మారుతున్న విలువలు

మారుతున్న విలువలు – మానవ సమాజం అంటే జడ పదార్థానికి మారు పేరు కాదు. మానవ సమాజం అంటే చైతన్య స్వరూపం. ఇక్కడ మంచీ-చెడులనేవి నిత్యం వివిధ పరిమాణాల్లో తక్కువ-ఎక్కువ మనకు దర్శనమిస్తుాంయి. రాతారీతులు, విలువలు రూపు దిద్దుకుంటుాంయి, రూపం మారుతుంటాయి. రూపు మాప బడుతుంటాయి కూడా. విలువలనేవి అవి సక్రమ మయినవయినా, అక్రమమయినవయినా, మంచివయినా, చెడ్డవయినా సమాజం మీద ఏదోక స్థాయిలో ప్రభావం చూపుతాయి.

 మతం, వర్గం, కులం, ప్రాంతం, భాష అన్న కృత్రిమ గీతల్ని దాటి, మంచి కోసం, సమాజ, దేశ శ్రేయస్సు, ప్రజా సంక్షేమం కోసం సంఘటితంగా, వ్యవస్థీకృతమయి కృషి చేసేవారు. వీరు స్వీయ సంస్కరణ, శ్రేయంతోపాటు జన, గణ సంస్కరణ, శ్రేయాన్ని కోరుకుాంరు. కోరు కోవడమే కాదు, శక్తి వంచన లేకుండా ఆ మార్గంలో అహర్నిశలు పరి శ్రమిస్తుాం

 నేడు మానవ సమాజంలో ఎక్కడయితే ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ మస్జిద్‌లు, మందిరాలు, చర్చీలు, సభలు, సమావేశాలు-నిత్యం భక్త జనంతో కిక్కిరిసి ఉండటం మనకు కనబడుతున్నదో, అక్కడే  నాతికి (స్త్రీకి) వలువ (గుడ్డ), నీతికి విలువ రోజు రోజుకు తగ్గి పోతున్నది. అశ్లీలత, అనైతికత, బరి తెగించే స్వభావం, అసహనత, పగ, ధ్వేషం, తల్లిదడ్రులు మరియు సంతానం మధ్య పెరుగుతున్న దూరం, దాంపత్య జీవితంలో అన్యోన్నత లేమి, సెక్యూలర్‌ భావం పేరిట విచ్చలవిడితనం, సహజీవనం లేబుల్‌ చాటున అసహజ, అక్రమ సంబంధం, యువతలో మాదక ద్రవ్యాల బానిసత్వం కోరలు విప్పి కరాళ నృత్యం చేస్తున్నది. ఇందులో మీడియా, సోషల్‌ మీడియా పాత్రను తక్కువ చేసి చూడా నికి లేదు. దాని వల్ల మంచి కన్నా చెడే ఎక్కు జరుగుతున్నది. సమాజం ఏదయినా సరే మూడు వర్గాల్లో విభాజితమయి ఉంటుంది.

మొది వర్గం:

 మతం, వర్గం, కులం, ప్రాంతం, భాష అన్న కృత్రిమ గీతల్ని దాటి, మంచి కోసం, సమాజ, దేశ శ్రేయస్సు, ప్రజా సంక్షేమం కోసం సంఘటితంగా, వ్యవస్థీకృతమయి కృషి చేసేవారు. వీరు స్వీయ సంస్కరణ, శ్రేయంతోపాటు జన, గణ సంస్కరణ, శ్రేయాన్ని కోరుకుాంరు. కోరు కోవడమే కాదు, శక్తి వంచన లేకుండా ఆ మార్గంలో అహర్నిశలు పరి శ్రమిస్తుాంరు.

రెండవ వర్గం:  

చెడు కోసం, సమాజ పతనం, దేశ వినాశనం, ప్రజా సంక్షామం కోసం సంఘితంగా, వ్యవస్థీకృతమయి కుయుక్తులు పన్నే, ప్రణాళికలు రచించే కత్సిత బుద్ధులు, కుమనస్కులు. వీరు తమ ప్రణాళికను –
అమలు పర్చడానికి సమాజం,సంఘంలోని కలం కారుల్ని, ధనవం తుల్ని, మంది మార్బలం గల వ్యక్తుల్ని బరిలోకి పెద్ద ఎత్తున దించుతారు. విచ్ఛిన్నకర వీరి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ స్థాయికయినా దిగ జారడానికి, దిగ జార్చడానికి వెనకాడరు. వీరి ప్రత్యేక ప్రణాళికనను సరించి ఒక ప్రత్యేక పద్ధతిలో పిల్లల నుండి మొదలు పెద్దల వరకు బ్రయిన్‌ వాష్‌ చేసి తమకు అనుకూలంగా మలచుకుంటారు. కొన్ని కొన్ని సందర్భాలలో మంచి పేరుప్రఖ్యాతలు గల వ్యక్తులు, సమాజ పెద్దలు, ధర్మ ప్రతినిధులు కూడా వీరి చదరంగంలో పావులుగా మార డం మనం గమనిస్తాం.

మూడవ వర్గం:

 వీరు మంచిని ప్రేమించే,సత్యాన్ని సత్యంగా చూసే వారయి ఉంారు. వీరు చెడుని, విద్వేష పూరిత వ్యాఖ్యల్ని, విష పూరిత బుద్ధుల్ని అస హ్యించుకుాంరు. అయితే వీరికి వారి స్వీయ సంస్కరణే ముఖ్యమయి ఉంటుంది. మంచిని ఇష్ట పడతారు కానీ మంచి చెయ్యాలనుకున్న వారితో చేయి చేయి కలపరు. చెడుని చీదరించుకుంటారు కానీ, చెడు చేసేవారి చెయ్యి పట్టి  ఆపరు. వీరికి సమాజంలో చోటు చేసుకున్న పెను మార్పును గురించి, నాటి నాటికి దిగజారి పోతున్న నైతిక విలు వల గురించి పెద్దగా చింతనేమి ఉండదు. వీరి మొత్తం దృష్టి స్వీయ సంస్కరణ మీదే కేంద్రీకృతమయి ఉంటుంది.
 సమాజంలో మరికొందరుంటారు వారు చెడుకు వత్తాసు పలికే వారుగా ఉంటారు. గోడ మీద పిల్లిలా ఏది గెలిస్తే దాని పక్షం వహిద్ధాం, మంచి గెలిస్తే మంచి, చెడు గెలిస్తే చెడు అన్నట్టు రెండింకి మధ్య చెడ్డ రేవడిలాగా ఉంటారు. వీరు లెక్కలోకి రారు. సమాజం ఏదయినా ఈ మూడో మేధావి, ధర్మ పరాయణుల వర్గం మౌనం వల్లనే చెడు ప్రబలుతుంది. ఒక విధంగా వీరి చేతకానితనాన్ని చూసి చెడు, చెడు శక్తులు పెట్రేగి పోతాయి. ఇక మొది వర్గం కూడా తన పని చేయడం మానేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉం టుందో ఊహించవచ్చు. ఇలాంటి  పరిస్థితి గురించే ప్రవక్త (స) హెచ్చ రించారు: ”ఏ శక్తి స్వరూపుని చేతిలోనయితే నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. మీరు మంచి వైపునకు పిలవనయినా పిలవాలి, చెడు నుండి ఆపనయినా ఆపాలి. లేదా అల్లాహ్‌ తరఫు నుండి –  భయంకరమయిన శిక్ష మీ మీద వచ్చి పడే ప్రమాదం ఉంది. అప్పుడు మీరు ఎంత ప్రార్థించినా మీ ప్రార్థనలు స్వీకరించ బడవు”. (తిర్మిజీ)
రండీ! కొన్ని ఉదాహరణల ద్వారా సమాజ చిత్రాన్ని తిలకించే  ప్రయత్నం చేద్దాం!
1) మీకు ఆటోలో షార్ట్‌ జర్నీ, ప్రవేట్, గవర్నమెంట్  బస్సులో లాంగ్‌ జర్నీ చేసిన అనుభవం ఉంటుంది. ఆటోలోనయితే ఆటో డ్రైవర్‌ అసభ్యకర మయిన పాటలు ప్ల్లే చేెస్తాడు. అదే లగ్జరీ బస్సులోనయితే పాటలే కాదు రాత్రి పూట సినిమాలు కూడా వేస్తారు. ఎవ్వరూ ఏమీ అనరు. ఇష్టం ఉన్నవారు ఎలాగో చూస్తారు. ఇష్టం లేని వారు ఎందు కొచ్చిన గొడవ అని మౌనం పాటిస్తారు.సామాజిక, నైతిక స్పృహ ఉన్న ఒకరిద్దరు దాన్ని ఖండించడానికి ప్రయత్నించినా ఫలితం పెద్దగా ఏమి ఉండదు. పైగా ావెల్స్‌ వారు ”ప్రయాణికుల సురక్షితంగా వారి ప్రాంతానికి చేర్చడం తోపాటు వారిని ఆహ్లాద పర్చడం కూడా మా బాధ్యతే” అని ఫోజులిస్తారు. అయినా ఎవ్వరికి లేని ఇబ్బంది నీకేంటయ్యా! అని గదమాయించే వారు లేకపోలేదు. మెజారిటీ  ప్రజల అభిప్రాయానికే మా ఓటు అన్నట్టు వారు మౌంగానే ఉన్నారుగా అంారు. ఒకవేళ నీకంతగా నచ్చక పోతే వ్రాత పూర్వకంగా వ్రాసి ఇవ్వు మేము పై అధికారుల వద్దకు విషయం చేర వేస్తాము అని కాసింత సంస్కారాన్ని కూడా ప్రదర్శించడం పరిపాటి.
 ఇదేదో ప్రవ్‌ే, లగ్జరీ బస్సుల్లో మాత్రమే జరిగే తంతు మాత్రమే అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అక్షరాల ముస్లిం ఇళ్ళల్లో జరిగే పెళ్ళిళ్ళ కోసం బాడుగకు తీసుకునే బస్సులో సయితం, బురఖా ధరించిన, నమాజులు చదివే, ధార్మిక పాఠశాలలో పట్టా  పుచ్చుకున్న పండిత మహాశయుల సమక్షంలో సయితం ఇలాింవి చోటు చేసుకోవడం విచారకరం! ‘కుర్రాళ్లు కదరా వదిలేయండ్రా!’ అని ఒకడంటే, ‘పెళ్ళి కదరా ఆ మాత్రం హంగామా ఉండాలి’ అని మరొకడు కితాబిస్తాడు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, ఈ ప్రయాణం మధ్యలో నమాజు సమయం వచ్చినా, బస్సు వారి అదుపులో ఉన్నప్పటికీ ఎవ్వరికీ పట్టదు. ఇక అసలు పెళ్లిలో జరిగే తంతు చెప్పనవసరమే లేదు. అప్పటి  వరకు పరదా పాటించిన భార్యను తీసుకొచ్చి వేదిక మీద నిలబెట్టి మరీ ఫోజు లిప్పిస్తారు. అక్కడే ఊరి పెద్దలు ఉంటారు. నికాహ్‌ చదివించిన ఇమామ్‌ కూడా ఉంతారు. ఎవ్వరూ ఏమీ పట్టనట్టే వచ్చి విందు ఆర గించి వెళ్ళి పోతారు.
2) సిగ్గు సిరిని అమ్మి సొమ్ము చేసుకోవాలనే సినిమా, కార్పొరేట్  కంపెనీలు.ఏది అమ్ముడు పోవాలన్నా మణిశీల కుసుమాన్ని మనీ+షీ= శిల్పంగా చేసి అంగడిలో పెట్టడానికి ఎగ బడుతున్నారు. అర్థ నగ్న, ముప్పాతిక నగ్న దుస్తులు తొడిగించిన పెద్ద ఫ్లెక్సీలు రహదారులకు ఇరువైపులా దర్శనమిస్తున్నాయి. ఇక సినిమా ఫోస్టర్‌ల సంగతి సరే సరి. కొన్ని కొన్ని ప్రాంతాల్లోనయితే నీలి చిత్రాల పోస్టర్లు సయితం దర్శనమిస్తుటాయి. ఎందరో తమ యవ్వనస్థులయిన ఆడ మగ సంతానంతో ఈ మార్గాలగుండా వస్తూ పోతూనే ఉంటారు. ఎవరికీ ఎలాంటి  అభ్యంతరం లేదు. ఎవరికయినా కాస్త ఇబ్బంది కలిగినా గట్టిగా ఖండించే నైతిక ధైర్యం వారికుండదు పాపం!
 ఏదో అరకొర సమయాల్లో తప్ప ఏ నాడయినా మహిళా సంఘాల పేరిట చెలామణి అవుతున్న సంస్థలు వీటికి వ్యతిరేకంగా గొంతు విప్పిన దాఖలాలు లేవు. ఇంత జరుగుతున్నా మనం మాత్రం ఆత్మ గౌరవాన్ని చంపుకుని, ఎవ్వరిని నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు అన్న భ్రాంతిలో బ్రతికేస్తున్నాం.
3) పటణాల్లో షాపింగ్‌ సంస్కృతి మధ్య తరగతి, సంపన్న వర్గాల్లో ప్రబలుతోంది అన్నది బహిర్గత సత్యం. ఇక్కడ ‘సేల్స్‌ గర్ల్స్‌’గా పని చేసే వారు దాదాపు ఆర్థికంగా నలిగిన కుటుంబాల ఆడ పడుచులయి ఉంటారు. వారి అవసరాన్ని క్యాష్‌ చేసుకునే బ్రాండెడ్‌ కంపెనీలు వస్తువులు అమ్ముకోవడానికి వనితల్ని పావులుగా చేస్తున్నారు. వారికి కస్టమర్స్‌ని ఆకర్షించే బట్టలు తొడిగించి స్త్రీ జాతికి అన్యాయం చేస్తు న్నారు. ఇక్కడ విచారకరయిన విషయం ఏమిటంటే స్త్రీలు కూడా ఇలాంటి  వృత్తులను ‘తమ స్వేచ్ఛకు వారిచ్చి రెక్కలు’గా భావించడం! ఒక్క నిమిషం కోసం ఆ కంపెనీ యజమాని తన కూతురినిగానీ, భార్యను గానీ సేల్స్‌ గర్ల్‌ స్థానంలో ఊహించ గలడా? అలాగని ఇది కేవలం బడా షాపింగ్‌ మాల్స్‌కే పరిమితం అనుకుంటే పొరపాటే, పల్లె స్థాయిలో సయితం ఇలా ఆడదానిని అంగడి వస్తువును చేసి వ్యాపారం చేసేవారు మనకు కనబడతారు. చివరికి కల్లు దుకాణాల్లో సయితం సేల్స్‌ గర్ల్స్‌ దర్శనమివ్వడం సమాజ పతనానికి తార్కాణం కాక మరెంటో  చెప్పండి!
4)  ఒక దేశాన్ని అంచనా కట్టడానికి ఆ దేశ స్త్రీని చూస్తే చాలు, ఒక స్త్రీను అంచనా కట్టడానికి ఆమే వస్త్రధారణను చూస్తే చాలు అన్న మాట ఎందుకు అనడం జరిగిందో అడవారితోపాటు మగవారు సయితం అర్థం చేసుకోవాల్సి ఉంది. తన ఇంటి  ఆడ పడుచుల్ని బజారు పాలు చేసిన వారు స్వర్గపు సువాసనను సయితం ఆఘ్రాణించ లేరు. కప్పుకోవడానికి ఉనికిలోకి వచ్చింది బట్ట. అలాంటిది వీరు ఒళ్లు కప్పుకున్నారా?విప్పుకు తిరుగుతున్నారా? అన్న అనుమానం కలిగేలా వస్త్రధారణ చేసి బజారు కెళుతున్నా సంజాయిషీ చెప్పాల్సిన అన్నగానీ నాన్నగానీ, భర్తగానీ, కొడుకుగానీ ఏమి అనడం లేదు.పైగా ఇప్పుడు అదే ట్రెండ్‌ అంటూ మురిసి పోతున్నారు. ఇది వారి ఉదారతకు పరా కాష్ఠ అనాలో ఉదాసీనతకు పరాకాష్ఠ అనాలో అర్థం కాదు.
 ఇవి చాలా చిన్నవి అని భావించబడుతున్న సామాజిక రుగ్మతలే. వీటికి మించిన మహమ్మారి ఆలోచనలు, ఆచరణలు నేడు మన సమాజంలో ఉన్నాయి. మరి వీటినే ఎందుకు ప్రస్తావించడం జరిగింది? అంటే, ఇది ప్రతి ఒక్కరికి అనుభవంలో వచ్చేవే, తలచుకుంటే ప్రతి ఒక్కరూ నిర్మూ లించ గలిగేవింవే. కాబ్టి పూరించ సాధ్యం కాని నష్టం మన స్వయా నికి, కటుంబానికి, సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి కలగక ముందే మనం మంచికై ఉద్యమించాలి. మంచికి శ్రీకారం చుట్టి, చెడుకి చరమ గీతం పాడాలి. లేదంటే, ఖుర్‌ఆన్‌కి ఆయత్‌ మన విషయంలో నిజమయ్యే ప్రమాదముంది:
”ఏ ఉపద్రవమయితే మీలోని దుర్మార్గులకు మాత్రమే పరిమితం కాకుండా (సమాజంలో ఉన్న వారందరినీ) కభళిస్తుందో దాని బారి నుండి మిమ్మల్ని మీరు కాపాడు కోండి”. (అన్ఫాల్‌: 25)

Related Post