హాస్యం మరియు ఇస్లాం

ఇస్లాం స్వచ్ఛమయిన నవ్వుకి, సత్యబద్ధ్దమయిన హాస్యాన్ని సయితం షరీయతు బద్ధం చేస్తుంది. అబ్దుల్లాహ్‌ా బిన్‌ హారిస్‌ బిన్‌ జజ్‌అ (ర) గారి కథనం - ''నేను దైవప్రవక్త (స) వారికంటే ఎక్కువగా చిరునవ్వు చిందించేవారిని మరొకరిని చూడ లేదు''. (తిర్మిజీ)

ఇస్లాం స్వచ్ఛమయిన నవ్వుకి, సత్యబద్ధ్దమయిన హాస్యాన్ని సయితం షరీయతు బద్ధం చేస్తుంది. అబ్దుల్లాహ్‌ా బిన్‌ హారిస్‌ బిన్‌ జజ్‌అ (ర) గారి కథనం – ”నేను దైవప్రవక్త (స) వారికంటే ఎక్కువగా చిరునవ్వు చిందించేవారిని మరొకరిని చూడ లేదు”. (తిర్మిజీ)

పిల్లలయినా పెద్దలయినా, ధనికులయినా, నిరుపేదలయినా, పండితుల యినా, పామరులయినా, రాజయినా, ప్రజా అయినా, ఎవరు ఎంత విలు వయిన దుస్తులు ధరించినా, ఎన్ని ఆభరణాలతో తన్ను తాను అలంక రించుకున్నా చిరునవ్వు అనే ఆభరణమే గనక అధరాలపై కదలాడకపోతే అన్నీ ఉన్నా అసలైన ఆభరణం లేని వారుగానే కనిపిస్తారు. వారితో సంభాషించడానికి వారి పిల్లలు కూడా జడుసుకుంటారు. ఏప్పుడు చూసినా నిప్పులు చెరుగుతూ, చిర్రుబుర్రులాడుతూ ఉంటే, ‘ఏమిట్రా! అతని ముఖం ఎప్పుడు చూసినా తుమ్మలో పొద్దుపొడిచినట్లు ఉంటుంది’ అని మన పెద్దలు అనడం మనం గమనిస్తాము. చంద్రరహిత నీలాంబరం ఎలా వెలవెలబోతుందో చిరినవ్వు లేని ప్రసంగం అయినా, సమావేశం అయినా, సంభాషణ అయినా, సంసారమయినా అంతే బోసిగా, బోర్‌గా కనిపిస్తుంది, అనిపిస్తుంది అనండంలో సందేహం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, నవ్వు నాలుగు విధాలు చేటు అన్న మాట ఎంత నిజమో, నవ్వు నలభయి విధాల గ్రేటు అన్న మాట కూడా అంతే నిజం. ఒక్క మాట కూడా మాట్లడకపోయినా, ఎదుటి వ్యక్తి ఎవరో తెలియకపోయినా ప్రతి హృదయానికి సులభంగా చేరగలిగే వారధి చిరునవ్వు. కాబట్టి ఇస్లాం స్వచ్ఛమయిన నవ్వుకి, సత్యబద్ధ్దమయిన హాస్యాన్ని సయితం షరీయతు బద్ధం చేస్తుంది. అబ్దుల్లాహ్‌ా బిన్‌ హారిస్‌ బిన్‌ జజ్‌అ (ర) గారి కథనం – ”నేను దైవప్రవక్త (స) వారికంటే ఎక్కువగా చిరునవ్వు చిందించేవారిని మరొకరిని చూడ లేదు”. (తిర్మిజీ)

దైవ ప్రవక్త (స) నవ్వడమే కాక సందర్భానుసారం సత్యబద్ధమయిన హాస్యాన్ని పండించి ఇతరుల్ని నవ్వించేవారు కూడా. అంతే కాదు, ‘నీవు నీ సోదరునితో జరిపే నగుమోము సంభాషణ కూడా పుణ్య కార్యమే-దానమే’ అని ప్రపంచంలోనే ఎవరు ఇవ్వని స్థానాన్ని హాస్యానికి ఇచ్చారు. దాన్ని ఆరాధనగా పరిగణించారు. అందుకే ‘నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం’ అన్నారు వెనుకటికి మన పెద్దలు.

1) ఆరోగ్యకరమయిన, సత్యబద్ధమయిన హాస్యాన్ని ఇస్లాం బోధిస్తుంది. అపహాస్యం పాలు చేసే వెకిలి నవ్వుల్ని ఇస్లాం నిషేధి స్తుంది. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”ప్రజలు నవ్వాలని అసం బద్ధ్ద, అసత్య విషయాలను పలికే వ్యక్తి నశించుగాక! నశించుగాక! నశించుగాక!”. (తిర్మిజీ)

2) హాస్యం అనేది పరనింద, పరదూషణ, అసభ్య ప్రహేళికలు లేనిదయి ఉండాలి. అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు: ”కూపీలు లాగ కండి, మీలో ఎవరూ ఇంకొకరి గురించి చెడుగా చెప్పుకోకూడదు. ఏమిటి మీలో ఎవరయినా చచ్చిపోయిన మీ సోదరుని మాంసం తినటానికి ఇష్ట పడతారా? చూడండి మీరు స్వయంగా దీన్ని ఏవ గించుకుంటున్నారు”. (హుజురాత్‌: 12)

3) హాస్యం ఒకరిని గేలి చేయడం, ఆట పట్టించడం కోసం ఉద్దేశిం చబడినదయి ఉండకూడదు. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ఓ విశ్వాసు ల్లారా! పురుషులు సాటి పురుషుల్ని ఎగతాళి చేయకూడదు. బహుశా వీరికంటే వారే ఉత్తములయి ఉండొచ్చు. అలాగే స్త్రీలు సాటి స్త్రీలను పరహసించ రాదు. బహుశా వీరికంటే వారే ఉత్తము రాలయి  ఉండొచ్చు. ఒకరినొకరు ఎత్తి పొడుచుకో కండి. ఒండొక రికి చెడ్డ బిరుదులు ఇచ్చుకోకండి. విశ్వసించిన తర్వాత తన సోద రుణ్ణి చెడ్డ పేరుతో అవమానించడం చాలా పాపం”(హుజురాత్‌:11) 4) హాస్యం హద్దుల్లో, పద్దుల్లో ఉండాలి.  నవ్వడంలో పడి నమాజు ను, ఇతర ముఖ్య విధులను విడనాడకూడదు. నవ్వడం అనేది ఒకరికి మేలు చేసి నవ్వాలి. ఒకరిని  నవ్వుల పాలు చేసి కాదు.

5) హాస్యంలో సమతౌల్యాన్ని పాటించాలి; ప్రయాణంలో తప్ప. అయితే మనం పండించే హాస్యం పాపభూయిష్టమయినదయి ఉండ కుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ‘ప్రయాణం యాతనలోని భాగం’అని ప్రవక్త (స) వారు సెలివిచ్చి ఉన్నారు గనక ప్రయాణం సాఫీగా, సరదాగా సాగిపోవాలంటే హాస్యం ఎంతయినా అవసరం.అది శృతి మించక హద్దుల్లో, పద్దుల్లో ఉండటం మరీ అవసరం.

 

 

Related Post