అమానతు నిర్వచనం

”వారు తమ అప్పగింతల, వాగ్దానాల పట్ల కడు అప్రమత్తంగా ఉంటారు”. (మోమినూన్‌: 8)
మనిషి జీవితానికి సంబంధించిన ఆధ్యాత్మిక, ఆర్థిక, ప్రాపంచిక, వాక్కు పరమయిన, క్రియా పరమయిన ప్రతి విషయానికి అమానతు అనే మాట వర్తిస్తుంది. అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు: ”ఎవరి అమానతులను వారికి అప్పగించండి. ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా తీర్పులు చేయండి” అని అల్లాహ్‌ మిమ్మల్ని గ్టిగా తాకీదు చేస్తున్నాడు. నిశ్చయంగా అల్లాహ్‌ మీకు చేసే ఉపదేశం ఎంతో చక్కనిది”. (అన్నిసా: 58)

మనిషి జీవితానికి సంబంధించిన ఆధ్యాత్మిక, ఆర్థిక, ప్రాపంచిక, వాక్కు పరమయిన, క్రియా పరమయిన ప్రతి విషయానికి అమానతు అనే మాట వర్తిస్తుంది.

అబూ సుఫ్యాన్‌ ఇస్లాం స్వీకరించిక ముందు రోము రాజు-హిరఖ్ల్‌ అడిగిన ప్రశ్న – ”మీ వద్దకు వచ్చిన ప్రవక్త విశ్వాస ఘాతుకానికి, నమ్మక ద్రోహానికి పాల్పడతాడా?” అని. దానికి సమాధాంగా – ‘లేదు’ అని బదులివ్వగా- ”ప్రవక్తలు ఇలానే ఉంటారు. వారు నమ్మక ద్రోహానికి ఒడి గట్టరు” అని రోము రాజు సెలవిచ్చాడు. (బుఖారీ)
”నిజాయితీ, అమానతు లేని వ్యక్తికి విశ్వాసం-ఈమాన్‌ ఉండదు. ఒప్పందాన్ని ఖాతరు చెయ్యని వ్యక్తికి ధర్మం ఉండదు” అన్నారు ప్రవక్త (స). (ముస్నద్‌ అహ్మద్‌)

”నీలో నాలుగు లక్షణాలుంటే, ఇక ప్రపంచంలో నీ వద్ద ఏదున్నా, లేక పోయినా చింతించాల్సిన అవసరం లేదు. 1) అమానతు రక్షణ. 2) సత్యవంతమయిన మాట. 2) సత్ప్రవర్తన. 4) కటిక దారిద్రియం లో సయితం నిరపేక్షత, సౌశీల్యం” అన్నారు ప్రవక్త (స). (ముస్నద్‌ అహ్మద్‌)

ఆరాధనల్లో అమానతు:

”నమాజులను కాపాడుకోండి. ముఖ్యంగా మధ్యస్థ నమాజును. అల్లాహ్‌ సమక్షంలో వినమ్రులయి నిలబడండి”. (బఖర;238)
”ఎవరయితే నమాజును కాపాడుకుంటారో అది వారి కోసం జ్యోతిలా పరిణమిస్తుంది. బలమయిన అధారంగా మారుతుంది. ప్రళయ దినాన మోక్ష ప్రదాయిని అవుతుంది” అన్నారు ప్రవక్త (స). (ముస్నద్‌ అహ్మద్‌)

శరీరావయవాల అమనతు:

”కళ్ళు వ్యభిచరిస్తాయి. మనసు వ్యభిచరిస్తుంది. కంటి వ్యభిచారం చూపు అయితే, మనసు వ్యభిచారం కోరిక. ఇక మర్మాంగం ఆ చూపును, ఆ కోరికను నిజమయినా చేస్తుంది, అబద్ధమయి చేస్తుంది” అన్నారు ప్రవక్త (స). (ముస్నద్‌అహ్మద్‌)

జనుల వస్తువుల రక్షణ:

”తిరిగి ఇవ్వాలన్న సదుద్దేశ్యంతో ఎవరయితే ప్రజలు సొమ్మును (అప్పుగా) తీసుకుంటాడో అతని తరపు నుండి అల్లాహ్‌ ఆ అప్పు ను తీరుస్తాడు. (అప్పు తీర్చే దారి చూపిస్తాడు). మరెవరయితే ఎగ్గొట్టే ఉద్దేశ్యంతో ప్రజల సొమ్మును తీసుకుంటాడో అల్లాహ్‌ దాన్ని నాశనం చేస్తాడు”- (అందులో శుభం ఉండదు, పైగా లేని పోని సమస్యలు వస్తాయి) అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ (స). (బుఖారీ)

పనిలో అమానతు:

”మీలోని ఒక వ్యక్తి ఒక పని చేసినప్పుడు దాన్ని సజావు గా, ఉత్తమ పద్ధతిలో పూర్తి చెయ్యడాన్ని అల్లాహ్‌ ఎంతగానో ఇష్ట పడతాడు” అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ (స). (బైహఖీ)

వ్యాపారంలో అమానతు:

ప్రవక్త (స) బజారు గుండా వెళుతూ ఖర్జూరాలు అమ్మే ఓ వ్యక్తి దగ్గర ఆగి, రాసి లోపల చెయ్యి వేసి చూడగా, అవి తడిగా ఉండటం గమనించారు. ”ఇదేమి?” అని ప్రశ్నించగా – ఆ వ్యక్త్తి: ‘రాత్రి వాన కురిసింది. కాసింత చెమ్మ చోటు చేసుకుంది, ఏమి లేదు’ అని సమాధానమిచ్చాడు. ”ప్రజలు చూసుకునేందుకు వాటిని పైన ఎందుకు పెట్ట లేదు” అని అడగటమే కాక ఇలా అన్నారు: ”మమ్మల్ని మోస పుచ్చిన వాడు మాలోని వాడు కాదు”. (ముస్లిం)

బాధ్యత కూడా అమానతే:

ఏదేని విషయంలో మనకు అప్పగించ బడిన బాధ్యత కూడా అమానతే. పిల్లల పెంపకం పెద్దల బాధ్యత. పెద్దల బాగోగులు చూడటం పిల్లల బాధ్యత. ప్రజలకు మేలు చేయడం నాయకుని బాధ్యత. నాయకుని యెడల వినయ, విధేయతలు కలిగి ఉండటం ప్రజల బాధ్యత. ఆ రకంగా ”మీలోని ప్రతి ఒక్కరూ బాధ్యతా పరులే. మీలోని ప్రతి ఒక్కరితో వారి బాధ్యత గురించి అడగడం జరుగుతుంది” అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ (స). (బుఖారీ, ముస్లిం)

రహస్య సంభాషణ, ఇంటి గుట్టు కూడా అమానతే:

”ప్రళయ దినాన అల్లాహ్‌ దగ్గర స్థాయి రీత్యా అత్యంత నీచమయినవాడు ఎవరు? అంటే, అలుమగలు పరస్పరం సంభోగించుకున్న తర్వాత ఆ రహస్యాలను ఇతరులతో చెప్పుకు తిరిగేవారు” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)

పెళ్లయిన కొత్తలో ఇలా భర్త తన ఫ్రెండ్స్‌తో, భార్య తన స్నేహితురాండ్రతో శోభన గదిలో జరిగిన విషయాల గురించి చెప్పుకోవడం కొన్ని సమాజా లలో పరిపాటి. అలాంటి సిగ్గుమాలిన చేష్ట పరమ నీచమయినదని ఈ హదీసు ద్వారా బోధ పడుతోంది. అలాగే రాత్రి చీకిలో కొందరు చేసిన పాపిష్టి పనుల్ని ఎవరూ చూసి ఉండరు. అల్లాహ్‌ కూడా వారి ఆ నీతి బాహ్యత మీద పరదా వేసి ఉంటాడు. కానీ, తెల్లారిన తర్వాత తాము చేసిన నిర్వాకాన్ని సిగ్గు వదిలి మరి చెప్పుకుంటూ ఉంటారు. అలాగే నేడు రంథ్రాన్వేషణ మితిమీరి పోతున్నది. మనిషి వ్యక్తిగత ప్రోఫైల్‌ను హాగ్‌ చెయ్యండం, ఒకరిని గురించి చెడుగా వినేందుకు ఆసక్తి చూపడం అన్నీ ఈ కోవలోకి వస్తాయి.

మాట కూడా అమానతే:

”మనిషి నుండి వెలువడే ఏ మాటయినా దాన్ని నమోదు చేసుకోవడానికి అతని దగ్గర పర్యవేక్షకుడు ఉంటాడు” (గౌరవనీయులయిన ఇద్దరు దైవ దూతలుాంరు). (ఖాఫ్‌:18) అంటుంది ఖుర్‌ఆన్‌. అంటే మన ప్రతి చేష్ట, ప్రతి మాట నమోదు చేసుకో బడతున్న దన్న మాట. కాబట్టి – ఏది మ్లాడాలనుకున్నా ఒకటికి పది సార్లు ఆలో చించుకొని మాట్లాడాలి. రేపు ప్రళయ దినాన మన కర్మల్ని హరించే వాటిలో మనం ఒకరికి అనరాని మాట అనడం కూడా ఒకటయి ఉంటుం దని గుర్తుంచుకోవాలి.
ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కూడా అమానతే: ప్రవక్త (స) ఇలా అన్నారు: ”కపటి లక్షణాలు ఇవి. అతని ఏదయినా వస్తువు అప్పగిస్తే స్వాహా చేసేస్తాడు. మాట్లాడితే అబద్దమే మ్లాడుతాడు. మాట ఇస్తే తప్పుతాడు. గొడవ పడితే పచ్చి బూతులు తిడతాడు”. (ముస్లిం)

చివరి మాట: ఖుర్‌ఆన్‌ కూడా అమానతే. ఇస్లాం ధర్మం కూడా అమానతే. ప్రవక్త (స) వారి జీవని కూడా అమానతే. వాటిని వాటి హక్కుదారుల వరుకు చేరవేయడం ముస్లిం అయిన ప్రతి వ్యక్తి విధ్యుక్త ధర్మం.

Related Post