సూరహ్‌ తాహా

నామకరణం: సూరహ్‌ తాహా

ఈ సూరహ్‌ాకి ‘తాహా’ అని నామకరణం చెయ్యడానికి పొడి అకరాలయి ‘తా”హా’తో ఈ సూరహ్‌ా ప్రారభం కావడమే. కొందరు ‘తాహా’, ‘యాసీన్‌’ లాంటి  పేర్లను ప్రవక్త ముహమ్మద్‌ (స) వారికి ఆపాదిస్తారు, ఇది సరయినది కాదు. అలాగే ఇలాంటి  పేర్లు కూడా పెట్టుకుంటుంటారు, ఇది కూడా హర్షించ దగినది కాదు.

అల్లాహ్‌ ఔన్నత్యాన్ని కొనియాడుతూ ఉండాలని, ఇతరులకు లభించిన వాటి  గురించి ఆలోచించరాదని, తన కుటుంబాన్ని ప్రార్థనలు చేసేలా ప్రోత్సహించాలని  ప్రవక్త (స) వారికి ఉపదేశించడం జరిగింది.

సూరహ్‌ పరిచయం:

1) ఇది మక్కీ సూరహ్‌. 130, 131 ఆయతులు తప్ప. ఇవి మదీనాలో అవతరించాయి.

2) ఇది మియీన్‌ సూరాలలోనిది.

3) ఆయతుల సంక్య 135.

4) క్రమానుసారం ఇది 20వ సూరహ్‌.

5) ఇది సూరహ్‌ మర్యమ్‌ (అ) తర్వాత అవతరించింది.

6) ఇది హురూఫ్‌ ముఖత్తఆత్‌ (‘తా-హా)తో ప్రారంభమవుతుంది.

ముఖ్యాంశాలు:

ఈ సూరహ్‌ తౌహీద్‌, రిసాలత్‌, ఆఖిరత్‌ గురించి నొక్కి వక్కాణిస్తుంది. ప్రవక్త (స) మక్కాలో అవిశ్వాసుల నుంచి ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు, కుట్రలు, దౌర్జన్యాల నేపథ్యంలో ఆయనకు ఊరటగా ఈ సూరహ్‌ అవతరించింది. రాత్రిబవలు, సూర్యోదయం సూర్యాస్తమయాల్లో అల్లాహ్‌ ఔన్నత్యాన్ని కొనియాడుతూ ఉండాలని, ఇతరులకు లభించిన వాటి  గురించి ఆలోచించరాదని, తన కుటుంబాన్ని ప్రార్థనలు చేసేలా ప్రోత్సహించాలని  ప్రవక్త (స) వారికి ఉపదేశించడం జరిగింది. అలాగే ఈ సూరహ్‌లో గత కాలానికి చెందిన ఇద్దరు ప్రవక్త గురించి ప్రస్తావనలు ఉన్నాయి. ప్రవక్త మూసా (అ) మరియు ప్రవక్త ఆదమ్‌ (అ).

అవతరణ నేపథ్యం:

అబూ జహల్‌, నజర్‌ బిన్‌ హారిస్‌ లాంటి  అవిశ్వాసుల నాయకులు ప్రవక్త (స) పడుతున్న శ్రమను, చేస్తున్న ఆరాధనలను చూసి ఎద్దేవ చేశారు. సులువయిన మా మతాన్ని వదిలేసి కఠినమయిన మతాన్ని అవలబించావు, ఇది నీకు అవసరమా? అని హేళన చేశారు. అప్పుడు అల్లాహ్‌ ఈ సూరహ్‌ తొలి ఆయతులు అవతరించాయి; మేము ఈ ఖుర్ఆన్ను నీపై అవతరింప జేసింది నిన్ను కష్టానికి గురిచేయటానికి కాదు.కేవలం (అల్లాహ్కు) భయపడే వారికి హితబోధ చేయటానికే!

ఈ సూరహ్‌ ఘనత:

ఈ సూరహ్‌ పారాయణం చేసిన మీదటే హజ్రత్‌ ఉమర్‌ (ర) ఇస్లాం స్వీకరించారు అన్నది ప్రతీతి.

 

 

 

 

Related Post