కారుణ్య వర్షిణి రమజాన్

 

karunya-varshina-ramadan

మన పిల్లాడు నిప్పు కుంపటిలో పడిబోతున్నాడని తెలిస్తే మనం ఎంతగానయితే తల్లడిల్లి పోతామో అలాగే మార్గం మరచి జీవిస్తున్నతోటి మానవుల విషయంలో సయితం మనం చలించి పోవాలి. ఇలా మనం చేసిన నాడు అల్లాహ్‌ కారుణ్య కడలి మన వైపు కదిలొస్తుంది.

”అల్లాహ్ భూభాగాల్లో మక్కా భూ భాగాన్ని మహోన్నతమైన భూభాగంగా ఎన్నుకున్నాడు. మాసాల్లో రమజాను మాసాన్ని మహిమాన్వితమైన మాసంగా ఎన్నుకున్నాడు. రోజుల్లో శుభప్రదమయినదిగా శుక్ర వారం రోజును ఎన్నుకున్నాడు. రాత్రుల్లో లైలతుల్ ఖద్ర్ను ఘనతరమైనదిగా చేశాడు” అన్నారు ఖతాదః (ర) పై పేర్కొన్న విశిష్టతల్లో రెండు రమజాన్ సంబంధించినవే. అంది వచ్చిన ఈ సువర్ణావకాశాన్ని ఒడిసి పట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

విశ్వాస సోదరులరా! అల్లాహ్‌ మీ ధన, మాన, ప్రాణాలను కాపాడాలని మీరు కోరుకుంటున్నారా? మీకు దైవప్రవక్త నాయకులు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) వారి దీవెనలు పొందాలని ఉందా? ప్రపంచంలోని సంపదలకంటే గొప్ప సంపదను మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా?
”ఓ ప్రవక్తా! నీవు నీ ప్రభువు తరఫు నుండి అవతరింపజేయబడిన దానిని (ప్రజల వరకు) చేరవేయి….నిశ్చయంగా అల్లాహ్‌ ప్రజల (కీడు) నుండి నిన్ను తపద్పక కాపాడుతాడు”. (మాయిదహ్‌; 67) ”అల్లాహ్‌ ఆ వ్యక్తిని సుభిక్షంగా ఉంచుగాక! ఎవరయితే నా నుండి నా మాటను విని దాన్ని ఇత రుల వరకు చేర వేసాడో”. వేరోక ఉల్లేఖనంలో-”నీ మాధ్యమంగా అల్లాహ్‌ ఒకే ఒక్క వ్యక్తికి సన్మార్గం చూపినా అది నీ పాలిట ప్రపంచ సకల సంపద లకంటే ఎంతో మేలయినది” అని అన్నారు ప్రవక్త (స).
రమజాను మాసం ధర్మబోధ మాసం కూడా. ఈ మాసం మార్గం మరచి బతకుతున్న అల్లాహ్‌ దాసుల్ని ఆయన మార్గం వైపునకు ఆహ్వానించాల్సిన బాధ్యత ఒక ముస్లింగా మనందరిపై ఉంది. మన ఈ బాధ్యతను మనం ఓ మంచి మాట ద్వారా అయినా నెరవేర్చగలము. ఒక కరపత్రాన్ని అందజేసి నిర్వర్తించ గలము. ఒక షార్ట్‌ మెసెజ్‌ పంపి అయినా చేయగలము. మన పిల్లాడు నిప్పు కుంపటిలో పడిబోతున్నాడని తెలిస్తే మనం ఎంతగానయితే తల్లడిల్లి పోతామో అలాగే మార్గం మరచి జీవిస్తున్నతోటి మానవుల విషయంలో సయితం మనం చలించి పోవాలి. ఇలా మనం చేసిన నాడు అల్లాహ్‌ కారుణ్య కడలి మన వైపు కదిలొస్తుంది.

విశ్వాస సోదరులరా! అల్‌హమ్దులిల్లాహ్‌ మనం ఉపవాసాలు పాటిస్తున్నాము. ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తున్నాము. తరావీహ్‌ ప్రార్థనల్లో ఎంతో నిష్ఠగా పాల్గొంటున్నాము. దానధర్మాలు విస్తృత స్థాయిలో చేస్తున్నాము. ఇఫ్తార్‌ కార్యక్రమాలూ జరుపుతున్నాము. తల్లిదండ్రులను సయితం కంటికి రెప్పలా చూసుకుంటున్నాము. అల్లాహ్‌ దాసుల్ని అల్లాహ్‌ మార్గం వైపునకు ఆహ్వానిస్తున్నాము. అయినా మన కర్మలు అల్లాహ్‌ సన్నిధానంలో ప్రవేశ పెట్ట బడటం లేదు. ఎందుకో తెలుసా? వినండి! ”ప్రతి సోమవారం మరియు ప్రతి గురువారం స్వర్గ ద్వారాలు తెరవబడతాయి. అల్లాహ్‌తో పాటు అన్యులను సాటి కల్పించని (షిర్క్‌ చేయని) ప్రతి వ్యక్తికి అల్లాహ్‌ క్షమాభిక్ష ప్రాప్తిస్తుంది. ఓ వ్యక్తికి తప్ప. అతనికి అతని సోదరునికి మధ్య పగ ఉంది. వారి విషయంలో ఇలా అనబడుతుంది: ”వీరికి గడువు ఇవ్వండి – వీరు సంధి చేసుకోని. వీరికి వ్యవధి ఇవ్వండి – వీరు సంధికి రాని. వీరికి గడువు ఇవ్వండి – వీరు సంధి చేసుకోని” అని.

నిజంగా సంధికి మించిన సత్కార్యం లేదు. స్వయంగా అల్లాహ్‌ ఇలా అంటున్నాడు: ”నిశ్చయంగా విశ్వాసులు పరస్పరం సోదరులు. కావున మీ సోదరుల మధ్య సంధి చేయిపించండి”. (హుజురాత్‌; 10) వేరోక చోట – ”రాజీ పడటం ఎంతో ఉత్తమమయిన కార్యం”. (అన్నిసా: 127) అలాగే మన సమావేశ ఉద్దేశ్యాల్లో ‘ప్రజల మధ్య సంధి చేయించడం కూడా ఒకి’ అని మనకు తెలుస్తుంది. ప్రవక్త (స) అనేక సందర్భాలలో అనేక సహాబా మధ్య సంధి కుదిర్చిన సందర్భాలున్నాయి. స్వయంగా అల్లాహ్‌ సుబ్హానహు వ తఅలా సయితం ఇద్దరు సోదరుల మధ్య సంధి కుదిర్చి, ఆ సంధి కుదర్చ డానికి అపార అనుగ్రహాల్ని ప్రసాదించి మరి వారిరువురిని స్వర్గంలో ప్రవే శింప జేస్తాడు అని వేరొక ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది. కాబ్టి నేడే ఈనాడే మనకు మన సోదరులకు మధ్య ఏదేని విషయంలో వివాదం ఉంటే, వారొచ్చి రాజికి రావాలని ఎదురు చూడటం మాని మనమే వెళ్ళి వారితో సంధి చేసుకోవాలి. ఈ రమజాను మాసం పూర్తయ్యే లోపు ఏ ధార్మిక కారణం లేకుండా ఎవ్వరితోనూ ఎలాిం వివాదం ఉండకూడదు. మనమే వెళ్లి వారికి సలామ్‌ చేద్దాం. ఆ నిమిత్తం అల్లాహ్‌ నేర్పిన దుఆను రమజాను మాసం చివరి క్షణం దాకా చేస్తూనే ఉందాం! ”రబ్బనఘ్ఫిర్‌ లనా వలి ఇఖ్వానినల్లజీన సబఖూనా బిల్‌ ఈమాన్‌, వలా తజ్‌అల్‌ ఫీ ఖులూబినా గిల్లల్‌ లిల్లజీన ఆమనూ రబ్బనా ఇన్నక రవూఫుర్రహీమ్‌”. ఆమీన్‌.

విశ్వాస సోదరులరా! మీకెప్పుడయినా చేయి కాలిన అనుభవం ఉందా? లేదంటే వేలిగే దీపంలో కాసేపు వేలు పెట్టి చూడండి. చురుక్కుమంటుంది. మనస్సు చివుక్కుమంటుంది. అమ్మా! లేదా అబ్బా అన్న శబ్దం అప్రయత్నం గా మీ నోట వెలువడుతుంది. నరకాగ్నిని 70 సార్లు కడిగితే మిగిలిన వేడి మన ప్రపంచపు మొత్తం అగ్నిది. అ అగ్నిలోని కొంతలో కొంత గోరంతి దీప సెగకే విలవిల్లాడి పోతుంటే రేపు నరకాగ్ని సెగకు మనం తట్టుకోగ లమా చెప్పండి! అక్కడేమో చర్మాలు కాలిన కొద్ది కొత్త చర్మాలు పుట్టుకొస్తుం దాయే! అల్లాహ్‌ మనందరిన నరకాగ్ని నుండి కాపాడుగాక!

విశ్వాస సోదరులరా! రమజాను మాసం నరక ముక్తి మాసం. ప్రవక్త (స) అన్నారు: ”ప్రతి రోజు అల్లాహ్‌ కొందరిని నరకాగ్ని నుండి కాపాడుతూ ఉంటాడు”. అలాగే ప్రవక్త (స) సెలవిచ్చిన మాట – ”మిమ్మల్ని మీరు నర కాగ్ని నుండి కాపాడుకోండి! ఒక్క ఖర్జూర ముక్కను దానం చేసి అయినా సరే”. అల్లాహ్‌ సుబ్హానహూ వ తఅలా ఖుర్‌ఆన్‌లో నరకాగ్నిన్ని వర్ణించిన తర్వాత ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తూ అంటున్న మాట ఏమిో తెలుసా? ”ఫ మా అస్బరహుమ్‌ అలన్నార్‌ – ఏ విషయం వారిని నరకాగ్ని విషయంలో దుస్సహనానికి పురిగొల్పింది”. (వారెలా నరకాగ్నిని భరించగలరు!?). (బఖరహ్‌ా: 176) కాబట్టి నరకాగ్ని యాతన మనల్ని కాపాడే ఎన్ని మార్గాల్ని ప్రవక్త (స) మనకు తెలిజేశారో వాటన్నింటిని అనుసరించి మనం మనల్ని, నరకాగ్ని బారి నుండి కాపాడుకోవాలి. మనల్ని నరకాగ్ని బారి నుండి కాపాడే సాధనాల్లో ఆడకూతుళ్ళ అగ్ర భాగాన ఉంారు అన్న విషయాన్ని గుర్తుంచుకొని మరీ వారి యెడల ఉత్తమంగా వ్యవహరించి ఇహపర మేలును మూట కట్టుకోవాలి.

విశ్వాస సోదరులరా! ప్రాంపంచిక విషయంలో మనిషి మహా ఆత్రగాడిలా వ్యహరిస్తాడు. ఒకవేళ అతనికి ఒక బంగారు లోయ దొరికితే ఇంకొకి ఉంటే బావుండు అంటాడు. రెండు లోయలు నిండా బంగారం దొరికితే మూడోది ఉంటే ఇంకా బావుండు అని అంటాడని స్వయంగా అల్లాహ్‌ సుబ్హానహు వ తఅలా సెలవిచ్చాడు. ప్రాపంచిక పరిమిత ప్రాపర్ట్టీ విషయలో ఇంత ప్రాకులాడితే, పరలోక సిసలయిన, శాశ్వతమయి సత్కార్యాల సామగ్రి విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉండాలో ఆలోచించండి! మరి మీకు అలాంటి లోయలు నిండిన పుణ్యాలు కావాలనుకుంటున్నారా? మహా పర్వతమంతటి పుణ్యాన్ని సొంతం చేెసుకోవాలనుకుంటున్నారా? ఒక పర్వతం మాత్రమే కాదు మాకు రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు… మహా పర్వతాలు కావాలని కోరుకుంటున్నారా? అల్‌హమ్దులిల్లాహ్‌ా ఆ ఏర్పాటు కూడా ఉంది, అంతిమ దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”ఎవరయితే జనాజా నమాజు చదివి జనాజా వెంట వెళ్ళకుండా ఆగిపోతే అతనికి ఒక ఖీరాత్‌ పుణ్యం లభిస్తుంది. ఒకవేళ దాని వెంట వెళితే అతనికి రెండు ఖీరాత్‌ల పుణ్యం లభిస్తుంది. అది విన్న సహాబా ”ఖీరాత్‌ అంటే ఏమి?” అని ఆరా తీశారు. అందుకాయన (స) – ”ఖీరాత్‌లోని అత్యల్ప భాగం ఉహద్‌ కొండంతిదై ఉంటుంది” అని సమాధానమిచ్చారు. (ముస్లిం).

విశ్వాస సోదరులరా! ఓర్పు సహనాల మాసం రమజాన్‌. ”నిశ్చయంగా సహనంతోనే సమస్య పరిష్కారం ముడి పడి ఉంటుంది” అని ప్రవక్త (స) వారు సెలవిచ్చి ఉన్నారు. స్వయంగా అల్లాహ్‌ సుబ్హానహు వ తఅలా ‘ఓర్పు సహనాలు కలిగి ఉండమని, పరస్పరం సహనబోధ చేస్తూ ఉండాల’ని హితవు పలికాడు. అల్లాహ్‌ మనల్ని అనేక విధాలు పరీక్షిస్తాడు. భయంతో, ఆకలితో, సంపద లేమితో, సంతాన లేమితో, ఆప్తులను దూరం చేసి. ఆయన పెట్టే అన్ని పరీక్షల్లో మనం ఉత్తీర్ణులవ్వాలంటే మన వద్ద ఉన్న ఏకైక సాధనం సహనం. అలా సహనం వహించిన వారిపై ఆయన దీవెనలు కుండపోతగా కురుస్తాయి. నేడు అనేక దేశాల్లో ముస్లింలు దహనీయ స్థితికి లోనయి ఉన్నారు. బతకడానికి కనీస అవసరాలకు సయితం నోచుకోకుండా తల్లడిల్లి పోతున్నారు. కొందరి కళ్ళ ఎదురే వారి కుటుంబాలను తూటాలకు బలి చేస్తూ, ఆపాలని, వారిని కాపాడుకోవాలని మనసు ఎంత ఆరాట పడుతున్నా అడుగెత్తి అడుగు వేయలేని దీనావస్థలో ఉన్నారు పాపం! అల్లాహ్‌ వారందరికి ఉత్తమ సహనాన్ని ప్రసాదించాలని, వారి సమస్యలను తీర్చి వారిని గట్టున పడేయాలని, విశ్వం మొత్తంలో నివిసిస్తున్న విశ్వాసుల కోసం ప్రార్థనలు చేసి ప్రగాఢ సానుభూతిని చాల్సిన మాసం రమజాన్‌. అలాగే ఆర్థిక, నైతిక సహాయంతోపాటు ఒకవేళ మన విశ్వాసాన్ని కాపాడుకునే నిమిత్తం మనపై అటువంటి ఆపదలు విరుచుకు పడినా అదరక, బెదరక ప్రాణ త్యాగం చేసైనా ధర్మోన్నతి కోసం పాటు పడతామని గట్టి సంకల్పం చేసుకోవాల్సిన మాసం. ఎందుకంటే, రమజాన్‌ ఓర్పు సహనాల మాసం మాత్రమే కాదు. అవి నశిస్తే సమర శర పరంపరల సంధించే మాసం కూడా అన్న విషయాన్ని గుర్తుంచుకొని, ధర్మ సంస్థాపన కోసం ఎప్పుడు అవసరం వచ్చినా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి. అలాిం పోరాట పిమ పేరే జిహాద్‌!

 

Related Post