మానసిక ఒత్తిడిని జయించడం ఎలా?

తరచూ తలనొప్పి, దవడల నొప్పులుంటే,పెదాలు, చేతులు వణకుతూ ఉంటే, మెడనొప్పి, నడుము, కండరాల నొప్పు లుంటే, తల తేలిపోతున్నట్లు తిరుగుతున్నట్లుంటే, నోరు ఎండి పోతుంటే, ఉన్నట్టుండి భయం అనిపిస్తే, గుండె దడదడ కొట్టుకుంటే, అరిచేతులు, అరికాళ్ళు చల్లబడితే, చెమటలు పట్టితే, తరచూ మూతాన్రికి వెళ్ళాలనిపిస్తే, శ్వాసలో ఇబ్బంది ఉంటే, నిదల్రేమి పీడిస్తే, భీతిగొల్పే కలలొస్తే, ఒంటరినైపోయాను, ఎందుకూ పనికి రాను అన్న భావన పీడిస్తే, తరచూ ఏడ్పు వస్తున్నట్లుంటే, ఎప్పుడైనా ఆత్మహత్య ఆలోచనలొస్తే, తరచూ దెబ్బలు, చిన్నచిన్న పమ్రాదాలకు గురవుతే,పనిలో లోపాన్ని కప్పివుచ్చేందుకు తరచూ అబద్దాలాడితే,

”అండలుంటే కొండలు దాటవచ్చ”ని సామెత ఉంది. ఆపదల్లో నేనున్నానని అండగా నిలిచే కుటుంబ సభ్యులు తోడుంటే మనిషి నిశ్చితం గా ఉండగలుగుతాడు. ఆత్మ పీడన నుండి, మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొంద వచ్చు.

సిగరెట్టు తాగ్రడం, మద్యం సేవించ డం, కాలక్షేపం కోసమని క్లబ్బులకు వెళ్ళి పేకాట ఆడటం వంటి అలవాట్లకు బానిసలయితే, అతిగా ఏదో ఒకి, ముఖ్యంగా తీపి
పదార్థాలు తినాలనిపిస్తే, అలసటగా, బలహీనంగా అనిపిస్తే, మలబద్దకం లేదా విరోచనాల సమస్య ఉంటే, (వివాహితులు)లైంగిక వాంఛ తగ్గి పోయిందని భావిస్తే,
అమ్మాయి జుట్టు ఎక్కువగా రాలిపోతే, రుతుకమ్రం సరిగ్గా ఉండకపోతే, చిన్నచిన్న విషయాలకు కూడా అతిగా స్పందిస్తే, ఇతరులతో మ్లాడటంలో, భావాల ను పంచుకోవటంలో ఇబ్బందిగా ఉంటే, అతిగా చేసిందే చేస్తే, మంకుగా తయారయితే, ఎప్పుడూ బయటకెళ్ళి, ఏదో ఒకటి షాపింగ్‌ చేస్తే… ఒత్తిడి ఉన్నట్లు లేక్క.
అయితే ఒత్తిడి అందరిలోనూ ఒకే రకంగా ఉండదు. ఏది ఏమైనా ఒత్తిడి దీర్ఘకాలం నెలకొంటే, శరీరంలోని వనరులన్నీ తరిగి పోతాయి. ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ బలహీన పడి డిప్రేషన్‌ వంటి మానసిక సమస్యలు ముసురుకుంటాయి. గుండె జబ్బులు పెరుగుతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి కొన్ని క్యాన్స ర్లకూ కారణమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఒత్తిడికి దారితీసే కొన్ని కారణాలు

కుటుంబ సంబంధాల్లో విచ్ఛిన్నం. అందం,అంతస్తుల్లో పైకెదగాలన్న ఆతృత. పిల్లల విద్య, శిక్షణలో సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. అని మానసిక నిపుణులు అంటున్నారు. అయితే ఒత్తిడికి విరుగుడు లేదా? ఒత్తిడి నుంచి ఉపశమనం పొందే మార్గాలు లేవా? జీవితంలో శాంతి, తృప్తి, ఆనందం ఆహ్లాదాన్ని పొందే మార్గం ఏది?… అని ఎంతో ఆతృత గా అడుగుతున్నారు. మానసిక నిపుణుల్ని ఆశ్రయిస్తున్నారు మానసిక బాధితులు. ఒత్తిడిని దూరం చేయడానికి జాగింగ్‌ నుంచి యోగా వరకూ, వ్యామాయం నుంచి మసాజ్‌ల వరకూ మార్గాలెన్నో సూచిస్తుంది శాస్త్ర ప్రపంచం. దీర్ఘశ్వాస తీసుకోవాలని, సంగీతం వినాలని, హాయిగా నవ్వెందుకు ప్రయత్నిం చాలని, పెంపుడు జంతువులతో ఆటలాడా లని, పిక్నిక్‌లకు వెళ్ళాలని మానసిక శాస్త్ర వేత్తలు పేరొంటున్నారు. అద్భుతం! ఈ సూచ నల్ని పాటించి ఎంత మంది మానసిక రుగ్మ తల నుండి ఉపసమనం పొందుతున్నారు?

మనిషి భౌతిక స్థాయి నుంచి ఉన్నతంగా ఎదిగి జీవించినప్పుడే జీవితంలో తృప్తి, శాంతి, ఆనందం, ఆహ్లాదం ఉంటాయి. రండి మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న ఉపద్రవం నుండి ఉపశమనం పొందే కొన్ని మార్గాలను దివ్య ఖుర్‌ఆన్‌ మరియు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) ప్రబోధనల వెలుగులో తెలుసుకుందాం.

దైవనామ స్మరణ, దైవాజ్ఞలపాలన

మనిషిని శారీరకంగానూ, మానసికంగానూ తొలిచేస్తున్న అశాంతి, అలజడి దూరం కావా లంటే దైవనామస్మరణ చేస్తూ ఉండాలి. దైవా జ్ఞలనుగుణంగా జీవించాలి.
”తెలుసుకోండి ! అల్లాహ్‌ సంస్మరణ ద్వారానే హృదయాలకు తృప్తి, శాంతి, నెమ్మది ప్రాప్త మవుతుంది”. (13:28) అంటున్నాడు విశ్వ ప్రభువు అయిన అల్లాహ్‌.
ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగం, గొప్ప జీతం, అందమైన ఇల్లు, ఖరీదైన కారు, ఇవన్నీ ఉన్నంత మాత్రాన జీవితంలో సుఖం, సంతోషం ఉంటుందనుకుంటే పొరపాటే. విశ్వప్రభువు అంటున్నాడు: ”నా ఆజ్ఞల్ని ఉల్లంఘించిన వాడు ఎన్నడూ మనశ్శాంతికి నోచుకోడు”. (20:124)

శ్రీ భగవద్గీత కూడా ఈ వాస్తవాన్ని ధృవీకరిస్తుంది. ”తమేవ శరణం గచ్ఛ సర్వ భావేన భారత తత్పృసాదాత్పరాం శాన్తిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్‌” (18:62)
ఓ అర్జునా! సర్వవిధముల (సాటి సమా నము లేని) ఆ సర్వేశ్వరునే శరణు బొందు ము. ఆయన అనుగ్రహముచే సర్వోత్తమమగు శాంతిని శాశ్వతమగు మోక్షపదవిని నీవు పొందగలవు.
”యశ్శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధిమవాప్నోతి నసుఖం న పరాంగతిమ్‌” (16:23 )

ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచి ప్టిె తన ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించునో అి్టవాడు పురుషార్థ సిద్దినిగాని, సుఖమునుగాని, ఉత్తమ గతియుదు మోక్షముగాని పొందలేడు. అవును మరి నిజస్వామిని, ఆ స్వామి ఆజ్ఞల్ని ధిక్కరిం చినవాడు కోటీశ్వరుడైనా అశాంతి అసంతృప్తితో బాధపడతాడు.

అనుబంధాల ప్రాముఖ్యత

సంఘజీవనంలో కుటుంబ వ్యవస్థకు చాలా ప్రాముఖ్యత ఉంది. తల్లిదండ్రులు, అన్న దమ్ములు, అక్కాచెల్లెల్లు, ఆత్మబంధువులు అంతా పరస్పరం ప్రేమానురాగాలు కలిగి ఉంటూ ఒకరినొకరు తోడుగా ఉండటంలో ఆనందం, తృప్తి ఎంతైనా ఉంటుంది. ”అండలుంటే కొండలు దాటవచ్చ”ని సామెత ఉంది. ఆపదల్లో నేనున్నానని అండగా నిలిచే కుటుంబ సభ్యులు తోడుంటే మనిషి నిశ్చితం గా ఉండగలుగుతాడు. ఆత్మ పీడన నుండి, మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొంద వచ్చు. అయితే డబ్బజబ్బు సోకినప్పి నుంచి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతానురా గాలు తగ్గిపోయాయి. నాలుగు గోడల మధ్య పలకరించేవారు కరువయ్యారు.

అంతిమ దైవప్రవక్త(స) ఎప్పుడో నొక్కి చెప్పారు: ”బంధువులు స్నేహితులు పరస్పరం ఆప్యాయతగా వ్యవహరించాలని, వ్యాధి గ్రస్తుల్ని పరామర్శించాలని, కానుకలు ఇచ్చు పుచ్చుకుంటూ ఉండాలని, సుఖదుఖాలలో పాలు పంచుకుంటూ ఉండాలని,” ఎందు కంటే మానసిక ఒత్తిడిని అధికమించాలంటే కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలుం డాలి అని మానసిక శాస్త్రవేత్తలూ అంటున్నారు.

”ఇతరులతో సత్సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండటం ద్వారా మానసిక సమతుల్యతను సాధించవచ్చు” – డాక్టర్‌ ఎస్‌.ఆర్‌.ఆర్‌.వై శ్రీవినాస్‌
డబ్బుందన్న అహంభావంతో, లేక ఎవరో ఏదో అన్నారని కసిని పెంచుకొని బ్రతికే వారికి తృప్తి, ఆనందం కరువైపోతుంది. ద్వేషమును తృంచి ప్రేమను పెంచేవారికి, కూికి కరువై కుమిలే వారికి తోడునీడగా ఉండే వారికి శాంతి, సుఖాలు ప్రాప్తమవు తాయి.

డబ్బే సర్వం కాదు

ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతుంది అంటుంటారు జనులు. డబ్బుంటే చాలు అన్నీ ఉన్నట్లే. అన్ని సౌఖ్యాలు వాటంతటవే వెతుక్కు ంటూ వస్తాయి అని చాలా మంది భావిస్తారు. కాని ”డబ్బుంటే సుఖం దక్కుతుందేమోగానీ సంతోషం కాదు” అన్నది అక్షర సత్యం. డబ్బు పిచ్చి ఒక్కొక్కసారి మనుషుల మధ్య అగాధాలు సృష్టించి పగలూ సెగలూ రేపుతుందని వివరించాడో పూర్వ కవి.

ప్రాణమిత్రుడైన పగవాని జేయు
నరమి ప్రాణమీద నలుగు జేయు
కొరగాని కతిలోభ గుణము బుట్టగజేయు
తోడబుట్టిన వాని దొలగ జేయు.

చెన్నైలోని ఓ -ఐటి కంపెనీలో పనిచేసే 26 ఏళ్ళ వర్ష అంటుంది ”నేనూ, నా భర్త కూడా సాప్ట్ వేర్‌ ఇంజనీరే. ఇద్దరం బాగా సంపాదిస్తున్నాం. కానీ జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించే తీరికే మాకు లేదు. మేమిద్దరం పేరుకు ఒకే ఇంలో ఉంటాం. కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సమయం ఉండదు. ఆదివారం నాడు కూడా ఇంలో ఆఫీసు పని చేసుకోవాల్సి వస్తుంది. అది పూర్తయ్యేసరికి మానసికంగా చాలా అలసిపోతాం” అని (ఉద్యోగం వివాహ నాశాయ! ఈనాడు 23/07/2007)

డబ్బు…డబ్బు…డబ్బు…డబ్బే జీవిత లక్ష్యంగా భావించి, దాని కోసం నిరంతరం శ్రమిం చి, శారీరంగా మానసికంగా కుమిలి డిప్రేషన్‌ కు గురై ఎన్ని జీవితాలు అంత మయ్యాయో?!  విశ్వప్రభువు అంటున్నాడు: ”వారి సిరిసంపదలనూ, వారి అధిక సంతానాన్నీ చూసి మోసపోవద్దు. అల్లాహ్‌ మాత్రం ఈ సిరిసంపదల ద్వారానే వారికి ప్రాపంచిక జీవితంలో కూడా శిక్షకు గురి చెయ్యాలని, వారు ప్రాణ త్యాగం చేసినా సత్య తిరస్కార స్థితిలోనే చెయ్యాలని కోరుతున్నాడు”. (9:55)
డబ్బు జీవితావసరం. జీవిత లక్ష్యం కాదని తెలుసుకుంటే ఒత్తిడి నుంచి బయటపడ వచ్చని అధ్యాయనాలు చాటి చెబుతున్నాయి.

సంతానం దేవుని వరం

”ఒకప్పుడు ఎక్కువ మంది వద్దు. ఒకరు లేక ఇద్దరు చాలు. వాళ్ళను చక్కగా పెంచాలి. మంచి చదువు చెప్పించాలి. నలుగురిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికీ తీసిపోకూడదు. చిన్నప్పుడు మేం ఎదుర్కొన్న ఇబ్బందులేవీ మా పిల్లలకు ఎదురు కాకూడదు” ఇది సగటు తల్లిదండ్రుల ఆలోచన. ఇప్పుడు ఏక సంతానంపై మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతుంది. ఏక సంతానంపై ఆసక్తితో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆపరేషన్ల గణాంకాల ప్రకారం 2007 జనవరి నాటికి రాష్ట్రంలో 50,792 జంటలు కు.ని. చేయించుకున్నాయి.
”నాణేనికి మరోవైపు చూస్తే ఒకే బిడ్డ ఉన్న తల్లిదండ్రులు స్వయంగా ఆ బిడ్డ మానసిక బాధకు గురవుతున్నారు. ఎక్కడున్న తమదే పైచేయి కావాలనే భావనతోపాటు తమకు తోడు లేదన్న న్యూనతాభావం కూడా ఆ ఒకే బిడ్డలో ఉంటుంది” అని మనస్తత్వ శాస్త్రవేత్త జి. పద్మజ అంటున్నారు (ఈనాడు 23/03/2008)
మరి కొన్ని కొత్త జంటలు కేరీర్‌ కోసం కానుపు వాయిదా వేస్తున్నారు, వారు స్థిర పడేసరికి వయస్సు మీరిపోయింది. ఇప్పుడు కావాలనుకున్న గర్భం రాదు… వచ్చినా నిలవదు. వయసు పెరిగే కొద్ది పిల్లలు పుట్టే అవకాశం తగ్గడమే కాదు పుట్టే పిల్లల్లో లోపాలు ఉండే అవకాశం కూడా ఎక్కువే అని హెచ్చరిస్తున్నారు ప్రముఖ గైనకాలజిస్ట్‌ రాధిక. (ఈనాడు 30/03/2008)

చిక్కుడు చెట్టుకు తీగలందమ్ము
కాకర పాదుకు కాయలందమ్ము
పడతికి పది నెలల బాలుడందమ్ము

మధ్య తరగతికి చెందిన దంపతులు తమ బిడ్డల్ని చూసి మురిసిపోతూ ఇలా పాడుకుంటారు:

పచ్చని చిలుకలు తోడుంటే
పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లోయి
లోకంలో కన్నీరిక చెల్లోయి.

కేరీర్‌లో నిలదొక్కుకోవాలని సంతానాన్ని కాంక్షించని వారికి జీవితాంతం విషాదం వెంటాడుతూ ఉంటుంది. అందుకే విశ్వ ప్రభువు అంటున్నాడు: ”పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని హత్య చేయకండి మేము వారికీ ఉపా ధిని ఇస్తాము, మీకూ ఇస్తాము. వాస్తవానికి వారిని హత్య చేయడం మహా పాపం”. (17:31)

Related Post