New Muslims APP

ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి ప్రత్యేకతలు

ఆయనొక యోధుడు, ధర్మ బోధకుడు. ఆయనొక శాంతి పుంజం, చైతన్య దీపం, మండే సూర్యం, చల్లని చంద్రం. ఆయనొక ధర్మ తేజం, క్రాంతి రూపం. ఆయనొక నిర్మి జ్యోతి, వినిర్మి ఆత్మ ` ఆయనే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స).

ప్రజల్లో అగ్రగణ్యు ప్రవక్తలు, ప్రవక్తల్లో అగ్రజులు  ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (స). నిజ దైవ భక్తుల్లో సుభక్తులు  ప్రవక్తలు, సుభక్తుల్లో అగ్రేసరులు  ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (స). నేల మీద నడిచిన ఆదర్శాల్లో ఉత్తమ ఆదర్శం ప్రవక్తది. ఉత్తమ ఆదర్శాల్లో అగ్ర పీఠం ప్రియ ప్రవక్త (స) వారి ఆదర్శానిదే. ఉత్తమ నీతికి నెవు, అత్యున్నత నైతికతకు ప్రమాణం ఆయన జీవితం. ‘‘(ఓ ప్రవక్తా!) నువ్వు ఉన్నత  నైతిక శిఖరాగ్ర భాగాన్ని అధిరోహించి ఉన్నావు’’. (ఖమ్‌: 4) నిత్య నూతనం అయిన ఆయన జీవితం సమస్త మానవాళికి అంతిమ ఆదర్శం. ఖుర్‌ఆన్‌ ఇలా అంటోంది: ‘‘మీ కోసం అల్లాహ్  ప్రవక్తలో అత్యుత్తమ, అత్యున్నత ఆదర్శం ఉంది’’. (అహ్జాబ్; 22) అలాంటి సాత్వికుడు, సత్య ప్రవక్త సంపూర్ణుడు, జగద్గురువు విశిష్ఠ స్థానాన్ని తెలియజేసే చిరు ప్రయత్నమే ఈ వ్యాసం. ప్రవక్తల మధ్య ఆయనకున్న గౌరవాదరణల  రీత్యా అల్లాప్‌ ఆయన్ను ఆనేక ప్రత్యేకతలను కల్పించాడు. వివరాల్లోకి వెళితే  –

ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి ప్రత్యేకతలు

ఆయనొక యోధుడు, ధర్మ బోధకుడు. ఆయనొక శాంతి పుంజం, చైతన్య దీపం, మండే సూర్యం, చల్లని చంద్రం. ఆయనొక ధర్మ తేజం, క్రాంతి రూపం. ఆయనొక నిర్మి జ్యోతి, వినిర్మి ఆత్మ ` ఆయనే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స).

మొదటి ప్రత్యేకత: అల్లాప్‌ ఆయన్ను ‘యా ఆయ్యుహన్నబియ్యు!’’ (అన్ఫాల్‌:64) ` ఓ ప్రవక్తా! అన్న గుణవాచకంతో ఖుర్‌ఆన్‌లో పదమూడు స్థానాలో ప్రస్తావించాడు. ‘‘యా అయ్యుహర్రసూు!’’ (మాయిదః – 4?) ఓ సందేహరుడా! అన్న గుణవాచకంతో రెండు చోట్ల ప్రస్తావించాడు. ఆలా ప్రస్తావించిన ప్రతి సారి ఆయన స్థాయి, గౌరవాన్ని సంపూర్ణ పద్ధతిలో ప్రస్తావించడం కొసమెరుపు. అలా అల్లాహ్  ఖుర్‌ఆన్‌లో మరే పవక్త గురించి ప్రస్తావించ లేదు. అల్లాహ్  ఖుర్‌ఆన్‌లో ఏ ప్రవక్తను సంబోధించినా ` ‘ఓ ఆదమ్‌’ (బఖరహ్ : 35). ‘ఓ ఈసా’ (మాయిదహ్ : 116), ‘ఓ నూహ్ ’ (నూప్‌: 40), ‘ఓ మూసా’ (ఆరాఫ్‌: 144) ‘ఓ ఇబ్రాహీమ్‌’ (సాఫ్పాత్‌: 104) ఆని వారి నామంతోనే సంబోధించాడు. ఇక ఎక్కడయితే ప్రవక్త (స) వారి నామ ప్రస్తావన వచ్చిందో అక్కడ సమాచారాన్ని అందజేయడం, యదార్థాన్ని విశధ పర్చడం ఉద్దేశ్యంగా ఉంటుంది. (ప్రజలారా!) ముహమ్మద్‌ (సల్లం) మీ పురుషుల్లో ఎవరికీ తండ్రి కాడు. ఆయన అల్లాహ్ సందేశహరుడు. దౌత్య పరంపరను అంతమొందించిన అంతిమ దైవప్రవక్త. అల్లాహ్  సమస్త విషయాలు ఎరిగినవాడు. (అహ్జాబ్‌: 40) ‘‘ముహమ్మద్‌’’ అన్న నామ ప్రస్తావన ఖుర్‌ఆన్‌లో నాలుగు సందర్భాలో వచ్చింది.

రెండవ ప్రత్యేకత: పూర్వ ప్రవక్తల అనుచర సమాజం వారిని వారి పేరుతో పిలిచేవారు. ‘వారన్నారు ` ఓ మాసా!’ (ఆరాఫ్‌:138) ‘హవారీలు ఇలా అన్నారు ` మర్యం కుమారుడగు ఓ ఈసా!’ (మాయిదహ్: 112) ‘వారన్నారు ` ఓ హూద్‌!’ (హూద్‌: 53). కానీ ప్రవక్త (స) వారిని అలా పివకూడదు అని అల్లాహ్ ఆదేశించాడు: ‘‘ముస్లింలారా! దైవప్రవక్త పిలుపును మీరు ఒకరినొకర్ని పిలుచుకునే పిలుపుగా భావించకండి.’’. (నూర్‌: 63)

మూడవ ప్రత్యేకత: అల్లాహ్ ఆయన జీవితాన్ని ప్రమాణంగా పేర్కొన్నాడు: ‘‘నీ ఆయుష్షు సాక్షిగా! వారు తమ (ముదనష్టపు) కైపులో గుడ్డివారయి పోయారు’’ (హిజ్ర్‌: 72) స్వయంగా అల్లాహ్యే ఆయన  జీవితం మీద ప్రమాణ చెయ్యడం అంటే ఆయన జీవితం ఎంత పవిత్రమయినదో, ఎంత మహిమాన్వితమయినదో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకత ఆయనకు తప్ప ఇతరులకు దక్క లేదు.

నాల్గవ ప్రత్యేకత: అల్లాహ్ ఖుర్‌ఆన్‌ లో అనేక మంది ప్రవక్తలను  ఒకే చోట ప్రస్తావించిన అధిక సందర్భాలో ప్రవక్త (స) వారిని ముందుగా పేర్కొన్నాడు. ‘‘(ముహమ్మద్‌!) మేము నూహ్‌కు, అతని తర్వాత వచ్చిన ప్రవక్తలకు ఎలా దివ్య జ్ఞానం అందజేశామో అలా నీకూ అందజేస్తున్నాం. మేము ఇబ్రాహీం, ఇస్మాయిల్‌, ఇస్‌హాఖ్‌, యాఖూబ్‌, యాఖూబ్‌ సంతానం, ఈసా, అయ్యూబ్‌, యూనుస్‌, హారూన్‌, సులైమాన్‌ (అలై)లకు దివ్యజ్ఞానం అందజేశాం. దావూద్‌ (అలై)కు జబ్బూర్‌ ప్రసాదించాం. నీకు పూర్వం వచ్చిన ప్రవక్తలలో కొందరి వృత్తాంతాలు నీకు తెలిపాము. అనేకమంది వృత్తాంతాలు తెలపలేదు. మేము మూసాతో (నేరుగా) సంభాషించాం. (163-164)’’  ‘‘ప్రవక్తా! మేము యావత్‌ ప్రవక్తలచేత చేయించిన ప్రమాణం జ్ఞప్తికి తెచ్చుకో. మేము నీచేత కూడా ప్రమాణం చేయించాం. నూహ్‌, ఇబ్రాహీం, మూసా, మర్యం కుమారుడు ఈసా (అలై)ల చేత కూడా ప్రమాణం చేయించాం.” (ఆహ్జాబ్‌: 7)

అయిదవ ప్రత్యేకత: ఇస్రా, మేరాజ్‌ సందర్భంగా బైతుల్‌ మఖ్దిస్‌లో ప్రవక్తందరికి నమాజులో నాయకత్వం వహించడం. ఆ సందర్భంగా ఆయన ఒక లక్ష 24 వేల మంది ప్రవక్తకు నాయకత్వం వహించిన నమాజు చేయిపించారు. (ముస్లిం హదీసు గ్రంథం )

ఆరవ ప్రత్యేకత: ప్రవక్తలందరి చేత ఆయన కోసం మాట తీసుకోవడం జరిగింది. ‘‘అల్లాహ్ తన ప్రవక్తల నుండి తీసుకున్న ఈవాగ్దానం గురించి ఆలోచించండి. ఆయన ఇలా అన్నాడు: “నేను మీకు గ్రంథాన్ని, వివేకాన్ని ప్రసాదిస్తున్నాను. ఆ తరువాత మీకివ్వబడిన గ్రంథాన్ని ధృవీకరిస్తూ మరో ప్రవక్త వస్తే అతడ్ని మీరు విశ్వసించి అతనికి సహాయం చేయాలి.” ఇలా అన్న తర్వాత “దీన్ని మీరు అంగీకరిస్తున్నారా? నేను మీపై మోపిన ఈ ప్రమాణ బాధ్యతను మీరు స్వీకరిస్తున్నారా?” అనడిగాడు దేవుడు. దానికి దైవప్రవక్తలు “ఆ..మేము అంగీకరిస్తున్నాం, స్వీకరిస్తున్నాం” అన్నారు. అప్పుడు దేవుడిలా అన్నాడు: “దీనికి మీరు సాక్షులుగా ఉండండి. మీతోపాటు నేనూ సాక్షిగా ఉంటాను. ఇకపై ఎవరు తమ వాగ్దానాన్ని భంగపరుస్తారో వారే నీతిలేని దుర్మార్గులు”    ’’ (ఆల్‌ ఇమ్రాన్‌: 81-82)

ఏడవ ప్రత్యేకత:సుదూర ప్రాంతంలో ఉన్నా సరే శత్రువు గుండెల్లో దడ. ‘‘ఒక నెల ప్రయాణం చేసేంతటి దూరపు భయ ప్రభావంతో నాకు తోడ్పాటునందించడం జరిగింది’’. (బుఖారీ)

ఎనిమిదవ ప్రత్యేకత: ఆయన సముదాయం సముదాయాల్లోకెల్లా ఉత్తమ సముదాయం. ‘‘విశ్వాసులారా! ఇకనుండి ప్రపంచ మానవులకు మార్గదర్శనం చేస్తూ వారిని సంస్కరించడానికి రంగంలోకి తీసుకురాబడిన శ్రేష్ఠసమాజం మీరే. మీరు మంచి పనులు చేయమని ప్రజలను ఆదేశిస్తారు. చెడుల నుండి వారిస్తారు. దేవుడ్ని ప్రగాఢంగా విశ్వసిస్తారు. గ్రంథప్రజలు (కూడా) విశ్వసించిఉంటే వారికెంతో మేలు జరిగేది. వారిలో విశ్వసించినవారు కూడా కొందరున్నారు. కాని చాలామంది అవిధేయులే ఉన్నారు. ’’ (ఆల్‌ ఇమ్రాన్‌: 110) ‘‘మీరు 70 సముదాయాల్లో చిట్ట చవరి సముదాయం. వాటన్నింటిలో ఉత్తమ సముదాయం. అల్లాహ్కు ఎంతో ఇష్టమైన సముదాయం’’ అన్నారు ప్రవక్త (తిర్మిజీ)

తొమ్మిదవ ప్రత్యేకత: ప్లేగు వ్యాధి, దజ్జాల్‌ ఆయన పట్టణమైన మదీనాలో ప్రవేశించ లేరు. ‘‘మదీనా తలుపుల దగ్గర దైవ దూతు పహారా కాస్తూ ఉంటారు. అందులో ప్లేగు వ్యాధి గానీ, దజ్జాల్‌ గాని  ప్రవేశించ జారు’’ అన్నారు ప్రవక్త (స). (బుఖారీ, ముస్లిం)

పదవ  ప్రత్యేకత: ఆయన్ను మనిషి తన ధన, మాన, ప్రాణాకన్నా అధికంగా అభిమానించాలి, గౌరవించాలి. ‘‘ప్రవక్తా! వారికి చెప్పు: “మీ తండ్రులు, కొడుకులు, సోదరులు, భార్యలు, బంధు మిత్రులే గాక మీరు కూడబెట్టుకున్న ఆస్తులు, (సత్యాన్ని విశ్వసిస్తే) మందగించి పోతా యేమోనని మీరు భయపడుతున్న మీవ్యాపారాలు, మీకు ప్రీతికరమైన మీఇండ్లు- ఇవన్నీ మీకు అల్లాహ్ కంటే, ఆయన ప్రవక్త కంటే, ఆయన మార్గంలో జరిపే పోరాటం కంటే ఎక్కువ ప్రియమైనవయితే మీ గురించి అల్లాహ్ నిర్ణయం వచ్చేదాకా ఎదురుచూడండి. దుర్జనులకు అల్లాహ్  ఎన్నటికీ సన్మార్గావలంబన బుద్ధి ప్రసాదించడు.”   (తౌబహ్: 24)

పదకొండు, పన్నెండు, పదమూడవ పద్నాల్గవ  ప్రత్యేకత: నాయకత్వం, పునరుత్థానం, ప్రశంసా పతాకం, స్వర్గ ప్రవేశం. ‘‘ప్రళయ దినాన ఆదం సంతతిలో నేను అధినాయకుడను ` ఇది గర్వంతో చెబుతున్న మాట కాదు.  నా చేతిలో ప్రశంసా పతాకం ఉంటుంది ` ఇది గర్వంతో చెబుతున్న మాట కాదు. ప్రవక్తల్లోని ఏ ప్రవక్త అయినా నా జెండా క్రిందనే ఉంటారు. పునరుత్థాన దినాన భూమి చీల్చుకుని లేపబడే తొలి వ్యక్తి నేనే ` ఇది గర్వంతో చెబుతున్న మాట కాదు’ అన్నారు ప్రవక్త (స). (తిర్మిజీ) వేరొక ఉల్లేఖనంలో ` ‘‘ప్రళయ దినాన స్వర్గంలో ప్రవేశించే  తొలి వ్యక్తిని నేనే ` ఇది గర్వంతో చెబుతున్న మాట కాదు’’అని ఉంది. (దారమీ)

పదైదవ  ప్రత్యేకత: మఖామె మహ్మూద్‌ ` ప్రశంసా భరిత పీఠ అధీరోహణ. ‘‘నీ ప్రభువు నిన్ను త్వరలోనే అత్యున్నతమైన స్తుతి స్థానం మీద అధిష్ఠింప జేయవచ్చు.’’ (ఇస్రా: 79) అదే సిఫారసు చేసే స్థాయి. అది ఒక్క ప్రవక్త (స) వారికి తప్ప ఇంకెవ్వరికి దక్కదు. ప్రవక్తందరూ చేతులెత్తయగా ` అంతిమంగా అందరూ అంతిమ దైవ ప్రవక్త (స) వారి వద్దకు వచ్చి సిఫారసు చేయాల్సిందిగా కోరతారు. అదే మఖామె మహమూద్‌ ` ప్రశంసా భరిత పీఠం –  స్తుతి స్థానం’అన్నారు ప్రవక్త (స). (బుఖారీ)

పదహారవ ప్రత్యేకత: ప్రవక్తలందరి అనుయాయులకన్నా, అయన అనుయాయులు  అధికంగా ఉంటారు. ”స్వర్గ వాసుల పంక్తులు 120 అయి ఉంటాయి. అందులో 80 పంక్తులు ఈ సముదాయానికి చెందినవి, 40 పంక్తులు మిగతా సముదాలన్నింటికి చెందినవయి ఉంటాయి”. అన్నారు ప్రవక్త (స). (ఇబ్ను మాజహ్‌)

పదహేడవ ప్రత్యేకత:  విశ్వ మానవాళి వైపునకు పంపబడిన జగత్ప్రవక్త. పూర్వం ప్రతీ ప్రవక్త తన జాతి వైపునకు మాత్రమే పంప బడేవాడు. నన్ను ప్రతి ఎర్రవాని, నల్లవాని వైపునకు (సమస్త మానవాళి వైపునకు) ప్రవక్తగా చేసి పంపడం జరిగింది.  (బుఖారీ)

ఓ ముహమ్మద్‌ (స)! మేము నిన్ను యావత్తు మానవాళి కోసం (స్వర్గ)శుభవార్త అందజేసేవానిగా, (దైవశిక్ష గురించి) హెచ్చరించే వానిగా చేసి పంపాము. కాని చాలామందికి ఈ వాస్తవం తెలియదు. (సబా; 28)

పద్దెమిది, పంతొమ్మిదవ ఇరవైవ  ప్రత్యేకత: భూమి మొత్తం నా కోసం మస్జిద్‌గా చెయ్యబడిరది. యుద్ధ ప్రాప్తి  నా కోసం దర్మసమ్మతం చెయ్యబడిమది. నాకు పెద్ద సిపారసు అనుగ్రహించ బడిరది. ప్రతి ప్రవక్త కేవలం తన జాతి జనం వైపునకు మాత్రమే వచ్చేవాడు. నేను ప్రపంచ ప్రజందరి వైపునకు పంపబడ్డాను. (బుఖారీ)

21వ ప్రత్యేకత: ఆయన గత మరియు భవిష్య పొరపాట్లు  మన్నించ బడ్డాయి. ‘‘(ముహమ్మద్‌ (స)! మేము నీకు స్పష్టమైన విజయం ప్రసాదించాం. దేవుడు నీగత పొరపాట్లు, భావిపొరపాట్లు మన్నించి నీపై తన అనుగ్రహం పరిపూర్తి చేయాలని, నీకు రుజుమార్గం చూపి, పెద్ద సహాయం చేయాలని (ఈ శుభవార్త నీకు విన్పిస్తున్నాడు)” (ఫతహ్: 1-2)

22వ ప్రత్యేకత: హౌజె కౌసర్‌ సరోవరం ఆయనకు ఇవ్వబడిరది. ‘‘(ముహమ్మద్‌!) మేము నీకు కౌసర్‌ (సరోవరం) ప్రసాదించాము.’’ (కౌసర్‌: 1) ‘‘ప్రతి ప్రవక్తకు ఒక సరోవరం ఉంటుంది. ఎవరి సరోవరం మీద ఎక్కువ మంది ప్రజాలు  వస్తారని వారు పోటీ పడతారు. ఎక్కువ మంది వచ్చే సరోవరం నాదే అయి ఉంటుందన్న నమ్మకం నాకుంది’’ అన్నారు ప్రవక్త (స). (తిర్మిజీ)

23వ ప్రత్యేకత: శాశ్వత మహిమ ఖుర్‌ఆన్‌. సాధరనంగా ప్రవక్తకు ఇవ్వబడే మహిమ కాలానికనుగుణంగా, ప్రజ డిమాండ్‌ మీద ఆధార పడి ఇవ్బడుతుంది. తత్కారణంగా తర్వాతి కాంలో దాని ప్రభావం ఉండదు. అలాంటి వందలాది మహిము ప్రవక్త ముహమ్మద్‌ (స) వారికి సయితం ఇవ్వ బడ్డాయి. ఒక్క మహిమ మాత్రం ప్రయం వరకూ పని చేస్తూనే ఉంటుంది. అదే ఖుర్‌ఆన్‌ గ్రంథ రాజం.

24వ ప్రత్యేకత: అల్లాహ్ ఆయన్ను మేరాజ్‌ సందర్భంగా  తన వద్దకు పిలిపించుకొని  ఏ  మధ్యవర్తి లేకుండా సంభాషించాడు.  (ముస్లిం)

25వ ప్రత్యేకత: 24వ ప్రత్యేకత: స్వర్గంలో ‘వసీలా ఆయనొక్కరికే భిస్తుంది. ”మీరు నా కోసం అల్లాహ్ తో వసీలహ్ ను కోరుకోండి” అన్నారు ప్రవక్త (స)> అందుకు సహాబా – ‘వసీలహ్ అనగానేమి?’ అని ప్రశించారు.  ‘అది  స్వర్గపు శిఖర భాగం. అది  ఒకే ఒక్క   వ్యక్తికి దక్కుతుంది . ఒక్క వ్యక్తి నేనే అయి ఉంటానన్న నమ్మకం నాకుంది’ అన్నారు ప్రవక్త (స).  (తిర్మిజీ)

26వ ప్రత్యేకత: ఆయనకు ‘‘గిరి అంతటి బావాన్ని గరిటెలో అందించే వాక్పటిమను అనుగ్రహించడం జరిగింది’’. (ముస్లిం ) ఆయన మాటలు  గరిటెడంత చిన్నగా ఉంటాయి కానీ, వాటి భావం గిరి (పర్వతం) అంతటిదై ఉంటుంది.

27వ ప్రత్యేకత: ఆయనపై దైవ ధర్మం ఇస్లాం సంపూర్ణం చేయబడిరది. . నేనీ రోజు మీకోసం మీ ధర్మాన్ని (సమగ్ర జీవన వ్యవస్థగా) పరిపూర్ణం చేశాను. మీ కోసం నా అనుగ్రహాన్ని పూర్తిగా నెరవేర్చాను. మీ శ్రేయస్సు కోసం ఇస్లాంను మీ జీవనధర్మంగా ఆమోదించాను (మాయిదః- 3)

28వ ప్రత్యేకత: ఆయన ద్వారా దైవ దౌత్య పరంపరను పరిసమాప్తం గావించడం జరిగింది. (ప్రజలారా!) ముహమ్మద్‌ (సల్లం) మీ పురుషుల్లో ఎవరికీ తండ్రి కాడు. ఆయన అల్లాహ్   సందేశహరుడు. దౌత్యపరంపరను అంతమొందించిన అంతిమ దైవప్రవక్త. అల్లాహ్  సమస్త విషయాలు ఎరిగినవాడు. (అహ్జాబ్ – 40)

29వ ప్రత్యేకత:  సమస్తలోకా పాలిట ఆయన కారుణ్యం. ముహమ్మద్‌ (స)! మేము నిన్ను యావత్తు ప్రపంచవాసుల పాలిట (దైవ) కారుణ్యంగా చేసి పంపాము. (అంమియా – 107)

30వ ప్రత్యేకత: ఖుర్‌ఆన్‌ ఆయన శరీరావయవాను పేర్కొన్నంత గొప్పగా మరే ప్రవక్త శరీరావయవా గురించి పేర్కొన లేదు.అతను తన మనోవాంఛలకు తలయొగ్గి మాట్లా డడు. ……  కళ్ళు చూసిన దానిలో హృదయం అసత్యాన్ని మిళితం చేయలేదు……. అతని చూపులు వేరేవైపు మరలడంగాని, హద్దుమీరి ముందుకు పోవడంగాని జరగ లేదు. (అన్నజమ్ – 3 – 17)

చివరి మాట: ఆయన జీవితం మనకిచ్చే సందేశం.

వివేకానికి నిువుటద్దం, కోటి కాంతు మెగు కిరణం విశ్వ కారుణ్యమూర్తి ముహమ్మద్‌ (స). ‘ఓర్పుతోనే విజయం సాధ్యం’ (సహీహుల్ జామె ) అన్న ప్రవక్త (స) వారి బాటలో నడిస్తే మనలో వ్యక్త్విం ప్రజలిస్తుంది. ‘ఓర్మి ` సహనం, కూర్మి ` ప్రేమ, శాంతి, కమ భావనను పెంచుకోవానే ఆయన ప్రవచనాు సదా సర్వత్రా ఆచరణీయమ. కోపతాపాకు తావీయకుమడా, పగాప్రతీకారా జోలికి పోకుండా మానవత్వంతో ముందుకు సాగాలి మనం.  మన పుకు బంగారం అవ్వాలి, మన ఆభరణం దైవభీతి, సహనం అవ్వాలి.

‘మిరు సంఘాన్ని అంటి  పెట్టుకు ఉండండి. వర్గాలుగా చీలిపోకండి.  నిశ్శయంగా షైతాన్‌ ఒంటరి వ్యక్తి కి దగ్గరగా ఉంటాడు. ఇద్దరు  వ్యక్తులకు దూరంగా ఉంటాడు. స్వర్గం నడి మధ్యలో ఓలలాడాలనుకునే వ్యక్తీ సంఘ నీతికి కట్టుబడి ఉండాలి’ ( తిర్మిజీ) అని చెప్పిన ఆయన మాటలోని ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒంటరి పోరుకంటే సంఘటిత పోరుతోనే సత్ఫలితాలు  సాధ్యం.

‘మీరు సత్యానికి కట్టుబడండి’. (ముత్తఫకున్అలైహి ) అన్న ఆయన (స) పిలుపు  స్ఫూర్తి తో సత్యాన్ని శ్వాసించాలి, సత్య సహిత జీవితాన్ని ప్రేమించాలి, సత్య సహిత మరణాన్ని కౌగలించుకోవాలి. సత్య నిత్య సస్య బాటలో ఎదురయ్యే ఆటుపోట్లను అధిగమిస్తూ జీవన యానంలోని మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాదించాలి. ‘ధర్మ స్థాపన కోసం ఎన్ని సార్లు మరణించి ఎన్ని  సార్లు బతికించ బడినా మళ్ళీ ధర్మం కోసం మరణించడాన్నే నేను ఇష్ట పడతాను’(ఇబ్ను హిబ్బాన్)  అన్న ఆయన శక్తివంతమైన మాట, ఆ అకుంఠిత దీక్ష  మనందరికి ఆసదర్శం అవ్వాలి.

సమాజ, దేశ అభివృద్ధి అంటే, ప్రతి పౌరుని నైతికాభివృద్ధియే. ఏ దేశమయినా, మరే సమాజమయినా మన ప్రాధాన్యతను గుర్తించే నైపుణ్యాల్ని పెంపొందించుకోవాలి. నాయక లక్షణాను అలవర్చు కోవాలి. మనం సత్య బాటన నడవడంతోపాటు మన తోటి వారిని సయితం నడిపించే ప్రయత్నం చేయాలి.

‘హితాన్ని కోరేదే ధర్మం’ అన్నారు ప్రవక్త (స). ( ముస్లిం) సమాజ, సంఘ, దేశ, ప్రపంచ నాయకులు, ప్రజా  సంపూర్ణ శ్రేయాన్ని మనసారా కోరుకునే, దాని కోసం శక్తి వంచన లేకుండా అవిరళంగా కష్టించే, అవిశ్రాంతంగా పరిశ్రమించే శ్రేష్ఠ గణంగా మనం ప్రపంచ వేదిక మీదకు రావల్సి సమయం ఆసన్నమయ్యింది.

విశ్వాసుల హృదయాలు దేవుని ప్రస్తావనతో ద్రవించే సమయమింకా రాలేదా? ఆయన పంపిన సత్యం ముందు లొంగిపోయే వేళ ఆసన్నంకాలేదా? గతంలో కొందరికి గ్రంథం ఇవ్వబడింది. కాని ఓ సుదీర్ఘకాలం గడచిన తర్వాత వారి హృదయాలు కఠినమై పోయాయి. ఈనాడు వారిలో చాలామంది దుర్మార్గులైఉన్నారు. మీరలా కాకూడదు సుమా! వినండి! భూమి మృతప్రాయమైన తర్వాత దేవుడు దానికి తిరిగి జీవంపోస్తు న్నాడు. (అలాగే మృతప్రాయమైన మానవతక్కూడా ప్రవక్తల ద్వారా జీవం పోస్తున్నాడు.) మీరు విషయం గ్రహిస్తారని మాసూక్తులు మీకు విడమరచి చెబుతున్నాం. (అల్-హదీద్: 16-17)

చిత్తశుద్ధితో దానధర్మాలు చేసే, దేవునికి శ్రేష్ఠమైన రుణం అందజేసే స్త్రీ పురుషు లకు దేవుడు తప్పక (వారి సత్కార్యాన్ని) అనేక రెట్లు పెంచి తిరిగిస్తాడు. ఆపై వారికి అత్యంత శ్రేష్ఠమైన ప్రతిఫలం కూడా లభిస్తుంది. దేవుడ్ని, దైవప్రవక్తను మనస్ఫూర్తిగా విశ్వసించినవారే తమ ప్రభువు దృష్టిలో సత్యసంథులు, ధర్మసాక్షులు. వారి కోసం తగిన ప్రతిఫలం, జ్యోతి ఉన్నాయి. దీనికిభిన్నంగా అవిశ్వాస వైఖరి అవలంబించి, మా సూక్తులు నిరాకరించినవారు మాత్రం నరకానికి పోతారు. (అల్-హదీద్: 18-19)

వినండి, ఇహలోక జీవితం ఒకఆట, తమాషా, బాహ్యపటాటోపం, పరస్పరం బడాయి చెప్పుకొని గర్వించడం, సంతానం, సిరిసంపదలలో ఒకర్నొకరు మించిపోవడా నికి ప్రయత్నించడం తప్ప మరేమీ కాదు. ఐహికజీవితాన్ని ఇలా పోల్చవచ్చు: వర్షంతో ఎదిగిన మొలకల్ని చూసి రైతులు సంబరపడిపోతారు. తర్వాత ఆ పొలం పంటకు వచ్చి ఎర్రబారడం కన్పిస్తుంది. ఆ తర్వాత తుప్పగా (గడ్డిపరకలుగా) మారిపోతుంది.

అయితే పరలోకంలో (అవిశ్వాసుల కోసం) తీవ్రమైన యాతనలు, (విశ్వాసుల కోసం) దేవుని మన్నింపు- ఆయన ప్రసన్నతలు ఉంటాయి. ప్రపంచజీవితం ఒక మాయ, భ్రాంతి తప్ప మరేమీ కాదు. దేవుడ్ని, ఆయన ప్రవక్తలను విశ్వసించినవారి కోసం స్వర్గ సీమ సిద్ధంగా ఉంది. (కనుక) దేవుని మన్నింపు వైపు, భూమ్యాకాశాలంత విశాలమైన ఆ స్వర్గసీమ వైపు పోటీపడి పరుగెత్తండి. ఇది దేవుని అనుగ్రహం. ఆయన దాన్ని తాను తలచిన వారికి ప్రసాదిస్తాడు. దేవుడు గొప్ప అనుగ్రహశాలి. (అల్-హదీద్ : 20-21)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 1.00 out of 5)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.