ఇందియ్ర నిగహ్రం

ఇంద్రియ నిగహ్రం
ఆదిలో దేవుడు ఏ నాలుగు మూలతత్వములతో మనషిని సృజించాడో అవి – మట్టి, నీరు, నిప్పు, గాలి. మానవులందరి నైజాలు, స్వభావాలు, ప్రతిభాపాటవాలు, నైపుణ్యత, నైతిక స్థాయి, ఆత్మశక్తి ఒకేలాగు ఉవండవు. వాటి మీద ఈ నాలుగు మూలతత్వముల ప్రభావం ఏదోక స్థాయిలో తప్పకుండా పడుతుంది. వారిలో కొందరు పిరికివారు, బలహీనులైతే మరికొందరు బలవంతులు, సాహసవంతులై ఉంటారు. కొందరు మర్యాదస్తులు, ధర్మపరాయణులైత, మరికొందరు గర్విష్ఠులు, పచ్చి స్వార్థపరులై ఉంటారు. కొందరు మృదుస్వభావులు శాంతి కాముకులైతే మరికొందరు కల్లోల జనకులు, కర్కశక హృదయులై ఉంటారు.కొందరు కరు గలవారైతే మరొకొందరు కోపిష్టులై ఉంటారు. ఏది ఏమైనా ఈ నాలుగు మూల తత్వముల ప్రభావఛాయలు ప్రతి మనిషిలోనోనూ గోచరిస్తాయి. ఇటువంటి వేర్వేరు స్వభావాలు, పరస్పర విరుధ్ద భావాలు గల వారు ఒకే సమాజంలో మనుగడ సాగించాలంటే, వారి మధ్య సోదభావం, సమరస భావం, సహిష్ణుత, సహృద్భావం, త్యాగ భావం ఎంతో అవసరం. సమాజాభ్యున్నతి, అభివృద్ధికైనా ఇవి టానిక్కులాంటివి. ఈ గుణాలు ఎంత పుష్కలంగా ఉంటే సమాజంలో అదే స్థాయిలో శాంతి సుస్థిరతలు పరిఢవిల్లుతాయి. మనిషి – తన, ధన, మాన, ధర్మానికి రక్షణ ఉంటుంది.
సమాజంలో చోటు చేసుకునే అల్లరి అలజడులకు కారణాలు, ప్రేరణలు, కారకాలు అనేకం ఉన్నప్పటికీ ముఖ్యమైన కారణం క్రోధావేశం అనాలి. ఈ క్రోధావేశానికి దారి తీసే కారణాల్ని గనక మనం నిర్మూలించగలిగితే సమాజం శాంతి శ్రేయాలతో వర్ధిల్ల గలదని ఆశించవచ్చు. ఇక ఆ ప్రేరకాలు, కారణాలు ఏవంటారా -, ప్రకృతి స్వభావినికి విరుద్ధంగా నడిచుకోవడం, హక్కుల ఉల్లంఘన , అపహరణ, ద్రోహం, అవినీతి, మోసం, విశ్వాస ఘాతుకం, బర్బరత్వం, అమానిషత్వం, దుర్మార్గం, దౌర్జన్యం, వైరం, ద్వేషం, శత్రుత్వం, పరోక్ష నింద, చాడీలు చెప్పడం, అపనిందలు మోపడం, కూపీలు లాగటం, రంధ్రాన్వేషణ, అబద్ధం, మాట ఇచ్చి తప్పటం, వాగ్దాన ఉల్లంఘన, లజ్జారాహిత్యం, పరదూషణ, రెండునాల్కల ధోరణి, అనుమానం, అపార్థం మొదలైనవి. ఇవి కోపావేశా నికి ఎలా కారణం అవుతాయి? అంటారా-

ప్రతి మనిషికి ఒక స్వభావం, ఒక తత్వం ఉంటుంది. దానికి భిన్నంగా ఏదైనా సంఘటన చోటు చేెసుకున్నప్పుడు కోపం వస్తుంది.
దేవుడు మనిషికి గౌరవోన్నతల్ని ప్రసాదించాడు. అతని ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసే క్రియ, ప్రతి చర్య బహిర్గతమైనప్పుడు కోపం వస్తుంది. మనిషి దోర్బల్యం గల దౌర్బల్యుడు. ఈ కారణంగానే ఒకరి అవసరం ఇంకొరికి ఉంటుంది. ఒండొకరి బలహీలతల్ని దూరం చేసి బలగాలను వృద్ధి పర్చడంలో అందరూ సమానంగా స్పందించాలి, సహరించాలి. అలాకాక ఎదుటి వ్యక్తి బలహీనుడు కదా అని హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే కోపం వస్తుంది. ఇదే అక్రమార్జన పెచ్చరిల్లితే సహనం నశించి, విద్వేషాగ్ని జ్వాల పెల్లుబు కుతుంది. మనిషి స్వభావసిద్ధంగా అవినీతిని, అన్యాయాన్ని, మోసాన్ని, విశ్వాసఘాతుకాన్ని అసహ్యించుకుంటాడు. తత్భిన్నంగా న్యాయాన్ని, ధర్మాన్ని ఇష్టపడతాడు. ఎవరైనా తన పట్ల అమానుషత్వానికి, అన్యాయానికి ఒడిగడితే కోపం వస్తుంది. మనిషి స్నేహాన్ని, ప్రేమను కాంక్షిస్తాడు. ఎవరైనా తన పట్ల వైరభావంతో, పగతో, సెగతో శత్రత్వాన్ని ప్రదర్శిస్తే కోపం వస్తుంది. ప్రతి వ్యక్తిలోనూ ఏదో కొన్ని లోపాలుంటాయి. తన లోపాలు ప్రచారంలోకి రాకూడదని ప్రతి వ్యక్తీ అభిలషిస్తాడు. ఎవరైనా తన బలహీనతల్ని, లోపాల్ని ఇతరుల ముందు ప్రస్తావించినప్పుడు కోపం వస్తుంది. చేయని నేరానికిగాను నింద పడాల్సి వచ్చినప్పుడు కోపం వస్తుంది. మాటల గారఢితో మోసం చేెసినప్పుడు కోపం వస్తుంది. సిగ్గు, బిడియం మహా గొప్ప లక్షణం. సభ్యత, సంస్కారవంతుని పట్ల ఎవరైనా లజ్జా రాహిత్యంగా వ్యవహరించినప్పుడు కోపం వస్తుంది. ముందు ఒకవిధంగా ప్రవర్తించి, వీపు వెనకాల చెడు వాగడం వల్ల కోపం వస్తుంది. రెండు నాల్కల ఈ ధోరణి మహా దారుణమైన లక్షణం. అర్థరహితమైన అనుమానం అనర్థాలకి దారి తీస్తుందన్నట్లు మనిషి ఒకరి పట్ల లేనిపోని అనుమానాలకు పోయినప్పుడు కోపం వస్తుంది. మరి వీటన్నింటికి మూల బీజం ఏది అంటే- సమాధానం మనసు. కనుక మనిషి తన ఇంద్రియాలకు కేంద్ర బిందువు అయిన మనసును జయించగలిగితే సకల విదమైనటువంటి అవలక్షణాల్ని పరిత్యజించగలడు. సమాజానికి ప్రయోజనకారిగా మారగలడు. మహా ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”జాగ్రత్త! మానవ దేహంలో ఒక ముద్ద ఉంది. అదిగనక బాగుంటే శరీరం మొత్తం బాగుంటుంది. అది గనక పాడైతే దేహం మొత్తం పాడైపో తుంది. గుర్తుంచుకోండి! అదే హృదయం”.

రమజాను మాసం వచ్చింది. మనకు ఎన్నో వరానుగ్రహాల్ని ప్రసాదించిన ప్రబోధిక రమజాన్‌.. మహా గొప్ప శిక్షణను ఇచ్చిన ప్రభానము రమజాన్‌. అది మనకిచ్చిన శిక్షణలో ప్రబర్హమైనది-ముఖ్యమైనది ఇంద్రియ నిగ్రహం. మనం ఈ శిక్షణకు లోబడి మనం మన పంచేంద్రియాలపై, జ్ఞానేంద్రియాలపై, నవనాడులపై, సర్వ అవయవాలపై అదుపు సాధించగలిగితే మన జీవితం ప్రహర్షణము -ప్రహల్లాదము-ఆనందప్రదం కావడమేకాక, ఇతరుల్ని సయితం ప్రశమనము-ప్రశాంతి కలుగజేసినవారం అవుతాము. ముస్లిం అన్న నామానికి సార్థకత చేకూర్చిన వారంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాము.

Related Post