ఆమెను గౌరవించండి.. ఎందుకంటే…

ఆమెను గౌరవించండి.. ఎందుకంటే… ..ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో ఆ దేశం సస్యస్యామలంగ వుంటుంది గనక.
ఎందుకంటే… బ్రతుకు ముల్లబాటలోన జతగా స్నేహితురాలిగా ఉంటుంది గనక….
ఎందుకంటే… కష్టాలు కుండపోతగా కురిసి గుండె చేరువైన వేళ కన్నీళ్ళు తుడిచే తోడబుట్టిన చెల్లిలా ఉంటుంది గనక…..
ఎందుకంటే… వెనక ముందు రాలినప్పుడు వెన్నుతట్టిన భార్యగా ఉంటుంది గనక… .
ఎందుకంటే… పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లిగా ఉంటుంది గనక…
ఎందుకంటే… కష్టంలో ముందుండి…. సుఖంలో ప్రక్కనుండి ….విజయంలో వెనకుండి ….ఎల్లప్పుడు పక్కనే ఉంటుంది గనక .

ఆమెను గౌరవించండి.. ఎందుకంటే...

ఎందుకంటే… బ్రతుకు ముల్లబాటలోన జతగా స్నేహితురాలిగా ఉంటుంది గనక….
ఎందుకంటే… కష్టాలు కుండపోతగా కురిసి గుండె చేరువైన వేళ కన్నీళ్ళు తుడిచే తోడబుట్టిన చెల్లిలా ఉంటుంది గనక…..
ఎందుకంటే… వెనక ముందు రాలినప్పుడు వెన్నుతట్టిన భార్యగా ఉంటుంది గనక… .
ఎందుకంటే… పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లిగా ఉంటుంది గనక…
ఎందుకంటే… కష్టంలో ముందుండి…. సుఖంలో ప్రక్కనుండి ….విజయంలో వెనకుండి ….ఎల్లప్పుడు పక్కనే ఉంటుంది గనక .

ఆమె మీ తల్లి… చెల్లి… భార్య… కూతురు!
అతివ… అబల… అర్థాంగి!
మగువ… మహిళ… నారీమణి! అక్షరాలా తెలుగులో ఆమెకు గల పేర్లు 300లకు పై చిలుకే.

అవును! మమతకు మారు పేరామె. త్యాగానికి నామాంతరం ఆమె. అనురాగానికి ప్రతిరూపం ఆమె.
ఓపికలో అందెవేసిన చేయి ఆమె. లజ్ఞా బిడియాలకు నిర్వచనం ఆమె.
ప్రకృతి ప్రసాదించిన మహదానుగ్రహం ఆమె! మట్టితో మలచి, మహికే రాజుగా చేసిన మనిషికి అతని ఒంటరితనంలోని ఉదాసీనతను, వైరాగ్యాన్ని దూరం చేయటానికి పట్టమహిషి’గా సృష్టికర్త వొసగిన వరం ఆమె!

తనకు మాత్రమే సొంతమైన దైవానుగ్రహాల ద్వారా ఆమె అనుక్షణం మనిషిని వెన్నంటి ఉంటుంది. వివిధ రూపాలలో, వివిధ దశలలో మగనికి తోడ్పాటునందిస్తూ అతని విజయాల వెనుక కీలకపాత్ర పోషిస్తుంది. బాల్యం నుంచి యవ్వనం వరకు, యవ్వనం నుండి వార్ధక్యం వరకు తోడూనీడగా ఉంటుంది. మానవుడు ‘అత్యావస్థ నుండి ఇహలోక యాత్రకు బయలు దేరినప్పుడు అతని ప్రప్రథమ మజిలీ మాతృగర్భమే కదా! ఆ మజిలీలో అతను నవమాసాలు మకాం వేస్తాడు. ఈ నవమాసాలు పీడనపై పీడనను భరిస్తూ ఆమె సంతోషంగా అతన్ని మోస్తుంది. తన రక్తమాంసాలను పంచి అతనికి ఆతిథ్యమిస్తుంది. మరి అతను సంపూర్ణ మానవాకారాన్ని సంతరించుకుని బయటి ప్రపంచాన్ని చూడదలచినప్పుడు భరించశక్యంకాని పురిటి నొప్పులను భరిస్తూనే బోసినవ్వుల, లేత బుగ్గల అందమైన పూవును లోకానికి కానుకగా సమర్పిస్తుంది!

మానవ జగతికి ఆమె చేసిన మేలు వెలకట్టలేనిది! అందుకే సృష్టికర్త తల్లిదండ్రుల యెడల సద్భావంతో మెలగండని తాకీదు చేయదలచినప్పుడు తల్లి రూపంలో అమె పడిన బాధలను ప్రత్యేకంగా ప్రస్తావించాడు: “అతని తల్లి అతన్ని బాధపడుతూనే గర్భంలో మోసింది. బాధపడుతూనే అతన్ని ప్రసవించింది. అతన్ని గర్భంలో మోయటానికి, పాలు విడిపిం చటానికి మొత్తం ముప్ఫయి మాసాల సమయం పట్టింది.” (ఆల్ ఆహూఫ్ : 15) మాతృప్రేమ, మమతానురాగాలు ఖరీదైన మార్కెట్లలోగాని, హైక్లాను నర్సరీలలోగాని శిశువుకు దొరకవు. తల్లి చను బాలలో, ఆమె వెచ్చని ఒడిలో మాత్రమే ఆ అవ్యాజాను రాగాలు లభిస్తాయి. అతి బలహీనమైన ఆ పసికందు శ్రేయం కోసం ఆమె రేయనక పగలనక, ఎండనక, వాననక బాధను దిగమ్రింగుతుంది. అతని సంతోషం కోసం ఏ ఇబ్బంది నయినా సంతోషంగా భరిస్తుంది. తన నిద్రాహారాలను సయితం త్యాగం చేసి అతన్ని ఎత్తుకుని ముద్దాడుతుంది. అతన్ని చూసి మురిసిపోతుంది. ఏడిస్తే లాలిస్తుంది. జో కొడు తుంది. జోలపాట పాడుతుంది. చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది. ‘అల్లాహ్ మియా’ అంటూ
ఆకాశం వైపు అతని చేతుల్ని చాచి ప్రార్థించటం నేర్పుతుంది. బిస్మిల్లాహ్, సుబహానల్లాహ్, ఇషా అల్లాహ్, మాషా అల్లాహ్, అలహమ్బులిల్లాహ్ లాంటి పదాలన్నీ ఉగ్గుతో పెట్టిన విద్యగా ఒంటబట్టిస్తుంది. అతని తప్పటడుగులకు కాబా గృహం దారి చూపుతుంది.

ఈ విధంగా ఒక మనిషి అనితర సాధ్యమైన ఆమె ప్రేమానురాగాల ఆసరాతో, అసామాన్యమైన ఆమె త్యాగాలతో, అనిర్వచనీయమైన ఆమె ఆశీస్సులతో బాల్య దశను అధిగమిస్తాడు. ప్రాజ్ఞ వయస్సుకు చేరుకుంటాడు. పరువం ఉరకలు వేయగా ఊహాలోకాల్లో విహరిస్తాడు. అలజడి రేపే కోర్కెల్ని అదుపులో ఉంచుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతాడు. సరిగ్గా ఆ సమయంలో ఆమె ‘అర్థాంగి’ రూపంలో అతని జీవితంలోకి వస్తుంది. ఉవ్వెత్తున ఎగిసిపడే అతని భావోద్రేకాలకు ప్రేమానురాగాల ఆనకట్ట వేస్తుంది. అతని కోసం తన హృదయనందనాన్ని వికసింపజేస్తుంది. అతని కంటికి చలువను ఇస్తుంది. అతని మనసును కుదుటపరుస్తుంది. అతని జీవన మార్గంలో పువ్వులు పరుస్తుంది. అతని విజయాల బాటను సుగమం చేస్తుంది. తన విశ్రాంతిని సయితం పట్టించుకోకుండా భర్తను మెప్పించే ప్రయత్నం చేస్తుంది. అతని ఆజ్ఞల్ని శిరోధార్యంగా భావిస్తుంది. పతి సేవే పరమా వధిగా తలపొస్తుంది. అందుకే సర్వోన్నతుడైన అల్లాహ్ అలు మగల ఈ అనురాగ బంధాన్ని తన సూచనలలో ఒక సూచ నగా ఖరారు చేశాడు.
“మరి ఆయన సూచనలలో ఒకటేమిటంటే ఆయన మీ కోసం మీ భార్యలను స్వయంగా మీలోనుంచే సృష్టించాడుమీరు వారి దగ్గర సుఖం పొందడానికి. ఇంకా ఆయన మీ మధ్య ప్రేమను, కారుణ్యాన్ని సృజించాడు.” (అర్రూమ్ : 21)
కేవలం రెండు మూడు పలుకుల ద్వారా భర్తతో ఆమెకు వివాహ బంధం ఏర్పడింది. అంతే! ఆమె తన కన్న తల్లిదండ్రు లను వదలి వచ్చేసింది. పుట్టింటికి వీడ్కోలు చెప్పేసింది. అన్నదమ్ముల నుండి, అక్కాచెల్లెళ్ళ నుండి సెలవు తీసేసు కుంది. ఆత్మీయులను, స్నేహితురాండ్రను జలజలా కారే అక్రధారలతో వీడ్కోలు చెప్పి అత్తింటి వైపునకు అడుగులు వేసుకుంటూ వచ్చేసింది. ఎంత గొప్ప త్యాగం! ఎంత కఠిన మైన పరీక్ష! బాల్యం నుంచి యవ్వనం వరకు ఏ చీకూచింత లేకుండా పెరిగిన స్వేచ్ఛాయుత వాతావరణాన్ని వదిలేసి ఆంక్షల నిబంధనల సంకెళ్ళలో తనను కట్టి పడేసుకుంటుంది! ఒక అపరిచిత పురుషుడు- ఒక అపరిచిత స్త్రీ ఒక్కటై, మమేకమై, పాలు తేనియల్లా కలిసిపోతున్నారు. వారిద్దరి మధ్య ఏ అడ్డూ ఉండదు, వారిరువురూ ఒండొకరి కోసం ఏ త్యాగం చేయడానికైనా, ప్రాణాలివ్వటానికైనా సిద్ధమవు తారు. మనిషి తన సహధర్మచారిణితో గడిపే మధుర క్షణా లను ప్రపంచంలోని అతి గొప్ప వరంగా భావిస్తాడు. ఇది దైవసూచన కాకపోతే మరేమిటి? అందుకే- “ఒక విశ్వాసి
భీతి తరువాత, సౌశీల్యవతి అయిన సతీమణిని మించిన అనుగ్రహం మరేదీలేదు” అని అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారు. (ఇబ్ను మాజు). వేరొక ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త(స) ఈ విధంగా కూడా అన్నారు : “ఈ ప్రపంచం సామగ్రితో నిండిన స్థలం. అయితే భోగభాగ్యాలతో నిండిన ఈ సాధన సంపత్తుల జగతిలో ఉత్తమురాలైన భార్యను మించిన వస్తువు మరేదీ లేదు.”
ఇబ్ను మాజ) మరి ఇంతటి విలువైన వస్తువు భర్త సాంతమైనపుడు, ఆ కోమలాంగిని సుఖ పెట్టవలసిన బాధ్యత భర్తపై ఉందా? లేదా? ఈ విషయంలో ఇస్లాం మనకిచ్చే శిక్షణ ఏమిటో ఖుర్ఆన్ హదీసుల వెలుగులో చూడండిఅంతిమ దైవప్రవక్త(స) ఒకరోజు రాత్రి నిద్ర నుంచి మేల్కొ న్నారు. చప్పుడు కాకుండా నెమ్మదిగా లేచారు. ఆ కుటీరంలో సతీమణి హజ్రత్ అయిషా(ర.అహా) కూడా పడుకునే ఉన్నారు. ఏమాత్రం శబ్దం రాకుండా తలుపు తెరిచి, జన్నతుల్ బఖీ (ఖబరస్తాన్) వైపునకు నడచిపోయారు. మృతుల మన్నింపు కోసం ప్రార్థించటానికి, ప్రవక్త(స) వారు ఎందుకింత నింపాదిగా వ్యవహరించారు. అంటే తన సహధర్మచారిణి అయిన అయిషా(ర.అహా)కు అనవసరంగా నిద్రాభంగం కలిగించటం ఆయన(స)కు ఇష్టం లేదు. లోకంలో ‘పతి దేవుళ్ళు’గా చెలామణి అవుతూ ప్రతి చిన్న విషయానికి సతిని శాసించే మగ మారాజులకు ఈ సంఘటన కనువిప్పు కలిగిం చాలి. ఇల్లాలి పై జులుం చేసే భర్త ఆమె తన ఇంటి నౌకరు కాదన్న సంగతిని తెలుసుకోవాలి. “వారితో ఉత్తమ రీతిలో కాపురం చెయ్యండి” (వ ఆఫ్రూ హున్న బిల్ మారూఫ్) అని అల్లాహ్ ఆదేశిస్తున్నాడు. కాబట్టి ఆమెను ఆదరించాలి. ఆమెలోని లోపాలను ఉపేక్షించాలి. ఆమెలోని సుగుణాలను మెచ్చుకోవాలి. ఆమెను ప్రోత్సహిస్తుండాలి. అంతేగాని, ఆమె వైవాహిక జీవితాన్ని కారాగారవాసంగా మార్చరాదు. యవ్వనంలోనూ, ముసలితనంలోనూ, పెళ్ళ యిన కొత్తలోనూ, పిల్లలు కన్న తరువాత కూడాను- నిత్యం ఆమెను ఒకే విధంగా చూడాలి. ఆమె తన వంతు ఆస్తిని తెచ్చినా, వట్టి చేతులతో వచ్చినా- భార్యగా ఆమె స్థానం మాత్రం చెక్కుచెదరకూడదు. ఎట్టి పరిస్థితిలోనూ ఆమెకు తన భర్త సంపాదన పై హక్కు ఉంటుంది. భర్తకు భార్యపై ఎటువంటి హక్కులున్నాయో భార్యకు కూడా భర్తపై- ధర్మం ప్రకారం- అటువంటి హక్కులే ఉన్నాయి. ఎందుకంటే వారిద్దరూ మానవ జాతికి చెందినవారే. ఇరువురి అవసరాలూ దాదాపు ఒక్కటే. అన్న వస్త్రాలు ఇద్దరికీ అవసరమే. సుఖ సౌఖ్యాలతో ఇద్దరూ ఆనందిస్తారు. బాధను ఇద్దరూ ఓర్చుకో లేరు. పరిశ్రమ ద్వారా ఇద్దరూ అలసిపోతారు. పౌరుషం ఏ ఒక్కరి సాంతం కాదు- స్వాభిమానం ఇద్దరికీ ఉంటుంది. గౌరవమర్యాదలు భర్త వంతూను, అవమానాలు భార్య వంతు అంటే కుదరదు. ఇస్లాం ఎన్నడూ అలా చెప్పలేదు. పైగా ఇస్లాం ప్రబోధన ఏమిటో చూడండి :
“మానవులారా! మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణినుండి పుట్టించాడు. అదే ప్రాణినుండి దాని జతను సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను లోకంలో వ్యాపింపజేశాడు. ఏ దేవుని పేరు చెప్పుకుని మీరు పరస్పరం మీ హక్కులను కోరుతారో, ఆ దైవానికి భయపడండి. బంధుత్వ సంబంధా లను తెంచటం మానుకోండి, అల్లాహ్ మిమ్మల్ని గమనిస్తు
న్నాడనే విషయాన్ని తెలుసుకోండి.” (అన్ నిసా- 1) దివ్య ఖుఠాలోని ఈ వచనం ద్వారా అవగతమయ్యే దేమిటంటే స్త్రీలయినా, పురుషులైనా మానవత రీత్యా ఒక్కటే.
తెలుసా? “స్త్రీ తన భర్త ఇంటికి సామ్రాజ్జి” అందుకే భర్త తన భార్యను అన్నివిధాలా సుఖ పెట్టాలి. తన : శక్తిస్థామతల మేరకు ఆమె అవసరాలు తీర్చేందుకు యత్నిం: చాలి అతను + చీటికిమాటికి ఆమెకు చీవాట్లు పెట్టకూడదు. + ఇతరుల ముందు ఆమెను మందలించకూడదు. :

ఒకవేళ మందలించవలసి వచ్చినా మృదువుగానే : మందలించాలి.
కోపం వచ్చినప్పుడు ఆమె వెనుకటి తప్పిదాలను ఏకరువు పెట్టకూడదు. ఆమె వంశస్థుల్ని తిట్టిపోయకూడదు.
ఆమెలోని సుగుణాలను విస్మరించకూడదు. ఆమె మంచితనాన్ని మెచ్చుకుంటూ ఉండాలి.
హదీసులో ఈ విధంగా ఉంది: “ఏ విశ్వానీ మరే విశ్వాసురాలిని వేరుపరచకూడదు. ఆమెలోని ఏ గుణమున్నా అయిష్టకరమైనదిగా ఉంటే, మరొక గుణం ఇష్టకరంగా ఉంటుంది.” (ముస్లిం ఆమె బాధ్యత క్రింద ఉన్న ఇంటి అంతరంగిక విష యాల్లో పడ్డాక జోక్యం చేసుకోవటం మంచిది కాదు.
మహనీయ ముహమ్మద్ (సఅసం) వారిలా అన్నారు : “స్త్రీ తన భర్త ఇంటికి బాధ్యురాలు. కాబట్టి ఆమెయే ఆ విషయంలో ఇన్చార్జి (మున్నది అహ్మద్- 6/ 256).
ఆమెపై మోయలేనన్ని బరువు బాధ్యతలు మోపరాదు. మాటిమాటికీ విడాకులిస్తానని బెదిరించకూడదు. విడాకుల విషయంలో ఒట్టు వేసుకోకూడదు.
కోపంలో ఉన్నప్పుడు భార్యతో కాస్త ముభావంగా : ఉంటే చాలు. చిందులు వేయనవసరం లేదు.
ఏ ఆధారమూ లేకుండా అనవసరంగా ఆమె శీలాన్ని – శంకించరాదు.
అత్తింటివారిపై ఉన్న కని అర్థాంగిపై తీర్చుకోరాదు. – ఇది చాలా పెద్ద అన్యాయం.
అన్యోన్యంగా కాపురం – చేయటానికి, సంసార రథం సాఫీగా సాగిపోవటానికి ఇస్లాం ప్రతిపాదించిన ఈ సూచనలను పాటించాలి.
అత్తింటి వారి మంచి చెబ్బరలను, బాగోగులను చూడవలసిన బాధ్యత భర్తపై ఏమాత్రం లేదుగాని ఒకవేళ అతను అవసరం మేరకు అత్తవారి ఇబ్బందులను, పట్టించుకోగలిగితే అది అతని పాలిట పుణ్యకార్యం, అవుతుంది.
అతని ఉపకార వైఖరి మూలంగా , బంధుత్వ సంబంధాలు మరింతగా బలపడతాయి. అరమరికలు దూరమవుతాయి. అప్పుడే అతను ఒక , మగవాడుగా, ఆదర్శ పురుషుడుగా, ఉత్తమ భర్తగా – పేరు తెచ్చుకుంటాడు.

 

Related Post