దగుల్బాజీ దేవుళ్ళకు దూరంగా ఉండండి!

ఈ సృష్టిలో ఉన్నతమైన సృష్టి మానవ సృష్టి. అంతటి శ్రేష్టమైన మానవ జాతి దొంగ బాబాలు, మంత్రగాళ్ళ చేతిలో బలహీనులుగా తయారయ్యిందా!!

?మానవుల బలహీనలతలను ఆసరాగా చేసుకొని ఈ దొంగ బాబాలు, మంత్రగాళ్ళు మోసాలకు హద్దులు దాటి పోయింది.

??అనారోగ్యం పేరిట బాబాల దగ్గరికి మంత్రగాళ్ళ దగ్గరి కన్య పిల్లలను పిలుచుకోవటం, స్త్రీలు ఎలాంటి మహ్రమ్ లేకుండా వెళ్ళడం, స్త్రీలు వారి చెడు చూపులకు గురికావటం, లైంగిక దాడులకు పాల్పడటం నేడు మన చూస్తూనే ఉన్నాము. రోజు ఇలాంటి దుశ్చర్యలు చూస్తూ కూడా మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉన్నారు అమాయక స్త్రీలు.?

‘ఎవరైతే తాయత్తు వ్రేళాడదీస్తాడో అల్లాహ్ అతని వాంఛను పూర్తి చేయకూడదు’ అని అన్నారు.  (అహ్మద్)

??‍? స్త్రీలు ఎలాంటి మహ్రమ్ లేకుండా వెళ్ళడం చాలా పెద్ద తప్పు. షైతాను మానవులకు బహిరంగ శత్రువు. వాడి నుండి అల్లాహ్ శరణు కోరాలి. ఆడ, మగ ఇద్దరుంటే మూడవ వాడు షైతాను. వాడు మానవుడ్ని తప్పుడు మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: ఏ స్త్రీ కూడా ఒక రాత్రి ఒక పగలు ‘మహ్రమ్’ లేనిది ప్రయాణము చేయకూడదు.
(“మహ్రమ్” అనగా వరుస రీత్యా వివాహానికి శాశ్వతంగా నిషిద్దమైనవారు.)
?సహీ బుఖారీ : 1087, ముస్లిం 1331

?మానవుడు ప్రతిదానికి భయపడటం మానాలి. మన ప్రియప్రవక్త ముహమ్మద్(స) గారు చెప్పిన మార్గాలను అనుసరించి తమ అనారోగ్యాల నుండి స్వస్ధత పొందటానికి ప్రయత్నించాలి.

?అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించాడు;
وَنُنَزِّلُ مِنَ ٱلْقُرْءَانِ مَا هُوَ شِفَآءٌۭ وَرَحْمَةٌۭ لِّلْمُؤْمِنِينَ ۙ وَلَا يَزِيدُ ٱلظَّٰلِمِينَ إِلَّا خَسَارًۭا

మేము అవతరింపజేసే ఈ ఖుర్‌ఆన్‌ విశ్వాసుల కొరకు ఆసాంతం స్వస్థత, కారుణ్య ప్రదాయిని. అయితే దుర్మార్గులకు (దీని వల్ల) నష్టం కలగటం తప్ప మరే వృద్ధీ జరగదు. (బసి ఇస్రాయీల్) (17)ఆయాత్(82).

?పై ఆయతులో ఖుర్ఆన్ యందు స్వస్దత ఉంది అని స్పష్టంగా వివరించినప్పటికి ఈనాడు చాలా మంది ముస్లింలు ఖుర్ఆన్ సందేశాన్ని వదలి ఏదైనా ఆపద సంభవించగానే జ్యోతిష్యుల, అంత్ర-మంత్ర గాళ్ళ వద్దకు పరుగెత్తుతారు. వాళ్ళు ఇచ్చే తాయత్తులలో స్వస్ధత ఉందని బావిస్తారు. కాని ఇలా చేయడం షరియత్ కు విరుద్దమైన కార్యము మరియు షిర్క్ అగును.

?స్వయంగా ప్రవక్త ముహమ్మద్ (స) వారు: ‘ఎవరైతే తాయత్తు వ్రేళాడదీస్తాడో అల్లాహ్ అతని వాంఛను పూర్తి చేయకూడదు’ అని అన్నారు.  (అహ్మద్)

?-అంతే కాకుండా ‘ఎవరైతే జ్యోతిష్యం చెబుతాడో లేక జ్యోతిష్యం చెప్పించుకుంటాడో వారు ఇస్లాం యెుక్క షరియత్ ను ధిక్కరించినట్లే’ అని అన్నారు.

?? ప్రవక్త ముహమ్మద్ (స) వారు “ఎవడైతే జ్యోతిష్యుని వద్దకు వెళ్ళి అతనిని ఏధైనా విషయం గురించి ప్రశ్నిస్తాడో అతని నలభై రోజుల నమాజు అంగీకరింపబడదు” అని అన్నారు. ?- ముస్లిం

??ఇంకా “ఏ వ్యక్తి అయిన సోది చెప్పేవాడు లేక జ్యోతిష్యుని వద్దకు వెళ్ళి అతను చెప్పిన మాటలను విశ్వసిస్తే అతను ప్రవక్త ముహమ్మద్(స) పై అవతరించిన షరియత్ ను ధిక్కరించినట్లే” అని అన్నారు. (?అబూ దావూద్, తిర్మిజి , ఇబ్నెమాజ ).

?కనుక విశ్వాసులమైన మనం అవిశ్వాసుల కార్యాలను విడిచి పెట్టి ఖుర్ఆన్ ద్వారా స్వస్దతను పొందవలెను. ఆపద సంభవించినప్పుడు అంత్రం-మంత్రం గాళ్ళు, జ్యోతిష్యులు, చేతబడులు చేయువారిని ఆశ్రయింపక ఓర్పు వహించి అల్లాహ్ యందు నమ్మకం ఉంచి ఖుర్ఆన్ మరియు హదీసుల ద్వారా స్వస్ధత పొందుటకు ప్రయత్నించుట విశ్వాసుల (ముస్లిం) లక్షణము. అలా కాకుండా తాయత్తులు మరియు షరియత్ కు విరుద్ద కార్యముల ద్వారా స్వస్ధత పొందదలిస్తే అటువంటి వారు అల్లాహ్ ఆగ్రహానికి గురై ఇహ-పరలోకాలలో అల్లాహ్ శిక్షకు గురి కావలసిన పరిస్ధితి ఏర్పడుతుంది. అల్లాహ్ మమ్ములను ఇటువంటి కార్యలకు దూరంగా ఉంచుగాక ఆమీన్.
?ప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా అన్నారు “ఎవరైతే తాయత్తు వ్రేలాడ దీస, అతను షిర్క్ చేసాడు” అని అన్నారు. (?అహ్మద్)

?అల్లాహ్ మానవులకు మూఢనమ్మకాల నుంచి కాపాడుగాక! మంత్రగాళ్ళ కీడు నుండి మన ఆడపడచులను కాపాడుగాక!ఆమీన్ యా రబ్?

Related Post