బహు భార్యాత్వం

ప్రశ్న: ముస్లింలకు ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు కలిగి వుండే అనుమతి ఎందుకు? అంటే ఇస్లాం ఒకరికంటే అధిక మందిని వివాహమాడే అనుమతి ఎలా ఇచ్చింది?

జవాబు: 1) బహు వివాహాల పారిభాషిక అర్థం: దీని అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు కలిగి వుండే, లేక ఒక స్త్రీ ఒకరి కంటే ఎక్కువ మంది భర్తలు కలిగివుండే వ్యవస్థ. ఇది రెండు రకాలుగా ఉంటుంది :
1. ఒక పరుషుడు ఒకరికంటే ఎక్కువ భార్యలు కలిగి ఉండటం.(పోలిగామి)
2. ఒక స్త్రీ ఒకరికంటే ఎక్కువ మంది భర్తలు కలిగి ఉండటం. (పోల్యాండ్రీ) ఒక పురుషుడు, ఒక నియమిత పరిమితిలో ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు కలిగి వుండే అనుమతి ఇస్లాంలో ఉంది. కాని ఒకరికంటే ఎక్కువ మంది భర్తలు కలిగివుండే అధికారం స్త్రీకి లేదు.

ఇక ఇప్పుడు పురుషునికి ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు కలిగివుండే అనుమతి ఇస్లాం ఎందుకిచ్చిందనే అంశాన్ని పరిశీలిద్దాం.
”కేవలం ఒకే స్త్రీని వివాహమాడండి” అని ఆదేశించే ధార్మిక గ్రంథం, ప్రపంచంలో కెల్లా ఒక్క ఖుర్‌ఆన్‌ మాత్రమే. కేవలం ఒకే స్త్రీని వివాహమాడండని ఆదేశించే, ఏ ఇతర ధార్మిక గ్రంథం ప్రపంచంలో లేదు. ఏ ధార్మిక గ్రంథంలోనైనా సరే, భార్యల సంఖ్యను పరిమితం చేసే ఆదేశం మనకు కనిపించదు. అది రామాయణం కానివ్వండి, మహాభారతం, గీతలు కానివ్వండి, లేదా తల్‌మూద్‌ లేక బైబిల్‌ కానివ్వండి. ఈ గ్రంథాలననుసరించి ఒక వ్యక్తి తనకిష్టమైనంత మంది భార్యల్ని కలిగి వుండొచ్చు. తరువాత కాలంలో హిందూ సాధువులు మరియు క్రైస్తవ పాదరీలు, వీరి సంఖ్యను కుదించి కేవలం ఒకరిగా నిర్ణయించారు.

వారి ధార్మిక పుస్తకాల్లో పేర్కొన్నట్లు, ఎంతో మంది హిందూ ధార్మిక వ్యక్తులు, అనేకమంది భార్యల్ని కలిగి ఉండటం మనం కనుగొంటాము. శ్రీ రామచం ద్రుని తండ్రిగారైన థశరథ మహారాజు, ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు కలిగి వున్నారు. అదే విధంగా శ్రీకృష్ణునికి కూడా ఎంతోమంది భార్యలుండేవారు. ప్రాచీన కాలంలో క్రైస్తవులకు, వారికిష్టమైనంత మంది భార్యల్ని ఉంచుకునే స్వాతంత్య్రముండేది. దీనికి కారణం ఏమిటంటే- భార్యల సంఖ్య విషయంలో బైబిల్‌ ఎలాంటి పరిమితి విధించలేదు. కేవలం కొన్ని శతాబ్దాల క్రితమే, చర్చీ, పత్నుల సంఖ్యను పరిమితం చేస్తూ, ఒకరుగా నిర్ణయించింది.

యూదు మతంలో బహుభార్యాత్వానికి అనుమతి ఉంది. తల్‌మూద్‌ చట్టాన్ని అనుసరించి అబ్రహాం (అ)కు ముగ్గురు భార్యలున్నారు, మరియు సులైమాన్‌(అ)కు వందలాది భార్యలుండేవారు. యూదుల్లో బహు భార్యాత్వపు ఈ ఆచారం కొనసాగుతూనే ఉండేది. చివరికి యూదుల మతగురువు అయిన గర్షోమ్‌ బిన్‌ యహూదా వరకు కొనసాగుతూనే ఉండేది. చివరికి ఇస్రాయీల్‌ చీఫ్‌ రబ్బి, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు కలిగి ఉండటంపై నిషేధం విధించాడు.

ముస్లింలకన్నా, హిందువుల్లోనే బహు భార్యాత్వం ఎక్కువ. భారతదేశంలో క్రీ.శ. 1975లో జరిగిన సెన్సస్‌(జనాభా గణనం)లో ఒక విచిత్ర విషయం బయట పడింది. 1975లో ”కమిటి ఆఫ్‌ ది జస్టిస్ వుమెన్‌ ఇన్‌ ఇస్లాం” ద్వారా జారీచేయ బడిన రిపోర్టులోని పేజి 66 మరియు 67ను అనుసరించి, 1951 మరియు 1961 మధ్య కాలంలో, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు కలిగిన హిందువులు 5.06 శాతముంటే, ముస్లింలలో ఈ సంఖ్య 4.31 శాతముంది. భారతీయ చట్టాన్ని అనుసరించి, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు కలిగి ఉండటం కేవలం ముస్లింలకు మాత్రమే అనుమతి ఉంది. ముస్లిమేతరులు, ఒకరికంటే అధిక మంది భార్యలు కలిగి ఉండటం చట్ట వ్యతిరేకం. అయినా కూడా, ముస్లింలకన్నా హిందువు ల్లోనే, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు కలిగిన వారి సంఖ్య అధికంగా ఉంది. అంతకు ముందు హిందువుల్లో, ఒకరి కంటే ఎక్కువమంది భార్యలు ఉండటంపై ఏలాంటి ఆంక్ష లేకుండేది. 1956లో ”హిందూ మేరేజ్‌ ఆక్టు” అమలులోకి వచ్చింది. తద్వారా ఒకరికంటే ఎక్కువ మందిని వివాహమాడటంపై ఆంక్ష విధిస్తూ బహుభార్యాత్వాన్ని చట్ట వ్యతిరేకంగా ప్రకించటం జరిగింది. హిందువులపై బహుభార్యాత్వాన్ని నిషేధించింది భార తీయ చ్టాలే కాని హిందూ ధార్మిక గ్రం థాలు మాత్రం కాదు. ఇక ఇప్పుడు ఇస్లాం, పురుషునికి బహు వివాహాలు చేసుకునే అనుమతి ఎందుకిచ్చిందనే విష యాన్ని చర్చిద్దాం.
3. దివ్య ఖుర్‌ఆన్‌ బహుభార్యాత్వాన్ని నియంత్రిస్తుంది.

‘ఒకరిని వివాహమాడండ’ని చెప్పే ఏకైక ధార్మిక గ్రంథం ఖుర్‌ఆన్‌ అనే విషయాన్ని నేనింతకు ముందే చెప్పి వున్నాను. ఈ విషయాన్ని తెలియపరచే దివ్వఖుర్‌ఆన్‌ ఆయత్‌ ఈ విధంగా ఉంది:
”అనాథలకు న్యాయం చేయలేమనే భయం మీకు కలిగితే, మీకు నచ్చిన స్త్రీల ను ఇద్దరేసి గాని, ముగ్గురేసిగాని, నలుగు రేసిగాని వివాహం చేసుకోండి, అయితే వారితో న్యాయంగా వ్వవహరించలేమనే భయం మీకుంటే, అప్పుడు ఒకామెనే చేసుకోండి. లేదా మీ స్వాధీనంలోకి వచ్చి న స్త్రీలను దాంపత్యంలోకి తీసుకోండి. ….” (నిసా:3)

ఖుర్‌ఆన్‌ అవతరించక ముందు, భార్యల సంఖ్యపై ఎలాంటి పరిమితిగాని, ఆంక్ష గాని లేదు. అందుకని అరబ్బులు ఏక సమయంలో అనేకమంది భార్యలు కలిగి ఉండేవారు. ఈ సంఖ్య కొన్ని సందర్భాల్లో వందల వరకు చేరేది. అయితే ఇస్లాం అవతరించిన తరువాత, ఈ సంఖ్యను నాలుగు వరకు కుదించింది. ఇస్లాం, ఒక పురుషునికి ఇద్దరు, లేక ముగ్గురు లేక నలుగురు భార్యల వరకు వివాహం చేసుకునే అనుమతినిస్తుంది, కాని దీనితో పాటే అనివార్యంగా వారందరి మధ్య న్యాయం పాటించే షరతును కూడా విధించింది.

ఖుర్‌ఆన్‌లోని ఇదే అధ్యాయంలో అనగా సూర నిసాలోని 129వ ఆయత్‌లో ఇలా చెప్పటం జరిగింది: ”భార్యల మధ్య పూర్తి న్యాయం చెయ్యటం మీ శక్తికి మించిన పని.” (నిసా:129)
అందుకని ఖుర్‌ఆన్‌ ద్వారా తెలిసేదేమిటంటే, బహుభార్యాత్వం అనేది ఒక ఆదేశం, ఆజ్ఞ ఎంత మాత్రం కాదు, ఇదొక అనుమతి, సడలింపు మాత్రమే. ముస్లింలకు ఒకరికంటే ఎక్కువ మంది భార్యలుండటం అనివార్యమని చాలమంది అపోహకు గురి అయివున్నారు. కాని అది వాస్తవం ఎంత మాత్రం కాదు.
సామాన్యంగా ఒక పని గురించి చేయటమా? మానుకోవటమా? అనే విషయం గురించి ఇస్లాం ఆదేశాలు ఐదు రకాలుగా విభజించబడి వున్నాయి.
1) ఫ్రర్జ్‌-అంటే అనివార్యమైనది. తప్ప కుండా చేయాలి.
2) ముస్తహబ్‌-అంటే అభిలషించదగినది, చేయమని ప్రోత్సహించదగినది.
3) ముబాహ్‌ – అంటే అది చేసే అనుమతి ఉంది.
4. మక్రూహ్‌ – అంటే అవాంఛనీయం, మంచిదని ప్రోత్సహించతగనిది.
5) హరాం- అంటే నిషేధితమైనది. ఎట్టి పరిస్థితుల్లోను చేయరాదు.
బహుభార్యాత్వం అనేది ఈ ఐదింటిలో మధ్య రకం అనగా ‘ముబాహ్‌’ కోవకు చెందినది. అంటే దీన్ని చేయానికి అనుమతి మాత్రమే ఉంది. ఆజ్ఞ, ఆదేశం కాదు. దీని అర్థం ఏమిటంటే, ఇద్దరు, ముగ్గురు, నలుగురు భార్యలు కలిగిన ఒక ముస్లిం, ఒకే పత్ని ఉన్న ముస్లిం కన్నా ఉన్నతుడు, మేలైనవాడు అని కాదు. అంటే ఇది పుణ్యమూ కాదు, పాపమూ కాదు.

4. స్త్రీల సరాసరి వయస్సు, పురుషుల కంటే అధికంగా ఉంటుంది.
ప్రకృతి సహజంగా స్త్రీ పురుషులు దాదాపు ఒకే నిష్పత్తిలో జన్మిస్తారు. (జన్మించినప్పటి నుండే) బాబులకన్నా, పాపల్లో వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యుని) అధికంగా ఉంటుంది. దీని అర్థం ఏమి టంటే, క్రిముల్ని, వ్యాధుల్ని ఎదుర్కోవ టంలో బాలురకన్నా, బాలికలు అధిక శక్తిసామర్థ్యాలు కలిగి ఉంటారు. ఈ కారణంగానే శిశు దశలో, పాపలకన్నా బాబుల సంఖ్య మరణాల్లో అధికంగా ఉం టుంది. ఇక యుద్ధాలు సంభవించినప్పు డు కూడా, స్త్రీలకన్నా పురుషులే అధిక సంఖ్యలో మరణిస్తుంటారు. క్లుప్తంగా చెప్పాలంటే స్త్రీ సరాసరి వయస్సు పురుషులకన్నా అధికంగానే ఉంటుంది. ఈ కారణంగా ప్రపంచంలో విధవల సంఖ్య భార్యావిహీనుల సంఖ్యకన్నా ఎప్పుడూ అధికంగానే ఉంటుంది. అదీగాక ప్రపంచంలో ఎప్పుడు లెక్కించినా గాని, స్త్రీల సంఖ్య పురుషులకన్నా అధికంగానే ఉండటం మీరు గమనిస్తారు.

Related Post