New Muslims APP

మహనీయ ఈసా (అలైహిస్సలాం)

ఇమ్రాన్‌ భార్య వేడుకోలు:

ఇమ్రాన్‌ భార్య విశ్వ ప్రభువును ఇలా వేడుకుంది; ”ఓ నా ప్రభూ! నా గర్భంలో ఉన్న బిడ్డను నీ సేవ కోసం అంకితం చేస్తున్నాను. నా ఈ సదాచరణను స్వీకరించు. నిస్సందేహంగా నువ్వు సర్వం వినేవాడవు, సర్వం తెలిసిన వాడవు”. ఇమ్రాన్‌ భార్యకు ఆడపిల్ల పుట్టింది. అప్పుడు ఆమె ఇలా విన్నవించుకుంది – ‘ఓ ప్రభూ! నాకు మగ పిల్లవాడు పుడుతాడు అనుకున్నాను. మగపిల్లవాడైతే ఆడపిల్లలో ఉన్న సహజమైన అనేక బలహీనతలకు దూరంగా ఉంటాడు.అందువల్ల నేను నా బిడ్డను నీ మార్గాన సమర్పించుకోదలిచిన ధ్యేయం బాలుడయితే మరింత బాగుగా నెరవేరగలిగేది. కాని ఆడపిల్ల పుట్టింది. నేను ఈ పాపకు మర్యమ్‌ అని పేరు పెట్టాను. ఓ అల్లాహ్‌! నేను ఈమెను, ఈమె సంతానాన్ని శాపగ్రస్తుడైన షైతాన్‌ బారి నుంచి రక్షణ పొందానికి నీకు అప్పగిస్తున్నాను”. ఇమ్రాన్‌ భార్య త్యాగాన్ని అల్లాహ్‌ స్వీకరిం చాడు. ఆ పసిపాపను అత్యుత్తమ రీతిలో పోషించే బాధ్యతను ప్రవక్త జకరియ్యా (అ)కు అప్పగించాడు.(ఆల్‌ ఇమ్రాన్‌ 35-37)

నేను అల్లాహ్‌ దాసుడను. ఆయన నాకు గ్రంథం వొసగాడు. నన్ను తన ప్రవక్తగా నియమించాడు. నేనెక్కడున్నాసరే ఆయన నన్ను శుభవంతుని గా చేశాడు.

హజ్రత్‌ మర్యం (అ) బాల్యం:

హజ్రత్‌ మర్యం (అ)కు బాల్యం నుండే అల్లాహ్‌పై అమితమైన ప్రేమ, నమ్మకం. ఆమె బైతుల్‌ మక్దిస్‌లో ఆలయ యాజకులు ఆరాధకుల కోసం నిర్మించబడిన గదుల్లో ఒక దానిలో అల్లాహ్‌ ఆరాధనలో ఏకాగ్రతతో కాలం గడిపేవారు. అల్లాహ్‌ తన అనన్యమయిన శక్తి ద్వారా గదిలో ఓ మూలన కూర్చుని తనను స్మరిస్తున్న ఆ కన్యకు తిను బండారాలు, పండ్లు ఫలాలు సమాకూర్చేవాడు. జక్రియా (అ) వీటిని చూచి ఆశ్చర్యంతో అడిగేవారు, ”అమ్మా మర్యం! ఇవి నీ వద్దకు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా?” దానికి ఆమె ఎంతో ప్రశాంతంగా సమాధాన మిచ్చేవారు- ”ఈ ఏర్పాట్లన్నీ అల్లాహ్‌ తరుఫు నుండి. ఆయన కోరితే ఎవరికైనా లెక్కలేనంతగా ఉపాధిని ప్రసాదిస్తాడు”. అప్పటి వరకు సంతానలేమితో బాధపడుతున్న హజ్రత్‌ జకరియ్యా (అ)లో అల్లాహ్‌ సర్వ శక్తిమంతడు. తాను కోరితే ఈ వృద్ధాప్యంలోనూ సంతానాన్ని ఇవ్వగలడన్న ఆశ చిగురించింది. సంతానం కోసం ప్రభవును వేడుకున్నారు. అల్లాహ్‌ హజ్రత్‌ జకరియ్యా(అ) మొరను ఆలకించి యహ్‌యా (అ)ను గురించి శుభవార్తనిచ్చాడు. (ఆల్‌ ఇమ్రాన్‌ 37-41)

హజ్రత్‌ మర్యం (అ) పరిశుద్ధురాలు:

హజ్రత్‌ మర్యం (అ) దైవారాధనకై అంకితమయిపోయిన ఓ కన్య కనుక ఆమెకు పెండ్లి కాలేదు. ఆమె జన బాహుళ్యంలోకి వచ్చేవారు కూడా కారు. ఆమె తన పినతండ్రి అయిన హజ్రత్‌ జకరియ్యా(అ)ను తప్ప ఏ పరాయి మగాడిని కూడా కన్నెత్తి చూడనేలేదు. ఆమెను ఏ మనిషీ తాకనయినా లేదు. తన అపారమయిన శక్తిసామార్థ్యాలను గుర్తించని ఇస్రాయూల్‌ సంతతి కళ్ళు తెరిపించడానికి అల్లాహ్‌ ఆమెను పరీక్షించాడు. ఓ రోజు ఆమె అల్లాహ్‌ సంస్మరణలో లీనమై ఉన్న ప్పుడు, దైవదూత హజ్రత్‌ జిబ్రయీల్‌ (అ) ఆమె సమక్షంలో పూర్తి మానవాకారంలో సాక్షా త్కరించారు. ఆమె అప్రమత్తంగా పలికారు, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకుచ్చావు? నీవు దైవభీతి గల వాడివయితే నేను నీ బారి నుండి కృపాకరుని శరణు వేడుకుంటున్నాను.

దైవదూత అన్నాడు: నేను నీ ప్రభువు పంపగా వచ్చిన దూతను, నీకు ఒక పరిశుద్ధుడయిన బాలుడి శుభవార్తను ఇచ్చేందుకు పంపబడిన వాణ్ణి. నీకు ఒక పరిశుధ్దమయిన బాలుడు పుడుతాడు.అతని పేరు మసీహ్‌ ఈసా బిన్‌ మర్యమ్‌ ఉంటుంది. ఆ అబ్బాయి జనుల కొరకు ఒక సూచనగా అల్లాహ్‌ వద్ద నుండి కారుణ్యంగానూ రూపొందుతాడు.

అతడు ఇహపరాలలో గౌరవనీయుడవుతాడు.అతను అల్లాహ్‌ సామీప్యం పొందిన వారిలో ఒకడు… అతడు ఉయ్యాలలో ఉన్నప్పుడూ, పెద్దవాడై నప్పుడూ ప్రజలతో మ్లాడతాడు. ఇలా చేయడం అల్లాహ్‌కు ఎంతో సులువు. అల్లాహ్‌ ఏదైనా పనిని చేయాలని సంకల్పించుకుని ‘అయిపో’ అని అంటే చాలు , అది అయిపోతుంది. ఆది మానవుడయిన హజ్రత్‌ ఆదం (అ)ను తల్లీ తండ్రి ఉభయులూ లేకుండా పుట్టించిన సర్వ శక్తిమంతుడు అల్లాహ్‌, హజ్రత్‌ ఈసా (అ)ను కేవలం తండ్రి మటుకే లేకుండా ఎందుకు పుట్టించ లేడు? (ఆల్‌ ఇమ్రాన్‌ 42-48)

హజ్రత్‌ ఈసా(అ) జననం:

అల్లాహ్‌ తన ఔచితీ విజ్ఞతల దృష్ట్యా-అసాధారణ రూపంలో ఈసా(అ) కు పుట్టించి, దైవప్రవక్తగా చేసి, అద్భుతాలను చేసే శక్తి ప్రసాదించాలనుకున్నాడు. అంతే, హజ్రత్‌ మర్యం (అ) దైవాజ్ఞతో గర్భం ధరించింది. ఆమె తీవ్రమయిన పరీక్షకు లోనయింది. ప్రసూతి సమయం వచ్చింది. ఆమె ఒంటరిగా ఎవరికం పడకుండా ఒక దూర ప్రాంతంలో ఒక ఖర్జూరపు చెట్టు క్రిందకు చేరింది. ఆమె విలపిస్తూ ఇలా చెప్పసాగింది. అయ్యో! నేను దీనికి మునుపే చనిపోయి ఉంటే ఎంత బాగుండేది! నా ఊరూ పేరూ లేకుండా అంతా సమసి పోయి ఉంటే ఎంత బావుం టుంది! దైవదూత ప్రత్యక్షమయ్యి ఇలా అన్నాడు: ఓ మర్యం దుఃఖించకు! నీ ప్రభువు నీ కోసం ఒక నీటి చెలమను సృష్టించాడు. ఖర్జూరపు చెట్టు కాండాన్ని పట్టి విదిలించు.పండిన ఖర్జూరపు పండ్లు రాలుతాయి. వాటిని తిను.మంచి నీళ్ళుత్రాగు. నేత్రానందాన్ని పొందు. ఎవరైనా నీకు తారస పడి నిన్ను నిందిస్తే, నీవు సహనం వహించు. ఎవరితోనూ మ్లాడకు. నేను కారుణ్య ప్రభువైన అల్లాహ్‌ కోసం ఉపవాస వ్రతం పాటిస్తున్నానని చెప్పు. ఎవరైనా నీపై నిందలు మోపితే, పసిపిల్లవాని వైపు సైగ చేసి చూపించు.ఆ పసివాడే జనులతో మ్లాడుతాడు.

హజ్రత్‌ ఈసా (అ) తల్లి ఒడిలో మ్లాడారు:

”నేను అల్లాహ్‌ దాసుడను. ఆయన నాకు గ్రంథం వొసగాడు. నన్ను తన ప్రవక్తగా నియమించాడు. నేనెక్కడున్నాసరే ఆయన నన్ను శుభవంతుని గా చేశాడు.నేను జీవించి ఉన్నంతకాలం నమాజు, జకాతులకు కట్టుబడి ఉండమని ఆయన నాకు ఆదేశించాడు. ఇంకా- ఆయన, నన్ను నా తల్లికి సేవ చేసేవానిగా చేశాడు. నన్ను దౌర్జన్యపరునిగానూ, దౌర్భాగ్యుని గానూ చేయలేదు.నేను పుట్టిన రోజూ, నేను చనిపోయే రోజూ, నేను సజీవినై తిరిగి లేపబడేరోజూ నాపై శాంతి కలుగుతుంది. ఇదీ, మర్యమ్‌ కుమారుడైన ఈసా (అ) యదార్థ గాథ.

అయితే,. ప్రజలు అల్లాహ్‌ శక్తి సామార్థ్యాలను అర్థం చేసుకోవలసిన విధంగా అర్థం చేసుకోలేదు. ఫలితంగా సంశయంలో పడి, వారు మహనీయ ఈసా(అ) గురించి, ఆయన ‘దేవుని కుమారుడు’ అని విశ్వసిస్తున్నారు. యేసు- దేవుని అద్వితీయమైన కుమారుడు- అని నిరాధారమయిన ప్రచారం కూడా చేస్తున్నారు.చూడబోతే అల్లాహ్‌కు సంతానం ఉండటం అనేది ఎంత మాత్రం శోభించదు.అల్లాహ్‌ ఇలాంటి మాటలకు అతీతుడు… పరమ పవిత్రుడు. మహనీయ ఈసా(అ) అల్లాహ్‌ దాసుడు. ఇస్రాయీల్‌ సంతానాన్ని ఉద్దరించడానికి అల్లాహ్‌ తరపు నుండి పంపబడిన ప్రవక్త. ఆయన జనులకు ఇచ్చిన సందేశం: ”జనులారా నాకూ మీకందరికీ ప్రభువు అల్లాహ్‌ మాత్రమే. కనుక ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం. (ఖుర్‌ఆన్‌-19: 30-36)

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 5.00 out of 5)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.