మహనీయ అలీ (ర) గారి విశిష్టత

మహనీయ అలీ (ర) గారి విశిష్టత  /  పది సంవత్సరాల ప్రాయంలోనే అసత్య ధ్వజవాహకులకు భయ పడనీ చిచ్చర పిడుగు హజ్రత్‌ అలీ (ర).  సంక్లిష్ట స్థితిలో సత్యాన్ని విశ్వసించ సాహసించిన సత్యబాంధవులు హజ్రత్‌ అలీ (ర). సత్యం కోసం సర్వస్వాన్ని తృణప్రాయంగా త్యాగం చేసిన ధన్య జీవులు హజ్రత్‌ అలీ (ర). సత్యధర్మ కేతనాన్ని సర్వత్రా ఎగుర వేసేంత వరకు కునుకు తియ్యను  అని కంకణం కట్టుకున్న కార్య సాధకులు, కారణ జన్ములు హజ్రత్‌ అలీ (ర). వారు ముందువారు ముందున్న వారు.

అందరికంటే ముందు (ఇస్లాంస్వీకారంలో) ముందంజవేసిన ముహాజిర్లు, అన్సార్ల పట్ల, ఆతర్వాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన ఇతరుల పట్ల అల్లాహ్  ప్రసన్నుడ య్యాడు. వారు అల్పలాహ్ట్ల  సంతసించారు. వారికోసం అల్లాహ్  సెలయేరులు పారే తోటలు సిద్ధపరచాడు. వారక్కడ కలకాలం ఉంటారు. ఇదే ఘనవిజయం. (తౌబా: 100)

ఈ వ్యాస మాధ్యమంగా ఆ మహనీయుల  గురించి, ఆయనకు ఇతర సహాబాతో గల సంబంధం గురించి  తెలుసుకుందాం!

హజ్రత్‌ అలీ (ర) చాలా నిరాడంబర పాలకుడు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన నాయకుడు. ప్రవక్త ముహమ్మద్‌ ప్రవక్త (స) వారి సుశిక్షణ, సహచర్యంలో పెరిగినవారు. అధికారం అంటే, స్వలాభం, స్వప్రయోజనం కోసం కాక, ప్రజల ప్రయోజనం కోసం, వారి సంక్షేమం కోసం వినియోగించే సాధనమని నమ్మిన ప్రజా పాలకుడు. తన పాలనలో ఏ ఒక్కరికి అణువంత అన్యాయం జరిగినా ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవడంతోపాటు, దైవానికీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని భావించిన సుభక్తుడు.

సంక్లిష్ట స్థితిలో సత్యాన్ని విశ్వసించ సాహసించిన సత్యబాంధవులు హజ్రత్‌ అలీ (ర). సత్యం కోసం సర్వస్వాన్ని తృణప్రాయంగా త్యాగం చేసిన ధన్య జీవులు హజ్రత్‌ అలీ (ర). సత్యధర్మ కేతనాన్ని సర్వత్రా ఎగుర వేసేంత వరకు కునుకు తియ్యను  అని కంకణం కట్టుకున్న కార్య సాధకులు, కారణ జన్ములు హజ్రత్‌ అలీ (ర). వారు ముందువారు ముందున్న వారు.

ప్రవక్త (స) నోట    స్వర్గపు శుభవార్తను అందుకున్న అదృష్టవంతులలో ఒకరు హజ్రత్ అలీ (ర).

అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి)  గారి కథనం దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు:

అబూబకర్ (రజి) స్వర్గంలో ఉంటారు, ఉమర్ (రజి) స్వర్గంలో ఉంటారు, అలీ (రజి) స్వర్గంలో ఉంటారు,  ఉస్మాన్ (రజి) స్వర్గంలో ఉంటారు, తల్హా  (రజి) స్వర్గంలో ఉంటారు, జుబైర్ బిన్ అవామ్ (రజి) స్వర్గంలో ఉంటారు,  అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి) స్వర్గంలో ఉంటారు, సఅద్ బిన్ అబీ వఖాస్  (రజి) స్వర్గంలో ఉంటారు,  సఈద్ బిన్ జైద్ బిన్ అమ్ర్ బిన్ నౌఫిల్ స్వర్గంలో ఉంటారు. ” (ముస్నాద్ అహ్మద్, తిర్మిజీ)

ఈ హదీసులో పేర్కొనబడిన వారందరూ బద్ర్  తోలి సత్య సమరంలో పాల్గొన్న దైవ ప్రవక్త సహచరులు (రజి) (వారు స్వయంగా అందులో పాల్గొన్నారు లేదా ఆదేశానుసారం పాల్గొన్న వారిగా పరిగణించబడ్డారు). అలాగే వారిలో కేవలం హజ్రత్ ఉస్మాన్ (రజి) తప్ప మిగిలినవారందరూ ‘బైఅతె రిజ్ వాన్’ లోనూ పాల్గొన్నారు. బైఅతె రిజ్వాన్ ‘ హజ్రత్ ఉస్మాన్ (రజి) కోసమే చేయబడింది.

హజ్రత్ అలీ బిన్ అబూ తాలిబ్ మరియు హజ్రత్ ఫాతిమహ్ (రజి) గారి శుభప్రదమైన వివాహం

హజ్రత్ అలీ (రజి) మరియు హజ్రత్ ఫాతిమహ్ (రజి) ల వివాహంలో దైవ ప్రవక్త (స) సహచరులు ఎంత చేదోడు వాదోడుగా ఉండేవారో చూడండి.

1 – హిజ్రీ శకం  2 వ సంవత్సరంలో   బద్ర్  యుద్ధం తర్వాత హజ్రత్ అలీ (రజి)గారిని   హజ్రత్ ఫాతిమహ్ (రజి) ను వివాహం చేసుకోవలసిందిగా సలహాను ఇచ్చిన సహాబా  – హజ్రత్ అబూబకర్ (రజి), హజ్రత్ ఉమర్ (రజి), హజ్రత్ సఅద్  బిన్ మఆజ్ (రజి).

2 – హజ్రత్ అలీ (రజి) యొక్క మహర్ హక్కును స్వయంగా హజ్రత్ ఉస్మాన్ (రజి) చెల్లించారు. అది ఎలా అంటే,  హజ్రత్ అలీ (రజి) గారి కవచాన్ని హజ్రత్ ఉస్మాన్ (రజి) నాలుగు వందల దిర్హములకు కొన్నారు. అలాగే హజ్రత్ అలీ (రజి) గారి ఆత్మ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుంటూ, తర్వాత  ఆ కవచాన్ని ఆయనకు  కానుకగా సమర్పించారు.

3 – అన్సార్లు  ఆ వివాహం పట్ల ఎంతగా సంతోషించారంటే హజ్రత్ సఅద్ (రజి) ఒక పొట్టేలును జిబహ్ చేసి వలీమహ్ విందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అలాగే కొంతమంది అన్సార్లు సైతం మొక్కజొన్నను తీసుకొచ్చారు.

4 – మరొక అన్సారీ సోదరుడు  అయిన హజ్రత్ హారిసహ్ బిన్ నుఅమాన్ అన్సారీ (రజి) దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (స) కు పొరుగున ఉన్న తమ ఇంటిని హత్ అలీ (రజి) మరియు హజత్ ఫాతిమహ్ (రజి) ల సేవలో కానుకగా సమర్పించారు.

5 – ఆ నవ దంపతుల కొరకు దైవప్రవక్త సహచరులు (రజి) ఇంటి సామగ్రిని సైతం కొనుగోలు చేశారు. వారిలో హజరత్ అబూబకర్ సిద్దీఖ్ (రజి) ప్రముఖులు.  ఇదంతా దైవప్రవక్త ముహమ్మద్ (స) మరియు ఆయన (స) కుటుంబీకుల పట్ల వారికి గల  ప్రేమ మరియు స్నేహం యొక్క వ్యక్తీకరణ తప్ప మరేమీ కాదు.

మహనీయ అలీ (స) సంతాన విశిష్టత

హజ్రత్  అబూ హురైరహ్ (రజి) ఈ విధంగా ఉల్లేఖించారు: దైవప్రవక్త (స) హజత్ హసన్ (రజి) గురించి ఇలా పేర్కొన్నారు: ( ఓ అల్లాహ్ నీవు ఇతడిని ప్రేమించు మరియు ఇతడిని ప్రేమించేవారిని సైతం ప్రేమించు) (సహీహ్ బుఖారీ)

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రజి) ఇలా ఉల్లేఖించారు: దైవప్రవక్త (స) హజ్రత్ హసన్ (రజి) మరియు హజ్రత్ హుసైన్ (రజి) ల గురించి ఇలా పేర్కొన్నారు: వీరిద్దరూ ప్రపంచంలో నాకు చెందిన రెండు కుసుమాలు. (సహీహ్ బుఖారీ)

హజ్రత్ అబూ సఈద్ ఖుద్ రీ (రజి) కథనం – ప్రవక్త (స) ఇలా అన్నారు: హసన్ మరియు హుసైన్ స్వర్గలోకపు యువకులకు నాయకులు. (ముస్నద్ అహ్మద్)

దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ” నా ఈ కుమారుడు నాయకుడు. బహుశా ఇతడి ద్వారా అల్లాహ్ ముస్లింలకు చెందిన రెండు పెద్ద సమూహాల మధ్య సయోధ్యను కుదిర్చే అవకాశముంది. ”

ఆ భవిష్యవాణిని నెరవేరుస్తూ ఆ యువనేత శక్తిని కలిగియున్నప్పటికీ తమ ప్రభువు ప్రసన్నతకై ముస్లింల రక్తాన్ని పరిరక్షించేందుగాను  తన  ఖిలాఫత్ మొదలయి ఐదు నెలలు గడచిన తర్వాత హిజ్రీ శకం  40లో ముఆవియహ్ (రజి) కొరకు తమ ఖిలాఫతు పరిత్యజిస్తున్నట్లు    ప్రకటించారు. అందుకే ఆ సంవత్సరం ‘ఆముల్ జమాఅహ్’ అనగా ‘సమైక్యతా సంవత్సరం’ గా పిలువబడింది. ఎందుకంటే ముస్లింలందరూ విభేదం తర్వాత ఒక పరిపాలకుని పాలన క్రింద ఏకమయ్యారు.

ఆయన సంతానం ఎడల సహాబా ప్రేమ

హజ్రత్  అబూబకర్ సిద్దీఖ్ (రజి) పరిపాలనా కాలంలో  హసన్ (రజి) వయస్సుదాదాపు 9 సంవత్సరాలు.  అబూ బకర్ (రజి) అస్ర్  నమాజ్ చదివి మస్జిద్ నుంచి నిష్క్రమించినప్పుడు  హసన్ (రజి) పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉండడాన్ని చూశారు. ఆయన  హసన్ (రజి) ను తమ భుజం మీద కూర్చోబెట్టుకొని ఇలా అన్నారు: “ నా తండ్రి మీ కొరకు అర్పింతు గాక. మీలో దైవప్రవక్త (స) వారి  స్వరం ఉంది, అలీది కాదు.” అది విన్న  హజత్ అలీ (రజి) నవ్వసాగారు. (బుఖారీ)

హసన్ (రజి) వయస్సు 11 సంనుంచి 21 సం వరకు చేరుకునేంత వరకు గల మధ్యకాలంలో హజ్రత్  ఉమర్ (రజి) గారి పరిపాలనా కాలాన్ని పొందారు.  హసన్ (రజి) మరియు  హుసైన్ (రజి) పట్ల హజ్రత్ ఉమర్ (రజి) గారి  ప్రేమకు సంబంధించిన కొన్ని మచ్చు తునకలు

1) ఆయన ఎంతటి ఉపకార వేతనాన్నయితే బద్ర్  యుద్ధంలో పాల్గొన్న దైవప్రవక్త సహచరుల (రజి) కొరకు నిర్ణయించారో అదే  స్థాయిలో హసన్ (రజి) మరియు హుసైన్ (రజి) కొరకు కూడా నిర్ణయించారు. అంతేగాకుండా ఈరాన్ కు చెందిన యుద్ధప్రాప్తి  చేరినప్పుడు ఇతర సహాబా కంటే ముందు ఆయన హసన్ (రజి) మరియు హుసైన్ (రజి)లకు ఆ గనీమత్ సొత్తు నుంచి ప్రసాదించారు

2) యమన్ నుంచి వస్త్రాలు వచ్చినప్పుడు హసన్ (రజి) మరియు హుసైన్ (రజి) ల కొరకు సముచితమైన వస్త్రాలేమీ వాటిలో లేవు. కనుక ఆయన తమ ప్రతినిధిని యమన్ పంపి వారిద్దరి కొరకు వస్త్రాలను తెప్పించారు. ఆ తర్వాత ఆయన ఇలా పేర్కొన్నారు: ” ఇప్పుడు నా మనస్సు కుదుట పడింది . ”

3) ఉపకార వేతనాలను పంపిణీ చేసే సమయంలో ఆయన తమ కుమారుడయిన అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రజి) కంటే హసన్ (రజి) మరియు హుసైన్ (రజి) లకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అబ్దుల్లాహ్ (రజి) ఇలా పలికారు. తమరు వారిద్దరికీ నా కంటే అధికంగా ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే నాకు దైవప్రవక్త (స) సహచర్యం మరియు హిజ్రత్  అనే రెండు గౌరవాలూ ప్రాప్తమయ్యాయి” అప్పుడు ఉమర్ (రజి) ఇలా బదులిచ్చారు: “ చాలు, చాలు ఇక ఆపండి. వారిద్దరి  తండ్రి మీ తండ్రి కంటే, వారిద్దరి మాతృమూర్తి మీ మాతృమూర్తి కంటే శ్రేష్ఠులు.

హసన్ (రజి)  వయస్సు 30 సంవత్సరాలకు చేరుకునేంత వరకు హజ్రత్ ఉస్మాన్ (రజి) గారి పరిపాలనా కాలాన్ని పొందారు. ఆయనకు   హజ్రత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రజి) పట్ల గల  ప్రేమకు ప్రతీక   – ఆయనను కల్లోల జనకులు  చుట్టుముట్టినప్పుడు హసన్ (రజి) తమ రెండు కరవాలాలను దూసి ఆయనను సంరక్షించేందుకై బయటికి వచ్చారు.  హజత్ ఉస్మాన్ (రజి) ఆయనను తమ కరవాలాన్ని ఒరలో పెట్టి తమ తండ్రి వద్దకు వెళ్ళిపోవలసిందిగా అభ్యర్థించారు. కానీ ఆయన అందుకు నిరాకరించారు. చివరకు గాయపడిన స్థితిలో ఆయనను అక్కడి నుంచి తీసుకెళ్ళడం జరిగింది.

హజ్రత్  అలీ (రజి) మరియు ఆయన సంతతికి ఇష్టమైన కొన్ని పేర్లు

అలీ బిన్ అబీ  తాలిబ్ కుమారులయిన అబూబకర్, హసన్ బిన్ అలీ బిన్ అబీ తాలిబ్ కుమారులయిన అబూబకర్ మరియు ఉమర్, హుసైన్ బిన్ అలీ బిన్ అబీ తాలిబ్ కుమారులయిన ఉమర్ మరియు ఉమ్ముల్ బనీన్ కలాబియహ్ కడుపున పుట్టిన అలీ బిన్ అబీ తాలిబ్ (రజి) యొక్క మరో ఇద్దరు కుమారులయిన అబ్బాస్ మరియు ఉస్మాన్ లు కర్బలా యుద్ధంలో పాల్గొని అదే యుద్ధంలో వీరమరణం కూడా పొందారు.

అలాగే  ఆరవ సంతతితో సంబంధాన్ని కలిగియున్న మూసా బిన్ కాజిమ్ సైతం తన ఇద్దరు కుమారులకు అబూబకర్ మరియు ఉమర్ అని పేర్లు పెట్టారు.

జాఫర్ సాదిఖ్ తమ కుమార్తెకు ‘ఆయిషహ్’ అని పేరు పెట్టారు.

మూసా కాజిమ్ తమ కుమార్తెకు ‘ఆయిషహ్’ అని పేరు పెట్టారు.

జాఫర్ బిన్ మూసా అల్ కాజిమ్ తమ కుమార్తెకు ‘ఆయిషహ్’ అని పేరు పెట్టారు. అలీ అక్బర్  తన కుమార్తెకు ‘ఆయిషహ్’ అని పేరు పెట్టారు.

అలీ అలహాదీ బిన్ ముహమ్మద్ అల్ జవ్వాద్ తన కుమార్తెకు ‘ఆయిషహ్’ అని పేరు పెట్టారు.

విశ్వసనీయమైన గ్రంథాలు వీరి పరస్పర సంబంధాలు, ప్రేమ మరియు సామరస్యానికి సంబంధించిన దృష్టాంతాలతో నిండియున్నాయి. ఇంత చెప్పిన  తర్వాత కూడా ఎవరయినా ‘ దైవప్రవక్త (స) కుటుంబీకులు మరియు ఆయన సహచరులు (రజి) పరస్పరం శత్రువులు,అసూయ చెందేవారు’ అని  అంటే ఎలా స్పందించాలో, ఎలా సమాధానము ఇవ్వాలో  ఎవరి విశ్వాసాన్ని బట్టి వారు ఆలోచించుకోవాలి.

సహాబహ్‌ స్థాయి, ప్రవక్త (స) వారి సతీమణుల స్థాయి తెలియని చాలా మంది బురద బుద్ధి ప్రబుద్దులు వారిని తూలనాడే వారితో స్నేహం చేయడం మనం గమనిస్తాము. ఇది ముమ్మాటికీ ఒక  ముస్లింకు శోభించని విషయం. ముస్లిం వేష ధారణ కలిగిన ఈ కుత్సిత బుద్ధులు అనేక నామాల తో పిలువ బడతారు. కాబట్టి  వారి విషయంలో కడు అప్రమత్తంగా ఉండా ల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది. ఇక్కడ ఉదార ధోరణి ఏ మాత్రం పనికి రాదు. నిన్న మొన్నటి  అలగా జనాలు, పుట్ట గొడుగు వ్యక్తిత్వం, చెదలు పట్టిన ఆలోచన కలిగిన కలహాకారులు అలనాటి  ఉత్తముల్ని దూషించ దుస్సాహసం చేయడం గర్హనీయం!

సహాబహ్‌ స్థాయిని గురించి స్వయంగా అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌లో ఇలా తెలియజేస్తున్నాడు: ”మీలో (మక్కా) విజయానికి పూర్వం దైవమార్గంలో ఖర్చు చేసినవారు మరియు పోరాడిన వారు ఇతరులు సమానులు కాజాలరు. వారు (మక్కా) విజయానంతరం ఖర్చు చేసిన, పోరాడిన వారికంటే మహోన్నత స్థాయి గలవారు”. (అల్‌ హదీద్‌: 10)

”మీలోని ఒక వ్యక్తి ఉహద్‌ పర్వతం అంతటి బంగారాన్ని దానం చేసినా నా సహాబహ్‌లోని ఒక వ్యక్తి చేసిన గుప్పెడు ధాన్యానికి కూడా అది సరి తూగదు సరి కదా,  దాని సగానికి కూడా సరిపోదు”.  అన్నారు ప్రవక్త (స).  (ముస్లిం)

Related Post