అరచేతిలో అంతర్జాలం

 రక్తంలో వేడి, ఆలోచన్లో వాడి, ప్రవర్తనలో దూకుడు గల యువకులు ఈ నూతన ఆప్స్‌ని ఆశ్రయిస్తున్నారు. ఎంత అలసిసొలసి ఉన్నా కొంతలో కొంత రవ్వంత సమయమయినా ఎలాక్ట్రానిక్‌ మీడియా ముందు గడపనిదే వారి రోజు గడవడం లేదు. యువత అంతర్జాల ఈ వాడకాన్ని చూసి అశ్లీల మలీనాల్ని అంటించే ప్రయత్నం కొందరు చేస్తుంటే, అసత్య సిద్ధాంతాలను యువత మనోమస్తిష్కాల మీద రుద్దే కుయుక్తి మరికొందరిది.

రక్తంలో వేడి, ఆలోచన్లో వాడి, ప్రవర్తనలో దూకుడు గల యువకులు ఈ నూతన ఆప్స్‌ని ఆశ్రయిస్తున్నారు. ఎంత అలసిసొలసి ఉన్నా కొంతలో కొంత రవ్వంత సమయమయినా ఎలాక్ట్రానిక్‌ మీడియా ముందు గడపనిదే వారి రోజు గడవడం లేదు. యువత అంతర్జాల ఈ వాడకాన్ని చూసి అశ్లీల మలీనాల్ని అంటించే ప్రయత్నం కొందరు చేస్తుంటే, అసత్య సిద్ధాంతాలను యువత మనోమస్తిష్కాల మీద రుద్దే కుయుక్తి మరికొందరిది.

నూతన టెక్నాలజీ ప్రతి ఒక్కరికీ అడుగు దూరంలో ఉన్న నేటి ఈ ఆధునికంలో-ప్రింంగ్‌ మీడియాకన్నా ఎలక్ట్రానిక్‌ మీడియా ఎక్కువ ప్రభా వంతంగా పని చేస్తుంది అనడంలో సందేహం లేదు. వెబ్‌సైట్లు, బ్లాగర్లు, ముఖపుస్తకం,ట్విటర్‌, వైబర్‌, స్కైప్‌, వాట్స్ ఆప్‌ల వాడకం పెద్ద ఎత్తున జరుగుతోంది. కొన్ని దేశాలు తిరిగితేగానీ దొరకని 30 లక్షలకు మించిన బ్రాండ్‌ల వివరాలు ఒకే ఒక్క వెబ్‌ వేదిక మీద అందు బాటులో ఉన్నాయి. ఏ దేశంలో నివశించే వారయినా ఎక్కడి నుండ యినా బుక్‌ చేసుకోవచ్చు. మనిషి తన గది మూలలో కూర్చొని అగ్గి పెట్టె వంటి పరికరం మాధ్యమంగా ప్రపంచంలో ఏ మూలలో నివ సించే వ్యక్తితోనయినా మ్లాడగలుగుతు న్నాడు, చూడగలుగుతున్నాడు, తన సందేశాన్ని ఒక్క క్లిక్‌తో కొన్ని వందల, వేల మంది వరకు చేరవేయగలుగుతున్నాడు. మంచినిగానీ, చెడునుగానీ ప్రచారం కల్పిం చుకునే ఇంత విస్తృత స్థాయి ఏర్పాటు మానవ చరిత్రలో మునుపెన్నడూ జరగలేదు.

రక్తంలో వేడి, ఆలోచన్లో వాడి, ప్రవర్తనలో దూకుడు గల యువకులు ఈ నూతన ఆప్స్‌ని ఆశ్రయిస్తున్నారు. ఎంత అలసిసొలసి ఉన్నా కొంతలో కొంత రవ్వంత సమయమయినా ఎలాక్ట్రానిక్‌ మీడియా ముందు గడపనిదే వారి రోజు గడవడం లేదు. యువత అంతర్జాల ఈ వాడకాన్ని చూసి అశ్లీల మలీనాల్ని అంటించే ప్రయత్నం కొందరు చేస్తుంటే, అసత్య సిద్ధాంతాలను యువత మనోమస్తిష్కాల మీద రుద్దే కుయుక్తి మరికొందరిది. సౌదీలో రోజు కి 100 అశ్లీల వెబ్‌సైట్లు బ్లాక్‌ చేయబడుతున్నాయి అంటే అశ్లీల ప్రవాహం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. మనిషి స్వర్గనరకాలు ఒక్క క్లిక్కు దూరం లోనే ఉన్నాయంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ‘ఇలాంటి సైట్ల వల్ల పిల్లలెంతగా చెడిపోతున్నారో చూడండి’ అని ఆరణ్యరోదన చేసేవాళ్ళు చేస్తున్నా – ”అవి లేకపోతే మరింత అడ్డ దారులు తొక్కుతారంటూ” వెను కేసుకొచ్చేవారే ఎక్కువగా కనబడుతున్నారు.

సందేహం లేదు!
అంతర్జాలం నేటి తరానికి ఓ వరం. పూర్వ తరాల వారు కలలోనయినా ఊహించని అనంత జ్ఞానాన్ని నేటి తరం పిల్లలకు స్మార్ట్‌ ఫోన్‌లు, ా్యబ్‌లు, పీసీలు అందిస్తున్నాయి. వయోభేదం లేకుండా సమస్త సమాచారాన్ని వారి చికెన వేలికి చేరువగా ఉంచుతున్నాయి. అయితే విజ్ఞానంతోపాటు వికృ తాలను కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. ఒకప్పుడు ‘వాయురిజం’గా ఉన్న సమస్యను నేటి సాంకేతిక సౌకర్యాలు పెర్వర్షన్‌ (లైంగిక వైపరీత్యం)గా దిగజార్చేశాయి. కొన్ని నష్టాలు కింకి కనిపించవు. చాప క్రింద నీరులా చల్లగా వచ్చి కబళిస్తాయి.వీటిని పూర్తిగా నిర్మూలించే పరిస్థితి ఇప్పికయితే కనిపించడం లేదు. ఏ దేశంలో ఎలాిం నిషేధాలున్నా అశ్లీల సైట్లను పూర్తి గా లేకుండా చేయడం ప్రస్తుతానికయితే అసాధ్యమనే చెప్పొచ్చు. ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్లు మన పిల్లలు వాడే స్మార్ట్‌ ఫోన్‌, పీసీ, ా్యబ్‌ ఎందు లోనయినా సరే అసభ్యకరమయిన దృశ్యాలు చూడకుండా అడ్డుకునే ‘నెట్ మానియా’ విం యాప్స్‌ను వాడి కంట్రోల్‌ చేసే ప్రయత్నం ఉడతాభక్తిగాన యినా చెయ్యకపోతే రేపు తీరిగ్గా కూర్చొని చింతించడం వల్ల ఎలాిం ప్రయోజనం లేదు. ‘అనుభవమయితే గానీ తత్వం బోధ పడదు’ అన్న మాట నిజమే కావచ్చు కానీ, కొన్ని అనుభవాలు జీవితంలో ఒక్కసారే ఎదురవు తాయి. వాటి నుండి నేర్చుకునే గుణపాఠాలు చాలా విలువయినవే అయినా, నేర్చుకోవడానికి మనమూ, మన పిల్లలూ లేకపోవచ్చు. ఇతరుల జీవితాల నుండి కూడా నేర్చుకోవాల్సిన సత్యాలు చాలానే ఉంాయి. మచ్చుకో సంఘ టనను ఇక్కడ పేర్కోంటున్నాము.

3 యేండ్ల క్రితం సంఘటన-తనో కాలేజీ కుర్రాడు. గొప్పిం బిడ్డ. అయితే బలాదూర్‌ తిరిగే బేవార్స్‌ వెధవలతో స్నేహం చేసాడు. ‘కూసే గాడిద మేసే గాడిదను చెడగొట్టింది’ అన్నట్టు-తానూ చెడ్డాడు. అయితే ఈ విషయం వారి కుటుంబ సభ్యులకు తెలీదు. చెడుకి అలవాటు పడ్డ అతను అటువిం అశ్లీల విషయాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకొని రుసూము చెల్లించి 5 యేండ్లపాటు ప్రతి వారం ఓ పోస్టు తన ఈమెయిల్‌కి వచ్చే ఏర్పాటు చేసు కున్నాడు. (ఒక్క భారత దేశంలో అందుబాటులో ఉన్న అశ్లీల వెబ్‌సైట్ల సంఖ్య నాలుగు కోట్లు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వమే సుప్రీం కోర్టుకు విన్న వించుకుంది.) అలా వచ్చే మెయిల్స్‌ని దాదాపు 150 స్నేహితుల మెయిల్స్‌కి ఆోమెిక్‌గా వెళ్ళే ఏర్పాటు చేశాడు. వారు వారి స్నేహితులకు – అలా ఒక్క క్షణంలో కొన్ని వేల మందికి చేరేది. ఆరు మాసాలు గడిచాయి. అకస్మా త్తుగా ఆ కుర్రాడు మరణించాడు. అయితే అతను ప్రారంభించి వెళ్ళిన ఆ చెడు మాత్రంనేటికీ కొనసాగుతూనే ఉంది. ఆలస్యంగా ఈ విషయం తెలు సుకున్న ఇంి వారు చలించిపోయారు పాపం! ఎలాగోలా సదరు కంపెనీ అడ్రస్సు రాబ్టి వారితో వీటిని ఆపి వేయాల్సిందిగా విన్నవించుకున్నారు. కానీ, అగ్రిమెంట్ ప్రకారం అలా చేయడం కుదరదని, ఒకవేళ అలా చేయా లన్నా సదరు వ్యక్తి పాస్‌వర్డ్‌ ఉంటే ఏమయినా సాయం చేయగలమని అన్యదా తమ వల్ల కూడా ఆ ప్రవాహాన్ని ఆపడం సాధ్యం కాదని తేటతెల్లం జేసేశారు.
చూశారా! వ్యక్తి చచ్చి కాటి మట్టిలో కలిసిపోయినా అతను మొదలు పెట్టి వెళ్ళిన చెడు మాత్రంనేటికీ అతన్ని వెాండుతూనే ఉంది. మనం మన వాల్‌ మీద పోస్ట్‌ చేసిన ఓ విషయాన్ని మనం మరచి పోవచ్చేమోగానీ, షేర్‌ చేసే వారు దాన్ని – మంచిదయినా, చెడ్డదయినా షేర్‌ చేస్తూనే ఉంారు. మన కర్మల పత్రంలో మంచో చెడో నమోదు అవుతూనే ఉంటుంది. అంతిమ దైవప్రవక్త (స) ఇలా హితోపదేశం చేశారు; ”ప్రజల్లో కొందరు మంచికి మార్గాలయి ఉంారు. చెడుని రూపు మాపే వారయి ఉంారు. మరి కొందరు – చెడుకి తలుపులు, తలపులు తెరిచేవారయి ఉంారు. మంచిని నాశనం చేసేవారయి ఉంటారు. మీరు మాత్రం మంచికి మార్గాలుగా మాత్రమే ఉండండి. చెడుని ఊతమిచ్చేవారిగా మారకండి”. (ఇబ్ను మాజా)

సమాచార సాంకేతిక పరిజ్ఞాన సాగర మధనంలో ప్టుిన అంతర్జాలాన్ని మన కోసం వరంగా మార్చుకుాంమో, శాపంగా మిగుల్చుకుాంమో మనమే నిర్ణయించుకోవాలి. మన దేశంలోఅంతర్జాల వినిమయం 20 శాతం లోపే ఉందంటున్నా చరవాణి (సెల్‌ఫోన్‌)ల సంఖ్య నూరు కోట్లకు చేరువవు తోంది. చరవాణుల్లో అంతర్జాల వెసులుబాటు – వరదలెత్తుతున్న అశ్లీలానికి కౌమార ప్రాయంలోనే పిల్లల్ని బానిసలు గామార్చేస్తుంది. మెదళ్ళను కకావిక లం చేసి, భవిష్యత్తును అంధకారం చేసి, ఎదిగే సత్తాను హరించి, మనిషిని- సమాజాన్ని ఒక్క తీరుగా ధ్వంసం చేయడంలో అశ్లీలానికి మించింది లేదు. ఎయిడ్స్‌, క్యాన్సర్లకన్నా, ఆ మాటకొస్తే అణుప్రమాద తీవ్రతకన్నా విపత్కర మైన అశ్లీల ప్రభంజనాన్ని ఆపక పోతే జరిగే నష్టం అంతా ఇంత కాదు.

హెరాయిన్‌లాంటి మాదక ద్రవ్యాల్నిఇంటి నాలుగు గోడలమధ్య సేవించడాన్ని రాజ్యాంగబద్ధ వ్యక్తి స్వేచ్ఛగా పరిగణించని ప్రభుత్వాలు – వారి ఇంటి నాల్గోడల మధ్య అశ్లీలాన్ని చూసే వెసులు బాటును ఎందుకు వారి వ్యక్తిగత స్వేచ్ఛగా భావి స్తున్నాయి అన్నది వేయి డాలర్ల ప్రశ్న! అశ్లీల వెబ్‌సైట్ల తుఫానుకి రేపి ఆశాదీపాలు, వెలుగు దివ్వెలు కొండెక్కి కూర్చోకుండా చూడాల్సిన బాధ్యత వ్యక్తులయిన పేరెంట్స్తోపాటు ప్రభుత్వా నిది కూడా. దేశంలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్‌ ప్టిె నిషేధించినట్లు అంతర్జాలానికి సెన్సార్‌ ఎందుకు పెట్టలేకపోతుంది? వివిధ విభాగాలా వారీగా దేశదేశాలకు చెందిన పచ్చి బూతు కౌమారప్రాయంలోని పిల్లల అరచేతుల్లో తార్లానికి మించిన అనర్థం ఇంకేముంటుంది? చెప్పండి! పాకిస్థాన్‌ అటువిం 7లక్షల 80 వేల సైట్లను కట్టడి చేస్తొంది. అరబ్‌ దేశాలూ లక్షలాది సైట్లను కట్టడి చేస్తున్నాయి. కాబ్టి ముంచుకొచ్చే ముప్పు తీవ్రతను గుర్తించి, జాతి నైతిక పునా దులు కదలకుండా, దేశ గౌరవం మ్టి పాలు కాకుండా, భావి తరాలు అశ్లీం ఊబిలో దిగబడి దేశాన్ని అధోగతికి గురి చెయ్యకుండా కాపాడు కోవడం భారతీయుడయిన ప్రతి ఒక్కరు, ముఖ్యం గా భారతీయ ముస్లిం ప్రథమ కర్తవ్యంగా భావించి ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.

మనిషి జీవిత ప్రభావం పుట్టుక నుంచి గిట్టుక దాకే అనుకోవడానికి వీలు లేదు. కొన్ని సందర్భా లలో మరణానంతర సంఘటనలు కూడా అతని చరిత్రపై సానుకూల, ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. కాబ్టి రేపు ప్రళయ దినాన సర్వ లోక సృష్టికర్త అయిన అల్లాహ్‌ా మన లెక్కలు మనతో తీసుకోక ముందే మన లెక్కల్ని మనమే సరి చేసుకోవాలి. ‘ నేటిమన ఆత్మపరిశీలన రేపి కర్మపరిశీలనను సులభతరం చేస్తుంది’ అన్న ఎరుకతో ముందుకు సాగాలి. అల్లాహ్‌ ఇలా అంటున్నాడు : ”మీలో ఒక వర్గం తప్పక ఉండాలి. వారు మంచిని గురించి బోధించాలి. చెడు నుండి వారించాలి. యదార్థంగా వారే సఫలీకృతులు”. (ఆల్‌ ఇమ్రాన్‌: 104)
”ఏ శక్తి స్వరూపుని అధీనంలోనయితే నా ప్రాణ ముందో ఆయన సాక్షిగా! మీరు తప్పకుండా మంచిని బోధించాలి, చెడు నుండి వారించాలి. లేదా అల్లాహ్‌ తన వద్ద నుండి మీపై శిక్షను అవతరింపజేసే ప్రమాదముంది. ఆ తర్వాత మీ ఎంత మొర పెట్టుకున్నా మీ మొర ఆలకించబడదు”. (తిర్మిజీ) అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ (స).

Related Post