మంచీచెడులు మరియు ఇస్లాం

మనిషిలో మంచీచెడులనేవి ప్రకృతి సహజంగానే నిబిడీకృతమయి ఉంటాయి. వాటిని గ్రహించగలిగే శక్తియుక్తుల్ని సయితం అతను కలిగి ఉంటాడు. కారణం - మంచీచెడుల విచక్షణాజ్ఞానం అతనిలో పొందు పరచింది పరమోన్నత ప్రభువయిన అల్లాహ్‌ాయే. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ''మానవాత్మ సాక్షిగా! దాన్ని తీర్చిదిద్దినవాని సాక్షిగా! మరి ఆయన దానికి దాని దుర్మార్గాన్ని, దాని దైవభీతిని అంతర్ప్రేరణ ద్వారా ఎరుక పర్చాడు''. (అష్‌ షమ్స్‌; 7,8)

మనిషిలో మంచీచెడులనేవి ప్రకృతి సహజంగానే నిబిడీకృతమయి ఉంటాయి. వాటిని గ్రహించగలిగే శక్తియుక్తుల్ని సయితం అతను కలిగి ఉంటాడు. కారణం – మంచీచెడుల విచక్షణాజ్ఞానం అతనిలో పొందు పరచింది పరమోన్నత ప్రభువయిన అల్లాహ్‌ాయే. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”మానవాత్మ సాక్షిగా! దాన్ని తీర్చిదిద్దినవాని సాక్షిగా! మరి ఆయన దానికి దాని దుర్మార్గాన్ని, దాని దైవభీతిని అంతర్ప్రేరణ ద్వారా ఎరుక పర్చాడు”. (అష్‌ షమ్స్‌; 7,8)

మనిషి ప్రకృతి సిద్ధంగా సంస్కార ప్రియుడు. మంచిని ప్రేమిస్తాడు. చెడును ద్వేషిస్తారు. మనిషిలోని ఈ సహజ భావనను అతని పోషణ, శిక్షణ, వాతావరణాలు పెంపొందిస్తాయి లేదా అణగద్రొక్కుతాయి. మంచి పెరిగితే మానవత్వ మందారాలు విరబూస్తాయి. మానవ మను గడ సవ్యంగా సాఫల్య బాటన సాగుతుంది. సమాజం మొత్తం సం స్కార సౌరభాలతో గుభాళిస్తుంది. అదే మంచి అన్నది అణిగితే పైకి వచ్చేది, పెరిగేది చెడు అనుభవాలే, కుళ్ళు బ్రతుకులే, దుర్గంధభరిత వాతావరణమే. వాతావరణం నైతికంగా కలుషితమయినప్పుడు సర్వత్రా – వ్యక్తుల్లోనూ, సమాజంలోనూ కానవచ్చేది, చెలామణి అయ్యేది, రాజ్యమేలేది చెడులే. అటువంటి దుస్థితి ఎక్కడ, ఎప్పుడు చోటు చేసు కున్నా దాన్ని దూరం చేసేందుకు ప్రయత్నించడం సమాజంలోని ప్రతి పౌరుని ప్రథమ కర్తవ్యం అంటుంది ఖుర్‌ఆన్‌: ”మీలో మంచి వైపు ఆహ్వానించేవారు, మేలు చేయండి అని ఆజ్ఞాపించేవారు, చెడు నుండి వారించేవారు తప్పకుండా ఉండాలి. ఇటువంటి సంస్కరణాభిలాషులే సాఫల్యం పొందుతారు”. (ఆల్‌ ఇమ్రాన్‌: 104) 

మనిషిలో మంచీచెడులనేవి ప్రకృతి సహజంగానే నిబిడీకృతమయి ఉంటాయి. వాటిని గ్రహించగలిగే శక్తియుక్తుల్ని సయితం అతను కలిగి ఉంటాడు. కారణం – మంచీచెడుల విచక్షణాజ్ఞానం అతనిలో పొందు పరచింది పరమోన్నత ప్రభువయిన అల్లాహ్‌ాయే. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”మానవాత్మ సాక్షిగా! దాన్ని తీర్చిదిద్దినవాని సాక్షిగా! మరి ఆయన దానికి దాని దుర్మార్గాన్ని, దాని దైవభీతిని అంతర్ప్రేరణ ద్వారా ఎరుక పర్చాడు”. (అష్‌ షమ్స్‌; 7,8)
ఏ పని ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా, పారలౌకికంగా, నైతికంగా, సామాజికంగా, విలువల పరంగా, చట్టం రీత్యా ఏ విధమయినటువంటిదో మనిషి మనసే అతనికి సాక్ష్యం పలుకుతుంది. తాను తలపెట్టబోయే ఆ కార్యం మానవునికి, వ్యక్తిగతంగా, సమాజాని కి సమిష్టిగా మేలు చేకూరుస్తుందో, కీడు కలుగజేస్తుందో అతని అంత రాత్మే అతనికి బోధ పరుస్తుంది. ఈ అంతరాత్మ ప్రబోధనం వల్లనే వ్యక్తి స్వతహాగా తాగుబోతయినా, తన పిల్లల విషయంలో దాన్ని అస హ్యించుకుంటాడు. తాను స్వతహాగా అన్యాయపరుడయినా తన విష యంలో న్యాయాన్నే కోరుకుంటాడు. తాను స్వతహాగా దుర్మార్గుడయినా తనపై ఒకరు దౌర్జన్యం చేయడాన్ని సుతరామూ సహించడు. ఈ సెన్స్‌ ను, కామన్సెన్స్‌ను, ఈ అవగాహనను, ఈ తారాతమ్యాన్ని, ఈ ఇంగిత జ్ఞానాన్ని అతని అంతరాత్మే ప్రబోధిస్తుంది అని ఖుర్‌ఆన్‌ చెప్పడంతోపాటే – ”దానిని (మనసును మనో మాలిన్యం నుండి) పరిశుద్ధ పరచు కున్నవాడు సాఫల్యం పొందాడు. మరియు దాని (అంత రాత్మ ప్రబోధ నాన్ని) అణచి పెట్టినవాడు నష్టపోయాడు”. (అష్‌ షమ్స్‌; 8,9) అంటుంది.
మానవునిలో ఈ ప్రేరణను మాధవుడు కలుగజేయడమేకాక, అతని మార్గదర్శనార్థం ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలను, అనేక గ్రంథాలను అవతరింపజేసి – సత్యమేదో, అసత్యమేదో, న్యాయమేదో, అన్యాయమేదో, మంచి ఏదో, చెడు ఏదో విశద పర్చాడు. అయితే మంచీచెడుల్ని అవలంబించే స్వేచ్ఛ మాత్రం మానవునికి మాధవుడు ప్రసాదించాడు. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”మరి మేము అతనికి వినేవాడుగా, చూసేవాడుగా చేశాము. నిశ్చయ ంగా మేమతనికి మార్గం కూడా చూపాము. ఇక అతను కృతజ్ఞుడుగా వ్యహరించినా లేక కృతఘ్నుడుగా తయారైనా (అతని ఇష్టం. మేము అతని స్వేచ్ఛను హరించలేదు). అయితే, కృతఘ్నతకు పాల్పడినవారి కోసం మేము సంకెళ్ళను, ఇనుప పట్టాలను, జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము”. (అల్‌ ఇన్సాన్‌: 3,4) అని హెచ్చరించడమే కాక, ”మిమ్మల్ని మీ పరివారాన్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి” అని జాగు రూక పర్చడమేకాక, మంచిని గురించి ఆదేశించడం, చెడు నుండి వారించడం మీ అందరి బాధ్యత అంటున్నాడు. వినడం, వినకపోవడం వారి ఇష్టం.-చూడండి: ‘ఇది సత్యం. మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది. ఇష్టమైనవారు దానిని స్వీకరించవచ్చు. ఇష్టం లేనివారు దాని ని తిరస్కరించవచ్చు”. (తౌబా: 29)
కాబట్టి సమాజంలోని చెడుల్ని అరికట్టే బాధ్యత సంఘశ్రేయోభిలాషు లైన వారందరిపై ఉంటుంది. ముఖ్యంగా ముస్లింలపై. ఎందుకంటే వారిని ప్రజా శ్రేయార్థమే ఉనికిలోకి తీసుకు రావడం జరిగింది గనక. ”విశ్వసించిన జనులరా! ఇకనుండి మానవులందరికి మార్గదర్శనం చేస్తూ వారిని సంస్కరించడానికి ఉనికిలోకి తీసుకురాబడిన శ్రేష్ఠ సముదాయం మీరే. మీరు మంచి పనులు చేయమని ఆదేశిస్తారు. చెడుల నుండి వారిస్తారు. అల్లాహ్‌ను ప్రగాఢంగా విశ్వసిస్తారు.” (ఆల్‌ ఇమ్రాన్‌: 110)

ఆ నిమిత్తం మహాప్రవక్త(స) చేెసిన మహోపదేశం గమనార్హం! ఆయన ఇలా అన్నారు: ”మీలో ఎవరయితే చెడును చూస్తారో, వారు తన చేతి తో ఆపాలి. ఒకవేళ అంత శక్తి లేకపోతే తన నాలుకతో దాన్ని నిర్మూ లించాలి. అదీ అతను చేయలేకపోతే కనీసం మనసులోనయినా ఆ కార్యాన్ని అసహ్యించుకోవాలి. అయితే ఇది విశ్వాసపు అధమ స్థితి అన్న విషయం గుర్తుంచుకోండి”. (ముస్లిం)
చేతితో అంటే, వ్యక్తి స్థాయిలోనూ, సంస్థ స్థాయిలోనూ, పభుత్వ స్థాయి లోనూ శక్తిని ఉపయోగించి చెడును దూరం చేసే ప్రయత్నం చేయడం. ముఖ్యంగా సంస్థలు, ప్రభుత్వాలు ఈ మహత్కార్యానికి పూనుకున్నట్ల యితే గొప్ప ఫలితాల్ని రాబట్టుకోవచ్చు. ఎందుకంటే, ‘లోకో భిన్న రుచి’ అన్నట్టు సమాజంలో అందరూ ఒకేలా ఉండరు. కొందరికి ప్రభువు భయం ఉంటే, మరికొందరికి ప్రభుత్వం విధించే శిక్ష భయం ఉం టుంది. ఈ కారణంగానే ఖుర్‌ఆన్‌ – మనిషికి దైవభీతిని, నైతిక రీతిని ప్రబోధించడంతోపాటు,స్వర్గసౌఖ్యాల గురించి, నరకయాతనలను ప్రస్తా వించడంతోపాటు దైవ శాసనోల్లంఘనకు పాల్పడేవారికి ప్రాపంచిక జీవితంలోనే శిక్ష అమలు పర్చాలని ఆదేశించడమే కాక, ”బుద్దీ వివే కాలు గల జనులారా! ప్రతీకార చట్టంలోనే మీకు సముజ్జీవనం లభి స్తుంది. మీరు ఈ శాసన ఉల్లంఘనకు పాల్పడకుండా మెలుగుతారని భావించబడుతోంది”. (అల్‌ బఖర: 179)అని నొక్కి వక్కాణించింది. నోటితో ఆపడం అంటే, మనిషి ఉక్తి మహా శక్తిలా పని చేస్తుంది అన డంలో ఎలాంటి సందేహం లేదు. ఒక మామూలు పోలీస్‌ సైరన్‌కే దొం గలు, నేరస్థులు ఎక్కడి వారు అక్కడే గప్‌చిప్‌ అయిపోతారంటే, శబ్దం తాలుకు ప్రభావం ఎటువంటిదో అర్థం చేసుకోగలం. అలాగే – ఇంట్లో పిల్లలుగాని, ఇల్లాలు గాని ఏదయినా చేయరాని పని చేస్తే ఒక గద్దింపు చర్య ఎంతటి ప్రభావవంతంగా పని చేస్తుందో మనందరికి అనుభవమ యిన విషయమే. గళానికే కాదు, కలానికి సయితం చరిత్రను తిరగ రాసిన ఖ్యాతి ఉంది. కాబట్టి చెడు ఎక్కడ, ఏ స్థాయిలో ఎవరు చేస్తూ చూసినా, చేసేవారు అయినవారయినా, కానివారయినా వారించడం మానసం గల ప్రతి మనిషి ద్వితీయ కర్తవ్యం. కాబట్టి సాహితీవేత్తలు, కలంకారులు తమ రాతల ద్వారా మంచిని పంచే, పెంచే ప్రయత్నం చేయాలి. చెడును అది సాహిత్యంలో ఉన్నా, సినిమాల్లో ఉన్నా, సమాజం లో ఎక్కడ ఏ పాళ్లల్లో ఉన్నా అరికట్టేందుకు కంకణం కట్టాలి. పై రెండు స్థాయిలోనూ లేని ప్రజలు కనీసం ఆ చెడును మనస్ఫూర్తిగా నిరసిం చాలి. అయితే ఇది సామాజిక స్పృహకు సంబంధించిన అధమ స్థాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదీ ఒక వ్యక్తి చేయడం లేదంటే, ఇక అతనిలో మానవత్వం లేనట్టే లెఖ్క.
మనిషి మంచి మనిషిగా బ్రతకాలి. దుర్గుణాల దుర్గంధాన్ని దూరం చేసుకుని, మంచి మల్లెల, మందారాల గుభాళింపుని మది నిండా నింపు కుని జీవించాలి. రెక్కలు రాలిపోతే ఎలాగయితే అందమయిన గులాబీ అందవికారంగా తయారవుతుందో, మంచి, మానవత్వాలు లేకపోతే అర్థ విహీనమవుతుంది జీవితం. మంచీచెడులనేవి జీవితంలో మమేకమయిన అంశాలే అయినప్పటికీ, చుట్టూ ఉన్న ముళ్ళు గుచ్చుకోకుండా మనం గులాబీని ఎలా కోసుకుంటామో, చెడు అనే చీకట్లు చిమ్మకుండా జీవి తాన్ని కాపాడుకోవాలి. అందుకు కావాల్సిన నేర్పూ, ఓర్పూ మనకు అల వడాలి. దాని తాలూకు మంచీచెడులు మనకు తెలియాలి.
మనలోని కల్మష కాలుష్యం అధికమయినప్పుడల్లా పశ్చాత్తాప పవిత్ర జలంతో దాన్ని కడగాలి. అహంకార పొరలు మన కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేెసినప్పుడల్లా జ్ఞాన కాంతితో మనం సత్యాన్ని సవినయంగా దర్శించాలి. పదవీ వ్యామోహం, కనక కామం మన స్పీడుకి కామాలు పెట్టాలనుకున్నప్పుడు పరలోక చింతనతో దాన్ని ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. మని షిగా పుట్టిన మనం మహా మనీషిగా ఎదిగేందుకు అహర్నిశలు పరిశ్ర మించాలి.
అయితే ‘మనిషిగా మనం ఇది చెయ్యాలి, ఫలానాది సాధించాలి అన గానే’ ‘అబ్బా’ అన్న బరువయిన నిట్టూర్పుతో ‘కప్పదాటు’గా వ్యవహరి స్తుంటారు కొందరు. అసలు మనిషి పుడుతూనే బోలెడన్ని బాధ్యతలతో పుట్టాడు అన్న విషయం వీరు గ్రహించరు. వారికి వారు నిర్వర్తించవల సిన బాధ్యతలు గుర్తుకు రావుగానీ, హక్కులు మాత్రం బాగానే గుర్తుం టాయి. మనిషి హక్కుల్ని గుర్తుంచుకుని, బాధ్యతల్ని విస్మరిస్తే అతనితో పాటు సంసారం, సమాజం కూడా ఉపద్రవం పాలవుతుంది.
మన బ్రతుకుకి మనమే రథసారథులం. మన మేథతో, మన విజ్ఞతతో మన బ్రతుకు బండిని మనమే నడిపించుకోవాలి. జయాపజయాలు ఎంచుకునే అధికారం మనకుంది. మంచీచెడులను అవలంబించే స్వేచ్ఛా మనకుంది. అయితే ఈ పరిమిత అధికారం, స్వేచ్ఛ మన చివరి శ్వాస అగేంత వరకు మాత్రమే. ఆ తర్వాత లెఖ్కలుంటాయిగానీ కర్మలుండవు. కనుక రేపు ప్రళయ దినాన ప్రభువు మనతో లెఖ్క తీసుకోక ముందే మన జీవిత లెఖ్కల్ని మనం సరి చేసుకోవాలి. ఉన్న కరెప్షన్స్‌ని కరెక్ట్‌ చేసుకుని ప్రభువుచే పర్‌ఫెక్ట్‌ అనిపించుకోవాలి.

 

Related Post