సూరహ్‌ ఆల్‌ ఇమ్రాన్‌

నామకరణం: సూరహ్‌ ఆల్‌ ఇమ్రాన్‌

‘ఆల్‌ ఇమ్రాన్‌’ అని నామకరణం చెయ్యడానికి కారణం – ఈ సూరహ్‌లో పేర్కొన బడిన గొప్ప వంశం. ఇమ్రాన్‌ వంశీయులు అన్నది దీని భావం. ప్రవక్త ఈసా (అ) వారి తల్లి మర్యం (అ) తండ్రి,లేదా తాత పేరు ఇమ్రాన్.

జాహ్రావైన్‌ (రెండు జ్యోతులు) చదువుతూ ఉండండి. అవి తమను పారాయణం చేసే వారి తరఫున పోరాడుతాయి. రేపు ప్రళయ దినాన అవి రెండు మేఘాల రూపంలో వస్తాయి.

సూరహ్‌ పరిచయం:

1) ఈ సూరహ్‌ మదనీ సూరహ్‌.
2) తివాల్‌ సూరాలలోని ఒకటి.
3) ఇందులోని ఆయతుల సంఖ్య 200
4) ఖుర్‌ఆన్‌ క్రమానుసారం ఇది మూడవ సూరహ్‌.
5) ఈ సూరహ్ అన్ఫాల్‌ సూరహ్‌ తర్వాత అవతరించింది.
6) ఈ సూరహ్‌ ‘హురూఫ్‌ ముఖత్తఆత్‌’ (الم) తో మొదలవుతుంది.
7) జుజ్‌ ౩,4, హిజ్బ్‌ 6,7.8, రుబుఅ 1-6


సూరహ్‌ పేర్కొన బడిన అంశాలు:


ఈ సూరాలో ఇస్లాం ధర్మానికి సంబంధించిన రెండు మౌలిక మూలాధారాల ప్రస్తావన ఉంది. 1) అఖీదహ్‌- అల్లాహ్‌ ఏకత్వాన్ని నిరూపించే ఆధారాలు. 2) షరీఅహ్‌: అల్లాహ్‌ మార్గంలో పోరాటం, యుద్ధ సంబంధిత ఆదేశాలు.


సూరహ్‌ అవతరణ నేపథ్యం:


ఖుర్‌ఆన్‌ వ్యాఖ్యానకర్తలు ఇలా అన్నారు: ప్రవక్త (స) వారి సన్నిధికి క్రైస్తవుల ఓ బృందం వచ్చింది. ఆ బృంధం క్రైస్తవ మతానికి చెందిన ఉద్దండ పండితులున్నారు, రోమ్‌ దేశ రాజులు సయితం ఎంతగానో గౌరవించే విద్యావంతులున్నారు. వారు వచ్చి ప్రవక్త (స) వారి మస్జిద్‌లో అస్ర్‌ నమాజు సమయంలో ప్రవేశించారు. వారికి ప్రార్థన చేసుకునే అనుమతి ప్రవక్త (స) ఇఆచ్చరు. వారు తూర్పు వైపునకు తిరిగి ప్రార్థన ముగించారు. అప్పుడు వారిలోని ఇద్దరు పెద్దల్ని ఉద్దేశించి ప్రవక్త (స) ఇలా అన్నారు:

”ఇస్లాం స్వీకరించండి”. వారన్నారు: ”మీరు రాక పూర్వమే మేము ఇస్లాం స్వీకరించేశాము”. ప్రవక్త (స) అన్నారు: మీరు అబద్ధమాడుతున్నారు. మీరు ఇస్లాం స్వీకరించకుండా మిమ్మల్ని ఈసా (అ) అల్లాహ్‌ కుమారుడు అన్న నమ్మకం, శిలువను ఆరాధించడం, పందిని తినడం ఆపుతున్నాయి. అందుకు వారన్నారు: ”సరే ఈసా (అ) అల్లాహ్‌ కుమారుడు కాకపోతే ఆయన తండ్రి ఎవరు?’
అది విన్న ప్రవక్త (స) – ‘ఒక కుమారుడికి అతని తండ్రి పోలికలు ఉంటాయి అని మీకు తెలీదా?’ వారన్నారు: తెలుసు, పోలిక ఉంటుంది.. ”మనందరి ప్రభువు సమసమ్త వస్తువులను కనిపెట్టుకొని ఉన్నాడు, వాటిని కాపాడుతున్నాడు, వాటికి కావాల్సి ఉపాధిని ఇస్తున్నాడు. అని మీకు తెలీదా? వారన్నారు: ”తెలుసు, ఆయనే ఇవన్నీ చేస్తున్నాడు”.


మరి ఈసా (అ) అల్లాహ్‌కు చెందిన ఈ మొత్తం అధికారం ఇసుమంత దానికయినా యజమానిగా ఉన్నారా?’ వారన్నారు: ‘లేదు’. అప్పుడు ప్రవక్త (స) ఇలా అన్నారు: ”మనందరి ప్రభువు, ఈసా (అ)ను మాతృ గర్భంలో తాను తలచిన ఆకారాన్ని ఇచ్చాడు. మనందరి ప్రభువు తినడు, త్రాగడు, కాలకృత్యాల తీర్చుకోడు’ అని మీకు తెలీదా? వారన్నారు: ”తెలుసు, అల్లాహ్‌ గుణాలు ఇవే. ప్రవక్త (స) అన్నారు: ”మీకీ విషయం తేలీదా? ఈసా (అ) ఆమే తల్లి ఇతర తల్లుల మాదిరిగానే ఆమెను మోసింది. వారు జన్మనిచ్చినట్టే హజన్మనిచ్చింది. ఆ తార్వత ఆయన సాధారణ పిల్లాడి మాదిరిగానే ఆయన ఆహార పానీయాల అవసరం ఉండేది.ఆ తర్వాత పెద్దయ్యాక ఆయన భోంచేసేవారు. కాలకృత్యాలు తీర్చుకునేవారు. వారన్నారు: అవును, ఇది నిజమే. అప్పుడు ప్రవక్త (స) అన్నారు: ఇది సత్యమయినప్పుడు – మీ భ్రమ పడుతున్నది ఎలా నిజమవుతుంది?’ వారి నొట మాట రాలేదు. అప్పుడు అల్లాహ్‌ – ప్రారంభం నుండి 80 వరకు ఆయతులను అవతరింప జేశాడు.


ఈ సూరహ్‌ ఘనత:

ప్రవక్త (స) ఇలా అన్నారు: మీరు ఖుర్‌ఆన్‌ చదువుతూ ఉండండి. ప్రళయ దినాన అది తనను పారాయణం చేసేవారి పక్షాన సిఫారసు చేస్తుంది. జాహ్రావైన్‌ (రెండు జ్యోతులు) చదువుతూ ఉండండి. అవి తమను పారాయణం చేసే వారి తరఫున పోరాడుతాయి. రేపు ప్రళయ దినాన అవి రెండు మేఘాల రూపంలో వస్తాయి. లేదా పక్షి రెక్కల వలె వీటికి రెక్కలుంటాయి” (ముస్లిం)

Related Post