చేతబడి వాస్తవికత

అన్నింటికన్నా హేయమయిన చేతబడి మనకు మనం చేసుకు నేది. దాంతో పోలిస్తే ఎదుివాళ్ళు చేెసే చేతబడి అత్యల్పం. ఏ విధంగా చూసుకున్నా మనకు మనం చేసుకునే అన్యాయమే ఎక్కువ. మన మనసుని అల్లాహ్‌ స్మరణతో నింపుకోగలిగితే, ప్రవక్త (స) వారు సూచించిన నివారణ పద్ధతుల్ని పాటించినట్లయితే ఎవరు ఏం చేసినా ఏమీ కాదు. ''మాంత్రికుడ ఏ విధంగా (ఎంత అట్టహాసంగా) వచ్చినా సఫలీకృతుడు కాలేడు''. (తాహా: 69)

అన్నింటికన్నా హేయమయిన చేతబడి మనకు మనం చేసుకు నేది. దాంతో పోలిస్తే ఎదుివాళ్ళు చేెసే చేతబడి అత్యల్పం. ఏ విధంగా చూసుకున్నా మనకు మనం చేసుకునే అన్యాయమే ఎక్కువ. మన మనసుని అల్లాహ్‌ స్మరణతో నింపుకోగలిగితే, ప్రవక్త (స) వారు సూచించిన నివారణ పద్ధతుల్ని పాటించినట్లయితే ఎవరు ఏం చేసినా ఏమీ కాదు. ”మాంత్రికుడ ఏ విధంగా (ఎంత అట్టహాసంగా) వచ్చినా సఫలీకృతుడు కాలేడు”. (తాహా: 69)

చేతబడి వాస్తవికత

ప్రవక్త (స) ఇలా అన్నారు: ”ముగ్గురు స్వర్గంలో ప్రవేశించరు. ఎప్పుడూ మద్యం మత్తులో జోగుతుండే వ్యక్తి. బంధుత్వ సంబంధాలను త్రెంచే వ్యక్తి. చేతబడి సత్యం అని నమ్మే వ్యక్తి”. (ముస్నద్‌ అహ్మద్‌)
దుష్ట శక్తుల వసీకరణకై తనయులను బలిచ్చిన కన్న తండ్రి.
నిధి కోసం మాంత్రికుడి ఆజ్ఞ పాలించి కన్న తల్లిని చంపిన కొడుకు.
ప్రేమించిన యువతిని పొందడానికి మాత్రికునికి నాలుక కోసి ఇచ్చిన అమర ప్రేమికుడు…
ఇలాంటి వార్తలు ఎన్నో వింటుంటాము. దిన పత్రికల్లో చదువుతుంటాము. అసలు చేతబడి ఉందా? ఉంటే ఏ మేరకు ఫ్రభావం చూపగలదు? అన్న విషయమై ప్రవక్త మూసా (అ) వారి కాలానికి పూర్వం నుండి వాదోప వాదాలు జరుగుతూనే ఉన్నాయి, తర్జనభర్జనలు పడుతూనే ఉన్నారు. ఈ వ్యాస మాధ్యమంగా మనం చేతబడి పూర్వపరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం!
చేతబడిని అరబీలో సిహ్ర్‌ అంటారు. సిహ్ర్‌ అంటే ముక్కలవ్వడం, మళ్ళిం చడం, వశ పర్చుకోవడం, దాగి ఉండటం, సూకమయినది అన్న అర్థాలు న్నాయి. సామాన్య అర్థంలో గిట్టని వారికి హాని తలపెట్టే దురుద్దేశ్యంతో చేసే, చేయిపించే విద్యను చేతబడి అంటారు.

చేతబడి రకాలు:

 
1) ముడుల మీద మంత్రించడం లేదా షైతానులు, జిన్నాతుల ద్వారా సహాయం పొంది ఎదుి వారికి హాని తలపెట్టడం.
2) మందు, మాకు, మాటల ద్వారా బాధితున్ని తనవైపు త్రిప్పుకుని అతని ఆలోచనలపై, ఆచరణలపై పట్టును సాధించి, అతన్ని తనకు అనుకూలంగా మలచుకోవడం. అంటే క్షుద్ర శక్తుల్ని ఆవహించి. షైతానులను రాజీ పర్చు కుని, జిన్నాతులను ప్రసన్నుల్ని చేసుకుని చేతబడి చేయడం లేదా మందు మాకుల, మాటల మాధ్యమంగా ఎదుటి వ్యక్తిని బకరా చేయడం. ఈ రెండు పద్దతులను వేర్వురుగా చేసేవారూ ఉంారు. ఈ రెంటిని కలిపి చేసే వారు కూడా ఉంటారు. మంత్రంతోపాటు తంత్రం అన్న మాట. పై రిెంతో దూరపు సంబంధం కూడా లేని మూడో రకం కూడా ఉంది. అదే మోసం.

చేతబడి గురించి పలువురి అభిప్రాయం:

చేతబడి పచ్చి మోసం అంటారు కొందరు. చేతబడి ఉందో లేదో తెలీదు కానీ, దానికి విరుగుడు మా వద్ద ఉంది అని అమాయకుల్ని మోసం చేసి పబ్బం గడుపుకునే వారికి మాత్రం కొదువ లేదు అంటారు మరికొందరు. చేతబడి అంటే – చేతన్‌ – పడి, మాంత్రికుని చేతిలో పడి మోస పోవడం అంటారు ఇంకొందరు.చేతబడి ఉంది అన్నది కొందరి వాదన. ఏది ఎలా ఉన్నా నేటికీ అనేక దేశాల్లో ఈ విద్యను అభ్యసించేవారికి సమాజంలో ప్రత్యేక స్థానానికయితే ఢోకా లేదు. ప్రపంచ వ్యాప్తంగా వీరికి మహా గిరాకీ కాబ్టి వీరు సంఘాలుగా ఏర్పడి పెద్ద ఎత్తున సమావేశాలు కూడా జరుపు తుంటారు. ‘వీకా’ (విచేస్‌ ఇంటర్నేషనల్‌ క్రాఫ్ట్‌ అసోసియోషన్‌) అనే పత్రికను కూడా ఆమెరికా నుండి నడుపుతున్నారు. యునెస్కో లెక్కల ప్రకారం- ఫ్రాన్స్‌లో 60 వేల మంది, జర్మనీలో 70 వేల మంది, రోమ్‌లో 500 మంది, ఇటలీలో 10 వేల మందికి పైగా మాంత్రికులున్నారని తెలుస్తుంది. కొస మెరుపు ఏమిటంటే ఒకప్పుడు అరబ్బులో అధిక సంఖ్య ఉన్న మాంత్రికుల ఇస్లామీయ దాదాపు అంతరించారని చెప్పొచ్చు. ఒకవేళ అడపా దడపా ఉన్నా సమాజంలో వారికంత ప్రాధాన్యత లేదు.

చేతబడి చరిత్ర:

చేతబడిని ప్రాంతం, భాషను బట్టి వేర్వేరు పేర్లతో పిలుస్తారు. విచ్‌క్రాఫ్ట్‌, వూడు, మ్యాగ్‌, బ్లాక్‌ మాజిక్‌, భాణామతి, చిల్లంగి, జాదు, క్షుద్రవిద్య మొదల యినవి. చేతబడి ఖచ్చితంగా ఏ కాలంలో ప్రారంభయ్యిందో తెలియ నప్పికీ, లిపి ఉనికిలోకి వచ్చిన తర్వాత నుండి దాదాపు అన్ని కాలాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ ఇది ఉన్నట్లు పరిశోధనల ద్వారా తెలుస్తుంది. ఆస్ట్రెలియా పాతకాలపు తెగల్లో, ఆమెరికాలోని రెడ్‌ ఇండియన్స్‌లో, ఆఫ్రీకా తెగల్లో, ఈజిప్టు, ఈరాన్‌, గ్రీకు, రోము, భారత, చైనా, నైనోవా, ఇటలీ, జర్‌మన్‌, జపాన్‌ దేశాల్లో నాడే కాదు, నేడు సయితం చేతబడి, క్షుద్ర విద్య అనేది ఏదోక రూపంలో ఉంది.
ఓ కథనం ప్రకారం ఈ విద్య తొలూత ఈరాన్‌ (ఈరాన్‌+ఇరాక్‌) దేశంలో మొదలయింది. ఆ తర్వాత మైనర్‌ ఆసియా మొత్తం విస్తరించింది. పూర్వం ఈరాన్‌లో ‘మగ్‌’ అనే ఓ తెగ ఉండేది. వారి ‘జర్‌తిష్త్‌’ అనుయాయలు. సం స్కృతంలో చేతబడిని ‘మాయిగుగ్‌’ అంటే మగ్‌ విద్య అని. ఆంగ్లంలోని మ్యాజిక్‌కి మూల పదమే ఈ మగ్‌. ‘మగ్‌’ అనే ఈ తెగ వారు భారత దేశాని కి వసల వెళ్లినప్పుడు తమతోపాటు ఈ విద్యను కూడా తీసుకెళ్ళారు. తర్వాత భారత ప్రజలు ఈ విద్యను ఎంతగా ఒంట బట్టించుకున్నారంటే అది తమ సంస్కృతిలోని అవిభాజ్యాంశంగా భావించ సాగారు.
ఖుర్‌ఆన్‌ ప్రకారమయితే బాబిల్‌ అనే ప్రాంతంలో అల్లాహ్‌ పరీక్షార్థం పంపిన ఇద్దరు దైవ దూతలకు ఈ విద్యను ప్రసాదించడం జరిగిందని తెలుస్త్తుంది: ”వారు సులైమాన్‌ (అ) రాజ్యంలో షైతానులు అవలంబించిన విష యాల వెంట పడ్డారు. అసలు సులైమాన్‌ (అ) ఎన్నడూ అవిశ్వాసానికి ఒడ గట్ట లేదు. ఈ అవిశ్వాస పోకడ అసలు షైతానులదే. వారు ప్రజలకు చేత బడి నేర్పేవారు. వారు బాబిలోనియాలో ఇద్దరు దైవదూతలపై అవతరింప జేయబడిన విద్య వెంట పడ్డారు. (వారి వద్ద నేర్చుకోవడానికి వచ్చే వ్యక్తినుద్దే శించి) ‘నిశ్చయంగా మేము ఒక పరీక్ష వంటివారము. నువ్వు మాత్రం అవిశ్వాసానికి ఒడిగట్టకు’ అని చెప్పి హెచ్చరించేంత వరకూ ఎవరికీ ఆ విద్యను నేర్పేవారు కాదు. అయినప్పికీ జనులు వారి దగ్గర భార్యాభర్తలను విడగొట్టే విద్యను నేర్చుకునేవారు”. (అల్‌ బఖరహ్‌ా: 102)

చేతబడి మరియు ఇస్లాం:

చేతబడి లేదని, అది కేవలం మానసిక అవస్థ మాత్రమేనని కొందరు పండితులు అభిప్రాయ పడ్డారు. అయితే అధిక శాతం మంది పండితులు ‘చేతబడి ఉంది’ అన్న అభిప్రాయానికే కట్టుబడ్డారు. ఇస్లాం చేతబడిని ఒక విద్యగా అంగీకరించినప్పికీ దాన్ని అన్ని రకాలుగా నిషేధిస్తుంది. దాన్నో నిష్ప్రయో జనకర విద్యగా, చెడు వ్యాపకంగా పేర్కొంటుంది: ”తమకు నష్టం తప్ప ఏ విధమయినటువిం ప్రయోజనం చేకూర్చని దానిని వారు నేర్చుకుంటు న్నారు” (బఖరహ్‌:102) అని చెప్పడమే కాక, పరలోకంలో వారికి కలగ బోయే విపరిణామాన్ని సయితం అది పేర్కొంటుంది: ”ఆ విద్యను నెర్చుకున్న వారికి పరలోకంలో ఎలాటి భాగం ఉండదు అన్న సంగతి వారికి సయితం తెలుసు”. (బఖరహ్‌:102) అంతే కాదు ”ఎంత హేయమయిన వస్తువుకు బదులుగా వారు తమను తాము అమ్ముకుంటున్నారో వారికి తెలిస్తే ఎంత బావుండి!” (బఖరహ్‌:102) అంటూ అలాిం వారికి కనివిప్పు కలిగించే ప్రయత్నం చేస్తుంది. అయినా వినకపోతే, వారిలో మార్పుకి చేసి ఏ ప్రయత్నం ఫలించని పక్షంలో అలాిం వారికి మరణ దండన విధిస్తుంది.
దైవప్రవక్త (స) ఏడు ప్రాణాంతకర విషయాల్ని పేర్కొంటూ – షిర్క్‌ తర్వాత చేతబడిని పేర్కొనండం-విశ్వాసి పాలిట చేతబడి ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. ఇంకా ప్రవక్త (స) ఇలా అన్నారు: ”ముగ్గురు స్వర్గంలో ప్రవే శించరు.24 గంటలూ మద్యం మత్తులో జోగుతుండే వ్యక్తి. బంధుత్వ సంబం ధాలను త్రెంచే వ్యక్తి. చేతబడిని సత్యం అని నమ్మే వ్యక్తి”. (ముస్నద్‌ అహ్మద్‌)

చేతబడి నివారణ:

చేతబడిని మూడు మార్గాల్ని అనుసరించి పోగొట్టడం జరుగుతుంది. అందులో రెండు అధర్మం అవగా, ఒకి మాత్రమే ధర్మసమ్మతం.
అదర్మ పద్ధతి-ఒకటి: ఒక మనిషిపై ఉన్న జిన్నును లేదా చేతబడిని తీయడా నికి ఇంకో జిన్ను సహాయం తీసుకోవడం. ఇది అందరి ఏకాభిప్రాయంతో నిషేధించబడింది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”అసలు విషయం ఏమిటంటే కొందరు మనుషులు కొందరు జిన్నాతుల శరణు వేడుకునేవారు. ఈ కార ణంగా జిన్నాతుల పొగరు మరింత పెరిగి పోయింది”. (జిన్‌: 6)
అధర్మ పద్ధతి – రెండవది: జిన్ను ముందరే షిర్క్‌ పనులు చేసి దాన్ని పోగొట్ట డం. ఇది పలు రకాలుగా ఉంటుంది. దాటు తీయడం, గుడ్డలూడదీసి రాత్రి సమయంలో చక్కర్లు కొట్టించడం, కన్య స్త్రీని వివస్త్రను చేెసి ముగ్గు మధ్యలో కూర్చో బెట్టడం వగైరా. ఇలాంటి జుగుప్సాకరమయిన చేష్టల ద్వారా షైతాన్‌ మెప్పు పొంది చేతబడినిగానీ, జిన్నుని గానీ తొలగించే ప్రయత్నం చేయడం. ఇది కూడా అధర్మమే, హరామే.
ధర్మసమ్మతమయిన విధానం: ఇది దైవప్రవక్త ముహమ్మద్‌ (స) సూచించిన విధానం. సృష్టిలో మన ఇంద్రియాలకు కానరాని అనేక ప్రాణుల కీడు నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో అల్లాహ్‌, ప్రవక్త (స) వారికి బోధ పర్చాడు.కాబట్టి ముస్లిం అయిన మనం ప్రామాణికమయిన ప్రవక్త (స) వారి పద్ధతినే అనుసరించాలి, ఆచరణలో పెట్టాలి.

1) ”అవూజు బిల్లాహి మినష్షయితానిర్రజీమ్‌” చదవాలి.
2) ఖుర్‌ఆన్‌లోని అల్‌ ఆరాఫ్‌ సూరా (7: 200) ఆయతును, అన్నహల్‌ సూరా (16:98) అయతును చదవాలి.
3) ముఅవ్వజతైన్‌- ఖుల్‌ అవూజు బిరబ్బిల్‌ ఫలఖ్‌ మరియు ఖుల్‌ అవూజు బిరబ్బిన్నాస్‌ (113, 114) చదవాలి. ప్రవక్త (స) వారికి చేయబడిన చేతబడి కి విరుగుడు అవతరించిన సూరాలు ఇవి.
4) ఆయతుల్‌ కుర్చీ చదవాలి. ప్రవక్త (స) అన్నారు: ”ఎవరయితే పడుకోక ముందు ఆయతుల్‌ కుర్సీ (2:255) పూర్తిగా చదువుకుమాడో, తెల్లారే వరకూ అల్లాహ్‌ తరఫున ఒక దైవదూత అతనికి రకణగా ఉమాడు. మరియు షైతాన్‌ అతని దగ్గరకు రాడు”. (బుఖారీ)
5) సూరహ్‌ బఖరహ్‌లోని చివరి రెండు ఆయతులు (2: 285, 286) చద వాలి. ”సూరహ్‌ బఖరహ్‌లోని చివరి రెండు ఆయతులు మూడు రాత్రులు వరుసగా ఏ ఇంటిలోనయితే పఠించబడతాయో ఆ ఇంటి దరిదాపులకు కూడా షైతాన్‌ రాలేడు”. (తిర్మిజీ)
6) అజాన్‌: ”అజాన్‌ ఇవ్వబడినప్పుడు షైతాన్‌ వీపు చూపి, గాలి వదులుతూ పారి పోతాడు”. (బుఖారీ)
7) సూరహ్‌ ఫాతిహా చదవాలి. ఓ సహాబీ (ర) సూరహ్‌ా ఫాతిహా చదివి ఓ వ్యక్తి చేతబడిని దూరం చేశారు.
గమనిక:వీటిని ఎవ్వరయినా చదవచ్చు. అంతగా భయం ఉంటే ధర్మబద్ధమ యిన రీతిలో వైద్య చేసే దైవభీతి పరుల వద్దకు మాత్రమే వెళ్ళాలి.
చివరి మాట: అన్నింటికన్నా హేయమయిన చేతబడి మనకు మనం చేసుకు నేది. దాంతో పోలిస్తే ఎదుివాళ్ళు చేెసే చేతబడి అత్యల్పం. ఏ విధంగా చూసుకున్నా మనకు మనం చేసుకునే అన్యాయమే ఎక్కువ. మన మనసుని అల్లాహ్‌ స్మరణతో నింపుకోగలిగితే, ప్రవక్త (స) వారు సూచించిన నివారణ పద్ధతుల్ని పాటించినట్లయితే ఎవరు ఏం చేసినా ఏమీ కాదు. ”మాంత్రికుడ ఏ విధంగా (ఎంత అట్టహాసంగా) వచ్చినా సఫలీకృతుడు కాలేడు”. (తాహా: 69)
అలా కాక, కాకమ్మ కబుర్లను నమ్మినా, ప్రవక్త (స) వారి సున్నతును విడ నాడినా మన మనస్సు షైతాన్‌ వసీకరణలకు నెలవుగా మారి పోతుంది. ఆ సమయంలో ఎదుి వాళ్ళు దాన్ని కొద్దిగా రగిలించినా అది మనల్ని, మన విశ్వాసాన్ని ధ్వంసం చేయగలదు. మన చూట్టూ ఉండే వారి ఉద్దేశాల్ని మనం అదుపు చెయ్యలేము గానీ, మన లోపల జరిగే దాన్ని మాత్రం మనం అదుపు చేససుకోగలం. మన మనసును నూటికి నూరు సాతం అల్లాహ్‌ స్మరణ నిండిన నెలవుగా మార్చుకోవచ్చు. అప్పుడు మనకేమి అవ్వదు. ఇది నిజం; కఠోర సత్యం!

Related Post