హిజ్రత్‌ పూర్వపరాలు

కొన్ని మేధోపర మయిన వలసలు (మెరుగయిన భృతి కోసం చేసే విద్వా వంతు వలస) అయితే, శ్రమ వలసలు మరికొన్ని. మేధో వలస చేసిన వారు తమ మేధస్సు ను, తెలివితేటలను అమ్ముకుంటుండగా, శ్రమ వలస ప్రజలు తమ శ్రమ శక్తిని అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ఈ వలసల్లో వాణిజ్య పరమయిన వలసలూ ఉంటాయి,రాజకీయపరమయిన వలసలూ ఉంటాయి. గత్యంతరం లేక ప్రాణాలను గుప్ప్లో పెట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ చేసే వలసలూ ఉంటాయి.

కొన్ని మేధోపర మయిన వలసలు (మెరుగయిన భృతి కోసం చేసే విద్వా వంతు వలస) అయితే, శ్రమ వలసలు మరికొన్ని. మేధో వలస చేసిన వారు తమ మేధస్సు ను, తెలివితేటలను అమ్ముకుంటుండగా, శ్రమ వలస ప్రజలు తమ శ్రమ శక్తిని అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ఈ వలసల్లో వాణిజ్య పరమయిన వలసలూ ఉంటాయి,రాజకీయపరమయిన వలసలూ ఉంటాయి. గత్యంతరం లేక ప్రాణాలను గుప్ప్లో పెట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ చేసే వలసలూ ఉంటాయి.

”ఎవరయితే అల్లాహ్‌ కోసం ఓ వస్తువును వదులుకుంటారో అల్లాహ్‌ వారికి దానికన్నా అత్యుత్తమమయిన వస్తువును అనుగ్రహస్తాడు”. (అహ్మద్‌)

హిజ్రత్‌

పరిచయం: హిజ్రత్‌ అనేది హిజ్ర్‌ అనే మూల ధాతువు నుండి వచ్చిన పదం. వేరు పడటం, వదలి వెళ్లడం, ప్రస్థానం, దూరమవ్వడం, వలస లాంటి భాషా పరమయిన అర్థాలు దీనికున్నాయి.

లోకాభ్యుదయ అవిభాజ్యాంశం హిజ్రత్‌:

అనాదిగా మనిషి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి అనేక ఉద్దేశ్యాలతో హిజ్రత్‌ చేస్తూనే ఉన్నాడు. ఈ హిజ్రతే గనక లేకపోతే మానవాళి నేడున్న విధంగా భూగోళ మంతా విస్తరించ ఉండేది కాదు. ఆ విధంగా మానవ నాగరికతా వికాసానికి ఈ హిజ్రత్‌ కారణం అయింది. ప్రాంత పరమయిన ఈ హిజ్రత్‌ ఒక మనిషి కే పరిమితం కాదు. జంతువులు, పక్షులు, క్రీమికీటకాదులు కుడా వాటి మనుగడ కోసం హిజ్రత్‌ చేస్తాయి. మన రాష్ట్రంలోని తేనిలీలాపురం, ఉప్పల పాడు లాంటి ప్రదేశాలకు ప్రతి యేటా సుదూర ప్రాంతాల నుండి పక్షులు రావడం అందికి తెలిసిన విషయమే. మనిషి చేసే ఈ హిజ్రత్‌-వలసలో కొన్ని శాశ్వతమయి నవిగా ఉంటే, మరికొన్ని తాత్కాలికమయినవి. వాటిలో కొన్ని మేధోపర మయిన వలసలు (మెరుగయిన భృతి కోసం చేసే విద్వా వంతు వలస) అయితే, శ్రమ వలసలు మరికొన్ని. మేధో వలస చేసిన వారు తమ మేధస్సు ను, తెలివితేటలను అమ్ముకుంటుండగా, శ్రమ వలస ప్రజలు తమ శ్రమ శక్తిని అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ఈ వలసల్లో వాణిజ్య పరమయిన వలసలూ ఉంటాయి,రాజకీయపరమయిన వలసలూ ఉంటాయి. గత్యంతరం లేక ప్రాణాలను గుప్ప్లో పెట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ చేసే వలసలూ ఉంటాయి.
ఒకప్పుడు వలస సాకుతో అనేక దేశాల్లో దూరి ఆయా దేశాలను ఆక్ర మించి, వారిని బానిసలుగా చేెసి పెత్తనం చెలాయించిన వారే నేడు- ఆధునికత ముసుగులో ఆటవికాన్ని అనుసరిస్తూ తమ తమ దేశాల్లో ఉంటూనే ఇతర దేశ ప్రజలు వారి స్వదేశాల్లో ఉండలేనంత దారుణంగా ఆయా దేశాల పరిస్థితిని మార్చి వేసి, దిక్కు తోచని స్థితిలో వారు పొరుగు దేశాలకు వలస వెళితే సహించ లేని స్థితిలో ఉన్నారు ఈ సామ్రాజ్య వాద ధ్వజవాహకులు. ఏది ఏమయినా హిజ్రత్‌ – వలస అనేది ప్రాంతం, భాష, జాతి,మతానికి అతీతంగా అందరి జీవితాలలో మమేకాంశం అని చెప్పొచ్చు. ఇక ఇస్లామీయ పరిబాషలో హిజ్రత్‌ దేన్నాంరు, హిజ్రత్‌కి గల ప్రాముఖ్యత ఏమి? అది మనకిచ్చే సందేశం ఏమి? అన్న అంశాలు. ఖుర్‌ఆన్‌ మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో తెలుసుకునేందుకు ప్రయత్నిద్ధాం!

ఇస్లామీయ పరిభాషలో హిజ్రత్‌:

అంటే – అవిశ్వాస భూభాన్ని వదలి ఇస్లామీయ భూభాగం వైపనకు ప్రస్థానం చేయడం. ఇది రెండు విధాలుగా విభజించ బడింది. 1) హిజ్రతుల్‌ ఔతాన్‌: ముస్లిం తన విశ్వాసాన్ని కాపాడుకునే నిమిత్తం ప్రతికూల ప్రాంతం నుండి అనుకూల ప్రాంతం , ఇస్లామీయ వాతావరం గల ప్రదేశం వైపనకు హిజ్రత్‌ చేయడం. 2) హిజ్ర తుల్‌ ఇస్మి వల్‌ ఉద్వాన్‌: పాపం, అతివాదాల నుండి పుణ్యం, మిత వాదం వైఖరి వైపునకు తరలి వెళ్ళడం. షిర్క్‌ నుండి తౌహీద్‌ వైపునకు, బిద్‌అత్‌ నుండి సున్నత్‌ వైపునకు చేసే హిజ్రత్‌. అంటే ఒకి బాహ్య పరమయిన, భౌతిక పరమయిన హిజ్రత్‌ అయితే, మరొకి భావ పరమయిన, మానసిక పరమయిన హిజ్రత్‌. ఈ రెండు హిజ్రత్‌లలో శ్రేష్ఠమయిన హిజ్రత్‌ – భావ పరమయిన హజ్రత్‌. ఈ హిజ్రత్‌ కారణంగా కరుణామయుని ప్రసన్నత ప్రాప్తమవుతుంది.షైతాన్‌ మరియు చెడు మనస్తత్వానికి గొడ్డలి పెట్టవుతుంది. బాహ్య పరమయినా హిజ్రత్‌ అవసరం అందరికీ ఉండదు, అవసరం ఏర్పడినా అన్ని వేళలా ఉండదు గనుక ఇది అందరిపై విధి కాదు. అయితే భావ పరమయి హిజ్రత్‌ మాత్రం ముస్లిం అయిన ప్రతి స్త్రీ పరుషుని మీద సర్వకాల, సర్వావస్థల్లోనూ తప్పనిసరి.
బాహ్య పరమయిన హిజ్రత్‌ చేయాల్సిన వారిని నాలుగు శ్రేణుల్లో విభజించడం జరిగింది. 1) స్థోమత కలిగి, తప్పనిసరి హిజ్రత్‌ చేయాల్సిన వారు – వీరు హిజ్రత్‌ చేయడం వాజిబ్‌. 2) తప్పనిసరి (వాజిబ్‌) హిజ్రత్‌ చేయాల్సివారే కానీ అగత్యపరులు. 3) అంత అవసరం లేని వారు, వీరి కోసం ముస్తహబ్‌. 4) పరిస్థితులు అనుకూలించకపోయినా ధర్మకార్యం, సంస్కరణ నిమిత్తం ఆగి ఉండాల్సిన వారు. వీరు అనుమతి ఉన్నా హిజ్రత్‌ చేయకుండా ఆగి ఉండటం ఉత్తమం. స్థాయి పరంగా తీసుకుంటే. 1) ప్రవక్త (స) వారి కాలంలో ఆయన మరియు సహాబా మదీనా వైపు చేసిన హిజ్రత్‌ అన్నింలోకెల్లా మహిమాన్వితమయినద. 2) అవిశ్వాస భూభాగం నుండి విశ్వాస భూమి వైపునకు చేసే హిజ్రత్‌. 3) పాపు భూమి నుండి పుణ్య భూమి వైపనకు చేసే హిజ్రత్‌. 4) చివరి కాలంలో ఉపద్రవాలు పెల్లుబికినప్పుడు షామ్‌ వైపు చేసే హిజ్రత్‌.

హిజ్రత్‌ ఘనత:

స్వచ్చమయిన విశ్వాసానికి నిదర్శనం హిజ్రత్‌: ”ఎవరు విశ్వసించి, (విశ్వాస సంరక్షణార్థం) స్వస్థలాన్ని విడిచి వలస పోయారో అల్లాహ్‌ మార్గంలో (ధర్మోన్నతి కోసం) జిహాద్‌ చేశారో, మరెవరయితే (వారికి) ఆశ్రయమిచ్చి ఆదుకున్నారో వారే నిమయినా విశ్వాసులు”. (అన్ఫాల్‌: 74)
ఉబై ఫాతిమా జమ్మరీ (ర) గారినుద్దేశించి ప్రవక్త (స) ఇలా అన్నారు: ”నువ్వు హిజ్రత్‌ చెయ్యాలి సుమా! ఎందుకంటే, హిజ్రత్‌కు సరిమానమయి నది ఖచ్చితంగా ఏది లేదు”. (నసాయీ)
ప్రవక్త (స) వారి అభిలాష హిజ్రత్‌: ”అల్లాహ్‌ సాక్షి! హిజ్రతే గనక లేకపోయినట్లయితే నేను అన్సార్లలోని ఓ వ్యక్తినయి ఉండేవాడను” అని హునైన్‌ సంగ్రామ సందర్భంగా ప్రవక్త (స) అభిప్రాయ పడ్డారు. ఈ కారణంగానే ఇమామ్‌ బుఖారీ (ర) ‘లౌ లల్‌ హిజ్రతు లకున్తు ఇమ్రఅన్‌ మినల్‌ అన్సార్‌’ అన్న శీర్షికతో ఒక అధ్యాయాన్ని ప్రారంభిచారు.

విస్తృతమయిన ఉపాధికి విలువైన మార్గం:

”అల్లాహ్‌ మార్గంలో తన స్వస్థలాన్ని వదలి హిజ్రత్‌ చేసిన వాడు భుమండలంలో ఎన్నో ఆశ్రయాలను, విస్తృతిని పొందుతాడు”. (అన్నిసా: 100) అంతే కాదు లభించే ఆ ఉపాధి చాలా గౌరవప్రదమయినదయి ఉంటుంది అంటున్నాడు అల్లాహ్‌ా: ”వారి కొరకు గౌరవప్రదమయిన ఉపాధి ఉంది”. (అన్ఫాల్‌: 74)
”ఎవరయితే అల్లాహ్‌ కోసం ఓ వస్తువును వదులుకుాంరో అల్లాహ్‌ వారికి దానికన్నా అత్తుత్తమమయిన వస్తువును అనుగ్రహస్తాడు”. (అహ్మద్‌)
ఉత్తమ నివాస వాగ్దానం: ”దౌర్జన్యానికి గురైన తార్వత అల్లాహ్‌ా మార్గంలో (ఇల్లూ వాకిలి వదలి) వలస పోయిన వారికి మేము ప్రపంచంలోనూ ఉత్తమ నివాసాన్ని కల్పిస్తాము. ఇక పరలోకంలో లభించే ఫుణ్యఫలమయితే మరింత గొప్పది.ఈ విషయాన్ని ప్రజలు గ్రహించగలిగితే ఎంత బావుండు!”.  (అన్నహల్‌: 41)

హజ్రత్‌ ఉమర్‌ (ర) గారు తన పరిపాలనా కాలంలో ముహాజిర్లకు, అన్సార్ల కు పెన్షన్‌ నిర్థారించారు. ఒక్కో ముహాజిర్‌కు ఆయన పెన్షన్‌ ఇస్తూ ”ప్రపంచంలో మీకు అల్లాహ్‌ చేసిన వాగ్దానం ఇదే. పరలోకంలో మీ పేరున సమకూర్చబడినది ఇంతకన్నా గొప్పది” అని చెప్పేవారు. (ఇబ్బు కసీర్‌)
అల్లాహ్‌ కారుణ్యానికి ఆనవాలు: ”నిశ్చయంగా విశ్వసించిన వారు మరియు అల్లాహ్‌ా మార్గంలో హిజ్రత్‌ చేెసినవారు మరియు జిహాద్‌ చేెసేవారు – ఇలాిం వారే అల్లాహ్‌ా కారుణ్యం ఆశించడానికి నిజమయిన అర్హులు. మరియు అల్లాహ్‌ అమిత క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత”. (అల్‌ బఖరహ్‌: 218)

క్షమా ద్వారం:

”ఇక నిశ్చయంగా నీ ప్రభువు, ఎవరయితే మొదట పరీక్షకు గురి చేయబడిన తర్వాత హిజ్రత్‌ చేస్తారో ఆ తర్వాత జిహాద్‌ చేస్తారో మరియు సహనం వహిస్తారో ఈ థలన్నిం తర్వాత అల్లాహ్‌ వారి యెడల అపార క్షమాశీలుడు, అమిత దయాకరుడు”. (అన్నహ్ల్‌: 110) అంతే కాదు, పాపాలను ప్రక్షాళిస్తాను అని మాటిస్తున్నాడు అల్లాహ్‌: ”వారి నుండి వారి చెడులను ఖచ్చితంగా దూరం చేస్తాను”. (అల్‌ ఇమ్రాన్‌: 195)
ఇస్లాం స్వీకరించడానికి వచ్చిన అమ్ర్‌ బిన్‌ ఆస్‌ (ర) గారి ప్రశ్నకు సమాధా నంగా ప్రవక్త (స) ఇలా అన్నారు: ”నిశ్చయంగా ఇస్లాం తనకు పూర్వం జరిగిన పాపాలను ప్రక్షాళిస్తుంది. నిశ్చయంగా హిజ్రత్‌ దానికి పూర్వం జరిగిన పాపాలను తుడిచి పెడుతుంది. నిశ్చయంగా హజ్జ్‌ దానికి పూర్వం జరిగిన పాపాలను కూలదోస్తుంది అని నీకు తెలీదా?” అని. (ముస్లిం)

స్వర్గప్రాప్తికి సోపానం:

ఓ సారి విశ్వాసుల మాత హజ్రత్‌ ఉమ్మె సలమా (ర.అ)దైవప్రవక్త (స) వారినుద్దేశించి-‘యా రసూలల్లాహ్‌! (స) హజ్రత్‌ సంద ర్భంగా స్త్రీల ప్రస్తావన రాలేదేమి?’ అని ప్రశ్నించగా ఈ ఆయతు అవతరిం చింది; ”వారి ప్రభువు వారి మొరను ఆలకించి ఆమోదించాడు. మీలో పని చేసే వారి పని-వారు పురుసులయినా సరే, స్త్రీలయినా సరే – నేను వృధాగా పోనివ్వను. మీరు పరస్పరం ఒకే కోవకు చెందినవారు. కాబ్టి స్వస్థలం వదలి హిజ్రత్‌ చేసినవారు, తమ ఇళ్ళ నుండి వెళ్ళగొట్ట బడినవారు, నా మార్గంలో వేధింపులకు, చిత్రహింసలకు గురైన వారు, నా మార్గంలో పోరాడి చంప బడినవారు – అటువిం వారి చచెడుగులను వారి నుండి దూరం చేస్తాను. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలో వారిని ప్రవేశింప జేస్తాము. ఇది అల్లాహ్‌ తరఫున వారికి లభించే పుణ్య ఫలం. నిష్ట్ర్చయంగా అల్లాహ్‌ వద్దనే అత్యుత్తమ ఫుణ్యఫలం ఉంది”. (ఆల్‌ ఇరమాన్‌: 195)

ముహాజిర్‌ నాయకత్వానికి ఎక్కువ అర్హుడు:

అబ్దుల్లాహ్‌ా మస్‌వూద్‌ (ర) ఇలా అన్నారు:”నమాజులో జాతి నాయకత్వం ఖుర్‌ఆన్‌ ఎక్కువ కంఠస్థం చేసుకున్న వారు చేయిపించాలి. ఆ విషయంలో అందరు సమానులయితే వారిలో తొలూత హిజ్రత్‌ చేసినవారు ఇమామత్‌ చేయిపించాలి. అందులోనూ అందరూ సముజ్జీలయితే వారిలో ఎక్కువ వయసు గల పెద్ద నాయకత్వం వహించాలి” అన్నారు ప్రవక్త (స). (ముస్లిం)

ముహాజిర్‌ మొత్తం బాధ్యత అల్లాహ్‌దే:

జమరహ్‌ బిన్‌ ఆస్‌ (ర) ఖుజాఆ తెగకు చెందిన వ్యక్తి. రోగ బారిన పడ్డారు. అదే సమయంలో హిజ్రత్‌ చేయాల్సి వచ్చింది. తన తెగ వారినుద్దేశించి ఆయన ఇలా అన్నారు: ‘నన్ను కాడిపై కూర్చోబ్టెి మీతోపాటు తీసుకెళ్ళండి’ అని. అలా హిజ్రత్‌ చేస్తూ మార్గం మధ్యలో తన్‌యీమ్‌ ప్రాంతంలో ఆయన మరణించారు. అప్పుడు ఈ ఆయతు అవతరించింది: ”అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త వైపనకు హిజ్రత్‌ చేస వెళ్ళడానికి తన గృహం నుండి బయలు దేరి దారిలో మృత్యు వాతన పడిన వానికి పుణ్యఫలం ప్రసాదించే బాధ్యత అల్లాహ్‌ాదే” (అన్నిసా:100)

విశ్వాసపు అత్యున్నత స్థాయి హిజ్రత్‌:

ఓ వ్యక్తి ప్రవక్త (స) వారి వద్దకు వచ్చి పలు విషయాల గురించి విచారించగా ఆయన ఇచ్చి సమాధానంలో ”సర్వే ద్రియాలు సహితం తమని తాము అల్లాహ్‌ాకు సమర్పించుకోవడం, మన మాటల వల్లగానీ, చేతల వల్లగానీ ఎవ్వరికి హాని తలపెట్టకపోవడం ఇస్లాం” అని, ఇస్లాంలో ఉత్కృష్టమయినది ఈమాన్‌ అని, ఈమాన్‌ అంటే అల్లాహ్‌ పట్ల, ఆయన దూతల పట్ల, ఆయన గ్రంథాల పట్ల, ఆయన ప్రవక్తల పట్ల, మరణానంతర జీవితం పట్ల, మంచీచెడు విధిరాతల పట్ల విశ్వాసం కలిగి ఉండటం అని, ఈమాన్‌లో ఉత్కృష్టమయినది హిజ్రత్‌ అని, హిజ్రత్‌ అంటే చెడును విడనాడటం, హిజ్రత్‌లో ఉత్కృష్టమయినది జిహాద్‌ అనీ జిహాద్‌ అంటే అధర్మకర్తలతో పోరాడాల్సి వస్తే (వెనుదిరగక) యుద్ధం చేయడం అని వివ రించడంతోపాటు మరికొన్ని విషయాలను విశద పర్చారు ప్రవక్త (స).

మొదట స్వర్గంలో ప్రవేశించే వర్గం:

అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (ర) గారి కథనం – ”స్వర్గంలో ప్రవేశించే మొది వర్గం ఏదో? నీకు తెలుసా?” అని అడిగారు ప్రవక్త (స). ‘అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అన్నాను నేను. ” నిరుపేదలయిన ముహాజిర్లు ప్రళయ దినాన స్వర్గ తలుపుల వద్దకు రాగా తలుపులు తెరవబడతాయి. స్వర్గదూతలు వారినుద్దేశించి-‘మీతో లెక్క తీసుకో బడిందా?’ అని అడుగుతారు. అందుకు వారు-‘ఏ వస్తువు లెక్క తీసుకుంటారు మాతో? ఎక్కడ స్థిర నివాసం ఏర్పచుకోకుండా ఒక ప్రాంతం నుండి మరోప్రాతం వైపునకు హిజ్రత్‌ చేస్తూ మేము నిరంతరం అల్లాహ్‌ మార్గంలో పోరాడుతూ కరవాలాన్ని మా భుజాల నుండి దించనే లేదు. అదే స్థితిలో మేము మరణిం చాము. అప్పుడు వారి కోసం స్వర్గ తలుపులు తెరువ బడతాయి. ప్రజలకన్నా 40 సంవత్సరాల ముందు స్వర్గంలో సేద తీరతారు”. అన్నారు ప్రవక్త (స). (హాకిమ్‌)

అల్లాహ్‌ ప్రసన్నతా భాగ్యం:

”ముఖ్యంగా ఈ ఫై సమ్ము తమ ఇల్లో వాకిలి నుండి, తమ ఆస్తిపాస్తుల నుండి గిెం వేయబడిన నిరుపేద ముహాజిర్లకు వర్తిస్తుంది. ఎందుకంటే వారు అల్లాహ్‌ అనుగ్రహాన్ని ఆయన ప్రసన్నతను ఆశిస్తూ అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు తోడ్పడుతున్నారు. వారే అసలు సత్యవంతులు”. (అల్‌ హష్ర్‌: 8) ఆ తర్వాత అల్లాహ్‌ ఇలా అంటున్నాడు: ”వారి ప్రభువు వారికి తన కారుణ్యాన్ని, ప్రసన్నతా భాగ్యన్ని స్వర్గ వనాలను అనుగ్రహిస్తానని శుభవార్త అందిస్తు న్నాడు. అక్కడ వారి కోసం శాశ్వతమయిన అనుగ్రహాలుాంయి”. (అత్తౌబహ్‌: 21)

Related Post