జీ ఖఅదహ్ మాసం ఒక చూపులో

”యథార్థం ఏమిటంటే, ఆకాశాన్నీ భూమినీ అల్లాహ్ సృష్టించినప్పటినుండీ, మాసాల సంఖ్య అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. వాటిలో నాలుగు నిషిద్ధ మాసాలు. ఇదే సరియైన గణనపద్ధతి. కనుక ఈ నాలుగు మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి”. (దివ్యఖుర్ఆన్ 9:36)

జీ ఖఅదహ్ మాసం ఒక చూపులో

నిషిద్ధ మాసాలైన జి అఖదహ్, జిల్ హజ్జా, ముహర్రం, రజబ్ నెలల్లో ఉపవాసాలు పాటించు

సుమారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం నెలల గురించి అల్లాహ్ చేసిన ప్రకటన ఇది. ఈ సృష్టి ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి 12నెలలే ఉన్నాయన్నది ఖుర్ఆన్ ద్వారా బోధపడుతోంది. ఒక అరా ప్రాంతాల్ని వదలి ఏ దేశ వాసులైనా, ఏ మతావలంబీకులైనా అందరిదీ ఇదే మాట. ఈ ఫన్నెండు నెలల్లోనూ నాలుగు నిషిద్ధ మాసాల గురించి ఖుర్ఆన్ ప్రకటన చేసింది. జీ ఖఅదహ్, జిల్ హజ్జా, ముహర్రం నెలలు వరుసగా ఒకదాని తరువాత వస్తాయి. రజబ్ నెల జుమాదల్ ఆఖర్ షాబాన్ నెలల మధ్యలో వస్తుంది. జీ అఖద్ నెల ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం.

జుల్ ఖఅదఃను జుల్ ఖఅదః అని పేరు ఎందుకొచ్చింది? అంటే, పూర్వ కాలంలో ప్రజలు ఈ మాసంలో ఆరాధన నిమిత్తం ఇంటి పట్టున కూర్చొనే వారు. యుద్దాలాంటి కార్యాల్లో పాల్గొనే వారు కాదు. 

౧) ఇది నిషిద్ధ మాసాల్లోని ఒక మాసం.

౨) నిషిద్ధ మాసాల్లో ఉపవాసం ఉండటం ఉత్తమం. ఏ ఒక్క నేలను ప్రత్యేకిమ్చకుండా. (ఉదాహరణకు – రజబ్ నెల)
౩) ఈ నెలలో ప్రవక్త (స) తన హజ్ ఉమ్రాతో కలిపి నాలుగు ఉమ్రాలు చేశారు. అంటే ఉమ్రా చెయ్యడం ఉత్తమం.
౪) ఇది హజ్ మాసం గనక ఈ మాసపు ఉమ్రా రమజాన్ మాసపు ఉమ్రా కన్నా ఘనతరమైనది అని హజ్రత్ ఆయిషా, అబ్డుల్లః బిన్ ఉమర్, (రజి), అతా (రహ్మా ) అభిప్రాయ పడ్డారు.

౫) ప్రవక్త మూసా (అ) వార్కి అల్లాహ్ నలభై రోజుల గడువు ఏదైతే ఇచ్చాడో అందులో ముప్ఫై రోజులు ఈ మాసానివి, పది రోజులు జుల్ హిజ్జా మాసానివి అని ఖుర్ ఆన్ వ్యాఖ్యానకర్తలు పేర్కొన్నారు.
౬) బద్రుల్ మౌయిద్ (యుద్ధం అయితే జరగ లేదు ) కోసం ముస్లింలు బయలు దేరారు. ఇది అబూ సుఫ్యాన్ ఉహద్ సంగ్రామంలో చేసిన వాగ్దానం.

౭) హిజ్రీ శకం అయిదవ సంవత్సరం బనూ ఖురైజా యుద్ధం జరిగింది.
౮) హిజ్రీ శకం ఆరవ సంవత్సరం సులః హుదైబియా జరిగింది. ఇవి రూడి అయిన విషయాలు.

నిరంతరాయంగా ఉపవాసాలు పాటించి బక్క చిక్కిన ఓ సహచరుణ్ణి చూసి, విషయం తెలుసుకొని ఇలా అన్నారు: ‘‘ఓర్పు సహనాల మాసమంతా (రమజాను) ఉపవాసాలు పాటించండి. ప్రతీ నెలలో ఒక్కరోజు ఉపవాసం పాటించండి’’ అని చెప్పారు ప్రవక్త మహనీయులు. అందుకా వ్యక్తి – ‘‘ఇంతకంటే ఎక్కువ రోజులు ఉపవాసాలు పాటించే శక్తి నాలో ఉంది’’ అని చెప్పాడు. దానికి ప్రవక్త ‘‘ప్రతీ నెల రెండు రోజులు ఉపవాసం పాటించు’’ ‘‘నాలో రెండు రోజులకంటే ఎక్కువ రోజులు ఉపవాసముండే స్థోమత ఉంది’’అని అభ్యర్థించాడు దానికి ప్రవక్త ‘‘నిషిద్ధ మాసాలైన జి అఖదహ్, జిల్ హజ్జా, ముహర్రం, రజబ్ నెలల్లో ఉపవాసాలు పాటించు అని చెబుతూ తన మూడు వేళ్లను పట్టుకుని వదిలిస్తూ సైగ ద్వారా ‘‘నెల నెలా మూడు రోజులు ఉపవాసాలు పాటించు’’ అని అన్నారు ప్రవక్త (స). (ముస్నద్ అహ్మద్) (ఈ హదీసుని బలహీనమైనదిగా ఇమాం అల్బానీ (ర) పేర్కోన్నారు).

గమనిక: 

ఈ నెలలో శుభకార్యాలను నిషేధించుకోవడం మూఢనమ్మకమవుతుంది. చాలామంది ముస్లిములు రమజాన్ నెల తరువాత షవ్వాల్ నెలలో వివాహాలు జరుపుతారు. జీ ఖఅదహ్ నెలలో ముహమ్మద్ ప్రవక్త (సఅసం) హజ్రత్ జైనబ్ (ర.అ )ను నికాహ్ చేసుకున్నారు. ఈ నెలలో నికాహ్ ను నిషేధించడం దుస్సాహసం అవుతుంది.

Related Post