వారసత్వ హక్కు

వారసత్వ హక్కు  – ఇస్లాం ధర్మ శాస్త్రం పరిపూర్ణం కాక ముందు జరిగిన అన్యాయాల్లో ఒకటి – స్త్రీలకు, చిన్న పిల్లలకు వారసత్వంలో వా ఇవ్వక పోవడం. యుద్ధంలో పాల్గొనేంతటి వయసు గల పిల్లలు మాత్రమే ఆస్తికి వారసులు అయ్యే వారు. ఇస్లామీయ వారసత్వపు చట్టంలో మౌలికమయిన సూత్రమేమిటంటే, ప్రతి వ్యక్తికి అతని అవసరం కొద్దీ ఇవ్వాలి. అవసరం అంటే వ్యక్తి యొక్క సామాజిక బాధ్యత. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:
”తండ్రులు, సమీప బంధువులు వదలి వెళ్లిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంటుంది. అలాగే తండ్రులు, సమీప బంధువులు వదలి వెళ్లిన ఆస్తిలో స్త్రీలకూ భాగం ఉంటుంది. ఆ ఆస్తి తక్కువైనా సరే, ఎక్కువైనా సరే (అందులో) వాటా మాత్రం నిర్థారితమై ఉంది”. (అన్నిసా: 07)

”ఎవరు వారసులు, ఎవరు వారసులు కారు, వారసత్వంలో ఎవరికెంత వాటా దక్కాలి అన్న విషయ అవగాన పేరే ఇల్ముల్‌ ఫరాయిజ్‌”

వారసత్వానికి సంబంధించిన విధుల విద్యను అరబీలో ఇల్ముల్‌ ఫరాయిజ్‌ అంటారు. దీని పూర్వపరాల్ని తెలసుకుందాం!
”ఎవరు వారసులు, ఎవరు వారసులు కారు, వారసత్వంలో ఎవరికెంత వాటా దక్కాలి అన్న విషయ అవగాన పేరే ఇల్ముల్‌ ఫరాయిజ్‌”

ఫర్జ్‌: ఇక్కడ పర్జ్‌ అంటే నిర్థారితమయిన వాటా అని అర్థం. ఉదాహరణకు – సగం, మూడో వంతు భాగం మొదలయినది.ఈ విద్య కేవ లం మృతుడు వదలి వెళ్ళిన ఆస్తి మరియు హక్కుల గురించి మాత్రమే చర్చిస్తుంది. ఈ విద్య వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, వారసుల్లో హక్కుదారుల హక్కులను వారి వరకు సగౌరవంగా చేరవేయడం జరుగుతుంది.

వారసత్వపు విద్వ ప్రాముఖ్యత:

అవసరం రీత్వా ఇది ఎంతో అవశ్యమయినది. స్థాయి రీత్యా ఇది ఎంతో మహోన్నతమయినది. హక్కుల రీత్యా ఇది ఎంతో ఘనమయినది. ఈ విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రవక్త (స) ఇలా అన్నారు: ”జ్ఞానం మూడు విధాలు. ఇది తప్ప మిగతాది అదనం. 1) స్పష్టమ యిన అల్లాహ్‌ ఆదేశం-సూచన. 2) స్థాపించ బడిన ప్రవక్త (స) వారి సంప్రదాయం. 3) న్యాయ బద్ధమయిన విధుల నిర్వహణ- ఆస్తి పంపకం”. (ఇబ్ను మాజహ్‌)
ఇబ్ను ఉయైనా (రహ్మ) ఇలా అన్నారు: ఇల్ముల్‌ ఫరాయిజ్‌ను సగం జ్ఞానంతో పోల్చడానికి గల కారణం – దాంతో ప్రజలందరి
హక్కులు ముడి పడి ఉండటమే, ప్రజలందరికీ దాని అవసరం ఉండటమే”.

ఖుర్‌ఆన్‌లో వారసత్వం ప్రస్తావన:

”ఓ ప్రవక్తా! (స) వీరు నిన్ను ‘కలాలహ్‌’ గురించి ధర్మాదేశం అడుగుతున్నారు. అల్లాహ్‌ (స్వయంగా) కలాలహ్‌ గురించి మీకు ఆదేశం ఇస్తున్నాడని నువ్వు వారికి చెప్పు. ఏ వ్యక్తయినా సంతానం లేకుండా చనిపోతే, అతనికి ఒక సోదరి మాత్రమే ఉంటే, అతను వదలి వెళ్ళిన ఆస్తిలో సగ భాగం ఆమెకు లభిస్తుంది. ఒకవేళ సోదరి సంతానం లేకుండా మరణిస్తే ఆమె సోదరుడు ఆమె ఆస్తికి వారసుడవుతాడు. ఒకవేళ మరణించిన వ్యక్తికి ఇద్దరు సోదరీమణులుంటే అతని మొత్తం ఆస్తిలో  మూడింట రెండు వంతుల భాగం వారిద్దరికీ దక్కుతుంది. ఒకవేళ సోదరీ సోదరులు అనేక మంది వారసులుగా ఉంటే, ఒక పురుషుని బాగం ఇద్దరు స్త్రీలకిచ్చే భాగానికి సమానంగా ఉంటుంది. మీరు పెడదారి పట్టకుండా ఉండేందుకు అల్లాహ్‌ మీకు స్పష్టంగా విడ మరచి చెబుతున్నాడు. అల్లాహ్‌ ప్రతిదీ తెలిసినవాడు”. (అన్నిసా: 176)

”అల్లాహ్‌ మీ సంతానం విషయంలో మీకు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు: మీ తండ్రులలో, మీ కుమారులలో మీకు ప్రయోజనం చేకూర్చడంలో ఎవరు ఎక్కువ సన్నిహితులో మీకు తెలీదు. (మీ ఇష్టం కాదు, అల్లాహ్‌ ఇష్టం).ఇది అల్లాహ్‌ తరఫు నుండి నిర్ణయించ బడిన వాలు. నిశ్చయంగా అల్లాహ్‌ సర్వ జ్ఞాని, పరిపూర్ణ వివేకవంతుడు”. (అన్నిసా: 11)

వారసత్వ ఆస్తి హక్కులు:

1) సౌకర్యం లేని పక్షంలో మృతుడు వదలి వెళ్ళిన ఆస్తిలో నుంచి అతని ఖనన సంస్కారా లకు అయ్యే ఖర్చును తీయాలి.
2) మృతుని మీద రుణం, చేతి బదులు లాింవి ఏవయినా ఉంటే వాిని తీర్చాలి.
3) మృతుని మీద మిగిలి ఉన్న జకాత్‌, ఫిద్యా – పరిహారం లాంటి బాధ్యతలను పూర్తి చేయాలి.
4) అతను చేసి వెళ్ళిన వసీయతును షరీ యతు బద్ధంగా పూర్తి చెయ్యాలి.
5) పై పేర్కొన్నవన్నీ పూర్తయిన మీదట మిగి లిన ఆస్తిని వారసత్వపు సొమ్ముగా పరిగణించాలి. ఈ వ్యాసం ద్వారా చెప్పాలనుకుం టున్నది కేవలం దాని గురించి మాత్రమే.

వారసత్వ సొమ్ము మూలాధారాలు మూడు:

1) అల్‌ ముఅర్రిస్‌: వారసత్వానికి కారణమ యినవాడు వాడు. వారసత్వ సొమ్మును వదలి వెళ్ళిన వ్యక్తి; మృతుడు.
2) అల్‌ వారిస్‌: వారసుడు-మృతుడి మరణా నంతరం కూడా బతికి ఉన్న హక్కు దారుడు.
3) హక్కుల్‌ మౌరూస్‌: వారసత్వపు హక్కు – మృతుడు వదలి వెళ్లిన సొమ్ము.

వారసత్వ హక్కును పొందే అర్హతలు మూడు:
1) నికాహ్‌: వివాహ కారణంగా భర్త భార్య ఆస్తికి, భార్య భర్త ఆస్తికి వారసులవుతారు. (అల్లాహ్‌ కాపాడు గాక!) ఒకవేళ వివాహ మయిన మరుక్షణం ఇరువురిలో ఎవరు మర ణించినా వారు ఒండొకరి ఆస్తికి అర్హులవు తారు.
2) రక్త సంబంధం: కుటుంబ వృక్షానికి కుదురు వంటి అమ్మా నాన్నలు. ఆ వృక్ష కొమ్మల్లాంటి కొడుకులు, కూతుళ్ళు, వాటి రెమ్మల్లాంటి చిన్నాన్న, ఆయన సంతానం, పెదనాన్న, ఆయన కుమారులు. ఆ రెమ్మల పూల వంటి అదే వరుసకు చెందిన స్త్రీలు.
3) బానిసకు స్వేచ్ఛ ప్రసాదించిన కారణంగా సంక్రమించే హక్కు.

వారసత్వానికి అనర్హులు ముగ్గురు:

1) బానిస: బానిసగా ఉన్నంత వరకూ.
2) అన్యాయంగా హత్య చేయడం: మృతుని చంపిన స్త్రీ, పురుషుడు ఎవ్వరయినా.
3) మత ధర్మం వేరవ్వడం: ప్రవక్త (స) అన్నారు: ”ఒక విశ్వాసి అవిశ్వాసి ఆస్తికి వారసుడు కాలేడు. ఒక అవిశ్వాసి విశ్వాసి ఆస్తికి వారసుడు కాజాలడు”.
(ముత్తఫఖున్‌ అలైహి)

వారసులు ముగ్గురు:

1) వాటా నిర్ధారితం అయిన వారు. 2) మరీ దగ్గర రక్త సంబంధీకులు, కొడుకులు, కుమా ర్తెలు-(అసబహ్‌). 3) బంధువులు.

వారసత్వ సొమ్ము పంపిణికి షరతులు మూడు:

1) సదరు వ్యక్తి మరణించాడన్న నిర్థారణ జరగాలి. ప్రత్యక్షంగా చూసయినా, ప్రామాణిక ఆధారం ద్వారా అయినా, ఇద్దరు వ్యక్తుల సాక్ష్యం ద్వారానయినా.
2) సదరు వ్యక్తి మరణించిన సమయానికి అతని వారసులు బతికి ఉన్నారన్న నిర్ధారణ జరిగాలి.
3) బతికి ఉన్న వారు వారసత్వానికి అర్హులా, అనర్హులా అన్న నిర్ధారణ జరిగాలి.

వారసత్వ ఆస్తి పంపిణి రెండు విధాలు:

1) నిర్థారితమయిన వాటా. సగం, మూడో వంతు, ఆరోవంతు భాగం.
2) వాటా నిర్థారితం కాని పంపిణి. అది మరీ దగ్గర బంధువులకు చెందినది.

ఖుర్‌ఆన్‌లో నిర్థారించ బడిన వాటాలు ఆరు:

1) నిస్ప్‌: సగం, రుబ్‌వు: నాలుగో వంతు. సులుస్‌: మూడో వంతు, సులుసాన్‌: మూడింట రెండు వంతుల భాగం. సుదుస్‌: ఆరో వంతు.

నిస్ప్‌ – సగ భాగానికి వారసులు అయిదుగురు:

తన భార్యకు సంతానం లేని పక్షంలో భర్త. కూతురు, కొడుకు కుమార్తె, సొంత చెల్లెలు, సవితి చెల్లెలు.
వారసులు పురుషులలో నుండి 15 మంది. స్త్రీలలో నుండి 11 మంది.

”ఇది అల్లాహ్‌ తరఫు నుండి జరిగిన నిర్థారణ. అల్లాహ్‌ అన్నీ తెలిసిన వాడు, వాత్సల్య భరితుడు”. (అన్నిసా: 12)
శుభవార్త: ”ఇవి అల్లాహ్‌ నిర్థారించిన హద్దులు. అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపే వారికి అల్లాహ్‌ క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలో ప్రవేశం కల్పిస్తాడు. వాిలో వారు కలకాలం ఉంారు. గొప్ప విజయం అంటే ఇదే”. (అన్నిసా: 13)
హెచ్చరిక: ”ఇక ఎవడు అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (స) యెడల అవిధేయుడయి, ఆయన నిర్థారించిన హద్దులను అతిక్రమిస్తాడో వాడిని అల్లాహ్‌ నరకాగ్నిలో పడ వేస్తాడు. వారందులో ఎల్లకాలం పడి ఉంటారు. అవమానకరమయిన శిక్ష అలాంటి వారి కోసమే ఉంటుంది”. (అన్నిసా: 14)

Related Post