ఆలుమగల అనుబంధం

కుటుంబ జీవితంలో శాంతి కొరవడితే, అది సత్సమాజ నిర్మాణానికి అవరోధంగా పరిణమిస్తుంది. అందుకని భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఎవరి పరిధుల్లో వారు తమతమ బాధ్యతల్ని నెరవేర్చాలి. స్వేచ్ఛ పేరుతో స్త్రీలు తమ పరిధుల్ని అతిక్రమించకూడదు. అలాగే పురుషులు భార్యలపై పెత్తనం చలాయించకూడదు.

కుటుంబ జీవితంలో శాంతి కొరవడితే, అది సత్సమాజ నిర్మాణానికి అవరోధంగా పరిణమిస్తుంది. అందుకని భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఎవరి పరిధుల్లో వారు తమతమ బాధ్యతల్ని నెరవేర్చాలి. స్వేచ్ఛ పేరుతో స్త్రీలు తమ పరిధుల్ని అతిక్రమించకూడదు. అలాగే పురుషులు భార్యలపై పెత్తనం చలాయించకూడదు.

సమాజంలో భార్యాభర్తల బంధం అత్యంత పవిత్రమైనది. నిజానికి ఇదే అసలు సృష్టికి మూలం. ఈ బంధం ద్వారానే దైవం మానవజాతిని ఉనికిలోకి తీసుకువచ్చాడు. అందుకే దీనికి ఇంత పవిత్రత, ప్రత్యేకత. ఈ బంధం పటిష్టంగా, గౌరవప్రదంగా ఉంటేనే మానవజాతి విజయపథంలో సాగుతుంది. సమాజ నిర్మాణంలో భార్యాభర్తలిద్దరి పాత్రా కీలకమైనదే. భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమానుబంధాల ద్వారానే మంచి కుటుంబాలు ఉనికిలోకి వస్తాయి. వారిద్దరి సాంసారిక జీవితం, దాని నియమాలు, బాధ్యతలు సరిగా అవగాహన చేసుకుంటేనే ఉత్తమఫలితాల్ని సాధించడానికి వీలవుతుంది. ఆలుమగల మధ్య ఈ విధమైన అవగాహన, పరస్పర ప్రేమానురాగాలు లోపించడం వల్లనే ఈనాడు కుటుంబాల్లో శాంతి కరవైపోతోంది.

కుటుంబ జీవితంలో శాంతి కొరవడితే, అది సత్సమాజ నిర్మాణానికి అవరోధంగా పరిణమిస్తుంది. అందుకని భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఎవరి పరిధుల్లో వారు తమతమ బాధ్యతల్ని నెరవేర్చాలి. స్వేచ్ఛ పేరుతో స్త్రీలు తమ పరిధుల్ని అతిక్రమించకూడదు. అలాగే పురుషులు భార్యలపై పెత్తనం చలాయించకూడదు. సహధర్మచారిణితో సత్ప్రవర్తనతో కూడిన జీవితం గడపాలి. ఆమె హక్కులను విశాల హృదయంలో గౌరవించాలి. ఎందుకంటే, ‘‘వారితో సత్ప్రవర్తనతో సంసారం చేయండి’’ (నిసా) అని దైవం ప్రబోధించాడు.

భార్య పట్ల సౌమనస్యంతో, ప్రేమాభిమానాలతో ప్రవర్తించాలి. ముహమ్మద్ ప్రవక్త ఇలా ప్రవచించారు: ‘‘తమ నడవడికతో అందరికంటే ఉత్తములైనవారే విశ్వాసంలో పరిపూర్ణులు. తమ భార్యల పట్ల అత్యంత మంచిగా మెలిగేవారే అందరిలో మంచి నడవడిక కలవారు’’(తిర్మిజీ). ఒక మనిషి నైతిక ప్రవర్తనను, అతని మంచితనాన్ని గ్రహించడానికి అసలైన గీటురాయి అతడి గృహజీవితమే.

స్వేచ్ఛగా ఉండే గృహజీవితంలోనే… మానసిక, నైతిక, ఆర్థిక సంబంధమైన ప్రతి అంశం ముందుకు వస్తుంది. కుటుంబం పట్ల ఔదార్యం, ప్రేమ, దయ కలిగి, కుటుంబానికి మానసిక తృప్తిని, ప్రశాంతతను కలిగిస్తూ ప్రేమాభిమానాలతో ప్రవర్తించినప్పుడే ఒక మనిషి విశ్వాసంలో పరిపూర్ణుడవుతాడు.

ప్రతిమనిషిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. స్త్రీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అందుకని చిన్నచిన్న విషయాలను రాద్ధాంతం చేయకూడదు. భార్యలో ఏదైనా చిన్నాచితకా లోపం, బలహీనత కానవస్తే – దానికే మూతి ముడుచుకోకూడదు. ఓర్పు వహించాలి. ఆమెలోని మరో మంచి గుణాన్ని గుర్తించి ఔదార్యం ప్రదర్శించాలి.

చిన్నచిన్న విషయాలకే మనసు పాడుచేసుకుంటే కుటుంబాల్లో దాంపత్య సుఖసంతోషాలు కనుమరుగైపోతాయి. అందుకే ముఖ్యంగా స్త్రీల వ్యక్తిత్వాన్ని గుర్తించాలి. అన్ని విషయాల్లోనూ పరస్పర అవగాహన అత్యంత అవసరం. ఈ విధంగా భార్యాభర్తలు ఒకరి హక్కుల్ని ఒకరు గుర్తించి, గౌరవించుకుంటే దైవం, దైవప్రవక్త హితవుల వెలుగులో జీవితం గడిపితే… ఇహంలో, పరంలో సాఫల్యవంత జీవితం పొందవచ్చు.

 

Related Post