పుణ్య కాలానికి చెందిన పుణ్యాత్ములు సహాబహ్‌

 

సహాబహ్‌ – సంక్లిష్ట స్థితిలో సత్యాన్ని విశ్వసించ సాహసించిన సత్యబాంధవులు సహాబహ్‌. సత్యం కోసం సర్వస్వాన్ని తృణప్రాయంగా త్యాగం చేసిన ధన్య జీవులు సహాబహ్‌. సత్యధర్నాన్ని సమస్త మానవాళి కొరకు చేరవేసేందుకు స్వప్రాంతాలను, స్వీయ కుటుంబాలను వీడిన మన్య జీవులు సహాబహ్‌. సత్యధర్మ కేతనాన్ని సర్వత్రా ఎగుర వేెసేంత వరకు కునుకు తియ్యము అని కంకణం కట్టుకున్న కార్య సాధకులు, కారణ జన్ములు సహాబహ్‌. వారు ముందువారు ముందున్న వారు. ఈ వ్యాస మాధ్యమంగా ఆ మాహాత్ముల గురించి తెలుసుకుందాం!
sahaabah

సత్యధర్మ కేతనాన్ని సర్వత్రా ఎగుర వేెసేంత వరకు కునుకు తియ్యము అని కంకణం కట్టుకున్న కార్య సాధకులు, కారణ జన్ములు సహాబహ్‌. వారు ముందువారు ముందున్న వారు.

సహాబీ అంటే:

భాషా పరంగా – సహాబీ అంటే సహచరుడు, సహవాసి అని అర్థం. శాస్త్ర పరంగా-స్త్రీ అయినా, పురుషుడయినా, పాపయినా, పిల్లాడయినా అల్లాహ్‌ అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స)వారిని విశ్వసించి, ఒకే ఒక్క చూపు అయినా సరే ఆయన్ను దర్శించి, ఇస్లాం ధర్మం మీదే మరణించిన వ్యక్తిని- పురుషుడయితే సహాబీ, స్త్రీ అయితే సహాబియహ్‌ా అంారు.వారి పేరు తర్వాత పురుషుడయితే ‘రజియల్లాహు అన్హు’-అల్లాహ్‌ా ఆయనతో రాజీ అయ్యాడు అని,  స్త్రీ అయితే ‘రజియ ల్లాహు అన్హా ‘- అల్లాహ్‌ా ఆమెతో రాజీ అయ్యాడు అని ప్రస్తావించడం ఆనవాయితి.
 సదరు వ్యక్తి సుదీర్ఘ సమయం కొరకు ప్రవక్త(స) వారి సమావేశంలో పాల్గొన్నా, స్వల్ప సమయం కొరకు పాల్గొన్నా, ఆయన నుండి కథనాలు ఉల్లేఖించినా, ఉల్లేఖించక పోయినా, ఆయనతోపాటు యుద్ధ్దంలో పాల్గొన్నా, పాల్గొ నక పోయినా, ఏదో కారణంగా ఆయన్ను చూడక పోయినా-ఉదాహరణకు – అంధత్వం – ఆ వ్యక్తిని సహాబీగా పరిగణించడం జరుగుతుంది.

గమనిక: 

ఒకవేళ ప్రవక్త (స)ను చూసి విశ్వసించిన తర్వాత ఏదోక కారణంగా ధర్మభ్రష్టుడయి మళ్ళీ కనువిప్పు కలిగి ధర్మం మార్గం మీద నిలకడగా జీవించి మరణించినట్లయితే అలాంటి  వ్యక్తిని సయితం సహాబీగా ఎంచడం జరుగు తుంది. ఉదాహరణకు-తల్హా బిన్‌ ఖువైలద్‌ (ర). (ఇమామ్‌ ఇబ్బు హజర్‌ (ర).
 ”ఒక ఏడాది కోసం లేదా ఒక నెల కోసం లేదా ఒక రోజు కోసం లేదా ఒక ఘడియ కోసమయినా సరే విశ్వాస స్థితిలో ఆయన సాంగత్యం పొంది ఉంటే, ఆయన్ను (స) చూసి ఉంటే  ఆ వ్యక్తిని సహాబీ అనడం జరుగుతుంది. హాఁ, సహచర్యం సుదీర్ఘమయినదా, స్వల్పమయినదా అన్న దాన్ని బట్టి  శుభం, శ్రేష్ఠత ఉంటుంది” అన్నారు ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌ (ర).

సహాబహ్‌ ఘనత:  

సహాబీ బహు వచనం సహాబహ్‌ా, సహాబియహ్‌ా బహు వచనం సహాబియాత్‌. రజియల్లాహు అన్హు బహు వచనం ‘రజియల్లాహు అన్హుమ్‌. రజియల్లాహు అన్హా బహువచనం రజియల్లాహు అన్హుహున్న. సహా బహ్‌ాకు మనం ఇచ్చే కనీస మర్యాద వారి నామాంతరం ఈ దీవెన పలుకుల్ని ప్రస్తావించడం. ఎందుకంటే ప్రవక్త (స) వారి  సముదాయంలో ఉత్తమ గణం సహాబహ్‌ా. అల్లాహ్‌ాను మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిని విశ్వసించడంలో ఆద్యులు సహాబహ్‌ా. ధర్మమార్గంలో మొక్కవోని సాహసం కనబర్చిన సహనమూర్తులు సహాబహ్‌. ప్రవక్త (స) వారి పవిత్ర ప్రత్యక్ష  సాంగత్యాన్ని పొందిన సౌభాగ్యవంతులు సహాబహ్‌.
ప్రవక్త (స) వారి ఆదేశం మేరకు హిజ్రత్‌ చేసిన శ్రేష్ఠ జనం సహాబహ్‌. ఆపద సమయంలో ఆయన్ను ఆశ్రయమిచ్చిన ఉత్కృష్ట దళం సహాబహ్‌. అల్లాహ్‌ స్వయంగా ముహాజిర్లు, అన్సార్లు అని  కొనియాడిన సత్య సేనా నులు సహాబహ్‌. అవసరం వచ్చినప్పుడు ప్రాణ త్యాగానికి వెనుకాడని వెన్నుముక వ్యక్తిత్వం గల సైన్యం సహాబహ్‌ా. నాయకులు, అధినాయకులు, ఖలీపాలు సహాబహ్‌. ధర్మాన్ని తొలూత పాటించిన పుణ్యాత్ములు సహాబహ్‌. ‘తన సంప్రదాయాన్ని, తన సహాబహ్‌ సంప్రదాయాన్ని గ్టిగా పట్టుకోండి’ అన్న కితాబు కారుణ్యమూర్తి (స) ద్వారా పొందిన కరదీపికలు సహాబహ్‌ా.  వారి తర్వాత వచ్చినవారు ఎవరయినా, ఎంతి వారలయినా, ఎన్ని పుణ్య కార్యాలు చేసిన వారలయినా వారి స్థాయికి చేరుకోవడం కష్ట సాధ్యం కాదు అసంభవం.
 ప్రవక్త (స) ఇలా అన్నారు: ”ప్రజలందరిలోకెల్లా ఉత్తములు నా తరానికి చెందినవారు. పిదప వారి తర్వాత వచ్చేవారు, ఆనక వారి తర్వాత వచ్చే వారు”. (బుఖారీ)
 వేరోక సందర్భంలో-”మీలోని ఒక వ్యక్తి ఉహద్‌ పర్వతం అంతి బంగా రాన్ని దానం చేసినా నా సహాబహ్‌లోని ఒక వ్యక్తి చేసిన గుప్పెడు ధాన్యానికి కూడా అది సరి తూగదు. దాని సగానికి కూడా సరిపోదు”.  (ముస్లిం)
 అలాగే ప్రవక్త (స) తన తర్వాతి మూడు తరాలకు జమానతు ఇచ్చారు: ”ప్రజల్లోని ఓ సముహం యుద్ధం చేెస్తుంది. అప్పుడు వారు – ‘మీలో ప్రవక్త (స) వారిని చూసిన వారున్నారా?’ అని అడుగుతారు. ”ఉన్నారు” అన్న సమాధానం ఇవ్వబడుతుంది. వారిని విజయం వరిస్తుంది.ఆ తర్వాత కొంత కాలానికి ప్రజల ఓ సమూహం యుద్ధం చేెస్తుంది. అప్పుడు వారు- ‘మీలో ప్రవక్త (స) వారిని సహరులను చూసిన వారున్నారా?’ అని అడు గుతారు. ”ఉన్నారు” అన్న సమాధానం ఇవ్వబడుతుంది. వారిని విజయం ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత మరి కొంత కాలానికి ప్రజల ఓ సమూహం యుద్ధం చేెస్తుంది.  అప్పుడు వారు – ‘మీలో ప్రవక్త (స) వారి సహాబహ్‌ సహచర్యానికి నోచుకున్న వారిని చూసిన వారున్నారా?’ అని అడుగుతారు. ”ఉన్నారు” అన్న సమాధానం ఇవ్వబడుతుంది. వారిని విజయం దక్కు తుంది”. అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)

భువన నక్షత్రాలు సహాబహ్‌: 

 ”నక్షత్రాలు ఆకాశానికి రక్ష. అవి రాలి పడ్డాయంటే ఆకాశంలో సంభవించా ల్సింది సంభవించి తీరుతుంది. నేను నా సహాబహ్‌కు రక్ష. నేను గనక ఈ ప్రపంచ వేదిక నుండి నిష్క్రమిస్తే నా సహాబహ్‌ాకు చెయ్యబడిన వాగ్దానం నెర వేరుతుంది. నా సహాబహ్‌ నా సముదాయానికి రక్ష. వారు గనక నిష్క్రమిస్తే వారికి వాగ్దానం చెయ్యబడిన విషయాలు సంభవించి తీరతాయి”. అన్నారు మహనీయ ముహమ్మద్‌ (స).  ( ముస్లిం)

సహాబహ్‌ యెడల ప్రేమ విశ్వాసానికి ప్రమాణం: 

అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ (ర) ఇలా అభిప్రాయ పడ్డారు: ”నిశ్చయంగా అల్లాహ్‌ ముహమ్మద్‌ (స) వారి హృదయాన్ని చూశాడు. దాసులందరి హృదయాలలోకెల్లా ఆయన హృదయం మేలిమి స్థితిలో ఉండటం గమనించాడు. ఆయన్ను తన దౌత్య కార్యం కోసం ఎన్నుకున్నాడు.పవక్త (స) వారి హృదయం తర్వాత ప్రజలందరి హృదయాలను వీక్షించాడు. వాటిలో ప్రవక్త (స) వారి సహచరుల హృదయాలు మేలిమి స్థితిలో ఉండటం గమనించాడు. వారిని ప్రవక్త (స) వారి సహచర్యం కోసం ఎన్నుకున్నాడు. కాబట్టి  విశ్వాసులు ఒక విషయాన్ని మంచిగా భావిస్తే అది అల్లాహ్‌ దగ్గర కూడా మంచిదయి ఉంటుంది. మరియు వారు దేన్నయితే చెడ్డదిగా పరిగణిస్తారో అల్లాహ్‌ దగ్గర సయితం అది చెడ్డదిగానే ఉంటుంది”.  (ముస్నద్‌ అహ్మద్‌) ఇక్కడ విశ్వాసులు అంటే సహాబహ్‌ అని పండితులు అభి ప్రాయ పడ్డారు.
 ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”వారి తర్వాత వచ్చినవారు ఇలా వేడుకుాంరు: ”మా ప్రభూ! మమ్మల్ని క్షమించు.మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరు లను కుడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి  ద్వేష భావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగిన వాడవు, కనికరించేవాడవు”. (అల్‌ హష్ర్‌: 10)
 పై ఆయతు దృష్ట్యా ఇమామ్‌ మాలిక్‌ (ర) ఇలా అభిప్రాయ పడ్డారు: ”దైవ ప్రవక్త ప్రియ శిష్యులను తూలనాడే రాఫిజీలకు ‘ఫై’ సొమ్ములో నుంచి వారికి  ఇవ్వ బడదు. ఎందుకంటే (‘ఫై’ సొమ్ము నేపథ్యంలో) అల్లాహ్‌, ప్రవక్త ప్రియ సహచరులను కొనియాడగా వీరు వారిని తూలనాడుతున్నారు” అన్నారు. అంటే ప్రవక్త (స) వారి ప్రియ శిష్యుల యెడల ఆంతర్యంలో వైర భావం లేశ మయినా కలిగి ఉంటే అతను షైతాన్‌ విసిరిన విష విలయానికి గురయినట్లే.
 విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా (ర.అ) ఇలా అన్నారు: ”దైవ ప్రవక్త (స) వారి ప్రియ సహచరుల కోసం ప్రార్థించమని మీకు ఆజ్ఞాపించ బడింది. కాని మీరేమో ఆ మహనీయులను తూలనాడుతున్నారు. ”ఈ సముదాయంలోని తర్వాతి వారు సజ్జనులయిన తమ ముందు తరాల వారిపై శాపనార్థాలు పెట్టనంత వరకూ ఈ ఉమ్మత్‌ రూపుమాప బడదు” అని మీ ప్రవక్త (స) చెప్పగా నేను విన్నాను’. (ఇబ్ను కసీర్‌)
ఈ నేపథ్యంలో ప్రవక్త (స) చేసిన హెచ్చరిక గమనార్హం; ”నా సహచరులను దూషించిన వానిపై అల్లాహ్‌ అభిశాపం, దైవదూతల అభిశాపం మరియు ప్రలందరి అభిశాపం పడుగాక!” (తబ్రానీ)

ప్రముఖుల దృష్టిలో సహాబహ్‌: 

 ”సహాబహ్‌ అందరూ న్యాయవంతులే. వారు అల్లాహ్‌ ప్రియతమ దాసులు, ఆయనచే ఎన్నుకోబడిన వారు. దైవప్రవక్తల తర్వాత సృష్టి మొత్తంలో శ్రేష్టులు. ఇదే అహ్లుస్సున్నహ్‌ వల్‌ జమాఅహ్‌ విశ్వాసం. దీని పైనే ముస్లిం సముదా యం మరియు ముస్లిం పండితులు  ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు” అన్నారు ఇమామ్‌ ఖుర్తుబీ (రహ్మ).
 అబుల్‌ హసన్‌ అల్‌ అష్‌అరీ (రహ్మ) ఇలా అన్నారు: ”ఖుర్‌ఆన్‌లో పలు చోట్ల ముహాజిర్లను, అన్సార్లను అల్లాహ్‌ కొనియాడాడు. వారు ఇస్లాం స్వీకరించ డంలో,  త్యాగాలు చెయ్యడంలో ముందు వారు ముందే ఉంారు అన్నాడు. బైఅత్‌ రిజ్వాన్‌లో పాల్గొన్న వారిని ప్రశంసించాడు:
”నిశ్చయంగా అల్లాహ్‌ చెట్టు క్రింద నీతో ప్రమాణం చేస్తున్నప్పుడు విశ్వాసుల యెడల ప్రసన్నుడ య్యాడు”. (అల్‌ ఫత్హ్‌: 18)  (అల్‌ ఇబానహ్‌ అన్‌ ఉసూ లిద్దియానహ్‌)
 అబూ జర్‌అహ్‌ (రహ్మ) ఇలా అన్నారు: ”దైవ ప్రవక్త (స) వారి ప్రియ సహచ రుల్ని తూలనాడుతూ, దూషిస్తూ గనక నువ్వెరినయినా చూస్తే వారు ధర్మ భ్రష్టులని తెలుసుకో! ఎందుకంటే ముహమ్మద్‌ (స) మన వద్ద సత్య ప్రవక్త, ఖుర్‌ఆన్‌ మన వద్ద సత్య గ్రంథం. ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని, ప్రవక్త (స) వారి సంప్రదాయల్ని మన వరకూ చేరవేసిన పుణ్య జనులు సహాబహ్‌. ఇలాంటి  విపరీత బుద్ధీకి ధర్మ భ్రష్టులు ఎందుకు పాల్పడుతున్నారంటే, మన నుండి మన సాక్ష్య ప్రమాణాలను తారుమారు చేసి ఖుర్‌ఆన్‌ మరియు హదీసులో జోక్యం చేసుకుని, వాటిని తప్పు పట్టడానికే. వీరు ముమ్మాటికీ ధర్మభ్రష్టులే. వీరికి ఇస్లాంతో ఎలాంటి సంబంధం లేదు”. (అల్‌ కిఫాయహ్‌ లిల్‌ ఖతీభ్‌)
 అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (ర) ఇలా అన్నారు: ”ముహమ్మద్‌ (స) వారి సహచరుల్ని తూలనడకండి. వారి స్థానం ఎలాిందంటే మీలోని ఒక వ్యక్తి 40 సంవత్సరాలు ఆరాధన చేెసినా వారు అల్లాహ్‌ మార్గంలో గడిపిన ఒక్క ఘడి యకు సరితూగదు”.
 హసన్‌ బస్రీ (రహ్మ) ఇలా అన్నారు: ”ముహమ్మద్‌ (స) వారి ప్రియ సహచ రులు మేలిమి గుణాలు గలవారు. సత్కర్మలు చేశారు. పరిశుద్ధమయిన ఆహారం భుజించారు.మిగిలిన దాన్ని పంచారు. ప్రాపంచిక వ్యామోహ పరులతో వారు పోటీ  పడలేదు. ప్రాపంచిక పాడు విషయాల జోలికి వారు వెళ్ళ లేదు. ప్రపంచం నుంచి వారు స్వచ్ఛమయిన వాటినే తీసుకున్నారు.  పనికి మాలిన వాిని వదిలేశారు. వారు ఎన్ని మంచి కార్యాలు చేెసినా ఎన్నడూ బీరాలు పోలేదు. వారు చిన్న పాటి  తప్పును కూడా మామూలుగా భావించ లేదు. వారిని ప్రేమించే వారిని మేము ప్రేమిస్తాము. వారిని ద్వేషించే వారిని మేము కూడా ద్వేషిస్తాము. వారి ప్రేమ మా ధర్మం, విశ్వాసం,  అదే మా జీవన సంవిధానం”.

గమనిక:

సహాబహ్‌ స్థాయి, ప్రవక్త (స) వారి సతీమణుల స్థాయి తెలియని చాలా మంది బురద బుద్ధి ప్రబుద్దులు వారిని తూలనాడే వారితో స్నేహం చేయడం మనం గమనిస్తాము. ఇది ముమ్మాటికీ ఒక  ముస్లింకు శోభించని విషయం. ముస్లిం వేష ధారణ కలిగిన ఈ కుత్సిత బుద్ధులు అనేక నామాల తో పిలువ బడతారు. కాబట్టి  వారి విషయంలో కడు అప్రమత్తంగా ఉండా ల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది. ఇక్కడ ఉదార ధోరణి ఏ మాత్రం పనికి రాదు. నిన్న మొన్ని అలగా జనాలు, పుట్ట గొడుగు వ్యక్తిత్వం, చెదలు పట్టిన ఆలోచన కలిగిన కలహాకారులు అలనాి ఉత్తముల్ని దూషించ దుస్సాహసం చేయడం గర్హనీయం!
సహాబహ్‌ స్థాయిని గురించి స్వయంగా అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌లో ఇలా తెలియజేస్తున్నాడు: ”మీలో (మక్కా) విజయానికి పూర్వం దైవమార్గంలో ఖర్చు చేసినవారు మరియు పోరాడిన వారు ఇతరులు సమానులు కాజాలరు. వారు (మక్కా) విజయానంతరం ఖర్చు చేసిన, పోరాడిన వారికంటే మహోన్నత స్థాయి గలవారు”. (అల్‌ హదీద్‌: 10)

Related Post