శాశ్వత జీవని ముందుంది! శ్వాస ఆగితే అది పుడుతుంది!!

ఇహలోకం శాశ్వత నివాసం కాదు, అంతమయ్యే తాకం. తాత్కాలిక వాహనమేగానీ, సుఖసంతోషాల నికేతనం కాదు. అదో వారిధి, దాన్ని దాలంటే సత్కర్మల నౌక అవసరం. ఇహలోక ప్రయాణానికి ప్రారంభం జననమయితే, పరలోక ప్రయాణానికి ఆరంభం మరణం

ఇహలోకం శాశ్వత నివాసం కాదు, అంతమయ్యే తాకం. తాత్కాలిక వాహనమేగానీ, సుఖసంతోషాల నికేతనం కాదు. అదో వారిధి, దాన్ని దాలంటే సత్కర్మల నౌక అవసరం. ఇహలోక ప్రయాణానికి ప్రారంభం జననమయితే, పరలోక ప్రయాణానికి ఆరంభం మరణం

మరణం తథ్యం:

జీవితం ఆట కాదు, నాటకమూ కాదు,తోలు బొమ్మలాట అంతకన్నా కాదు, జీవితం ఓ యదార్థం, కళ్ళకు క్టినట్టు కానవస్తున్న కఠోర సత్యం. మనిషి అనుక్షణం అనుభవిస్తున్న వాస్తవం, నిత్య ప్రయాణం. ఇక్కడ అందరూ ప్రయాణికులే. అందరూ ప్రయాణ సామగ్రి అవసరం ఉన్నవారే. ఇహలోకం శాశ్వత నివాసం కాదు, అంతమయ్యే తాకం. తాత్కాలిక వాహనమేగానీ, సుఖసంతోషాల నికేతనం కాదు. అదో వారిధి, దాన్ని దాలంటే సత్కర్మల నౌక అవసరం. ఇహలోక ప్రయాణానికి ప్రారంభం జననమయితే, పరలోక ప్రయాణానికి ఆరంభం మరణం. ”ప్రతి ప్రాణికి మరణం రుచి చూడవలసి ఉంటుంది”. (ఆల్‌ ఇమ్రాన్‌: 185)

మరణ స్మరణ మంచిది:

మరణం అంటే ఎందుకో మనిషికి కొంచం అయిష్టం, కొంచం భయం. కారణం – సత్కర్మల సామగ్రి అంతగా లేదన్న బెంగ. అల్లాహ్‌ా విషయంలో తన వల్ల జరిగిన జాప్యం. అయినా ఒక విశ్వాసి అల్లాహ్‌ాను కలుసుకోవ డాన్నే ఇష్ట పడతాడు. తన నిర్వాకాలకు ప్రభువు ఎక్కడ శిక్షిస్తాడోనన్న భయం అతనిలో ఉన్నట్లే, మన్నిస్తాడు అన్న గంపెడాశ అతనికి. అందుకే ఎంత ఇష్టం లేకున్నా మరణాన్ని స్మరించుకోవడం మానకోడు. నికాహ్‌ా ప్రసంగంలో సయితం మరణ స్మరణ జరుగుతుంది. కారణం ”రుచుల్ని నియంత్రించే మరణాన్ని అత్యధికంగా స్మరించుకుంటూ ఉండండి” (తిర్మిజీ) అన్న ప్రవక్త (స) వారి మాట. ఓ సందర్భంగా ప్రవక్త (స) వారిని ‘బుద్ధి మంతులు ఎవరు?’ అని ప్రశ్నించడం జరిగింది. అందుకాయన (స) ”మరణాన్ని అందరికన్నా ఎక్కువగా స్మరించుకునేవారు, దాని కోసం అందరికన్నా ఎక్కువగా సామగ్రి విషయంలో సిద్ధంగా ఉండేవారు, వారే బుద్ధిమంతులు. ఇహపరాల మేళ్ళన్నింనీ మూట కట్టుకు పోయారు” అన్నారు ప్రవక్త ౖ(స). (తబ్రానీ)

కఠోర గరళం మరణం:

మరణం సంభవించగానే కర్మల పత్రాలు చుట్టి వేయబడతాయి. ఎలాిం కర్మ చేసుకునే వెసులుబాటు ఉండదు. జరిగిన పొరపాట్లకు గానూ తౌబా చేసుకునే వ్యవధి కూడా దొరకదు. చేజారి సువర్ణావకాశాలపై కాసింత కన్నీళ్ళు పెట్టుకునే తీరిక సయితం లభించదు. మనిషి అసలు ప్రస్థానం మెదలవుతుంది – అది స్వర్గానికా? నరకానికా? అన్నది అతను చేసుకున్న కర్మను బట్టి నిర్థారించడం జరుగుతుంది. ఎంత కాదనుకున్నా ఈ గరళాన్ని మింగాల్సిందే. ”వారికి చెప్పు: ‘ఏ చావు నుండయితే మీరు పారి పోతు న్నారో అది మిమ్మల్ని కబళించి తీరుతుంది. ఆ తర్వాత మీ రహస్యం బహిర్గత విషయాలను ఎరిగిన వాని సమక్షంలో మీరంతా తరలించ బడ తారు. మరి ఆయన మీరు చేస్తూ ఉండిన పనులన్నింనీ మీకు తెలియ జెపుతాడు”. (జుముఅహ్‌ా: 8)

మరణ కాంక్ష మంచిది కాదు:

”మీలో ఎవ్వరూ మరణాన్ని కాంక్షించ కూడదు. అది రాక మునుపే దాన్ని ఆహ్వనించ కూడదు, దుఆ చెయ్యకూడదు. మీలో ఒకడు మరణించాడు అంటే, ఇక అతనికి కర్మలు చేసుకునే వెసులుబాటు ఉండదు. విశ్వాసి ఎంత కాలం జీవిస్తే అతనికి అంతే ఎక్కువ మంచి జరుగుతుంది” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)
”తనపై విరుచుకు పడిన విపత్తు కారణంగా మీలో ఎవ్వరూ మరణాన్ని కోరుకోకూడదు. ఒకవేళ తప్పసరి అనుకుంటే ఈ విధంగా ప్రార్థించాలి: ”అల్లాహుమ్మ అహ్‌ాయినీ మా కానతిల్‌ హయాతు ఖైరన్‌ లీ, వ తవప్ఫనీ ఇజా కానతిల్‌ వఫాతు ఖైరన్‌ లీ” – ఓ అల్లాహ్‌ా! జీవతం నా కోసం శుభవంత అయినమత వరకు నన్ను బ్రతికించు. మరణమే నా పాలిట మేలన్నప్పుడు నాకు మరణాన్ని ప్రసాదించు. (ముత్తఫఖున్‌ అలైహి)

మరణానికి మించిన ప్రమాదం మరణ విస్మరణం:

మరణం ఎవ్వరూ నిరాకరించ లేనీ, తప్పించ లేని యదార్థం అయినా మనిషి మాత్రం దాన్ని మరచి పోవడానికి ప్రయత్ని స్తుాండు. అది నిత్యం ఎదురయ్యే అనుభవం అయినా దాని కోసం ముందస్తు జాగ్రత్తలు అస్సలు తీసుకోడు. ఇది ముమ్మాికి మూర్ఖత్వమే! ”వివేకి ఎవరంటే, తన మనోమయ స్థితిని అంచనా వేయగలిగే స్థితిలో ఉంటూనే, మరణా నంతరం పనికొచ్చే కర్మలు చేయడంలో జీవితాన్ని సద్వినియోగ పర్చు కుాండో అతడే. ఇక అసమర్థుడెవడండే, మనోవాఛల్ని అనుకరిస్తూ అల్లహ్‌ మీద లేనిపోని ఆశలు పెట్టుకునేవాడు” అన్నారు ప్రవక్త (స). (తిర్మిజీ) – జీవితం తర్వాత మరణం ఉంది, మరణం తర్వాత మళ్ళీ జీవితం ఉంది, ఆ జీవితానికి అంతం లేదు. అక్కడ మరణానికే మరణం ఇవ్వడం జరుగుతుంది.
”ఈ ప్రాపంచిక జీవితం కేవలం ఒక సయ్యాట, వినోద వస్తువు తప్ప మరేమీ కాదు. అయితే పరలోక నిలయపు జీవితమే అసలు సిసలయిన జీవితం. ఈ విషయాన్ని వీళ్ళు తెలుసుకోగలిగితే ఎంత బావుండు!”. (అన్‌కబూత్‌: 64) అవును;
శాశ్వత జీవని ముందుంది! శ్వాస ఆగితే అది పుడుతుంది!!

మరణ స్మరణ లాభాలు:

1) ప్రాపంచిక రుచుల, ఐహిక వ్యామోహ నియంత్రణ.
2) మరణానికి పూర్వమే దాని కోసం తగిన సన్నాహాలు చేసుకునే ఆలోచన కలుగుతుంది.
3) అది మనిషిని నిత్య జాగృతావస్థలో ఉంచుతుంది. ఏమరుపాటు నుండి, అలక్ష్యం నుండి కాపాడుతుంది.
4) అది మనిషికి కష్టాల, నష్టాల వల్ల కలిగే బాధను తగ్గిస్తుంది. నిరాశకు లోను కాకుండా చూస్తుంది.
5) అది మనిషిలో ఐహిక అనాసక్తతను,పరలోక ఆసక్తతను కలిగిస్తుంది.
6) అది జరిగి పొరపాట్లను దిద్దుకునే, తౌబా చేసుకునే వ్యవధిని ఇస్తుంది.
7) అది మనస్సును మెత్తబరుస్తుంది. కింలో కన్నీరు ఇంకిపోకుండా, కరుణ అంతరించి కాఠిన్యం, కరకుదనం ఆవహించకుండా కాపాడుతుంది.

మరణ మైక పీడన:

”చివరికి మరణ మైకం సత్య సమేతంగా రానే వచ్చింది. (ఓ మనిషీ!) దేని పట్ల నువ్వు బెదిరి పారిపోయేవాడివో అదే ఇది”. (ఖాఫ్‌: 19)
విశ్వాసుల మాత హజ్రత్‌ ఆయిషా (ర.అ) గారు ఇలా అన్నారు: ”ప్రవక్త (స) వారి మరణ మైకం సందర్భంలో ఆయన దగ్గర నీళ్ల పాత్ర ఒకటుం డేది. ఆయన తన చేతిని దానిలో ముంచి మాటి మాటికి ముఖాన్ని తుడుచు కుంటూనే ఇలా అనేవారు: ”లా ఇలాహ ఇల్లల్లాహ్‌ నిశ్చయంగా మరణాని కి ఎన్నో మైకాలున్నాయి”. (బుఖారీ)
మరో ఉల్లేఖనంలో ఆయన మరణ మైకం నుండి అల్లాహ్‌ శరణు కోరేకునే వారు అని ఉంది: ”అల్లాహుమ్మ అయిన్నీ అలా సకరాతిల్‌ మౌతి” – ఓ అల్లాహ్‌! మరణ మైకాలు ఆవహించినప్పుడు నాకు తోడ్పాటునందించు. (అహ్మద్‌, తిర్మిజీ)

మిత్రమా! మరణ పీడన చాలా తీవ్రమయినది. అది అనుభవించిన వ్యక్తికే అర్థమవుతుంది. మరికొద్ది సేప్లో మరణించబోయే వ్యక్తి గొంతు మూగ బోతుంది. కలిగే పీడనకు కేక ప్టిె అరవలేనంత బలహీనత అతన్ని ఆవహి స్తుంది. మరణం మనిషి దేహావయవాలన్నింని దంచి వేస్తుంది. అతన్ని శరీరంలోని కీళ్ళన్నిం బలహీన పర్చేస్తుంది. సహాయం కోసం అర్థించ లేనంత నిస్సహాయుణ్ణి చేసేస్తుంది. ఇక మెదడాంవా, అదీ కాస్త పని చేయ డం మానేస్తుంది. దానికి సయితం మైకం క్రమ్ముకుంటుంది. ఎదుట ఉన్నది ఆప్తులే అయినా గుర్తు పట్టనంతి దయనీయ స్థితికి నెట్టేస్తుంది. నాలుక పిడచగట్టుకు పోతుంది. కలిగే నొప్పికి దిక్కులు పిక్కిల్లేలా అరవాలనుకున్నా అరవ లేడు.

అతని దేహంలోని అణువణువుకు మైకం క్రమ్ముకోవడం ప్రారంభమవు తుంది. ఒక మైక పీడన తర్వాత మరో మైక పీడన.. ‘పరికి కంపపై పలుచి బట్ట వేసి లాగిట్టు’ అతనిలోని ప్రతి భాగం నుండి ప్రాణం లాక్కో బడుతుంది.. శరీరంలో వణుకు.. గుండెలో వింత విచిత్ర శబ్దం…గుండెలోని ప్రాణం గొంతులోకి వచ్చేస్తుంది…అది అక్కడే కాసేపు ఉంటుంది…మనిషికి తన జీవితం మొత్తం అద్దంలా కనబడుతుంది…పుణ్యాత్ముల వదనం ప్రశాంతమ యం అవుతుంది…పాపాత్ముల ముఖం మాడి పోతుంది,రంగు పాలి పోతుంది …ఏదో తెలియని ఆవేదన…’క్క్‌…క్క్‌…క్క్‌’ అంతే. గుండె దాిన ప్రాణం గొంతు దాటి పోతుంది….! కోట్లకు పడగలెత్తిన కుబేరుడయినా, కూటికి కరువయిన కిక దరిద్రుడయినా ఇప్పుడతనో శవం!! ఇదే కఠోర సత్యం!!!

విశ్వాసి మరణం కారుణ్యం:

హజ్రత్‌ బురైరహ్‌ా (ర) కథనం – ప్రవక్త ఇలా అన్నారు: ”విశ్వాసి నుదుి మీద చెమటలతో మరణిస్తాడు”. (ఇబ్ను మాజహ్‌, తిర్మజీ) అంటే, ”అల్లాహ్‌ా విషయంలో తన వల్ల జరిగిన జాప్యానికిగానూ సిగ్గుతో అతని వదనం నీర వుతుంది” అన్నారు పండితులు.

అల్లాహ్‌ యెడల సద్భావన:

జాబిర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ా (ర) కథనం – మరణానికి మూడు రోజుల ముందు ప్రవక్త (స) వారిని ఇలా చెబుతూ విన్నాను: ”అల్లాహ్‌ా యెడల సద్భావనా స్థితిలో తప్ప మీలోఎవ్వరికీ మరణం రాకూడదు ”. (ముత్తఫఖున్‌ అలైహి)
”మీరు ఒక వ్యక్తిని మరణశయ్య మీద చూస్తే అతనికి శుభవార్త అంద జేయండి. తద్వారా అతను తన ప్రభువు యెడల సద్భావనా స్థితిలో వెళ్ళి కలుసుకుాండు. అదే అతను బతికుంటే అతన్ని నరకాగ్ని, అల్లాహ్‌ ఆగ్ర హం నుండి భయ పెట్టండి” అన్నారు అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర).

తుది వీడ్కోలు పలుకులు:

అబూ సయీద్‌ అల్‌ ఖుద్రీ (ర) గారి కథనం – ప్రవక్త (స) ఇలా ప్రవచిం చారు: ”మరణించబోయే మీ సోదరులకు ‘లా ఇలాహ ఇల్లలాహ్‌ా’ అనే హితవు చేెస్తూనే ఉండండి”. (ముస్లిం)
ఈ హితవు మరణ సమీపంలో చెయ్యాలి. కొందరు అవివేకుల్లా సమాధి లో దించిన తర్వాత కాదు. ఇలా చెయ్యడం వల్ల అతని ఆఖరి పలుకులు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’-తౌహీద్‌ పలుకులవుతాయి. ”మరెవరి ఆఖరి మాట ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా’ అయి ఉంటుందో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు” అన్నారు ప్రవక్త (స). (అబూ దావూద్‌)

మంచి చావు సూచనలు:

1) మరణ సమయంలో ‘కలిమ-ఎ-తయ్యిబహ్‌ పలికే భాగ్యం.
2) మరణ సమయంలో అల్లాహ్‌ యెడల సద్భావం కలిగి ఉండటం.
3) అల్లాహ్‌ మార్గంలో వీర మరణం (షహాదత్‌) పొందడం.
4) మృతుని చివరి కార్యం పుణ్య కార్యం అయి ఉండటం.
5) శుక్రవారం రాత్రి లేదా పగలు మరణించడం.
6) నుదుటిపై చెమటలు పట్టడం.
7) పురిటి రక్త స్త్రావం సమయంలో స్త్రీ మరణించడం.
8) హజ్జ్‌-ఉమ్రాల ఇహ్రామ్‌ (దీక్ష) స్థితిలో మరణించడం.
9) పుణ్య స్థితిలో – సజ్దాలో రుకూలో, ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తూ మరణించడం.

చెడ్డ చావు సంకేతాలు:

1) తౌబా చేసుకోకుండా చావడం.
2) అకస్మాత్తుగా చావడం.
3) పాప స్థితిలో – మద్యం మాదక ద్రవ్యాలు సేవిస్తూ, పాటలు వింటూ, వ్యభిచారం చేస్తూ, అశ్లీల చిత్రాలు చూస్తూ చావడం.
4) ఆత్మహత్య చేసుకొని చావడం.
5) బిద్‌అత్‌ మీదే చావడం.
6) ధర్మయుద్ధం నుండి వెన్ను చూపి పారిపోయిన స్థితిలో చావడం.
7) అమ్మాయి, పరస్త్రీ ప్రేమలో పడి చావడం.
8) ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ పలుక లేక పోవడం.
9) చెడ్ట చావును సూచించే మాటలు, చేష్టలకు పాల్పడుతూ చావడం.

ప్రార్థన:

దైవ ప్రవక్త (స) తరచూ ముడు విషయాల నుండి అల్లాహ్‌ా శరణు వేడు కునేవారు:”అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మిన్‌ జహ్దిల్‌ బలా, వ దర్‌కిష్‌ షిఖా వ షమాతతిల్‌ అఅదా వ సూయిల్‌ ఖజా”-ఓ అల్లాహ్‌! విపత్తు తీవ్రత నుండి, చెడ్డ చావు నుండి, శత్రువు వెకిలి నవ్వు నుండి, చెడు తీర్పు నుండి నీ శరణు వేడుకుంటున్నాను. (బుఖారీ)

Related Post