New Muslims APP

సర్వేంద్రియానం నయనం ప్రధానం

ఈ క్షణం భూమి మీద గొప్ప అద్భుతాల్లోని ఓ అద్భుతం జరు గుతూ ఉంది. అదేమంటే – మీరు ఈ వ్యాసం చదువుతున్నారు. కాగితంపై నల్లటి అక్షరాలు, మీ చుట్టూ వస్తువులు, పరిసరాలు, మీరు చూస్తున్న వాటి రంగులు, దగ్గర-దూరం, ప్రకృతి సౌందర్యం, సుకుమారతలు – అన్నీ మీకు తెలుస్తున్నాయి కదా! ఇది ఎలా సాధ్యం అయింది? అని ఎప్పుడైనా ఆలోచించారా?

ఈ పృధ్వి ఆయనది. ఈ అపార విస్తృత ఆకాశం ఆయనది. ఉభయ సాగరాలు ఆయనవి. అయినా ఆయన్ను చిన్న నీటి చెలమల్తో కూడా తెలుసుకోవచ్చు. ఆయన ఇలా పబ్రోధించాడు: ”నమ్మేవారికి భూమిలో అనేక నిదర్శనాలున్నాయి. స్వయంగా మీ అస్తిత్వంలో కూడా ఉన్నాయి. మరి మీరు పరిశీలనగా చూడటం లేదా”? (జారియాత్‌: 21) అని. మనం మన పూర్తి శరీర నిర్మాణం గురించి కూలంకషంగా తెలుసుకోవాలంటే మనకు కొన్ని వందల వేల పుస్తకాల అవసరం ఉంటుంది. దానికి తగ్గట్టు సమయమూ కావాలి. ఎందుకంటే మనపై ఉన్న అల్లాహ్‌ అనుగహ్రాలు లెక్కింప సాధ్యం కానివి. ఆయన అనుగహ్రాల్లోని ఓ అనుగహ్రం – నేత్రం (సర్వేందియ్రానం నయనం పధ్రానం) గురించి మానవ మేధకు అందిన కొన్ని యదార్థాల్ని తెలుసుకునేందుకు పయ్రత్నిద్దాం.

ఈ క్షణం భూమి మీద గొప్ప అద్భుతాల్లోని ఓ అద్భుతం జరు గుతూ ఉంది. అదేమంటే – మీరు ఈ వ్యాసం చదువుతున్నారు. కాగితంపై నల్లటి అక్షరాలు, మీ చుట్టూ వస్తువులు, పరిసరాలు, మీరు చూస్తున్న వాటి రంగులు, దగ్గర-దూరం, ప్రకృతి సౌందర్యం, సుకుమారతలు – అన్నీ మీకు తెలుస్తున్నాయి కదా! ఇది ఎలా సాధ్యం అయింది? అని ఎప్పుడైనా ఆలోచించారా?

మీ మెదడులో ఉండే కటిక చీకిలో ఇవన్నీ రూపుదిద్దుకోవడం వల్లనే ఇవన్నీ తెలుస్తున్నాయి. మీకు కళ్ళతో పాటు చూసే చక్కటి శక్తి ఉంది కాబట్టి మీరు సృష్టి సౌందర్యాన్ని చూడగలుగు తున్నారు. మీ కుటుంబం, మీ ఇల్లు, మీ ఆఫీసు, మీ ఆప్తులు, మీ చుట్టుప్రక్కల ఉన్న ప్రతి దాన్ని మీరు ఇట్టే పసిగట్ట గలుగు తున్నారంటే కారణం మీ చూపు. కళ్ళు లేకుండా మీ చుట్టూ ఉండే దేని గురించైనా కరెక్ట్‌గా సెన్స్‌ చేయలేరు కదా! కళ్ళు లేకుండా రంగులు, రూపాలు, రమణీయ దృశ్యాలను ఒక్కసారి ఊహించుకోండి!

సాధారణంగా మనం ఏదైనా ఒక వస్తువు ఫోటో తీయాలంటే, ఆ వస్తువు దూరంగా ఉంటే ఫోకస్‌ ఎడ్జస్ట్‌ చేెసుకోవాలి. అది దగ్గరగా ఉంటే క్లోజ్‌అఫ్‌ సెలక్ట్‌ చేసుకోవాలి. కాని మన కళ్ళల్లో ఉండే లెన్స్‌లు అటువంటి ఆప్టికల్‌ కొలతలు తీసుకోకుండానే వెంటనే ఫోకస్‌ చేెసుకుంటాయి. అంటే మనం ఓ వస్తువును చూడాలనుకుంటే చాలు, క్షణంకంటే తక్కువ సమయంలోనే, మన కళ్ళు ఫొకస్‌ చేెసుకోవడం, మెదడుకి అందించడం, మనకు ఆ వస్తువు గురించి తెలియడం వెంటవెంటనే జరిగి పోతాయి.
మరి ఈ మహిమ నేత్రాలదో, మెదడు, మేధకి సమబంధించి నదో కాదు; ఇది సర్వలోక సృష్టికర్త, పాలకుడు, పరిపోషకుడు అయిన అల్లాహ్‌ది. ఆయనే మనల్ని శూన్యం నుండి సృష్టించింది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”అల్లాహ్‌ మిమ్మల్ని మీ మాతృ గర్భాల నుండి బయటకి తీశాడు (పుట్టించాడు). అప్పుడు మీకేమీ తెలియదు. మరియు మీకు వినికిడిని, కళ్ళనీ ఇంకా హృదయాలను ప్రసాదించాడు. బహుశా మీరు కృతజ్ఞులై ఉంటారని”. (16: 78)

కంటి యొక్క ఖచ్చితమైన నిర్మాణం

గడిచిన కొన్ని సెకన్లలో, మన కళ్ళల్లో సుమారు వంద బిలియన్ల చర్యలు పూర్తి అయి ఉంాయన్న విషయం మీకు తెలుసా? విశ్వం యొక్క టెక్నాలజీకి సంబంధించిన ఓ ఉదాహరణ కన్ను రూపంలో మన దగ్గరే ఉందంటే అశ్చర్యమేస్తుంది కదూ! ఈ విశ్వకర్త టెక్నాలజీని అంచనా వేయడం విషయం అలా ఉంచితే దాని దరిదాపులకు కూడా ఏ సైన్టిస్టు చేరుకోలే డన్నది కఠోర సత్యం. దానిని పోలినది మనిషేదైనా కని పెట్ట వచ్చు అంతే.

కళ్ళ యొక్క నిర్మాణం మరియు వాటి పనిని బట్టి అవి మన శరీరంలోని చిన్న ప్రదేశాన్ని మాత్రమే ఆక్రమించాయి. కళ్ళు ఉండే ప్రదేశం కరెక్టుగా – మన శరీరవయాలన్నింని సరైన విధంగా కంట్రోల్‌ చేసే సూచనలిచ్చే వీలు కల్పిస్తుంది అంటే ఆశ్చర్యం వేయకమానదు. ఒక్క నిమిషం ఆలోచించండి! ఒకవేళ మన కళ్ళు మేకాళ్ళ దగ్గరనో. లేక చీలమండల దగ్గరనో ఉండి ఉంటే ఎలా ఉండేది? అప్పుడు మనం నడుస్తున్నప్పుడు మన క్రింది దారి కనబడుతుందేగాని, పైన ఏముందో కనబడదు. అలానే మనం నడిచి వెళితే ఏదోకదాన్ని వెళ్ళి ఢీకొనడం ఖాయం. అటువిం పొందిక లేని శరిర నిర్మాణమే గనక మనం కలిగి ఉంటే, మామూలుగా చేసే చాలా పనులు – తినడం, త్రాగడం, పరికరాలను ఉపయోగించడం మొదలైనవి చాలా కష్టమయ్యెది. దీనికి భిన్నంగా మన కళ్ళు సరైన చోట ఉండటమే కాక, మన ముఖంలో అవి చాలా ఖచ్చితమైన స్థానంలో అందంగా అమర్చబడి ఉన్నాయి. సుబ్హానల్లాహ్‌!

మరో ఉదాహరణ – మన కళ్ళు ఒకవేళ ముఖం మీదే ముక్కు క్రింద ఉండి ఉంటే చూడానికి వికారంగా ఉండటమేకాక, సురక్షితమైన కోణంలో (సేఫ్‌ ఎంగిల్‌) చూడటం మనకు సాధ్య మయ్యేది కాదు. కాబట్టి సుందరాంగుడైన ఆ సృజనశీలుడు అవి ఉండాల్సిన స్థానంలోనే వాటిని అందంగా అమర్చాడు. ఇదొక్కటే కాదు కనుబొమ్మల నుండి కార్నియా వరకు, కన్నీళ్ళు ఏర్పడటం నుండి కనురెప్పలు వాల్చడం వరకూ ప్రతి దానిలోనూ ఓ ప్రత్యేకమైన అద్భుతం, ప్రబల నిదర్శనం ఉంది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ఇదీ అల్లాహ్‌ సృష్టి! ఇప్పుడు ఆయన తప్ప వేరితరులు ఏం సృష్టించారో మీరు నాకు చూపించండి?” (లుఖ్మాన్‌: 11)
నిజంగా మనిషి సృష్టించిందంటూ ఏది లేదు. ఉన్న వాటికి కొత్త రూపం ఇచ్చాడు అంతే. శూన్యం నుండి ఏ ఒక్క వస్తువును సృష్టించడం ఎవరి తరమూ కాదు.

కనురెప్పలు

మనకు తెలియకుండానే రోజుకి వేల సార్లు మనం మన కళ్ళ ను బ్లింక్‌ చేస్తుంటాము. ఇలా మన ప్రమేయం లేకుండానే జరిగే కదిలికలు చాలా వరకు తీవ్రమైన వెలుగు నుండి, బాహ్య ధూళి కణాల నుండి, కళ్ళు తమను తాము భద్రంగా ఉంచుకోవ డానికి దోహద పడుతుంటాయి. ఇలా మనం తెరుస్తూ మూస్తూ ఉన్నప్పుడు, కనురెప్పలు కన్ను యొక్క ఉబ్బెత్తుగా ఉండే ఆకారానికి సరిపోతాయి. అందు వలన కంటి యొక్క ఉపరితలాన్ని కనురెప్ప పూర్తిగా కప్పకలుగుతుంది.

కనుగుడ్డు వంపుకు అంత ఖచ్చితంగా కనురెప్ప ఫిట్ కాకపోతే, చేరుకోలేని కంటి మూలల నుండి ధూళి కణాలను తొలగిం చడం అసాధ్యమయ్యేది. మనకు తెలియకుండా జరుగుతున్న ఈ ప్రక్రియ నిజానికి మనకు పోల్చసాధ్యం కాని ఓ వరమే. ఖచ్చితమైన ఈ నిర్మాణం గురించి ఖుర్‌ఆన్‌ ఇలా చెబుతుంది:
”నిశ్చయంగా మేము ప్రతి వస్తువును ఒక (నిర్ణీత) విధి ప్రకారమ సృష్టించాము”. (ఖమర్‌: 49)
ఒకవేళ పైన పేర్కొన్న విధంగా ఆటోమేటిక్ బ్లింకింగ్‌ జరగకపోతే ఏమవుతుంది? ఏమవుతుందంటే – కళ్ళల్లో దుమ్ము బాగా ఎక్కువ చేరినప్పుడు మాత్రమే మనురెప్పలు ఆడించాలని మనకు జ్ఞాపకమొస్తుంది. ఫలితంగా, అతి చిన్న ధూళి కణం కూడా చివరికి పెద్ద సమస్యే సృష్టిస్తుంది. అది ఇన్ఫెక్షన్‌కి దారి తిస్తుంది.

ఇలా సగం మాత్రమే కళ్ళు శుభ్రమయితే, చూపు కూడా మందగిస్తుంది. ఇందులో మరో ట్విస్ట్ ఏమిటంటే బ్లింకింగ్‌ (కను రెప్పవాల్చడం) మధ్యనున్న కాలవ్యవధి. ఎటువిం అవరో ధాలు లేకుండా మనిషికి తన చుట్టూ మారుతున్న పరిశరాలు తెలియజేస్తూ ఉండాలి. ఉదాహరణకు మనం కారులో వెళు తుంటే మన చుట్టూ ఉండే ప్రదేశాలు మారిపోతూ ఉంటాయి కదా! అందుకని మనం చూస్తున్న వస్తువు నిరంతరం కన్పించడానికి ఈ బ్లింకింగ్‌ చాలా తక్కు సమయంలోనే జరగాలి. ఒక వేళ ఈ బ్లింకింగ్‌ వెంటవెంటనే జరగకుండా ఎక్కువ సమ యాన్ని తీసుకుంటే తీవ్ర ప్రమాదాలకి కారణం అవుతుంది. హైవే మీద ప్రయాణం చేస్తున్నారనుకోండి. రెప్పలు మూసుకుని వెంటనే తెరుచుకోకుండా కాసేపాగాక తెరుచుకుంటే భయకర మైన యాక్సిడెంట్ దారి తీస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే – మన కనురెప్పల బ్లింకింగ్‌ మనకు తెలియకుండానే జరుగుతూ ఉంది. బ్లింకింగ్‌ కావడంలోని ఈ సున్నితమైన బ్యాలెన్స్‌ మనం పుట్టినప్పటి నుండి జరుగుతూనే ఉంది. ఇది పోల్చ శక్యం కాని దైవ సృష్టికి ప్రతక్ష్య సాక్ష్యం! మరి ఇంత తెలిసిన, తెలుసుకుంటున్న మనషి ఆ పరమ దాత విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు? ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా ప్రశ్నిస్తుంది: ”ఓ మానవుడా! ఉదాత్తుడైన నీ ప్రభువును గురించి ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? (యదార్థానికి) ఆయనే నిన్ను సృష్టించాడు. నఖశిఖ పర్యంతం ఎలాంటి లోపం లేకుండా నిన్ను చక్కగా తీర్చిదిద్దాడు. ఆపైన నిన్ను తగు రితిలో పొందికగా మలిచాడు. తాను తలచిన ఆకారంలో నిన్ను కూర్చాడు”. (82: 6-8)

 

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...

Leave a Reply


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.