిప్రాయం?
జవాబు: తుమ్ము విత్తనం నాటితే తుమ్మ చెట్టు మొలకెత్తుతుంది తప్ప మామిడి చెట్టు ఎంత మాత్రం కాదు. నెల సాంతం ఎంతో భక్తీప్రపత్తులతో గడిపిన వ్యక్తి ఎలా కొన్ని గంటల్లో మారి పోగలడు. మారి పోయాడు అంటే రమజాను నెలసాంతం అతనిలో కనిపించిన మార్పు తాత్కాలికమే అనాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా హజ్రత్‌ అలీ (ర) సంఘటన ఒకటి వినండి! పండుగ నాడు ఎండు రొట్టె ఆరగిస్తున్న హరజత్‌ అలీ (ర) గారిని చూసిన కొందరు సహచరులు – పండుగ నాడు ఇలాిం ఆహారం ఏమి? అని ఆశ్చర్యపోగా ఆయన ఇలా సమాధానమిచ్చారు: ”చూడండయ్యా! నూతన వస్త్రాలు ధరించి, రుచికరమయిన (సరీద్‌) వంటకాలు ఆరగించిన వారిది కాదు పండుగ. వాస్తవంగా ఈద్‌ ఎవరిదంటే, ఎవరి నిన్ని ఉపవాసాలు స్వీకరించ బడ్డాయో, ఎవరి ఖియామ్‌ స్వీకరింబడిందో, ఎవరి పాపాలు మన్నించ బడ్డాయో, ఎవరి కృషి అయితే అంగీకరిమచ బడిందో వారిదే ఈద్‌. ఆ విదంగా ఈ రోజు ఫండుగే, రేపు కూడా పండుగే, అల్లాహ్‌ అవిధేయతకు పాల్పడని ప్రతి దినం పండగే”. ఆ విధంగా ఒక వ్యక్తి అల్లాహ్‌ అవిధేయతకు పాల్పడితే అతని పండుగ కూడా దండగే.
ప్రశ్న: షవ్వాల్‌ ఉపవాసాల గురించి చెప్పగలరు?
జవాబు: ప్రవక్త (స) ఇలా అన్నారు: ”రమజాను ఉపవాసాల తర్వాత ఎవరయితే షవ్వాల్‌ 6 ఉపవాసాలు ఉంటారో వారు యేడాది మొత్తం ఉపవాసాలున్నట్లుగా భావించ బడుతోంది”. (ముస్లిం)
ప్రశ్న: చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏమి?
జవాబు: అల్లాహ్‌ మన తప్పిదాలను మన్నించి, మంచి తర్వాత మరో మంచికి శ్రీకారం చుట్టే సద్బుద్ధిని అనుగ్రహించు గాక! ఆమీన్‌.

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.