ముస్లిం జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు – 3

17- బ్రతికి ఉన్న వారిని సహాయం కోరటం, సిఫారసు కోసం అడగటం సమ్మతమేనా?

జ: అవును, సమ్మతమే. ఇతరులకు సహాయపడమని ఇస్లామీయ షరీఅత్‌ ప్రోత్సహించింది. అల్లాహ్‌ ఈ విధంగా ఆజ్ఞాపించాడు: ‘సత్కార్యాలలో, దైవభీతితో కూడిన విషయాలలో ఒండొకరికి తోడ్పడుతూ ఉండండి”.(అల్‌మాయిద-2)
మహనీయ ముహమ్మద్‌(స)ఇలా ప్రవచించారు: ”దాసుడు తన సోదరునికి తోడ్పడుతూ ఉన్నంత సేపు అల్లాహ్‌ అతని తోడ్పాటులో ఉంటాడు” (ముస్లిం)
ఇక సిఫారసు వ్యవహారానికొస్తే అది ఎంతో మహత్పూర్వకమైనది. సిఫారసు కోసం ఎవరయినా అభ్యర్థించినపుడు, వారి వ్యవహారంలో కల్పించుకుని సిఫారసు చేయటం ‘షఫాఅతె వాస్తా’ అనబడుతుంది. ఈ విషయంలో ఉన్న దైవోపదేశమేమిో గమనించండి: ”ఎవరయినా ఒక మంచి పని కోసం సిఫారసు చేస్తే అతనికి కూడా అందులో కొంతభాగం లభిస్తుంది”.(అన్‌నిసా -85)

” సిఫారసు చేయండి, ప్రతిఫలం పొందుతారు” ( బుఖారీ) అని ప్రవక్త మహనీయులు(స) ప్రేరేపించారు.

ఒకవేళ మీరు ఉహుద్‌ పర్వతానికి సమానంగా అల్లాహ్‌ మార్గంలో బంగారాన్ని ఖర్చు పెట్టినా సరే – మీరు విధివ్రాతను సత్యమని విశ్వసించనంత వరకూ మీ దానాన్ని స్వీకరించడు.

ఈ సిఫారసు సమ్మతమే. అయితే కొన్ని షరతులకు లోబడి:
(1)సిఫారసు కోసం జీవించి ఉన్న వారినే కోరాలి. ఎందుకంటే మృతుడు తన స్వయానికే లాభం చేకూర్చుకోలేక పోయినపుడు ఇతరులకు ఎలా లాభం మేకూర్చ గలడు ?
(2) సిఫారసు కోసం మనం ఎవరిని అడుగుతున్నామో వారు మన విన్నపాన్ని అర్థం చేసుకోగలవారై ఉండాలి.
(3) మనం దేనికోసం సిఫారసు చేయమని అంటున్నామో ఆ వస్తువు ఉండాలి.
(4) మనం కోరే ఆ వస్తువును మానవ మాత్రుడు ఇప్పించగలిగి ఉండాలి.
(5) ఆ వస్తువు ప్రాపంచిక వ్యవహారాలకు సంబంధించినదై ఉండాలి.
(6) అది ధర్మసమ్మతమైనదై ఉండాలి. దాన్ని మనం పొందటం వల్ల ఇతరులకు నష్టం వాటిల్లకూడదు.

18 – వసీల ఎన్ని రకాలు?

జ: వసీల రెండు రకాలు. 1) సమ్మతమైన వసీలా (2) సమ్మతం కాని వసీలా.
సమ్మతమైన వసీలా కూడా మూడు విధాలుగా ఉంటుంది. ఒకటి: అల్లాహ్‌ నామాల,గుణగణాల ఆధారంగా అభ్యర్థించటం. రెండవది: తాము చేసుకున్న ఏదేని మంచిపని ఆధారంగా వేడుకోవటం- ముగ్గురు గుహవాళ్ళ గాధ మనకు తెలిసిందే.
మూడవది: ఎవరయినా సజీవుడైన ముస్లిం పుణ్యపురుషుని దుఆను ‘వసీలా'(ఆధారం)గా చేసుకోవటం.

సమ్మతం కాని వసీలా: ఇది రెండు విధాలు .
ఒకటి: దైవప్రవక్త(స) లేదా మరెవరయినా సత్పురుషుని ఉన్నత స్థానాన్ని ఆసరాగా చేసుకుని దైవసహాయాన్ని అర్థించటం. ఉదాహరణకు:- ఓ అల్లాహ్‌! నేను నిన్ను నీ ప్రవక్త(స) ఔన్నత్యం ఆధారంగా లేదా హజ్రత్‌ హుసైన్‌(ర)అంతస్తు ఆధారంగా వేడుకుంటున్నాను అని అనటం. దైవప్రవక్త (స) దైవసన్నిధిలో గొప్ప స్థానమున్న సంగతి వాస్తవమే. అలాగే దేవుని పుణ్యపురుషుల స్థానం కూడా గొప్పదే. అయితే దైవసన్నిధిలో మేలును కోరటంలో అందరికంటే అత్యుత్తమ శ్రేణికి చెందిన ప్రవక్త ప్రియ సహచరులు ఎన్నడూ ఈ విధంగా చేయలేదు. వారి కాలంలో కరువుకాటకాలు సంభవించినపుడు వారు (సహాబా-రజి) దైవ ప్రవక్త(స) వసీలాను ఆశ్రయించలేదు. మరి చూడబోతే ప్రవక్త(స) వారి సమాధి వారికి చేరువలోనే ఉండేది. పైగా వారు ప్రవక్త పినతండ్రి అయిన హజ్రత్‌ అబ్బాస్‌ (ర) చేత దుఆ చేయించారు – అప్పటికి ఆయన జీవించి ఉన్నారు గనక.
రెండవది: దాసుడు దైవ ప్రవక్త(స) లేదా దేవుని ఏ ప్రియ దాసునిపై ఒట్టు వేసి తన కోర్కెను వెలిబుచ్చటం. ఉదాహరణకు: ఓ ఆల్లాహ్‌! నేను నీ ఫలానా ప్రియతముని ఆధారంగా లేదా ఫలానా ప్రవక్త తెచ్చిన సత్యం ఆధారంగా నీకు దరఖాస్తు చేసుకుంటున్నాను.

19 – మృతులను గానీ, గైర్హాజరు వ్యక్తులను గానీ మొరపెట్టుకోవటం ఎటువంటిది.?

జ: మృతులను గానీ, హాజరుకాని వ్యక్తులను గానీ మొరపెట్టుకోవటం షిర్క్‌. ఎందుకంటే దుఆ (ప్రార్థన,వేడుకోలు) అనేది ఒక్క అల్లాహ్‌కే ప్రత్యేకం. అది ఆయన హక్కు. అల్లాహ్‌ ఉపదేశించాడు: ”ఆయన్ని వదలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు. ఒకవేళ మీరు వారిని మొరపెట్టుకున్నా, వారు మీ మొరను ఆలకించరు. ఒకవేళ ఆలకించినా మీ అక్కరను తీర్చలేరు. పైపెచ్చు ప్రళయదినాన మీరు కల్పించే భాగస్వామ్యాన్ని(షిర్క్‌ను) వారు త్రోసిపుచ్చుతారు.” (ఫాతిర్‌- 13,14)

మహాప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ”ఎవడు అల్లాహ్‌ను కాకుండా వేరొకరిని మొరపెట్టుకుంటూ ఉన్నస్థితిలో చస్తాడో అతడు నరకానికి పోతాడు” (బుఖారీ)
మృతుడు స్వయంగా సజీవుల ప్రార్థనల (దుఆల) ఆధారపడి ఉండగా అతన్ని ఏదన్నా అడగగలం? అదీగాక, అతని మరణంతోనే అతని సత్కర్మల పరంపర తెగిపోయింది. బ్రతికి ఉన్నవారి కర్మలు మాత్రం కొనసాగుతూ ఉంటాయి. మృతుని మన్నింపు కోసం సజీవులు ప్రార్థించినపుడు అతడు సంతోషిస్తాడు. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే మృతుడు స్వయంగా వేరొకరిపై ఆధారపడి ఉన్నాడు. అలాంటప్పుడు అతన్ని మొరపెట్టుకోవటం ఎంతవరకు సబబు? ఒక వేళ మొరపెట్టుకున్నా ఆలకింనలేనివాడు. దానికి ఎలా స్పందించగలడు?.

ప్ర: స్వర్గం నరకం ప్రస్తుతానికి ఉన్నాయా?

జ: ఉన్నాయి. అల్లాహ్‌ మానవులను పుట్టించిన ముందే స్వర్గ-నరకాలను పుట్టించాడు. అవి ఎన్నటికీ సశించవు. తరువాత అల్లాహ్‌ తన కృపతో కొందరిని స్వర్గం కోసం సృష్టించాడు. మరి కొందరిని తన న్యాయం ప్రకారం నరకం కోసం సృష్టించాడు. ఎవరు దేని కోసం పుట్టించబడ్డారో వారికి ఆ మార్గం సుగమం చేయబడింది.

ప్ర: విధివ్రాతపై విశ్వాసం అంటే ఏమిటి?

జ: మంచి జరిగినా, చెడు జరిగినా – అంతా దైవ నిర్ణయం ప్రకారం జరుగుతుంది అనే దానిని ధృవీకరించాలి. అల్లాహ్‌ తాను తలచినది చేసి తీరుతాడు అనే సత్యాన్ని నమ్మి నడుచుకోవాలి. ఇదే విధివ్రాత (జాతకం)పై విశ్వాసం అంటే. మహా ప్రవక్త ముహమ్మద్‌(స) ఇలా ప్రవచించారు: ”అల్లాహ్‌ గనక సమస్త ఆకాశవాసులను, సమస్త భూవాసులను శిక్షిస్తే అలా శిక్షించటంలో ఆయన అన్యాయ పరుడు కాడు. ఒకవేళ ఆయన అందరినీ కరుణిస్తే ఆయన కారుణ్యం వారి పాలిట వారి కర్మలకన్నా మేలైనదని గ్రహించాలి. ఒకవేళ మీరు ఉహుద్‌ పర్వతానికి సమానంగా అల్లాహ్‌ మార్గంలో బంగారాన్ని ఖర్చు పెట్టినా సరే – మీరు విధివ్రాతను సత్యమని విశ్వసించనంత వరకూ మీ దానాన్ని స్వీకరించడు. ఇంకా తెలుసుకోండి! మీకు ఏ ఆపద వచ్చి పడిందో అది మీ నుండి తొలగిపోయే అవకాశం లేనందువల్లే వచ్చిపడింది. మరే ఆపద మీ నుండి మీరు తప్పించుకున్నారో అది మీపై రాని ఆపద గనకనే మీరు తప్పించుకోగలిగారు. మీరు ఈ విశ్వాసంపై గాకుండా మరే యితర విశ్వాసంపై మరణించినా మీకు నరకమే గతి.” ( అహ్మద్‌, అబూదావూద్‌)

విధివ్రాతను విశ్వసించటంలో 4 అంశాలు చేరి ఉన్నాయి: ఎవరయినా ఈ రకమైన సాకు చూపితే సమాజం దాన్ని ఒప్పుకోదు. అతను శిక్షార్హుడవుతాడు. ”దేవుడు నీకు శిక్ష కూడా రాసి పెట్టాడు. అనుభవించు” అని జనులాంరు. కాబట్టి విధివ్రాత ఆసరా పోంది, సాకులు చెప్పటం సమ్మతం కాదు. పైగా ఇది ఒక రకమైన తృణీకారం. అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ”దేవుడు తలచుకుని ఉంటే మేము గానీ, మా తాతముత్తాతలు గానీ షిర్క్‌ పాల్పడేవారం కాము; ఏ వస్తువునూ నిషిద్ధంగా ఖరారు చేసేవారం కూడా కాము” అని అంటారు. వీరికి పూర్వం గతించిన వారు కూడా ఇలాగే ధిక్కార వైఖరిని అవలంబించారు.” (అల్‌ అన్‌ఆమ్‌ – 148 )

ప్ర: సత్కర్మల స్వీకృతికి షరతులేమి?

జ: సత్కర్మలు స్వీకారయోగ్యమవానికి అనేక షరతులున్నాయి. వీటిలో కొన్ని ఇవి:
(1) ఒక్కడైన అల్లాహ్‌ను మాత్రమే విశ్వసించాలి. ఆయనకు సహవర్తుల్ని కల్పించరాదు. ఎందుకంటే ముష్రిక్కు చేసే సత్కర్మ ఏదీ ఆమోదించబడదు.
(2) ఏ సత్కర్మ చేసినా చిత్తశుద్ధితో చేయాలి. కేవలం అల్లాహ్‌ను సంతోష పరచటమే ధ్యేయమై ఉండాలి.
(3) సదాచరణ చేస్తున్నప్పుడు దైవప్రవక్త(స) విధానాన్ని అనుసరించాలి. అంటే ప్రవక్త(స) వారు మనకు అందజేసిన షరీయతు ప్రకారం ఆ సత్కర్మలను నెరవేర్చాలి. కాబట్టి ముహమ్మద్‌(స)వారి పద్ధతి ప్రకారం చేయాలి.
ఈ షరతులలో ఏ ఒక్క షరతు నెరవేరకపోయినా ఆ సత్కర్మ త్రోసిపుచ్చబడుతుంది. అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు:
”వారు (ప్రాపంచిక జీవితంలో) చేసివున్న కర్మల వైపుకు మేము వచ్చి, వాటిని ఎగిరిన దుమ్ము ధూళి వలే చేసేశాము” (అల్‌ ఫుర్ఖాన్‌: 23)

ప్ర: ‘ఎహ్సాన్‌’ అని దేన్నంటారు ?

జ: ఒక సారి దైవ ప్రవక్త (స) ప్రశ్నించేవాని ప్రశ్నకు బదులిస్తూ ఇలా వివరించారు:
”మీరు అల్లాహ్‌ను ఆరాధిస్తున్నప్పుడు మీరు ఆయన్ని చూస్తున్నట్లుగానే ఆరాధించండి. ఒకవేళ మీరు ఆయన్ని చూడలేకపోతే ఆయన మిమ్మల్ని చూస్తూనే ఉన్నాడు ( అన్న భావన అయినా ఉండాలి.)” ( బుఖారీ, ముస్లిం )

Related Post