అఖీఖా

ఇస్లామీయ పరిభాషలో పుట్టిన బిడ్డ కోసం మేకపోతును ‘ఖుర్బాని’చేయడాన్ని అఖీఖా అంటారు.‘ఖుర్బాని’చేసేటప్పుడు మేక గొంతును కోస్తారు కాబట్టి దీన్ని అఖీఖా అంటారు. దీన్ని‘నుసుక్’(అంటే‘ఖుర్బాని’)అని కూడా అంటారు. విద్వాంసుల్లో చాలా మంది అఖీఖాను సున్నత్ గా పేర్కొన్నారు.

ఇస్లామీయ పరిభాషలో పుట్టిన బిడ్డ కోసం మేకపోతును ‘ఖుర్బాని’చేయడాన్ని అఖీఖా అంటారు.‘ఖుర్బాని’చేసేటప్పుడు మేక గొంతును కోస్తారు కాబట్టి దీన్ని అఖీఖా అంటారు. దీన్ని‘నుసుక్’(అంటే‘ఖుర్బాని’)అని కూడా అంటారు. విద్వాంసుల్లో చాలా మంది అఖీఖాను సున్నత్ గా పేర్కొన్నారు.

– ఆస్క్ ఇస్లాం పీడియ

సంతానం (ఆడ, లేక మగ బిడ్డ) కలిగిన సంతోషంలో అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుతూ మేకను ‘జిబహ్’చేయడాన్ని‘అఖీఖా’ అంటారు.అఖీఖాధర్మాదేశ ప్రకారంబిడ్డ పుట్టిన 7వ రోజున చేయాలి.అఖీఖా అనేది అరబీ పదం ‘అఖ్ఖా’’నుండి వచ్చింది.దీని అర్ధం కత్తిరించుట.

ఇస్లామీయ పరిభాష

ఇస్లామీయ పరిభాషలో పుట్టిన బిడ్డ కోసం మేకపోతును ‘ఖుర్బాని’చేయడాన్ని అఖీఖా అంటారు.‘ఖుర్బాని’చేసేటప్పుడు మేక గొంతును కోస్తారు కాబట్టి దీన్ని అఖీఖా అంటారు. దీన్ని‘నుసుక్’(అంటే‘ఖుర్బాని’)అని కూడా అంటారు. విద్వాంసుల్లో చాలా మంది అఖీఖాను సున్నత్ గా పేర్కొన్నారు. (అల్ ముఘ్నీ -13/393-394)

బిడ్డపుట్టిన తరువాత చేయవలసిన పనులు

1. మగపిల్లవాడి కోసం చేయవలసిన దుఆ:“జఅల హుల్లాహు ముబారకన్ అలైక వ అలా ఉమ్మతి ముహమ్మద్” భావం: మీ కొరకు మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లము వారి సముదాయం కొరకు అల్లాహ్ ఈ పిల్లవాడిని శుభ సూచకంగా చేయుగాక!
ఆడపిల్ల కోసంచేయవలసిన దుఆ: “జఅల హల్లాహు ముబారకతన్ అలైక వ అలా ఉమ్మతి ముహమ్మద్.” (ఇమాం సుయూతి గారి ప్రమాణిక గ్రంధం ‘కితాబు ఉసూలుల్ అమాని బి ఉసూలి అత్తహాని’. కితాబుద్ దుఆ, తబ్రాని,vol 1:294 & 945; ఇబ్నె అబీ దునియా vol 1:366 & 202)

2. తహ్నీక్–ఏదైనా తియ్యటి పదార్ధం – తేనె లేదా ఖర్జూరం – పిల్లవాడి నోటిలో నమలి వేయడం. (సహీహ్ బుఖారీ 5150, ముస్లిం2145)

3. మగబిడ్డ కైనా ఆడబిడ్డ కైనా మంచి పేరు పెట్టాలి. (ముస్లిం 3126)

4. మగబిడ్డ కైనా ఆడబిడ్డ కైనా ఏడవ రోజున తలవెంట్రుకలు తీయిం (గుండు గీయిం) చాలి. తీసిన వెంట్రుకలను తూకము వేయించి అంతే బరువు గల వెండిని దానం చేయాలి. (అత్తిర్మిజి 1522; అల్ నసాయి 4220; అబూ దావూద్ 2838)

5. ఆడపిల్లకు ఒక మేక, మగపిల్లకు రెండు మేకలు ఖుర్బాని’ఇవ్వాలి. (అబూ దావూద్ 2842)

6. ఖితాన్ చేయించడం. (సహీహ్ బుఖారి 5441)

సున్నత్

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: “ప్రతి బిడ్డకి తను పుట్టిన ఏడవ రోజున మేకను ‘ఖుర్బాని’ ఇచ్చి అఖీఖా చేయాలి, తలవెంట్రుకలు తీయిం(గుండు గీయిం)చాలి, పేరుపెట్టాలి.” (అన్నసాయి 4220; అబూ దావూద్ 2838; అత్తిర్మిజి 1522; ఇబ్న్ మాజా 3165)

ఆయిషా రజియల్లాహుఅన్హా ఉల్లేఖించారు: “దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం హసన్ మరియు హుసైన్ లకు ఏడవ రోజున ‘అఖీఖా’చేసి పేర్లు పెట్టారు.” ఇబ్న్ హిబ్బాన్ 12/127, హాకిం 4/264, ఫత్ హుల్ బారి 9/589

‘అఖీఖా’ చేయడానికి సరైయిన సమయం

సముర బిన్ జున్దుబ్ ఉల్లేఖనం ప్రకారం:దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ప్రతి బిడ్దకి అఖీఖా చేయడం తప్పనిసరి. పుట్టిన ఏడవ రోజున మేకను ‘ఖుర్బాని’ ఇచ్చి, తలవెంట్రుకలు తీయిం(గుండు గీయిం)చాలి, పేరుపెట్టాలి. (అత్తిర్మిజి 1522, ఇబ్న్ మాజా 3165, సహీహ్ ఇబ్న్ మాజా 2563)

ఎవరైనా ఆ రోజు చేయలేకపోతే పద్నాల్గవ రోజున లేదా ఇరవై ఒకటవ రోజున చేయవచ్చు. బురైదా రజియల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అఖీఖా బిడ్డ పుట్టిన ఏడవ రోజున, లేక పద్నాల్గవ రోజున, లేక ఇరవై ఒకటవ రోజున చేయవచ్చు.” (సహీహుల్ జామి 4132)

ఎలాంటి జంతువును ‘ఖుర్బాని’ ఇవ్వాలి

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “రెండు మేకలు మగపిల్లవాడి కొరకు, ఒక మేక ఆడపిల్ల కొరకు ‘ఖుర్బాని’ ఇవ్వాలి.” (ఇబ్న్ మాజా 3163, సహీహుత్తిర్మిజి 1221)

‘ఖుర్బాని’ఇచ్చేజంతువు ఏ స్థితిలో ఉండాలి

ఇబ్నుల్ అరబీ అల్ మాలికి అన్నారు: బక్రీద్ పండుగకు ఇచ్చే మేకపోతు లాంటి మేకపోతే‘అఖీఖా’కోసం కూడా ఉండాలని ప్రామాణికమైన లేదా బలహీనమైన హదీసులో ఎక్కడా లేదు.అలా చెప్పేవారి వద్ద ఎలాంటి సాక్ష్యం లేదు. (అమీన్ మహమూద్ ఖత్తాబ్ లోని‘ఫత్ హుల్ మలికిల్ మాబూద్)

విద్వాంసుల కోణం

ఇమాం ఇబునుల్ ఖయ్యిం రహిముల్లాహ్ అన్నారు: ‘అఖీఖా’లాభాల్లో ఒకటి ఏమంటే: ఈ ‘ఖుర్బాని’ ద్వారా పిల్లాడు పుట్టగానే అల్లాహ్ కు దగ్గర అవుతాడు.

పుట్టిన పిల్లాడి చెవిలో అజాన్, ఇఖామత్ ఇవ్వడం

ఈ విషయంలో రెండు అభిప్రాయాలూ ఉన్నాయి. కొందరు విద్వాంసులు దీన్ని అనుమతిస్తున్నారు, మరి కొందరు దీన్ని నిరాకరిస్తున్నారు.
అనుమతించే పండితులు చెప్పే వాదన ఏమిటంటే, పిల్లాడు పుట్టగానే అతని చెవిలో అజాన్ పలికితే అది అతనిపై మంచి ప్రభావం చూపుతుంది. మొట్ట మొదటిసారిగా అతడుతౌహీద్ పలుకులే వింటాడు. షేక్ నాసిరుద్దీన్ అల్బాని రహిముల్లాహ్ గారి పరిశోధన ప్రకారం పిల్లాడి చెవిలో అజాన్, ఇఖామాత్ పలకడం ధృవీకరించబడలేదు.వివరాల కోసం షేక్ అల్బాని గారి అస్సిల్ సిలతు ద్దయీఫహ్ 1/491

పిల్లల రక్షణ కోసం అల్లాహ్ ను వేడుకోండి

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్ మరియు హుసైన్ రక్షణ కొరకు అల్లాహ్ ను ఇలా వేడుకునేవారు: (చెడు చూపు నుండి పరిరక్షించే దుఆ)

“అఊజు బికలిమాతిల్లాహిత్ తామ్మతి మిన్ కుల్లి షైతానిన్ వహామ్మతిన్ వ మిన్ కుల్లి ఐనిన్ లామ్మతిన్.”

అనువాదం: అల్లాహ్ యుక్క అన్ని వాఖ్యాల ద్వార “ప్రతి షైతాన్, విష జంతువు మరియు ప్రతి చెడు దృష్టి నుండి నేను నీ కొరకు (అల్లాహ్) శరణు కోరుతున్నాను.” సహీహుల్ బుఖారీ 3371

Related Post