పేరు చూసి ఏరులోకి దూకొద్దు!

ఈనాడు పేరు మీదే వ్యాపారమంతా. మతి పోగొట్టే పేర్లు, విద్యుత్‌ వైర్లల్లే షాక్‌కి గురి చేసే పేర్లు, మోసపూరిత పేర్లు. ఈ పేర్లను వాటి  పట్ల అవగా హన లేని ఒక సామాన్య పౌరుడు వింటే అవి చాలా గొప్పగా  గోరిస్తాయి.  మచ్చుకు కొన్నింని ఇక్కడ ఇస్తున్నాము.

ఈనాడు పేరు మీదే వ్యాపారమంతా. మతి పోగొట్టే పేర్లు, విద్యుత్‌ వైర్లల్లే షాక్‌కి గురి చేసే పేర్లు, మోసపూరిత పేర్లు. ఈ పేర్లను వాటి పట్ల అవగా హన లేని ఒక సామాన్య పౌరుడు వింటే అవి చాలా గొప్పగా గోరిస్తాయి. మచ్చుకు కొన్నింని ఇక్కడ ఇస్తున్నాము.

”స్వర్గం మనసుకి నచ్చని విషయాలతో కప్ప బడి ఉంది. నరకం మనో రంజకమయిన విషయాలతో కప్ప బడి ఉంది” అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ (స). (తిర్మిజీ) అంటే స్వర్గంకన్నా నరకానికున్న ఆకర్షణ, పై మెరుగులు ఎక్కువన్న మాట.
 ఈనాడు పేరు మీదే వ్యాపారమంతా. మతి పోగొట్టే పేర్లు, విద్యుత్‌ వైర్లల్లే షాక్‌కి గురి చేసే పేర్లు, మోసపూరిత పేర్లు. ఈ పేర్లను వాటి  పట్ల అవగా హన లేని ఒక సామాన్య పౌరుడు వింటే అవి చాలా గొప్పగా  గోరిస్తాయి.  మచ్చుకు కొన్నింని ఇక్కడ ఇస్తున్నాము. ఎందుకంటే, మొదట షైతాన్‌ ఆది మానవుడయిన ఆదమ్‌ (అ)ను సయితం ఇలాంటి  మాయా మాటలు చెప్పే బోల్తా కొట్టించాడు గనక. అల్లాహ్‌, షైతాన్‌ ఎత్తుగడల నుండి జాగ్రత్త ఉండండి అని అప్రమత్తం చేశాడు గనక.
దర్గా కాదు దుర్గా:
దర్గాహ్‌ అంటే సన్నిధి అని, ఇదేదో రాజుల వారి, పండితుల సన్నిధి అనుకుందురు. కుళ్ళి, కృశించి పోయిన శవాల సన్నిధి. నిజకర్త, స్వామీ, శాసనకర్త, పాలనాధీశుడయిన అల్లాహ్‌ సన్నిధిలో మోకరి ల్లాల్సిన ముస్లిం జనావళిని మోసపుచ్చి ఈ శవాల ముందర మోకరిల్లేలా చేసి అక్రమార్జన చేసే అక్రమార్కుల కుయుక్తిలో భాగమే ఈ దర్గాహ్‌.కరామాత్‌ల, మహత్యాల పేరిట ఇక్కడ జరిగే తంతుకు, ఒక దుర్గా మందిరంలో జరిగే తంతుకు పెద్ద తేడా ఏమి ఉండదు. ఇక్కడ జరిగే ప్రతి కార్యం ఇస్లాం ధర్మ శాస్త్రానికి విరుద్ధమయినదే. వీటిని ఎవరయినా షిర్క్‌ – బహు దైవారాధన అడ్డాగా పేర్కొంటే, ఇది కూడా దుర్గా సన్నిధి వంటిదే కదా అని అంటే కొందరికి ఒంటి  మీద తేళ్ళు, జెర్రులు పాకినట్లు అనిపిస్తుంది. అపచారం, అప చారం అంటూ చిర్రుబుర్రులాడతారు. కళ్ళు పోతాయ్‌ అని బెదిరిస్తారు. దర్గాహ్‌ ప్రదక్షిణను కాబా ప్రదక్షిణతో పోల్చే దుస్సాహసం చేస్తారు. కొందరయితే కాబా విందే దర్గాహ్‌ను నిర్మిస్తారు. కాబా దగ్గరకెళ్ళి చేసే హజ్జ్‌ క్రియ ల్లాంటివి శవాల కుప్పల దగ్గర చేయమని, మక్కా వెళ్ళ లేని వారికి అదో సువర్ణ్ణావకాశం అని ప్రచారం చేస్తారు. ”షిర్క్‌ను (అల్లాహ్‌తో పాటు అన్యుల్ని భాగస్వాములుగా చేసి పూజించడాన్ని) అల్లాహ్‌ ఎన్నటికీ మన్నించడు” (జుమర్‌:53) అని అల్లాహ్‌ అంత ఖరాఖండిగా చెప్పినా ముస్లిం ప్రజా బాహుళ్యంలో జడలు విప్పుతున్న ఈ జాఢ్యం, మతమౌఢ్యం, మూడత్వం, మూర్ఖత్వం అంతమవ్వడం లేదు.
కల్చర్‌ కాదు వల్గర్‌:
ఒకరి బట్టలు ఒకరు తొడుక్కుంటేనే ప్రళయం సృష్టించే పడతులు, ఏం ఆధునిక(ఆటవిక)మోగానీ షాపింగ్‌ మాల్‌లో శాంపిల్‌ కోసం బట్టలు మార్చుకునేంత ఈజీగా ఒకరి భర్తల్ని మరొకరు మార్చుకోవడం నేడు సంపన్న వర్గాల్లోని కొందరిలో చోటు చేసుకుంటున్న పాశ్చాత్య విష సంస్కృతి.
 కంచం, మంచం భర్తతోనే అన్న కంచెను దాటి  మేస్తున్న పశువులివి. రుచికరమయిన మాంసం ప్రక్కనే ఉండగా కుళ్ళి కంపు కొడుతున్న మాంసాన్ని తినేందుకు తెగిస్తున్న తిలోత్తములు వీరు. పురుషులు ఇలాంటి  చేష్టలకు పాల్పడరు అని చెప్పడం కాదు ఉద్దేశ్యం. ఏ పరాయి పురుషడ యినా ఒక స్త్రీ అంగీకారం లేకుండా ఆమెను ముట్టుకో లేడు. ముఖ్యంగా స్త్రీ ఆస్తి, అందం. అధికరాం గలదయినప్పుడు. ఇలాంటి  వల్చర్‌ కటుంబ విలువల్ని చీల్చి చెండాడే (రాబందువు)ని వీరు పెట్టుకున్న పేరు కల్చర్‌. నీతి, నడవడికలు కలిగి జీవించాల్సిన నరులే పశువుల్లాగా (వల్గర్‌గా) ప్రవర్తించ డం ఎంత హేయం? కల్చర్‌, క్లబ్బులు, ప్లబ్బుల, నైట్  పార్టీల  పేరుతో సాగే అశ్లీల పరాచికాలు పట్టణాల్లో, స్టేజీ షోల పేరుతో మారు మూల ప్రాంతాల్లో పరాకాష్టకు చేరతున్నాయి. ఇలాంటి  రాబందువుల వల్ల సమాజానికి ప్రమా దం పొంచి ఉంది. వీరి లోగిళ్లల్లో తెగుళ్లు తిష్ట వేెసి ఉన్నాయి. ఇది వ్యభిచా రం కాదట ‘కల్చర్‌’ అట.
జాలి కాదు జారత్వం:
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆపన్న హస్తాలయి ఆదుకుంటున్నామన్న పెద్ద శీర్షికతో ప్రగల్బాలు పలికే పులి రాజులు ”ఉపాధి” కల్పిస్తామని మోసగించి ఎందరో ఆడ పడుచులను వ్యభిచార రొంపిలో దించుతున్నారు. ఎందరినో విదేశాలకు తరలిస్తున్నారు. స్వయంగా భారత దేశంలోని పెద్ద పట్టణాలలో కొందరు మాన్యుల ఈ అమానవీయ వ్యాపారంలో ప్రతి రాత్రి బలయ్యే మహిళామణుల సంఖ్య కొన్ని వేలల్లో ఉంది. స్వదేశి మహిళల్నే కాక, నేెపాల్‌, శ్రీలంక లాిం బీద దేశాల మహి ళల్ని దిగుమతి చేసే దొంగ చచ్చినోళ్లు నానాటికి పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తూనే ఉన్నారు. పడతికి ఉన్న పవిత్రతను పాడు చేస్తూనే ఉన్నారు. అంతా ప్రణాళిక బద్ధంగా జరిగే ఈ వ్యాపాన్ని ఏ నిర్భయ చట్టం ఇప్పటి  వరకూ ఏం చేయలేదు. ఇక మీదట చేస్తుందన్న ఎదురు చూపూ అవసరం లేదు. భర్త మరణించో, లేక వేరితర కారణంగా చేతనో ఉపాధికి దూరమయి స్త్రీకి పట్టా  ఇచ్చి వ్యభిచారం చేసుకోమనడం ఎంత నీచమయిన సంస్కృతో ఆలోచిం చండి! థాయ్‌ లాంటి  దేశాల్లోనయితే అలా సంపాదించే స్త్రీల సంపదానపై ప్రభుత్వం టాక్సు కుడా విధిస్తుంది.
డేటింగ్ కాదు చీటింగ్;
డైటింగ్  అంటే కొందరికి కాసింత అవగాహన ఉండొచ్చేమోగానీ ‘డేటింగ్ ‘ అంటే చాలా మందికి తెలీదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి విచ్చలవిడిగా ప్రేమిం(కామిం)చుకొని, ముచ్చట్లు, ముద్దుల సరిహద్దుల్ని చెరిపేసి పశువులా బ్రతికేయడం.’మీ పెళ్ళికి నన్ను పిలువలేదు, కాబ్టి నా పెళ్ళికి మిమ్మల్ని పిలవను’ అనేటటువిం సంతానం ఇలాంటి  వారికే పుడుతుంది. ఈ ముద నష్టపు ప్రాణులు పెళ్ళి పేరంటం లేకుండానే ఎంచక్కా కాపురాలు పెట్టేసి, పిల్లల్ని కనేసి, తీరుబడిగా ఇద్దరు అన్ని విధాల సెటిలయ్యాక, నమ్మకం కుది రాక, నచ్చాక పిల్ల జెల్లతో పెళ్ళి పీఠం ఎక్కి భార్యాభర్తల హోదాను అప్పుడు స్వీకరిసారట. కాపురాలు చేసేశాక, పిలల్ని కూడా కనేశాక పెళ్లి చేసుకోవడం దేనికో? అదీ అవసరం లేదనే ప్రబుద్ధులు ఉన్నారులేండి! జంతువులకు లేని పెళ్ళి మనుషులకు ఎందుకు? అని చెబుతూ పెళ్ళి పేరంటం లేకుండానే విచ్చలవడిగా బ్రతికేస్తున్న పేరు గల పెద్దలు ఎంత మంది లేరు. వీరు ”డేటింగ్”ను డైటింగ్, స్కైటింగ్  అంత ఘనంగా భాస్తున్నారు. ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, థియేటరికల్‌ ట్రయిలర్‌ లాింవట ఈ సావాసాలు. ఎంత మంచి పేరో దీనికి!?
కళ కాదు కళంకం:
 భళా అన్పించే ఈ పేరు నేడు కళాహీనం కావడం బహిరంగ సత్యం. వాస్తవంగా నేర్పు, నైపుణ్యం కళగా చెప్ప బడుతుంది. హస్త కళలు, చేతితో బహు నేర్పుగా చేయబడిన వస్తువులు, కళలను ప్రదర్శించేవారు ఒకప్పి కళాకారులు. అయితే నేడు కళగా చెలామణి అవుతున్న కొన్ని కళ అనే పేరుకే కళంకితంలా ఉంటున్నాయి.
‘కళ’ అన్నది అర్థ నగ్నంగా, ముప్పాతిక నగ్నంగా, పూర్తి నగ్నంగా నించ డం, కాముకాత్వన్ని ప్రదర్శించడంగా రూపాంతరం చెందింది. అలా నించేవారికి సన్మానాలు చేయడం, వారి చేతులతో రిబ్బంన్‌ క్టింగ్‌లు పెట్టుంకోవడం, వారి పేర్లనే తమ పిల్లలకు పెట్టుకొని మురిసి పోవడం, వారు చేసే జుగుప్సాకరమయిన డాన్సులను పసి పిల్లలతో చేయిపించడం నేడు మనం చూస్తున్న భారత సమాజం.  కళంకితమయిన జీవన శైలి కూడా ‘గొప్ప కళ’గా చెలామణీ అవుతుంటే అది మన మంచికో చెడ్డకో ఆలో చించే స్థితిలో మనం ఉన్నామా? అన్న ఆత్మావలోకనం అందరిలోనూ చోటు చేసుకోవాలి. మంచిని మంచి అనడం మానేయడం ఓ దర్దశ అయితే, చెడుని మంచి అనడం మరో దుర్దశ. ఇది సర్వ సాధారణమైపోతే ”రక్త పాతం’రక్తపాతం” అని ప్రవక్త (స) వారి హెచ్చరికను సమాజం ఎంత తొందరగా గుర్తిస్తే అమత మంచిది.
బెల్టుషాపు:
నేటి నాగరికత ఎంత అభివృద్ధి చెందిందంటే మనుషుల తీరు తెన్నులు మారడమే కాదు, ప్రాంతాల పేర్లు, వృత్తుల పేర్లు మార్చేస్తున్నారు. ఒకప్పుడు ‘కల్లు దుకాణం’ ‘బ్రాంది షాపు’ అని ఉండేది. అయితే ఇప్పుడు ఈ మాటలు కాస్త మొరటుగా, అమర్యాదగా అన్పించాయేమో! స్వయంగా చట్టమే ‘బెల్టు షాపు’ అని లేబుల్‌  చుట్టింది. ‘మద్యం తాగి బండి నడిపితే నేరమట, మద్యం అమ్మగా వచ్చి పాపిష్టి సొమ్ముతో ప్రభుత్వం నడపటం తప్పు కాదట!?’  నీచ కార్యాలకి కూడా నిర్మలమయిన పేర్లు పెట్టే, చెడ్డ పనులకు దొడ్డ పేర్లు పెట్టే సంప్రదాయం మన ఆధునికానిది.
లీలలు:
‘లీల’ అంటే క్రీడ, శృంగార చేష్ట, ప్రేమాధిక్యమున వేషభాషణాదుల చేత ప్రియుని అనుకరించు నిష్ట శృంగార చేెష్టా విశేషము క్రియ, విధము. (శబ్ధ రత్నాకరము-నిఘంటువు) సాధారంగా ‘లీలలు’ అనే పదం కృష్ణునితో జత కలిపి చెప్పడం జరుగుతుంది. కందుకూరి వీరేశ లింగం రచించిన ‘విగ్రహారాధన’ అనే పుస్తకంలో-”శ్రీ కృష్ణు విగ్రహమును కొలుచువారు ‘కృష్ణ లీలలు’ అని పాడే పాటలు విన్ను పక్షమున వివేకులు సిగ్గు చేత తలలు వంచుకో వలసి యుండును” అని అంటారు. పరాయి స్త్రీలతో పరాచికాలడ టంలో జారత్వంగానీ, అసభ్యతగాని గోచరించదన్న మాట. అలాంటి  సంబం ధాన్ని కొందరు ‘భగవంతుని భక్తురాలికి మధ్య అనినాభావంగా ఉండే సంబంధం వంటిదే ఇదని’ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుాంరు. స్నానం చేెస్తున్న స్త్రీల వస్త్రాలు ఎత్తుకు పోవడం, స్త్రీలు స్నానమాడుతుంటే చెట్టెక్కి చూడటం, బుగ్గలు గిల్లడం ఒకప్పటి  లీలయితే  మరి నేడు మన సమాజంలో కనబడుతున్న డ్రస్సింగ్‌ రూమ్స్‌లో అమర్చే సీక్ర్‌ే కెమరా, చాటుగా సెల్‌ ఫోన్‌తో చిత్రీకరించే, ఆడ కూతుళ్లను చూసి వెకిలిగా నవ్వడం, ఏడిపించడం, అమార్యదగా ప్రవర్తించడం వంటి  వాటిని ‘పోకిరితనం’ అని ఎందుకు చెబుతున్నట్టో!? నేడు లీలల పేరుతో నిత్యానందులు ఎందరు ఎంత మంది ఆడ పడుచుల శీలాలను కాటు వేస్తున్నారో ఎవరికీ తెలియదేం కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాింగ్‌, సెక్స్‌ వర్కర్స్‌, ఆనర్‌ కిల్లింగ్‌ (గౌరవం పేరుతో జరిగే హత్యలు), ఫ్యాషన్‌ ఎన్నో ఎన్నెన్నో!
చివరి మాట:
ప్రాణం తీసే విషం ఉన్న సీసా మీద విషం అన్న లేబుల్‌ తీసేసి పిప్పరమెంటు పొడి అని వ్రాస్తే మన పిల్లలకు ఎంత ప్రమాదం జరగ గలదో దానికన్నా ఎక్కువ ప్రమాదం ఇలాంటి  నీచ పద ప్రయోగాలు. పేరు ఏదయినా తప్పు తప్పే. తప్పు ఒప్పుగా మారదు. మార్చ లేరు.

Related Post